Side effect
-
రోజూ బ్రేక్‌ఫాస్ట్‌గా ఓట్స్ తీసుకుంటున్నారా..?
ప్రజలు తమ జీర్ణక్రియను మెరుగుపరచడానికి, బరువు తగ్గడానికి ఎక్కువగా వినియోగించే తృణధాన్యాల్లో ఒకటి ఓట్స్. పైగా శరీరానికి పుష్కలమైన ఫైబర్స్ అందుతాయని దీనికే ప్రాధాన్యత ఇస్తుంటారు. ముఖ్యంగా డైటీషియన్లు, జిమ్ శిక్షకులు ఫైబర్ కంటెంట్ ఉండే ఓట్స్‌ని తీసుకోమని సూచిస్తారు. జీర్ణక్రియకు, బరువు తగ్గడానికి, చెడు కొలస్ట్రాల్‌ని తగ్గించడానికి తోడ్పడే ఓట్స్‌ని తీసుకోవడం మంచిదే అయినప్పటికీ దీన్ని డైట్లో భాగం చేసుకునేటప్పుడూ ఈ జాగ్ర త్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సిందేనని అంటున్నారు నిపుణలు. లేదంటే దుష్పభావాలు తప్పవంటున్నారు.రోజు ఎందుకు తినకూడదు..నిపుణులు అభిప్రాయం ప్రకారం వోట్స్ కొన్ని రకాల దుష్ప్రభావాలను కలిగిస్తుందని పరిశోధనల్లో తేలింది. వారి ప్రకారం ఇది శరీరానికి విషపూరితం కావొచ్చని అంటున్నారు. శాస్త్రవేత్తలు 2017 నుంచి 2023 మధ్యకాలంలో జరిపిన అధ్యయనంలో చాలామంది అమెరికన్ల ఉపయోగించే ఓట్స్‌లో క్లోమరోమెక్వాట్ అనే విషపూరిత రసాయనం ఉన్నట్లు గుర్తించారు. ఆ పరిశోధనల్లో సుమారు 92% వోట్స్ ఆధారిత వాటిల్లో క్లోర్మెక్వాట్ గుర్తించదగిన స్థాయిల్లో ఉన్నట్లు కనుగొన్నారు. కొన్ని పెద్దపెద్ద బ్రాండ్ ఓట్స్‌లలో కూడా ఈ విషపూరిత రసాయనం ఉన్నట్లు గుర్తించారు. ఇది పునరుత్పత్తి అభివృద్ధిని ప్రభావితం చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇది మానవులకు హాని కలిగించే అవకాశాలు ఎక్కుగా ఉన్నట్లు అని పరిశోధన వెల్లడించింది. బరువు పెరిగేందుకు..ఓట్స్ బరువు తగ్గడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నప్పటికీ..ఇవి ఎక్కువగా తీసుకుంటే మాత్రం వ్యతిరేక పరిణామాలు చూపిస్తాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ప్రతిరోజూ ఎక్కువగా ఓట్స్ తీసుకుంటే పెద్ద మొత్తంలో బరువు పెరిగే అవకాశాలు ఉంటాయని అంటన్నారు. అలాగే చాలామంది దీన్ని చక్కెర, నట్స్, చాక్లెట్ చిప్స్, ఉప్పుతో కలిపి తీసుకుంటారు. ఇలా తీసుకుంటే ప్రయోజనాల కంటే, సమస్యలే ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. పొట్ట ఉబ్బరం..కొందరికి అదేపనిగా తృణధాన్యాలు తీసుకుంటే పొట్ట ఉబ్బరం కలిగిస్తాయి. అందువల్ల డైటీషియన్లు ఎప్పడూ కొద్ది మొత్తంలోనే తీసుకోమని సూచిస్తారు. దీన్ని జీర్ణశయాలు లేదా పెద్ద ప్రేగలలోని బ్యాక్టీరియాను వినియోగించుకోవటంతో గ్యాస్ ఫామ్ అయ్యి పొట్ట ఉబ్బరానికి దారితీస్తుంది.గ్లూటెన్ సున్నితత్వం..ఇవి గ్లూటెన్ రహితంగా ఉన్నప్పటికీ..తరుచుగా గోధుమ, బార్లీ మాదిరిగా ప్రాసెస్ చేయబడతాయి. ఇది ఉదరకుహార వ్యాధి లేదా గ్లూటెన్ సెన్సిటివిటీకి దారితీస్తంది. క్రమం తప్పకుండా ఓట్స్ తింటుంటే ప్రతికూల ప్రతి చర్యలకు దారితీస్తుంది. డైలీ తినాలనుకునేవారు పూర్తిగా గ్లూటెన్ రహిత ఓట్స్‌ని ఎంచుకోవాని చెబుతున్నారు. కడుపు వాపుఇవి ఒక్కోసారి గ్యాస్టిక్ వాపుని కలుగజేస్తాయి. ఆహారంలో ఆకస్మిక మార్పు వల్ల కలిగే ప్రభామే ఈ కడుపు వాపు. ఈ సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే వోట్స్ తీసుకునే మొత్తాన్ని తగ్గించాలి. మోతాదుకి మించి ఎక్కువగా తీసుకోకుండా జాగ్రత్తపడాలి. ఫైటిక్ యాసిడ్లుఈ ఓట్స్‌లో ఫైటిక్ యాసిడ్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి కాల్షియం, జింక్ వంటి ఖనిజాల శోషణను నిరోధిస్తుంది. ఓట్స్‌ని నానబెట్టడం లేదా పులియబెట్టడం వల్ల వాటిలో ఫైటిక్ యాసిడ్ కంటెంట్ తగ్గుతుంది.(చదవండి: భారతీయ యువతికి లండన్ ప్రతిష్టాత్మక అవార్డు! కింగ్ చార్లెస్‌ని..) -
పప్పు మంచిదని తినేస్తున్నారా..?ఐతే వీళ్లు మాత్రం..
