అత్యాధునిక జన్యు పరీక్షతో రోగులకు ప్రయోజనం..
ఎవరెవరికి ఏ మందు ఎంతమేరకు పనిచేస్తుందో ఈ పరీక్షతో తెలుసుకోవచ్చు
జీనోమ్ ఫౌండేషన్ వర్క్‌షాప్‌లో డాక్టర్ సోమరాజు, డాక్టర్ ప్రసాదరావు వెల్లడి
సాక్షి, హైదరాబాద్: గత పది, పదిహేనేళ్లతో పోలిస్తే ఇప్పుడు గుండెపోటు మరణాలు తగ్గాయని ప్రముఖ వైద్యులు వెల్లడించారు. కోవిడ్ తర్వాత గుండెపోటు మరణాలు పెరిగాయన్నది వాస్తవం కాదన్నారు. వివిధ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు అత్యాధునిక జన్యు పరీక్షతో ఎంతో ప్రయోజనం ఉంటుందని జీనోమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన వర్క్‌షాప్‌లో పలు వురు డాక్టర్లు, శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
గురువారం హైదరాబాద్‌లోని జీనోమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఏఐజీ ఆసుపత్రికి చెందిన ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ బి.సోమరాజు, నిమ్స్ మాజీ డైరెక్టర్, అపోలో స్పెక్ట్రా ఆసుపత్రుల చైర్మన్ డాక్టర్ ప్రసాదరావు, అపోలో ఆసుపత్రి కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాసరావు, యూరాలజిస్ట్ డాక్టర్ దీపిక, డాక్టర్ సత్యనారాయణ, జీ నోమ్ ఫౌండేషన్ ఎండీ డాక్టర్ గాంధీ మాట్లాడారు. జెనెటిక్ పరీక్షల వల్ల కొందరికి కొన్ని రోగాలకు మందులు వాడాల్సిన అవసరం ఉండకపోవచ్చని, కొందరికి ఎంత డోసు వాడాలో స్పష్టత వస్తుందన్నారు.
మనిíÙకీ, మనిషికీ జన్యుపరంగా తేడా ఉంటుందని... ఆ ప్రకారమే మందుల అవసరం ఉంటుందన్నా రు. ఆ తేడాను గుర్తించకపోతే కొందరికి మందులు సరిగా పనిచేస్తే, కొందరిపై దు్రష్పభావాలు ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.
ఔషధాల వినియోగంలో..: కార్డియాక్ ఔషధాల దీర్ఘకాలిక వినియోగంలో లోతైన అవగాహన అవసరమని వక్తలు చెప్పారు. కొలె్రస్టాల్ స్థాయిలను తగ్గించడంలో క్లోపిడోగ్రెల్, రక్తం గడ్డకట్టే స్థాయిలను తగ్గించడంలో స్టాటిన్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయని, అయితే అవి వ్యక్తిగతంగా రోగులపై ఏ స్థాయిలో పనిచేస్తున్నాయోననే విషయాన్ని అర్థం చేసుకోవడంలో జన్యు పరీక్షలు దోహదపడతాయని తెలిపారు. డాక్టర్ సోమరాజు మాట్లాడుతూ, జెనెటిక్ టెస్టు వల్ల ఏ వ్యక్తికి ఏ మందు అవసరం? ఎంత మోతాదులో అవసరం? అసలు మందులు వేయాల్సిన అవస రం ఉందా? లేదా? వంటి స్పష్టత వస్తుందన్నారు.అపోలో స్పెక్ట్రా చైర్మన్ డాక్టర్ ప్రసాదరావు మాట్లాడుతూ, డాక్టర్లు రాసిచ్చే మందుల్లో ప్రతీ నలుగురిలో ఒకరికి పని చేయడం లేదన్నారు. అందుకే జన్యు పరీక్ష చేస్తే ఏది అవసరమో నిర్ధారణకు రావొచ్చన్నారు.
జెనెటిక్ పరీక్ష ధర రూ.10 వేలు: జీనోమ్ ఫౌండేషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 4.15 ఎకరాల భూమి కేటాయించిందని డాక్టర్ గాంధీ వెల్లడించారు. త్వరలో భవన నిర్మాణానికి సీఎం రేవంత్‌రెడ్డి శంకు స్థాపన చేస్తారన్నారు. జీనోమ్ టెస్ట్‌కు తాము రూ.10 వేలు చార్జి చేస్తున్నామన్నారు. ఒకసారి పరీక్ష చేస్తే జీవితాంతం ఆ రిపోర్టు ఉపయోగపడుతుందన్నారు. దాని ప్రకారం అవసరమైన మోతాదులో డాక్టర్లు మందులు ఇవ్వడానికి వీలుపడుతుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment