Acupuncture
-
ఆన్లైన్లో ఆక్యుపంక్చర్ నేర్చుకుని ఏకంగా ఓ వ్యక్తికి చికిత్స చేసింది..కట్ చేస్తే..!
ఇటీవల చాలామంది ఎలాంటి నైపుణ్యాలు లేదా స్కిల్స్ నేర్చుకోవడానికి ఆన్లైన్ లెర్నింగ్‌కే ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే కొన్ని రకాల కోర్సులు, స్కిల్స్‌కే వర్కౌట్ అవుతుంది. వైద్య విద్యలాంటి కోర్సులకు అస్సలు పనికిరాదు. ఇది ఓ రోగి జీవితంతో ముడిపడి ఉంటుంది. ఏదైనా తేడా కొడితే అసలుకే మోసం వస్తుంది. చివరికి కటకటాలపాలవ్వుతాం. ఆన్లైన్ లెర్నింగ్‌లో వైద్య విధానం గురించి జస్ట్ అవగాహన తెచ్చుకోగలమే గానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ పొందడం అసాధ్యం. కానీ ఇక్కడొక మహిళ అలాంటి సాహసానికి ఓడిగట్టి ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. చివరికి జైటుపాలయ్యింది. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే..వివరాల్లోకెళ్తే..ఆగ్నేయ చైనాలోని వాంగ్ అనే మహిళ ఆన్లైన్ వీడియోల ద్వారా ఆక్యుపంక్చర్ మొత్తం నేర్చుకుంది. ఈ నైపుణ్యంతో తాను నివశించే గ్రామంలోని ప్రజలకు చికిత్స చేస్తూ మంచి పేరు సంపాదించుకుంది. ఇప్పటి వరకు ఎలాంటి తేడా కొట్టలేదు కాబట్టి డాక్టర్ లైసెన్స్ లేకుండానే ధర్జాగా చేసేసింది. అయితే గతేడాది లీ అనే వ్యక్తి అనారోగ్యంతో ఆ మహిళ వద్దకు వచ్చాడు. చికిత్స కోసం రూ. 5 వేలు చెల్లించాడుకూడా. ఆమె అతడికి చికిత్స అందించడమే గాక చివరి సెషన్లో భాగంగా చేసిన చికిత్స టైంలో లీ అసౌకర్యానికి గురయ్యాడు. కాసేపటి తర్వాత ఆమె అతడిని ఎంత తట్టి లేపిన లేవకపోవడంతో అతడిని హుటుహుటినా ఆస్పత్రికి తరలించింది. ఆ క్రమంలోనే పరిస్థితి విషమించిన చనిపోవడం జరిగింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్టు చేసి కోర్టు ఎదుట హాజరపర్చారు. అప్పుడే అసలు విషయం బయటపడింది. వాంగ్‌కు అధికారిక ఆక్యుపంక్చర్ శిక్షణ లేదని పరిశోధనలో వెల్లడయ్యింది. ఆమె ఆన్లైన్ వీడియోలతో నేర్చుకుని తనపై, తన భర్తపై సాధన చేసిందే తప్ప క్లినికల్ అనుభవం లేదని తేలింది. ఇక్కడ బాధితుడు లీకి తీవ్రమైన కరోనరీ హార్ట్ డిసీజ్ ఉంది. అలాంటి వాళ్లకు ఆంక్యుపక్చర్ అనేది ప్రత్యేక నిపుణులు పర్యవేక్షణలో చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎలాంటి క్లినికల్ శిక్షణలేని వాంగ్ అతడికి తనకు తెలిసిన కొద్దిపాటి జ్ఞానంతో చేయడంతో వికటించి అతని మరణించాడని కోర్టు పేర్కొంటూ ఆ మహిళకు 18 నెలలు జైలు శిక్ష, జరిమానా విధించింది. (చదవండి: ఓ సంపన్న కుటుంబం దాష్టికం..ఏకంగా 26 ఏళ్ల పాటు..!) -
కాస్మెటిక్ ఆక్యుపంక్చర్ గురించి విన్నారా?