మన భారతీయ వంటకాల్లో పప్పు లేకుండా భోజనం పూర్తవ్వదు. పండుగలు, ఫంక్షన్లో కచ్చితంగా పప్పుతో చేసిన వంటకం ఉండల్సిందే. అంతలా కందిపప్పుతో చేసే రెసిపీ భారతీయ వంటకాల్లో అగ్రస్థానంలో ఉంటుంది. ఈ పప్పులో ఫైబర్లు పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పైగా రక్తహీనతను నివారిస్తుంది. గుండె ఆరోగ్యానికి, మెరిసే చర్మానికి, ఎముకల ఆరోగ్యానికి పప్పు మేలు చేస్తుంది. అలాంటి కందిపప్పు వల్ల కొన్ని దుష్పరిణామాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఏంటీ కందిపప్పు వల్ల దుష్పరిణామాలా..? పప్పు వల్ల బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ..ఎక్కువగా తీసుకుంటే మాత్రం సమస్యలు తప్పవని అంటున్నారు నిపుణులు. ఇంతకీ పప్పు ఎవరు తినకూడదు?, ఎందుకని తినకూడదు? సవివరంగా చూద్దామా..! యూరిక్ యాసిడ్: యూరిక్ యాసిడ్ సమస్య ఎక్కువగా ఉంటే పప్పులు ఎక్కువగా తినకపోవడమే మంచిది. పప్పులో ముఖ్యంగా ప్యూరిన్ ఎక్కువగా ఉంటుంది. ప్యూరిన్లు యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచి కీళ్ల నొప్పులను పెంచుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కిడ్నీ రుగ్మతలు: అదేవిధంగా కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పప్పు తీసుకోవడం హానికరమని వైద్యులు చెబుతున్నారు. ఈ పప్పులో ఆక్సాలేట్స్ ఎక్కువగా ఉంటాయి. కిడ్నీ సమస్యలు ఉన్న వ్యక్తులు, వారి ఆహారంలో పప్పుతో కారణంగా కిడ్నీలో రాళ్లు లేదా ఇతర కొత్త మూత్రపిండ వ్యాధులలో ఆక్సలేట్ కారణం కావచ్చు. గ్యాస్ సమస్య: పప్పులో ఫైబర్ అధికంగా ఉంటుంది, కాబట్టి దీనిని తినడం వల్ల కొన్నిసార్లు గ్యాస్ సమస్యలు వస్తాయి. అతిగా తీసుకోవడం వల్ల ఎసిడిటీ సమస్యలు కూడా వస్తాయని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే ఈ పప్పుల్లో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దీనిని అధికంగా ఆహారంలో చేర్చుకుంటే, బరువు పెరగడం, కొవ్వు అధికంగా ఉండే ప్రమాదం ఉంది. అలెర్జీ ప్రతిచర్యలు: కొంతమంది వ్యక్తులు పప్పు వల్ల అలెర్జీ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇది కొందరికి దురద, వాపు, జీర్ణశయాంతర బాధ వంటి ప్రతికూల ప్రతిచర్యలకు దారితీయవచ్చు. గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీని గురించి వ్యక్తిగత నిపుణులు, వైద్యుల సలహాలు సూచనలు మేరకు ఫాలో అవ్వడం మంచిది. (చదవండి: ఐస్ క్రీమ్ తినడం ఆరోగ్యానికి మంచిదా? పరిశోధన ఏం చెబుతోందంటే.!.) -
కాస్మెటిక్ ఆక్యుపంక్చర్ గురించి విన్నారా?
అందానికి, ఆరోగ్యానికి ఆక్యుప్రెషర్ ట్రీట్మెంట్ దీ బెస్ట్ అనేది చాలామంది నమ్మకం. అలాంటివారికి ఈ పర్సనల్ ఆక్యుపాయింట్ ప్రెషర్ మసాజ్ డివైజ్ బాగా యూజ్ అవుతుంది. ఇది చూడటానికి.. చిన్న చిన్న బెలూన్స్.. రోల్స్ మాదిరి అటాచ్ అయ్యి.. డాగ్ షేప్‌లో కనిపిస్తుంది. దీన్ని ఒక డాగ్ అనుకుంటే.. కాళ్లవైపుండే రోల్స్‌కి.. అడుగున స్టెయిన్లెస్ స్టీల్ బాల్స్ అమర్చి ఉంటాయి. వాటితో మసాజ్ చేసుకోవచ్చు. తల, తోకలాంటి రోల్స్‌కి మొనదేలిన చిన్న బొడిపెలు ఉంటాయి. వీటితో ఆక్యుప్రెషర్ ట్రీట్మెంట్ను అందుకోవచ్చు. ఇది నొప్పుల్ని తగ్గిస్తుంది. ఒత్తిడిని దూరం చేస్తుంది. యవ్వనాన్ని ఇస్తుంది. ఈ బెలూన్ డాగ్ డిజైన్స్ రోలర్స్.. ఆన్ లైన్ మార్కెట్లో.. పింక్, బ్లూ కలర్స్‌లో లభిస్తున్నాయి. పైగా ఇది చిన్నగా ఉండటంతో ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. ఆఫీస్ సొరుగుల్లో, కారు డాష్ బోర్డ్‌లో ఇలా.. అందుబాటులో ఉంచుకోవచ్చు. ఆక్యుప్రెషర్ ట్రీట్మెంట్లో పలు ప్రెషర్ పాయింట్స్ గురించి, పలు ఉపయోగాల గురించి తెలుసుకుంటే చాలు.. దీని వినియోగం చాలా సులభమవుతుంది. చెవులు, ముక్కు, చేతులు, కాళ్లు ఇలా ప్రతి భాగంలోనూ ప్రెషర్ పాయింట్స్‌ను ఈ బెలూన్ల రోలర్‌తో ప్రెస్ చేస్తే చాలు.. ఉపశమనంతో పాటు.. అందం, ఆరోగ్యం చేకూరుతాయి. హెల్త్ ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్తో పాటు.. కాస్మెటిక్ ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ కూడా తెలిసి ఉంటే దీన్ని వినియోగించడం ఇంకా తేలిక. అలసట, ఒత్తిడి దూరం కావడంతో పాటు.. మొటిమల సమస్యలు, సోరియాసిస్, పిగ్మెంటేషన్ వంటి సమస్యలనూ తగ్గించుకోవచ్చు. ఏబీఎస్ ప్లాస్టిక్, స్టెయిన్లెస్ స్టీల్ మెటీరియల్‌తో రూపొందిన ఈ టూల్.. అన్ని రకాలుగానూ లాభదాయకమే. దీని ధర 25 డాలర్లు. అంటే దాదాపు రెండువేల రూపాయలు పైనన్న మాట. (చదవండి: ఎగ్స్‌ని ప్రిజర్వ్ చేసుకుని ఐదారేళ్ల తర్వాత పిల్లల్ని కనొచ్చా?) -
బీపీని పెంచే అవకాశం.. గ్రీన్ టీ తాగేవాళ్లు ఈ విషయాలు తెలుసుకోండి
బరువు తగ్గాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలనుకునే వారు చాలామంది తమ ఆహారంలో భాగంగా గ్రీన్ టీ తీసుకుంటారు. ఎందుకంటే ఇది మన శరీరానికి చాలా ప్రయోజనాలను అందిస్తుంది. అయితే రోగ్యానికి మంచిదని అధికంగా తీసుకోవడం వల్ల మన శరీరంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ►గ్రీన్ టీ ఎక్కువగా తాగడం వల్ల కొందరిలో కాలేయ సమస్యలు వస్తాయని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. గ్రీన్ టీ తీసుకునేటప్పుడు గర్భిణులు, పాలిచ్చే తల్లులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ► పరిశోధనల ప్రకారం, గ్రీన్ టీలో కూడా కొద్ది మోతాదులో కెఫిన్ ఉంటుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి.ఒకవేళ తీసుకోవాల్సి వస్తే, రోజుకు 200 మిల్లీగ్రాములకు మించి కెఫిన్ తీసుకోకూడదని పరిశోధనలు సూచిస్తున్నాయి. ► గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ దండిగానే ఉంటుంది. ఒకరకంగా ఇది హెల్తీ డ్రింక్ అయినప్పటికీ, గర్భధారణ సమయంలో ఎక్కువ మొత్తంలో గ్రీన్ టీ తీసుకోకూడదని అరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ► గర్భం దాల్చిన మొదటి మూడు నెలల్లో గ్రీన్ టీకి దూరంగా ఉండటం మంచిది. మూడవ త్రైమాసికంలో గ్రీన్ టీని తీసుకోవచ్చు. మరోవైపు కాఫీని అస్సలు తీసుకోకూడదు, ఇందులో కెఫీన్ ఎక్కువగా ఉంటుంది. ► గర్భిణీ స్త్రీలు గ్రీన్ టీకి దూరంగా ఉంటే మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. లేకుంటే ఇది పాల స్రావాన్ని తగ్గిస్తుంది. కాలేయ వ్యాధులు ఉన్నవారు గ్రీన్ టీ తీసుకోకపోవడమే మంచిది. గ్రీన్ టీ తాగేవారికి ఇతర మందులతో రియాక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. ► అందువల్ల మీరు ఇప్పటికే ఏవైనా ఇతర మందులు వాడుతున్నట్లయితే ఒకసారి వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే మీరు దీన్ని మీ ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది. గ్రీన్ టీ అధికంగా తీసుకోవటం వల్ల తలనొప్పి రావచ్చు. ఇది రక్తపోటును అమాంతం తగ్గించే అవకాశం ఉంది. ఇది అశాంతిని కలిగిస్తుంది. ► నిద్రలేమికి కారణం అవుతుంది. జీర్ణవ్యవస్థకు చికాకు కలిగిస్తుంది. భయాన్ని, ఆందోళనను కలిగిస్తుంది.గ్రీన్ టీ తీసుకున్న తర్వాత ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ గమనించినట్టయితే... మీరు వెంటనే మీ వైద్యుడిని సంప్రదించాలి. -
క్యాన్సర్ కణాలపై విద్యుత్ఛార్జ్!!
అల్లరిమూకలపై లాఠీఛార్జి!! అందరూ ఈ మాట అనేక సార్లు వినే ఉంటారు. దాదాపు క్యాన్సర్ కణాలూ అంతే. అయితే ‘లాఠీచార్జీ’కి బదులు... ఈ సరికొత్త చికిత్స ప్రక్రియలో ‘విద్యుత్ ఛార్జీ’ ప్రయోగిస్తారు. తలపైనున్న క్యాప్ నుంచి ‘ఛా...ర్జ్’ అంటూ ఆదేశాలు రాగానే... అపాయకర క్యాన్సర్కణాలన్నీ చెల్లాచెదురైపోతాయి. అంతేకాదు... ఆ విద్యుత్‌షాక్ కారణంగా వాటి పెరుగుదలా ఆగిపోతుంది. అదెలాగో చూద్దామా? సాధారణంగా మెదడులో క్యాన్సర్ గడ్డలు వస్తే ప్రధానంగా సర్జరీతో తొలగిస్తారు. కానీ మెదడులో శస్త్రచికిత్స కాస్త కష్టమైన ప్రక్రియ. క్యాన్సర్ గడ్డ వరకే తొలగించాలి. లేదంటే... దేహంలో అది నియంత్రించే ఏదైనా కేంద్రానికి ఏ కొంత దెబ్బ తగిలినా... ఆ ప్రాంతం చచ్చుబడిపోతుంది. అయితే ఇటీవల ‘ఆప్ట్యూన్ థెరపీ’ అనే సరికొత్త ప్రక్రియకు అమెరికాకు చెందిన ఎఫ్‌డీఏ అనుమతి ఇచ్చింది. టోపీలా ధరించాల్సిన ‘ఆప్ట్యూన్ డివైజ్’ అనే ఓ పరికరం కొన్ని విద్యుత్ క్షేత్రాలను పుట్టిస్తుంది. ఆ క్షేత్రాల్లో ప్రసారమయ్యే విద్యుత్తు... విస్తృతంగా పెరగబోయే క్యాన్సర్ కణజాలాన్ని చెల్లాచెదురు చేస్తుంది. ఇటీవలే అందుబాటులోకి వచ్చిన ఈ సరికొత్త చికిత్స ప్రక్రియ గురించి అవగాహన కోసమే ఈ కథనం. మెదడులో వచ్చే గ్లయోబ్లాస్టోమా అనే రకానికి చెందిన క్యాన్సర్ గడ్డలకు చికిత్స అందించేందుకు ఉద్దేశించిన పరికరమే ‘ఆప్ట్యూన్ డివైజ్’. దీన్ని తలకు తొడిగాక అది తలచుట్టూ ‘ట్యూమర్ ట్రీటింగ్ ఫీల్డ్’ అనే విద్యుత్ క్షేత్రాన్ని ఏర్పాటు చేస్తుంది. ఆ క్షేత్రం ఫలితంగా కొత్తగా పెరగాల్సిన క్యాన్సర్ కణాలు పెరగకుండా పోతాయి. అంతేకాదు... ఆ ప్రాంతంలోని క్యాన్సర్ కణాలన్నీ చెల్లాచెదురైపోతాయి. అయితే కొత్త చికిత్స గురించి తెలుసుకోడానికి ముందర అది చికిత్స చేసే ‘గ్లయోబ్లాస్టోమా క్యాన్సర్’ గడ్డలు గురించి తెలుసుకుందాం. గ్లయోబ్లాస్టోమా అనేవి చాలా వేగంగా పెరిగే ఒక రకం క్యాన్సర్ కణుతులు. ఇవి నాడీకణాల ఆధారంగా పెరిగేవి. కాబట్టి అవి సాధారణంగా మెదడులో లేదా కాస్త అరుదుగా వెన్నుపాము మీద వస్తుంటాయి. ఇవి చాలా చురుగ్గా, వేగంగా, తీవ్రంగా పెరుగుతాయి. ఈ తరహా క్యాన్సర్ ఎందుకు వస్తుందనేది ఇప్పటికీ స్పష్టంగా తెలియదు. అయితే అరుదైన కొన్ని రకాల జన్యురుగ్మతలు ఉన్నవారిలో ఈ క్యాన్సర్ గడ్డలు రావడం వైద్యనిపుణులు, శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది వేగంగా విస్తరించే క్యాన్సర్ కావడంతో... ఒకసారి దీని బారిన పడ్డాక బాధితులు సాధారణ ఆయుఃప్రమాణంతో చాలాకాలం పాటు బతికే అవకాశాలు కాస్తంత తక్కువే. సాధారణంగా క్యాన్సర్‌లో ఉపయోగించే సంప్రదాయ చికిత్సలైన శస్త్రచికిత్స, రేడియోథెరపీ, కీమో వంటి వాటితోనే ఇప్పటివరకూ దీనికి చికిత్స ఇస్తూ వస్తున్నారు. అయితే... ఈ క్యాన్సర్‌కు ఇప్పుడు ఈ ‘ఆప్ట్యూన్’ అనే సరికొత్త పరికరం అందుబాటులోకి రావడం చాలామంది బాధితుల పాలిట ఇదో ఆశారేఖగా మారింది. ఇప్పుడిప్పుడే అందుబాటులోకి రావడం వల్ల ఇది చాలా ఎక్కువ ఖరీదైన చికిత్సగానే ఉంది. పైగా అమెరికాలో మినహాయించి చాలా యూరోపియన్ దేశాల్లోకీ ఇంకా అందుబాటులోకి రాలేదు. కానీ భారత్‌లోని కొన్ని పెద్ద పెద్ద క్యాన్సర్ సెంటర్లలో ఇప్పుడిప్పుడే ఈ చికిత్స అందుబాటులోకి వస్తోంది. ఏమిటీ ఆప్ట్యూన్ పరికరం...? గ్లయోబ్లాస్టోమా కోసం ఉపయోగించే ’ఆప్ట్యూన్’ ప్రక్రియలో తలచుట్టూ బ్యాండేజీల్లాగా కనిపించే కొన్ని పరికరాలను అతికిస్తారు. ఇందుకు వీలుగా తొలుత బాధితుల తలవెంట్రుకలు తీయిస్తారు. (గుండు చేస్తారు). ఆ గండుకు వీటిని అంటుకుపోయేలా వీటిని రూపొందించారు. వీటిల్లో ‘ట్రాన్స్‌డ్యూసర్ అర్రేస్’ అని పిలిచే సిరామిక్ డిస్క్‌లు ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ బ్యాండేజీలా కనిపించే ఉపకరణాన్ని ‘స్కల్ క్యాప్’లా తొడుగుతారు. ఈ అర్రేస్ – అంటే ఎన్నో అద్దాల్లాంటి సముదాయం అని అర్థం) అన్నింటినుంచీ వచ్చే వైర్లన్నీ ఒక పోర్టబుల్ బ్యాటరీకి కలిపి ఉంటాయి. ఆ బ్యాటరీని భుజం దగ్గరగానీ లేదా బ్యాక్ప్యాక్లోగానీ పెడతారు. ఈ బ్యాటరీ సహాయంతో తలచుట్టూ ఓ విద్యుత్ క్షేత్రాన్ని రూపొందిస్తారు. ఈ క్షేత్రాన్ని ‘ట్యూమర్ ట్రీటింగ్ ఫీల్డ్’ అంటారు. ‘టీటీఎఫ్’ అంటే...? ‘ట్యూమర్ ట్రీటింగ్ ఫీల్డ్’లో చాలా తక్కువ తీవ్రతతో ఉన్న విద్యుత్ తరంగాలు ఉత్పన్నమవుతుంటాయి. ఈ తరంగాలు హానికారక క్యాన్సర్ కణాలను ఎటుపడితే అటు చెల్లాచెదురుగా చెదరగొట్టడంతో పాటు... వాటిల్లో కణవిభజన జరగకుండా నిరోధిస్తాయి. ఏ ఫ్రీక్వెన్సీలో ఈ విద్యుత్తరంగాలను ప్రయోగిస్తే... గ్లయోబ్లాస్టోమా కణాలన్నీ చెదిరిపోతాయో... ఆ ఫ్రీక్వెన్సీలో విద్యుత్తరంగాలు ఉత్పన్నమయ్యేలా ఆప్ట్యూన్ పరికరాన్ని సెట్ చేస్తారు. ఎంతకాలం పాటు...? చికిత్సలో భాగంగా ఇలా ఎంతకాలంపాటు ఈ టోపీలాంటి ఉపకరణాన్ని తొడిగి ఉండాలన్నది ట్యూమర్ల తీవ్రత ఆధారంగా డాక్టర్లు నిర్ణయిస్తారు. దుస్తులన్నింటిలాగే క్యాప్ ధరించడమూ ఒకరకంగా ఓ తొడుగు లాంటిదే కాబట్టి ఇది రోజువారీ పనులకూ అడ్డురాదు. ఒక్కోసారి ఈ క్యాప్లాంటి తొడుగును రోజుల్లో 18 గంటల పాటు కూడా ధరించాల్సి రావచ్చు. అలాగే తలలోని గడ్డలకు ఈ విద్యుత్ తరంగాల ప్రభావం ఉండటానికి, క్యాప్‌ను గుండుతో సరిగా అంటుకుపోయేలా ఉంచడానికి వారంలో రెండుసార్లు వెంట్రులకను తీసేయాల్సి వస్తుంటుంది. ఎందుకు అందుబాటులోకి రావాల్సి వచ్చింది? ఈ పరికరం ఎందుకు అందుబాటులోకి రావాల్సి వచ్చిందో కూడా చూద్దాం. యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ రీసెర్చ్ అండ్ ట్రీట్మెంట్ ఫర్ క్యాన్సర్ (ఈవోఆర్టీసీ) అనే అంతర్జాతీయ పరిశోధన సంస్థ... ‘గ్లయోబ్లాస్టోమా’ బాధితులు వివిధ చికిత్సలతో ఎంత కాలం పాటు మనుగడ సాగించగలరనే అంశాలపై విస్తృతంగా పరిశోధనలు చేసింది. ఏడు అంశాల ఆధారంగా ఇందుకోసం మూడు మోడల్స్‌ను కూడా రూపొందించిది. ఆ ఏడు అంశాలేమిటంటే... బాధితులకు ఇస్తున్న చికిత్స, అతడి వయసు, శస్త్రచికిత్స ఏ మేరకు సాధ్యమైందనే అంశం, మినీ మెంటల్ స్కోర్ ఎగ్జామినేషన్ అనే పరీక్ష, కార్టికోస్టెరాయిడ్స్ ఏమైనా ఇస్తున్నారా అనే అంశం, ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశాలకు అనుగుణంగా బాధితుడి సామర్థ్యాలు, ఎంజీఎమ్టీ ప్రమోటర్ మిథైలేషన్ స్టేటస్... అనే ఈ ఏడు అంశాల సహాయంతో ఆయా అంశాలను మూడు రకాల మోడల్స్ (సూత్రాల్లాంటివి)లో ప్రతిక్షేపించి లెక్కగడతారు. ఇలా లెక్కగట్టినప్పుడు అననుకూలతలు ఎక్కువగా ఉన్న కొందరు బాధితులు బతికే కాలం చాలా తక్కువగా ఉండటాన్ని శాస్త్రవేత్తలు గమనించారు. ఇలాంటి వారి ఆయుష్షునూ పెంచడానికి అనేక మార్గాల్లో పరిష్కారాలను వెతుకుతున్నప్పుడు ఈ ఆప్ట్యూన్ పరికరం అందుబాటులోకి వచ్చింది. దాదాపుగా పదకొండు నెలలు కూడా బతకరని నిర్ణయించిన చాలామంది రోగుల ఆయుష్షును దాదాపు మూడు నుంచి ఐదేళ్లకు మించి బతికేలా చేసింది ఈ చికిత్స. దీన్ని ఇంకా మెరుగుపరిస్తే... బాధితులు మరింతకాలం బతికే అవకాశం ఉన్నందున అననుకూలురైన చాలామందికి ఇదో ఆశాకిరణంగా కనిపిస్తోంది. ఒకసారి గ్లయోబ్లాస్టోమా నిర్ధారణ అయ్యాక... సంప్రదాయ క్యాన్సర్ చికిత్సలతో రోగి బతికే అవకాశాలను (ప్రోగ్నోసిస్ను) దాదాపుగా మూడేళ్లుగా చెబుతుంటారు. కానీ ఈ ఉపకరణంతో నిర్వహించిన ట్రయల్స్‌లో తర్వాత ఆ రోగుల ఆయుష్షు దాదాపు ఐదేళ్ల వరకు పెరగడాన్ని వైద్యనిపుణులు చూశారు. ఈ పరిశీలనలన్నింటినీ చూశాకే... కొత్త మందులకూ, కొత్త చికిత్స ప్రక్రియలకు అనుమతులిచ్చే ‘ఎఫ్‌డీఏ’ దీన్ని ఆమోదించింది. సాధారణంగా ఇది నోటిలోకి తీసుకునే మందు కానందున సైడ్ఎఫెక్ట్స్ పెద్దగా లేవుగానీ... బాధితుల్లో మరికొన్ని రకాల ఇబ్బందులను నిపుణులు గమనించారు. రోజూ మాడుకు క్యాప్‌లా ధరించి ఉండాల్సి రావడంతో మాడు–చర్మం మీద ఇబ్బందిగా (ఇరిటేషన్లా) అనిపించడం, మరికొందరిలో తలనొప్పి కనిపించాయి. కీమోథెరపీ తీసుకుంటూనే దీన్ని ధరించివారిలో ప్లేట్లెట్ కౌంట్ తగ్గడం, వికారం, వాంతులు, మలబద్ధకం, అలసట వంటి స్వల్ప అనర్థాలను వైద్యనిపుణులు చూశారు. దీనికి తోడు కాస్తంత అరుదుగా కొందరిలో కాస్త పెద్దస్థాయి అనర్థాలైన మూర్ఛ (ఫిట్స్/సీజర్స్), డిప్రెషన్ వంటి మానసిక సమస్యలనూ గమనించారు. ఇక రోజూ దీన్ని ధరించాల్సి రావడంతో తలపైన చర్మంలో కొన్నిచోట్ల కాస్తంత బిగుతుగా/బిగుసుకుపోయినట్లుగా అనిపించడం (ట్విచ్చింగ్), తలమీద పుండ్లు, జ్వరం వచ్చినప్పుడు కనిపించే నీరసం వంటివి కూడా కనిపించాయి. చదవండి: Tomato Fever: ఒళ్లంతా దురద.. జ్వరం, అలసట.. టొమాటో ఫీవర్ అంటే? -
