genetic tests
-
గుండెపోటు మరణాలు తగ్గాయ్!
సాక్షి, హైదరాబాద్: గత పది, పదిహేనేళ్లతో పోలిస్తే ఇప్పుడు గుండెపోటు మరణాలు తగ్గాయని ప్రముఖ వైద్యులు వెల్లడించారు. కోవిడ్ తర్వాత గుండెపోటు మరణాలు పెరిగాయన్నది వాస్తవం కాదన్నారు. వివిధ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు అత్యాధునిక జన్యు పరీక్షతో ఎంతో ప్రయోజనం ఉంటుందని జీనోమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన వర్క్‌షాప్‌లో పలు వురు డాక్టర్లు, శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.గురువారం హైదరాబాద్‌లోని జీనోమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఏఐజీ ఆసుపత్రికి చెందిన ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ బి.సోమరాజు, నిమ్స్ మాజీ డైరెక్టర్, అపోలో స్పెక్ట్రా ఆసుపత్రుల చైర్మన్ డాక్టర్ ప్రసాదరావు, అపోలో ఆసుపత్రి కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాసరావు, యూరాలజిస్ట్ డాక్టర్ దీపిక, డాక్టర్ సత్యనారాయణ, జీ నోమ్ ఫౌండేషన్ ఎండీ డాక్టర్ గాంధీ మాట్లాడారు. జెనెటిక్ పరీక్షల వల్ల కొందరికి కొన్ని రోగాలకు మందులు వాడాల్సిన అవసరం ఉండకపోవచ్చని, కొందరికి ఎంత డోసు వాడాలో స్పష్టత వస్తుందన్నారు. మనిíÙకీ, మనిషికీ జన్యుపరంగా తేడా ఉంటుందని... ఆ ప్రకారమే మందుల అవసరం ఉంటుందన్నా రు. ఆ తేడాను గుర్తించకపోతే కొందరికి మందులు సరిగా పనిచేస్తే, కొందరిపై దు్రష్పభావాలు ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఔషధాల వినియోగంలో..: కార్డియాక్ ఔషధాల దీర్ఘకాలిక వినియోగంలో లోతైన అవగాహన అవసరమని వక్తలు చెప్పారు. కొలె్రస్టాల్ స్థాయిలను తగ్గించడంలో క్లోపిడోగ్రెల్, రక్తం గడ్డకట్టే స్థాయిలను తగ్గించడంలో స్టాటిన్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయని, అయితే అవి వ్యక్తిగతంగా రోగులపై ఏ స్థాయిలో పనిచేస్తున్నాయోననే విషయాన్ని అర్థం చేసుకోవడంలో జన్యు పరీక్షలు దోహదపడతాయని తెలిపారు. డాక్టర్ సోమరాజు మాట్లాడుతూ, జెనెటిక్ టెస్టు వల్ల ఏ వ్యక్తికి ఏ మందు అవసరం? ఎంత మోతాదులో అవసరం? అసలు మందులు వేయాల్సిన అవస రం ఉందా? లేదా? వంటి స్పష్టత వస్తుందన్నారు.అపోలో స్పెక్ట్రా చైర్మన్ డాక్టర్ ప్రసాదరావు మాట్లాడుతూ, డాక్టర్లు రాసిచ్చే మందుల్లో ప్రతీ నలుగురిలో ఒకరికి పని చేయడం లేదన్నారు. అందుకే జన్యు పరీక్ష చేస్తే ఏది అవసరమో నిర్ధారణకు రావొచ్చన్నారు. జెనెటిక్ పరీక్ష ధర రూ.10 వేలు: జీనోమ్ ఫౌండేషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 4.15 ఎకరాల భూమి కేటాయించిందని డాక్టర్ గాంధీ వెల్లడించారు. త్వరలో భవన నిర్మాణానికి సీఎం రేవంత్‌రెడ్డి శంకు స్థాపన చేస్తారన్నారు. జీనోమ్ టెస్ట్‌కు తాము రూ.10 వేలు చార్జి చేస్తున్నామన్నారు. ఒకసారి పరీక్ష చేస్తే జీవితాంతం ఆ రిపోర్టు ఉపయోగపడుతుందన్నారు. దాని ప్రకారం అవసరమైన మోతాదులో డాక్టర్లు మందులు ఇవ్వడానికి వీలుపడుతుందని చెప్పారు. -
‘జన్యుమార్పిడి’కి రంగం సిద్ధం!