అందానికి, ఆరోగ్యానికి ఆక్యుప్రెషర్ ట్రీట్మెంట్ దీ బెస్ట్ అనేది చాలామంది నమ్మకం. అలాంటివారికి ఈ పర్సనల్ ఆక్యుపాయింట్ ప్రెషర్ మసాజ్ డివైజ్ బాగా యూజ్ అవుతుంది. ఇది చూడటానికి.. చిన్న చిన్న బెలూన్స్.. రోల్స్ మాదిరి అటాచ్ అయ్యి.. డాగ్ షేప్‌లో కనిపిస్తుంది. దీన్ని ఒక డాగ్ అనుకుంటే.. కాళ్లవైపుండే రోల్స్‌కి.. అడుగున స్టెయిన్లెస్ స్టీల్ బాల్స్ అమర్చి ఉంటాయి. వాటితో మసాజ్ చేసుకోవచ్చు. తల, తోకలాంటి రోల్స్‌కి మొనదేలిన చిన్న బొడిపెలు ఉంటాయి. వీటితో ఆక్యుప్రెషర్ ట్రీట్మెంట్ను అందుకోవచ్చు. ఇది నొప్పుల్ని తగ్గిస్తుంది. ఒత్తిడిని దూరం చేస్తుంది. యవ్వనాన్ని ఇస్తుంది. ఈ బెలూన్ డాగ్ డిజైన్స్ రోలర్స్.. ఆన్ లైన్ మార్కెట్లో.. పింక్, బ్లూ కలర్స్‌లో లభిస్తున్నాయి. పైగా ఇది చిన్నగా ఉండటంతో ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. ఆఫీస్ సొరుగుల్లో, కారు డాష్ బోర్డ్‌లో ఇలా.. అందుబాటులో ఉంచుకోవచ్చు. ఆక్యుప్రెషర్ ట్రీట్మెంట్లో పలు ప్రెషర్ పాయింట్స్ గురించి, పలు ఉపయోగాల గురించి తెలుసుకుంటే చాలు.. దీని వినియోగం చాలా సులభమవుతుంది. చెవులు, ముక్కు, చేతులు, కాళ్లు ఇలా ప్రతి భాగంలోనూ ప్రెషర్ పాయింట్స్‌ను ఈ బెలూన్ల రోలర్‌తో ప్రెస్ చేస్తే చాలు.. ఉపశమనంతో పాటు.. అందం, ఆరోగ్యం చేకూరుతాయి. హెల్త్ ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్తో పాటు.. కాస్మెటిక్ ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ కూడా తెలిసి ఉంటే దీన్ని వినియోగించడం ఇంకా తేలిక. అలసట, ఒత్తిడి దూరం కావడంతో పాటు.. మొటిమల సమస్యలు, సోరియాసిస్, పిగ్మెంటేషన్ వంటి సమస్యలనూ తగ్గించుకోవచ్చు. ఏబీఎస్ ప్లాస్టిక్, స్టెయిన్లెస్ స్టీల్ మెటీరియల్‌తో రూపొందిన ఈ టూల్.. అన్ని రకాలుగానూ లాభదాయకమే. దీని ధర 25 డాలర్లు. అంటే దాదాపు రెండువేల రూపాయలు పైనన్న మాట. (చదవండి: ఎగ్స్‌ని ప్రిజర్వ్ చేసుకుని ఐదారేళ్ల తర్వాత పిల్లల్ని కనొచ్చా?) -
తాడిపత్రిలో శంకర్‌దాదా ఎంబీబీఎస్..
