అందానికి, ఆరోగ్యానికి ఆక్యుప్రెషర్ ట్రీట్‌మెంట్ దీ బెస్ట్ అనేది చాలామంది నమ్మకం. అలాంటివారికి ఈ పర్సనల్ ఆక్యుపాయింట్ ప్రెషర్ మసాజ్ డివైజ్ బాగా యూజ్ అవుతుంది. ఇది చూడటానికి.. చిన్న చిన్న బెలూన్స్.. రోల్స్ మాదిరి అటాచ్ అయ్యి.. డాగ్ షేప్‌లో కనిపిస్తుంది. దీన్ని ఒక డాగ్ అనుకుంటే.. కాళ్లవైపుండే రోల్స్‌కి.. అడుగున స్టెయిన్లెస్ స్టీల్ బాల్స్ అమర్చి ఉంటాయి. వాటితో మసాజ్ చేసుకోవచ్చు. తల, తోకలాంటి రోల్స్‌కి మొనదేలిన చిన్న బొడిపెలు ఉంటాయి. వీటితో ఆక్యుప్రెషర్ ట్రీట్‌మెంట్‌ను అందుకోవచ్చు. ఇది నొప్పుల్ని తగ్గిస్తుంది. ఒత్తిడిని దూరం చేస్తుంది. యవ్వనాన్ని ఇస్తుంది.
ఈ బెలూన్ డాగ్ డిజైన్స్ రోలర్స్.. ఆన్ లైన్ మార్కెట్‌లో.. పింక్, బ్లూ కలర్స్‌లో లభిస్తున్నాయి. పైగా ఇది చిన్నగా ఉండటంతో ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. ఆఫీస్ సొరుగుల్లో, కారు డాష్ బోర్డ్‌లో ఇలా.. అందుబాటులో ఉంచుకోవచ్చు. ఆక్యుప్రెషర్ ట్రీట్‌మెంట్‌లో పలు ప్రెషర్ పాయింట్స్ గురించి, పలు ఉపయోగాల గురించి తెలుసుకుంటే చాలు.. దీని వినియోగం చాలా సులభమవుతుంది. చెవులు, ముక్కు, చేతులు, కాళ్లు ఇలా ప్రతి భాగంలోనూ ప్రెషర్ పాయింట్స్‌ను ఈ బెలూన్ల రోలర్‌తో ప్రెస్ చేస్తే చాలు.. ఉపశమనంతో పాటు.. అందం, ఆరోగ్యం చేకూరుతాయి.
హెల్త్ ఆక్యుపంక్చర్ ట్రీట్‌మెంట్‌తో పాటు.. కాస్మెటిక్ ఆక్యుపంక్చర్ ట్రీట్‌మెంట్ కూడా తెలిసి ఉంటే దీన్ని వినియోగించడం ఇంకా తేలిక. అలసట, ఒత్తిడి దూరం కావడంతో పాటు.. మొటిమల సమస్యలు, సోరియాసిస్, పిగ్మెంటేషన్ వంటి సమస్యలనూ తగ్గించుకోవచ్చు. ఏబీఎస్ ప్లాస్టిక్, స్టెయిన్‌లెస్ స్టీల్ మెటీరియల్‌తో రూపొందిన ఈ టూల్.. అన్ని రకాలుగానూ లాభదాయకమే. దీని ధర 25 డాలర్లు. అంటే దాదాపు రెండువేల రూపాయలు పైనన్న మాట.
(చదవండి: ఎగ్స్‌ని ప్రిజర్వ్ చేసుకుని ఐదారేళ్ల తర్వాత పిల్లల్ని కనొచ్చా?)
Comments
Please login to add a commentAdd a comment