కరోనానంతర సమస్యలకు లీ హెల్త్ ఔషధం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ తయరీలో ఉన్న హైదరాబాద్ కంపెనీ లీ హెల్త్ డొమైన్.. సహజ పదార్థాలతో న్యూట్రాస్యూటికల్ ట్యాబ్లెట్స్ను యాక్టోకిన్ పేరుతో విడుదల చేసింది. కరోనా వంటి వైరస్ సంబంధ అంటువ్యాధుల బారినపడ్డ వారిలో కీళ్ల నొప్పులు, చేతులు, అరచేతులు, కాళ్లు, పాదాలలో మంట, తిమ్మిరి, జలదరింపు తదితర నరాల సమస్యలను తగ్గించడానికి, అలసట నుండి ఉపశమనం పొందడానికి సహాయక చికిత్సగా శక్తివంతమైన యాంటీ ఇన్‌ఫ్లామేటరీ చర్యతో వీటిని రూపొందించింది. ఇందులోని కొలాజెన్, బోస్వెలియా సెరాటా, కుర్కుమిన్ ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా నొప్పి నివారణ మందుల స్థానంలో ఉపయోగించవచ్చని కంపెనీ డైరెక్టర్ ఆళ్ల లీలారాణి తెలిపారు. చదవండి: కోవిడ్ ఔషధం వచ్చేసింది! -
ఉప్పును ఎక్కువగా వాడుతున్నారా.. అయితే ఇది మీకోసమే!
ఉప్పు రక్తపోటును పెంచుతుందన్న విషయం మనందరికీ తెలిసిందే. అందుకే హైబీపీతో బాధపడేవారు ఉప్పు తగ్గించుకోవాలని వైద్యులు సలహా ఇస్తారు. ఉప్పులేని చప్పిడి తిండి తినడానికి చాలామంది ఇష్టపడరు గానీ, ఉప్పు ఎక్కువగా తీసుకుంటే, బీపీ పెరుగుతుంది. ఉప్పు వల్ల రక్తపోటు ఎందుకు పెరుగుతుందో చూద్దాం. మనం ఉప్పు ఉన్న పదార్థాలు ఎక్కవగా తీసుకున్నప్పుడు... ఆ ఉప్పు ద్వారా సోడియం అనే మూలకం రక్తంలోకి సాధారణ స్థాయి కంటే ఎక్కువగా చేరుతుంది. ఇలా చేరిన ఆ సోడియంను తొలగించడంలో కిడ్నీలు విఫలమవుతాయి. ఫలితంగా రక్తపోటు పెరుగుతుంది. రక్తంలోని సోడియం నరాల లోపల ఒత్తిడిని పెంచుతుంది. దీనిని తట్టుకునేందుకు నరాల లోపలి గోడల్లోని సన్నని కండరాలు మందంగా మారుతాయి. దీనివల్ల నరాల లోపల రక్తప్రసరణ సాఫీగా సాగేందుకు కావలసిన చోటు కుంచించుకుపోయి, రక్తపోటు పెరుగుతుంది. అతిగా ఉప్పు తింటే మెదడుకు దారితీసే నరాలు కూడా దెబ్బతింటాయి. ఫలితంగా గుండెకు ఆక్సిజన్, ఇతర పోషకాలు సజావుగా చేరలేని పరిస్థితి ఏర్పడుతుంది. మెదడుకు రక్తప్రసరణ తగ్గి డెమెన్షియా వంటి సమస్యలు తలెత్తుతాయి. రక్తపోటు అదుపు తప్పితే, గుండెపోటు రావడం, మెదడు వద్ద రక్తనాళాలు చిట్లి పక్షవాతం వంటి ప్రమాదకర పరిస్థితులు కూడా తలెత్తవచ్చు. అందుకే సాధ్యమైనంతవరకు మన ఆహారపదార్థాల్లో ఉప్పును పరిమితంగా తీసుకోవడమే మంచిది. ఇక ఉప్పు ఎక్కువగా ఉండే పచ్చళ్లు, అప్పడాలు, ఎక్కువకాలం నిల్వ ఉంచేలా తయారు చేసే బేకరీ ఐటమ్స్ పరిమితంగా తీసుకోవాలి. హైబీపీ ఉన్నవాళ్లు వాటిని తీసుకోకపోవడమే మంచిది. -