‘‘మోకాలి నొప్పులు, వెన్ను నొప్పి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా? దీర్ఘ కాలిక రోగాల బారినపడి విసిగిపోయారా? ఇకపై సంవత్సరాల తరబడి ట్యాబ్లెట్లు వేసుకోవాల్సిన అవసరమే లేదు. చిన్న సూదులతో కొద్ది రోజుల్లోనే మిమ్మల్ని సంపూర్ణ ఆరోగ్యవంతులను చేసేస్తాం’’ అంటూ ఆక్యుపంక్చర్ వైద్యుడిగా తనను తాను చలామణి చేసుకుంటున్న ఓ వ్యక్తి జిల్లాలో జోరుగా ప్రచారం చేశాడు. ఇదంతా నిజమేననుకుని వందలాది మంది ఆ వ్యక్తిని ఆశ్రయించారు. ఉన్నరోగం నయమవుతుంది అనుకున్న వారికి కొత్త అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో బాధితులంతా లబోదిబోమంటున్నారు. సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఆక్యుపంక్చర్ వైద్యంతో సర్వరోగాలను నయం చేస్తానంటూ తాడిపత్రికి చెందిన ఓ వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో ఊదరగొట్టడంతో వివిధ రోగాల బారిన పడిన వారంతా అతడి వద్దకు క్యూ కట్టారు. ఆక్యుపంక్చర్ వైద్యం పేరిట అతను అత్యంత ప్రమాదకరమైన స్టెరాయిడ్ ఇంజెక్షన్లను వినియోగించడంతో చాలా మంది అనారోగ్యం బారిన పడ్డారు. స్థానిక ఆర్ఎంపీలకు ఈ విషయం తెలిసి భయపడి పోయిన వారు తమ వాట్సాప్ గ్రూప్‌ల నుంచి సదరు వ్యక్తిని పూర్తిగా తొలగించారంటే అతని వైద్యం ఎంత ప్రమాదకరమైనదో అర్థం చేసుకోవచ్చు. ఆక్యు పేరిట అడ్డగోలు వైద్యం.. చర్మంపైన సూదితో గుచ్చుతూ వ్యాధిని నయం చేసే నైపుణ్యతను, శాస్త్ర పరిజ్ఞానాన్ని ‘ఆక్యుపంక్చర్’ అంటారు. ఇందులో రోగలక్షణాలకు కాకుండా రోగ మూలకారకాలకు చికిత్స చేస్తారు. అలా చేస్తేనే జబ్బు పూర్తిగా నయమవుతుంది. ఇందుకోసం తేలికపాటి ప్రత్యేకమైన సూదులను ఉపయోగిస్తారు. కానీ ఇందుకు భిన్నంగా తాడిపత్రి పట్టణం టైలర్స్ కాలనీలో ఉన్న ఓ వ్యక్తి ‘ఆక్యు’ పేరిట అడ్డగోలు వైద్యానికి తెరలేపాడు. తనకు తాను ఆంక్యుపంక్చర్ వైద్యునిగా ప్రచారం చేసుకుంటున్నాడు. వృద్ధాప్యం ఇతర కారణాలతో మోకాలి నొప్పులతో బాధపడుతున్న వారిని టార్గెట్ చేసుకొని మోసానికి తెరలేపాడు. కేవలం రూ. 300 తో ఇంజెక్షన్ చేయించుకుంటే నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుందని నమ్మబలకడంతో ఎంతో మంది అతని ఆస్పత్రి ముందు బారులు తీరుతున్నారు. స్టెరాయిడ్లతో చికిత్స ఇంజెక్షన్ వేసుకుంటే చాలు మోకాళ్ల నొప్పులు ఇట్టే మాయం అవుతాయని సదరు వ్యక్తి నమ్మబలకడంతో తాడిపత్రి, పుట్లూరు, యల్లనూరు, యాడికి, పెద్దపప్పూరుకు చెందిన ఎంతో మంది అతని వద్ద వైద్యం కోసం క్యూ కట్టారు. దీంతో అతను ఆక్యుపంక్చర్ వైద్యం పేరుతో అత్యంత ప్రమాదకరమైన స్టెరాయిడ్ ఇంజెక్షన్లు వేస్తున్నాడని కొందరు బాధితులు తెలిపారు. ఇంజెక్షన్ చేసిన ప్రతిసారీ రూ.300 వసూలు చేస్తున్నాడని చెబుతున్నారు. ఇలా ఇంజెక్షన్ వేయించుకున్న వారికి తాత్కాలికంగా ఉపశమనం కలుగుతుండటంతో ఈ విషయం ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందటంతో కొందరు ఆర్ఎంపీలకు కూడా కాసుల పంట పండుతోంది. ఉన్న రోగాలకు తోడు కొత్తరోగం ఇంజెక్షన్లు వేయించుకున్న వారికి తాత్కాలికంగా నొప్పుల నుంచి కాస్త రిలీఫ్ వచ్చినా... ఆ తర్వాత నుంచి వారిని కొత్త అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో లబోదిబోమంటున్నారు. ఇంజెక్షన్ ఇచ్చిన చోట వాపులు రావడంతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు రావడంతో ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. పట్టించుకోని వైద్యాధికారులు కొన్నేళ్లుగా తాడిపత్రి పట్టణంలో ‘ఆక్యు’ పేరిట ఈ దందా జరుగుతున్నా... జిల్లా వైద్యాధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పటికే వందలాది మంది అతన్ని ఆశ్రయించి మోసపోగా నేటికీ దర్జాగా ఆక్యుపంక్చర్ వైద్యం చేస్తూనే ఉన్నాడు. కనీసం ఇప్పటికైనా అతని ఆగడాలకు బ్రేక్ వేసి సామాన్యుల ఆరోగ్యాలను కాపాడాలని ప్రజలు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. కఠిన చర్యలు తీసుకుంటాం ఆక్యుపంక్చర్ పేరిట రోగుల ప్రాణాలతో ఆడుకుంటే ఉపేక్షించేది లేదు. రోగులకు నొప్పులు తగ్గించడానికి స్టెరాయిడ్స్ ఇస్తే దుష్పరిణామాలు ఎదురవుతాయి. జిల్లాలో ఇలాంటి విధానంతో వైద్యం చేస్తున్న విషయం నాకు తెలియదు. విచారించి, ఎక్కడైనా ఇలాంటి పనులు చేస్తుంటే కఠిన చర్యలు తీసుకుంటాం. రోగులకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా మెరుగైన వైద్యం అందుతోంది. ప్రజలు ఇలాంటి తెలిసీ తెలియని వైద్యుల వద్దకు వెళ్లవద్దు. – కామేశ్వర ప్రసాద్, డీఎంహెచ్ఓ ప్రభుత్వ గుర్తింపు లేదు ఆక్యుపంక్చర్ థెరపీ చైనా వైద్య విధానంలో భాగం. ఏపీలో ఈ వైద్యానికి ఎలాంటి గుర్తింపు లేదు. జిల్లాలో ఆక్యుపంక్చర్ చేసే వారు లేరు. ఆయుష్ వైద్య విధానంలో వివిధ రుగ్మతలకు మంచి వైద్యం అందిస్తున్నాం. జిల్లా ప్రజలు ఆస్పత్రుల్లో అందించే ఉచిత వైద్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – రత్నా చిరంజీవి, ఇన్చార్జ్ ఆయుష్ వైద్యాధికారి -
అందం కోసం తేనెటీగలతో కుట్టించుకుంది!
లాస్ ఏంజెల్స్: అందంగా కనిపించడానికి ఏదైనా చేస్తానని అంటోంది.. హాలివుడ్ నటి గ్వైనెత్ పాల్త్రోవ్. తాజాగా ఆక్యుపంక్చర్‌లో భాగంగా తేనెటీగలతో డజన్ల సార్లు కుట్టించుకున్నానని చెప్పిందీ భామ. అంతేకాదు తనను తాను గినియా పందితో పోల్చుకున్న ఈ ఆస్కార్ విన్నర్ ఏం చేయడానికైనా ఎప్పుడూ సిద్దంగా ఉంటానంటోంది. తేనెటీగలతో తీసుకునే ఈ చికిత్స వేల సంవత్సరాల నుంచి అందుబాటులో ఉందని తెలిపింది. ఎపిథెరపీగా పిలిచే ఈ చికిత్సను చర్మం మీద మచ్చలను తగ్గించుకునేందుకు చేయించుకుంటారని, అయితే.. ఈ చికిత్స చేయించుకోవడానికి చాలా ధైర్యం, నొప్పిని భరించగల శక్తి ఉండాలని చెప్పింది 43 ఏళ్ల పాల్త్రోవ్. కీళ్ల నొప్పులు, వాపు, చర్మం మీద ఎర్రగా కనిపించడం, రక్తప్రసరణను పెంచడానికి ఆక్యుపంక్చర్ బాగా ఉపయోగపడుతుంది. -
శక్తి ప్రవాహాన్ని సరిచేసే చికిత్స... ఆక్యుపంక్చర్!
ఆక్యుపంక్చర్ అంటే... అది సూదులు గుచ్చుతూ రోగిని మరింత బాధించే ప్రక్రియ అనే అపోహ ఉంది. కానీ చాలా సందర్భాల్లో సూది గుచ్చడం రోగికి బాధాకరంగా పరిణమించదు. పైగా అది ఆరోగ్యాన్ని చక్కబరుస్తుంటుంది. ఈ ప్రక్రియపై ఉన్న అపోహలను తొలగించి, అవగాహనను కలిగించడానికే ఈ కథనం. మన శరీరమంతటా ప్రాణశక్తి ప్రవహిస్తూ ఉంటుంది. ఆ శక్తి ప్రవాహపు నెట్‌వర్క్‌ను ‘చి’ లేదా ‘కి’ అంటారు. శక్తిప్రవాహ మార్గాలు ఒకదాన్ని మరొకటి కలిసే జంక్షన్లను ‘మెరీడియన్స్’ అంటారు. ఆ ప్రవాహంలో ఎక్కడైనా లోపాలు తలెత్తినప్పుడు, ఆ జంక్షన్లను జాగ్రత్తగా గుర్తించి, వాటిలోకి సూదులు గుచ్చి, ఆ ప్రవాహాన్ని మళ్లీ క్రమబద్ధం చేస్తారు. ఈ ప్రక్రియనే ఆక్యుపంక్చర్ అంటారు. ఇలా సూదులు గుచ్చడం సాధారణంగానైతే నొప్పి లేని ప్రక్రియ. ఎప్పుడోగానీ అది నొప్పి కలిగించదు. ఆక్యుపంక్చర్ ప్రక్రియ చైనాలో 4000 ఏళ్ల క్రిందటే ఆవిర్భవించింది. మొదట్లో జపాన్ కొరియా వంటి దేశాల్లో విస్తరించింది. ఇప్పుడు పాశ్చాత్య ప్రపంచంలోనూ, భారత్‌లోనూ ప్రాచుర్యాన్ని సంపాదించుకుంటోంది. ఆక్యుపంక్చర్ గురించి అందరూ ఒకే తరహాగా తలపోస్తుంటారు. కానీ దేశదేశాల్లోనూ అక్కడి తాత్విక ధోరణులను (స్కూల్ ఆఫ్ థాట్‌ను) బట్టి, ప్రాక్టీషనర్‌ను బట్టి ఆచరణలో దీన్ని వేర్వేరు దేశాల్లో దీన్ని వేర్వేరుగా అనుసరిస్తుంటారు. చాలామంది దీనికి తమదైన పరిజ్ఞానాన్ని జోడించి, శాస్త్రాన్ని మరింత