♦ బహుళజాతి విత్తన కంపెనీల నుంచి వచ్చిన 10 దరఖాస్తుల పరిశీలన ♦ క్షేత్రస్థాయిలో పరీక్షలకు అనుమతిస్తే తప్పులేదన్న వ్యవసాయ వర్సిటీ! ♦ వ్యవసాయశాఖకు తాజాగా నివేదిక అందజేసిన శాస్త్రవేత్తల బృందం ♦ రాష్ట్రంలో అనుమతి ఇచ్చే అంశంపై త్వరలో కమిటీ సమావేశం సాక్షి, హైదరాబాద్: వరి, జొన్నల్లో జన్యుమార్పిడి పంటలను క్షేత్రస్థాయిలో ప్రయోగాత్మకంగా సాగు చేసేందుకు అవసరమైన అనుమతులు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధం అవుతోంది. అందుకు సంబంధించి ఏర్పాట్లు చకాచకా జరిగిపోతున్నాయి. ఒకవైపు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సాంకేతిక కమిటీ జన్యు మార్పిడి పరీక్షలను నిషేధించినా.. వాటిని అధ్యయనం చేసిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ జన్యు మార్పిడి పంటలను అనుమతించడాన్ని వ్యతిరేకించినా రాష్ర్ట ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో వెనకడుగు వేయడానికి సిద్ధంగా లేదని అర్థమవుతోంది. బహుళజాతి కంపెనీల నుంచి.. రాష్ట్రంలో వరి, జొన్న పంటల్లో జన్యుమార్పిడికి క్షేత్రస్థాయి పరీక్షలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ బహుళజాతి విత్తన కంపెనీలైన మోన్శాంటో, బేయర్, మహికో, పయనీర్ సహా పది కంపెనీలు తెలంగాణ వ్యవసాయశాఖకు దరఖాస్తు చేశాయి. జన్యు మార్పిడి పం టల ప్రయోగాలకు అనుమతి ఇవ్వాలా వద్దా అనే నిర్ణయం తీసుకునేందుకు వ్యవసాయశాఖ కార్యద ర్శి చైర్మన్‌గా, డెరైక్టర్ సభ్య కన్వీనర్‌గా మరో నలుగురితో కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీచేసిన సంగతీ తెలిసిందే. కమిటీ ఏర్పాటైనప్పటినుంచి జన్యుమార్పిడి ప్రయోగాలకు అనుమతించే అంశంపై అంతర్గతంగా పలు నిర్ణయాలు వేగంగా జరిగిపోతున్నాయి. అనుమతిపై వ్యవసాయ వర్సిటీ పరిశోధన కేంద్రం సానుకూలత బహుళజాతి కంపెనీల నుంచి వచ్చిన 10 దరఖాస్తులను అధ్యయనం చేయాలని జయశంకర్ వ్యవసాయ వర్సిటీని వ్యవసాయశాఖ ఆదేశించింది. జన్యుమార్పిడి పంటలకు అనుమతి ఇవ్వొచ్చా? ఇస్తే జరిగే నష్టాలేంటి? లాభాలేంటి? వంటి అంశాలను అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా వ్యవసాయశాఖ కోరింది. పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు జన్యుమార్పిడికి సానుకూలత వ్యక్తంచేస్తూ వ్యవసాయశాఖకు నివేదిక ఇచ్చినట్లు వ్యవసాయశాఖ వర్గాలు చెప్పాయి. అయితే ఆ నివేదిక అంశాలపై వ్యవసాయశాఖ అత్యంత గోప్యత పాటిస్తోంది. జీవ భద్రత పరీక్షలు చేయకుండానే.. జన్యు మార్పిడి పరీక్షలు రెండు రకాలుగా చేస్తా రు. మొదటివి జీవ భద్రత పరీక్షలు, రెండోవి దిగుబడి ఎంతొస్తుందో తెలుసుకునే క్షేత్రస్థాయి పరీక్షలు. కంపెనీలు మాత్రం క్షేత్రస్థాయి పరీక్షలకే అనుమతి కోరుతున్నాయి. జీవ భద్రత పరీక్షలు ఎందుకు చేయట్లేదని శాస్త్రవేత్తలు, రైతులు ప్రశ్నిస్తున్నారు. కానీ కంపెనీలు అందుకు ససేమిరా అంటున్నాయి. దీంతో ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని పలువురు విమర్శిస్తున్నారు. కమిటీ ఆమోదమే తరువాయి.. జన్యుమార్పిడికి అనుమతి ఇవ్వాలా? వద్దా? అన్న అంశంపై తుది నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ యే. త్వరలో కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వాటికి అనుమతి ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమే కీలకం కాబట్టి బహుళజాతి కంపెనీల నుంచీ ఒత్తిడి పెరిగింది. ఆయా కంపెనీలు పెద్దఎత్తున రాజకీయ లాబీయింగ్ మొదలుపెట్టినట్లు తెలిసింది. మరోవైపు రాష్ట్రంలో అత్యంత కీలకమైన వరి, జొన్నలపై జన్యుమార్పిడి ప్రయోగాలకు అనుమతిస్తే ఇక రైతు భవిష్యత్తు అంధకారమే అవుతుందని రైతు నేతలు అంటున్నారు.