ఇటీవల చాలామంది ఎలాంటి నైపుణ్యాలు లేదా స్కిల్స్ నేర్చుకోవడానికి ఆన్‌లైన్ లెర్నింగ్‌కే ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే కొన్ని రకాల కోర్సులు, స్కిల్స్‌కే వర్కౌట్ అవుతుంది. వైద్య విద్యలాంటి కోర్సులకు అస్సలు పనికిరాదు. ఇది ఓ రోగి జీవితంతో ముడిపడి ఉంటుంది. ఏదైనా తేడా కొడితే అసలుకే మోసం వస్తుంది. చివరికి కటకటాలపాలవ్వుతాం. ఆన్‌లైన్ లెర్నింగ్‌లో వైద్య విధానం గురించి జస్ట్ అవగాహన తెచ్చుకోగలమే గానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ పొందడం అసాధ్యం. కానీ ఇక్కడొక మహిళ అలాంటి సాహసానికి ఓడిగట్టి ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. చివరికి జైటుపాలయ్యింది. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే..
వివరాల్లోకెళ్తే..ఆగ్నేయ చైనాలోని వాంగ్ అనే మహిళ ఆన్‌లైన్ వీడియోల ద్వారా ఆక్యుపంక్చర్ మొత్తం నేర్చుకుంది. ఈ నైపుణ్యంతో తాను నివశించే గ్రామంలోని ప్రజలకు చికిత్స చేస్తూ మంచి పేరు సంపాదించుకుంది. ఇప్పటి వరకు ఎలాంటి తేడా కొట్టలేదు కాబట్టి డాక్టర్ లైసెన్స్ లేకుండానే ధర్జాగా చేసేసింది. అయితే గతేడాది లీ అనే వ్యక్తి అనారోగ్యంతో ఆ మహిళ వద్దకు వచ్చాడు. చికిత్స కోసం రూ. 5 వేలు చెల్లించాడుకూడా. ఆమె అతడికి చికిత్స అందించడమే గాక చివరి సెషన్‌లో భాగంగా చేసిన చికిత్స టైంలో లీ అసౌకర్యానికి గురయ్యాడు.
కాసేపటి తర్వాత ఆమె అతడిని ఎంత తట్టి లేపిన లేవకపోవడంతో అతడిని హుటుహుటినా ఆస్పత్రికి తరలించింది. ఆ క్రమంలోనే పరిస్థితి విషమించిన చనిపోవడం జరిగింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్టు చేసి కోర్టు ఎదుట హాజరపర్చారు. అప్పుడే అసలు విషయం బయటపడింది. వాంగ్‌కు అధికారిక ఆక్యుపంక్చర్ శిక్షణ లేదని పరిశోధనలో వెల్లడయ్యింది. ఆమె ఆన్‌లైన్ వీడియోలతో నేర్చుకుని తనపై, తన భర్తపై సాధన చేసిందే తప్ప క్లినికల్ అనుభవం లేదని తేలింది.
ఇక్కడ బాధితుడు లీకి తీవ్రమైన కరోనరీ హార్ట్ డిసీజ్ ఉంది. అలాంటి వాళ్లకు ఆంక్యుపక్చర్ అనేది ప్రత్యేక నిపుణులు పర్యవేక్షణలో చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎలాంటి క్లినికల్ శిక్షణలేని వాంగ్ అతడికి తనకు తెలిసిన కొద్దిపాటి జ్ఞానంతో చేయడంతో వికటించి అతని మరణించాడని కోర్టు పేర్కొంటూ ఆ మహిళకు 18 నెలలు జైలు శిక్ష, జరిమానా విధించింది.
Comments
Please login to add a commentAdd a comment