విస్తృతపరుస్తుంటారు. దాంతో అల్లోపతి, హోమియోపతి విధానాలతో పోలిస్తే ఆక్యుపంక్చర్ ప్రాక్టీస్‌లో భేదాలు చాలా ఎక్కువ. అయితే ఇందులో ఆక్యుపంక్చర్‌కు సంబంధించిన మూల అధ్యయనవేత్తలైన చైనీయుల మార్గమే ఎక్కువ అనుసరణీయం. ఎందుకంటే వాళ్లు దేహంలో శక్తి ప్రయుక్తం అయ్యే సరైన తీరునూ, ఆ ప్రవాహం వల్ల శరీరంలో ఏర్పడే అనారోగ్యాలను గుర్తించారు. కొందరు చైనీయుల మార్గాన్ని అనుసరిస్తూనే అక్కడి వేర్లూ, పసర్లను ఉపయోగించి వైద్యం చేస్తారు. అయితే ఆక్యుపంక్చర్ వైద్యవిధానంలో వ్యాధికి ఒక నిర్దిష్టమైన చికిత్స కంటే... ఆ వ్యక్తికి కలిగిన అనారోగ్యం, స్వస్థతలో లోపం వంటి వాటిని అనుసరించి, వ్యక్తి వ్యక్తికీ చికిత్స మారుతుంటుంది. ఇందులో వ్యాధి లక్షణాలనూ, వ్యక్తిత్వాన్ని, అతడి శరీర నిర్మాణపు ఒడ్డూపొడవూ, వైద్యపరీక్షల ద్వారా తెలిసిన అంశాలూ, రోగి ఇష్టానిష్టాలు, భావోద్వేగాలు... వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని వ్యాధిని తెలుసుకుంటారు. ఆక్యుపంక్చర్ వైద్యవిధానంలో నిర్దిష్టత చాలా ప్రధానం. దీనితో పాటు విశ్లేషణశక్తి, వ్యాధిని ఊహించగలిగే సామర్థ్యం ఇవన్నీ చాలా ముఖ్యభూమికను పోషిస్తాయి. నిర్దిష్టత, విశ్లేషణ, ఊహాసామర్థ్యం ఈ మూడు అంశాల సరైన సమతౌల్యతతోనే చికిత్సలోని నైపుణ్యం ఆధారపడి ఉంటుంది. కేవలం వ్యాధిని మాత్రమే గాక... ఒక వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యం, అతడి జీవనశైలి, ఆహార విహారాలు... ఇలా అన్ని అంశాల పరంగా ఆలోచించి చికిత్స చేసి స్వస్థత పరచాల్సి ఉంటుంది. చైనీయుల జ్ఞానాన్ని ఉపయోగించి ఆహార విహారాదులు మొదలకొని అన్నింటా పాటించాల్సిన పరిమితులు, వదిలివేయాల్సిన అతి ధోరణులను తెలుసుకోవాల్సి ఉంటుంది. అయితే చాలామందికి దీని దుష్ర్పభావాల గురించి కొన్ని అపోహాలు ఉంటాయి. శక్తి ప్రయుక్తమయ్యే జంక్షన్లు, కీలక స్థానాలను సరిగా గుర్తించకుండా వైద్యం చేస్తే రోగి పరిస్థితి మరింత విషమించే అవకాశం ఉందని చాలామంది భావిస్తారు. కానీ చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే సూది గుచ్చిన చోట అసౌకర్యాలు, గాయాలయ్యే అవకాశాలు తలెత్తుతాయి. కానీ శక్తిప్రయుక్తమయ్యే కీలకస్థానాలను కనిపెట్టగలిగే ఆక్యుపంక్చర్ నిపుణుల వల్ల అలాంటి పరిస్థితులను నివారించవచ్చు. సంప్రదించాల్సిన మెయిల్ ఐడీ : indumati_p@yahoo.co.in