ఫ్రూట్‌ ఫేషియల్‌: పార్లర్‌ అవసరం లేకుండా ఇంట్లోనే.. | These Are Various Fruit Face Packs You Can Try At Home | Sakshi
Sakshi News home page

ఫ్రూట్‌ ఫేషియల్‌: పార్లర్‌ అవసరం లేకుండా ఇంట్లోనే..

Published Sat, Dec 9 2023 3:03 PM | Last Updated on Sat, Dec 9 2023 3:10 PM

These Are Various Fruit Face Packs You Can Try At Home - Sakshi

బ్యూటీ టిప్స్‌

  • రెండు స్పూన్ల క్యారెట్‌ జ్యూస్‌లో బొప్పాయి ‍జ్యూస్‌, శనగపిండి, తేనె కలిపి ముఖానికి పట్టించాలి. అరగంట తర్వాత చల్లటి నీళ్లతో కడిగేస్తే ముఖం కాంతివంతంగా మారుతుంది. 
  • యాపిల్‌ పండును చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసి స్మాష్‌ చేసుకోండి. ఇందులో తేనె, రోజ్ వాటర్ కలుపుకొని ఫేస్‌ప్యాక్‌ వేసుకోండి. ఇలా తరచూ చేస్తుంటే నల్లటి మచ్చలు తొలగిపోయి చర్మం మంచి నిగారింపును సంతరించుకుంటుంది. 
  • ఆరెంజ్‌ పండ్ల తొక్కలను పొడి చేసుకొని అందులో గంధం, చిటికెడు పసుపు కలిసి ముఖానికి రాసుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే జిడ్డుతనం పోయి యవ్వనంగా తయారవుతారు.
  • చర్మ సౌందర్యానికి బొప్పాయి బెస్ట్‌ ఛాయిస్‌. మొటిమలు, మచ్చలు వంటి చర్మ వ్యాధులను తగ్గించేందుకు కూడా ఇది చక్కగా పనిచేస్తుంది. బొప్పాయి పండులో కాసిన్ని పాలు, తేనె కలపుకొని ఫేస్‌ప్యాక్‌ వేసుకుంటే చర్మం తాజాగా, బ్రైట్‌గా కనిపిస్తుంది. 
  • మామిడి, ఓట్స్‌ను కలిపిన ఈ స్క్రబ్‌ ముఖం మీద మృతకణాలు, దుమ్మూధూళిని తొలగించి చర్మానికి నిగారింపునిస్తుంది.

  • పుచ్చకాయ రసాన్ని ముఖానికి రాసుకుని ఇరవై నిమిషాల తరువాత కడిగేయాలి. ఇది చర్మానికి టోనర్‌గా పనిచేసి పొడిబారడాన్ని తగ్గిస్తుంది.
  • ∙అరటి, యాపిల్, బొప్పాయి, నారింజ పళ్ల గుజ్జును సమపాళ్లల్లో తీసుకుని పేస్టు చేయాలి. ఈపేస్టుని ముఖానికి పూతలా వేయాలి. అరగంట తరవాత కడిగేయాలి. ఈ ప్యాక్‌ ముఖం మీద పేరుకుపోయిన మృతకణాలు, ట్యాన్‌ను తొలగించి కాంతిమంతంగా మారుస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement