Beauty Tips: ఈ డివైస్‌ని వాడారో.. మీ ముఖం చక్కటి ఆకృతిలోకి.. | Beauty Tips Ergonomic Face Lifting Massager Brings The Face Into Good Shape | Sakshi
Sakshi News home page

Beauty Tips: ఈ డివైస్‌ని వాడారో.. మీ ముఖం చక్కటి ఆకృతిలోకి..

Published Sun, May 5 2024 1:40 PM | Last Updated on Sun, May 5 2024 1:40 PM

Beauty Tips Ergonomic Face Lifting Massager Brings The Face Into Good Shape

కాసింత ఒళ్లు చేస్తే చాలు.. చాలామందికి డబుల్‌ చిన్‌  వచ్చేస్తుంది. దాంతో ముఖంలోని కళే పోతుంది. ఇది  వి షేప్‌ ఫేస్‌ కోరుకునేవాళ్ల ఆత్మస్థైర్యంతో భలే ఆడుకుంటుంది. మెడ, తలను అటూ ఇటూ తిప్పుతూ.. ఎన్ని ఎక్స్‌సైజులు చేసినా.. ముఖాన్ని V షేప్‌లోకి తెచ్చుకోవడం కష్టమే అవుతుంది. అందుకోసమే చిత్రంలోని ఈ డివైస్‌.

ఈ ఎర్గోనామిక్‌ ఫేస్‌ లిఫ్టింగ్‌ మసాజర్‌.. ముఖాన్ని చక్కటి ఆకృతిలోకి తెస్తుంది. ఈ ఫోల్డబుల్‌ చిన్‌ రెడ్యూసర్‌ను అన్ని వేళలా సులభంగా వాడుకోవచ్చు. చదివేటప్పుడు, నిద్రపోతున్నప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు, ఇంటి పని చేస్తున్నప్పుడు దీన్ని చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఈ డివైస్‌తో పాటు సాఫ్ట్‌ అండ్‌  స్కిన్‌  ఫ్రెండ్లీ కంఫర్టబుల్‌ కోర్డ్‌ (ఛిౌటఛీ.. చెవి పట్టీ) లభిస్తుంది. అవసరాన్ని బట్టి ఈ మెషిన్‌ ని చేత్తో పట్టుకుని ట్రీట్‌మెంట్‌ తీసుకోవచ్చు.

ఏదైనా పని చేసుకుంటున్నప్పుడు మాత్రం ఆ చెవి పట్టీ సాయంతో డివైస్‌ను చెవులకు బిగించుకుంటే చాలు..  గడ్డం కింద మెషిన్‌ దాని పని అది చేసుకుంటుంది. దీన్ని చార్జింగ్‌ పెట్టుకుని యూజ్‌ చేసుకోవచ్చు. ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లొచ్చు. దీనితో ప్రయాణాల్లోనూ ట్రీట్‌మెంట్‌ పొందొచ్చు. ధర 28 డాలర్లు. అంటే 2,341 రూపాయలు అన్నమాట!

ఇవి చదవండి: Health: లోయర్ బ్యాక్ పెయిన్‌తో ఇబ్బందా! ఆలస్యం చేశారో??

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement