ఫౌండేషన్స్, గ్లాసీ లోషన్స్‌తో ముఖాన్ని తాత్కాలికంగా మెరిపించడం ఈజీయే! కష్టమల్లా తర్వాత ఫేస్‌ని క్లీన్ చేసుకోవడమే! అందుకే ఈ బ్రష్‌ని మీ మేకప్ కిట్‌లో పెట్టేసుకోండి. మేకప్‌ను తొలగించడంతో పాటు బ్లాక్ హెడ్స్, డెడ్ స్కిన్ వంటి సమస్యల నుంచి బయటపడేందుకూ ఇది చక్కగా ఉపయోగపడుతుంది. ఈ 3–ఇన్–1 ఎలక్ట్రిక్ మసాజ్ టూల్.. చర్మాన్ని శుభ్రపరచడమే కాక మృదువుగానూ మారుస్తుంది. ముఖం, మెడ, వీపు ఇలా ప్రతిభాగాన్నీ క్లీన్ చేస్తుంది. స్కిన్ మసాజర్‌లా పనిచేసి స్కిన్ టోన్‌ను మెరుగుపరుస్తుంది.
మృతకణాలను తొలగిస్తుంది. ముడతలను మాయం చేస్తుంది. ఒత్తిడిని.. అలసటను దూరం చేస్తుంది. ఈ డివైస్.. అన్ని వయసుల వారికీ అనువైనది. అలాగే స్త్రీ, పురుషులనే భేదం లేకుండా దీన్ని అందరూ వాడుకోవచ్చు. నచ్చినవారికి బహుమతిగా కూడా ఇవ్వొచ్చు. మసాజర్‌ను అవసరమైన విధంగా స్లో లేదా ఫాస్ట్ మోడ్‌లో ఉపయోగించుకోవచ్చు. యూజ్ చేసిన ప్రతిసారీ నీటితో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఎలక్ట్రిక్ గాడ్జెటే అయినా .. వాటర్ ప్రూఫ్ కావడంతో స్నానంచేసేటప్పుడూ వాడుకోవచ్చు.
ఇందులో మూడు వేరువేరు బ్రష్‌లు ఉంటాయి. ఒకటి సెన్సిటివ్ ఫేస్ బ్రష్.. ఇది సున్నితమైన చర్మం కోసం మృదువుగా, సౌకర్యవంతంగా పని చేస్తుంది. రెండవది డీప్ క్లెన్సింగ్ బ్రష్.. ఇది రంధ్రాలను శుభ్రపరచి.. చర్మాన్ని నీట్‌గా మారుస్తుంది. మూడవది సిలికాన్ బ్రష్.. ఇది అన్ని చర్మతత్వాలకూ ఉపయోగపడుతుంది. ఈ బ్రష్‌లను స్కిన్ టైప్‌ని బట్టి మార్చుకుంటూ ఉండాలి. ఈ మెషిన్‌కి చార్జింగ్ పెట్టుకుని.. వైర్ లెస్‌గానూ వాడుకోవచ్చు. ఇందులో పింక్, బ్లూ కలర్స్ అందుబాటులో ఉన్నాయి.
(చదవండి: సంగీతం వస్తేనే సింగర్ అయిపోరు అని ప్రూవ్ చేసింది!)
Comments
Please login to add a commentAdd a comment