ఔషధో రక్షతి రక్షితః
ధర్మో రక్షతి రక్షితః... అన్నమాట మనమందరమూ విన్నదే. ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుందన్నది దాని అర్థం. దీన్ని మనం చెట్లకూ వర్తింపజేసుకుని, వృక్షో రక్షతి రక్షితః అనుకున్నాం. అంటే... చెట్లను మనం రక్షిస్తే, మనల్ని అవి రక్షిస్తాయి. కానీ ఇప్పుడు దీన్ని యాంటీబయాటిక్స్‌కూ అనువర్తింపజేసుకోవాల్సిన సమయం వచ్చింది. విచక్షణ రహితంగా వాడటాన్ని అరికట్టి యాంటీబయాటిక్స్‌ను మనం రక్షించుకోలేకపోతే, భవిష్యత్తులో మన ముందు తరాలకు వాటితో మనకు ఒనగూరే ప్రయోజనాలను ఇవ్వలేం. అందుకే యాంటీబయాటిక్స్ విషయంలో మనం అనుకోవాల్సిన కొత్త సూక్తి... ‘ఔషధో రక్షతి రక్షితః’. ఈ మాటను యాంటీబయాటిక్స్ మందులకు ఎందుకు వర్తింపజేసుకుంటున్నామని తెలుసుకునేందుకు ఉపయోగపడేదే ప్రస్తుత కథనం. మన దేహం అనేకానేక సూక్ష్మజీవులకు నిలయం. ఇందులో మనకు మేలు చేసేవి, హాని చేసేవి కూడా ఉంటాయి. మేలు చేసేవాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. హాని చేసేవాటిని తుదముట్టించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసం మనం వాడే మందులే... ‘యాంటీబయాటిక్స్’. ప్రాణరక్షకాలైన ఈ మందులను అదేపనిగా వాడటంవల్ల లేదంటే అధిక మోతాదుల్లో వాడటం వల్ల ఎన్నో దుష్పరిణామాలు ఉన్నాయి. మనకు చెడుచేసే సూక్ష్మజీవులు ఈ మందులకు నిరోధకత (రెసిస్టెన్స్) సాధిస్తే... ఆ తర్వాత మనల్ని రక్షించుకోవడం కష్టం. అందుకే యాంటీబయాటిక్స్ పట్ల అవగాహన పెంపొందించుకోవాలి. యాంటీబయాటిక్స్ అంటే మన శరీరంలోని హానికరమైన బ్యాక్టీరియాను చంపేందుకు ఉపయోగపడే మందు. ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ను తగ్గించి, రోగి ప్రాణాలు కాపాడుతుంది. అంటే ఈ మందులు ఇన్ఫెక్షన్ను వ్యాపించకుండా నిరోధిస్తాయన్నమాట. రోగిలోకి అప్పటికే ఇన్ఫెక్షన్ పాకి, రక్తం విషపూరితం కావడాన్ని (సెప్సిస్‌ను) సైతం ఆపి, ప్రాణాన్ని రక్షిస్తాయి. నైపుణ్యం కావాలి: రోగిలో బ్యాక్టీరియా వ్యాపించిన తీవ్రతను బట్టి ఏ మోతాదులో దీన్ని వాడాలో తెలిసి ఉండటం ఒక నైపుణ్యమే. రోగిలోని ఇన్ఫెక్షన్ తీవ్రతను సరిగ్గా అంచనా వేసి, ఆ మేరకు మాత్రమే మోతాదు ఇస్తే అది ఇన్ఫెక్షన్ను తుదముట్టిస్తుంది. అలాకాకుండా మోతాదును పెంచుకుంటూపోతే... రోగకారక క్రిములు క్రమంగా యాంటీబయాటిక్స్ తమపై పనిచేయని విధంగా నిరోధకత (రెసిస్టెన్స్)ను పెంచుకోవచ్చు. అందుకే యాంటీబయాటిక్స్‌ను ఎలా వాడాలి, ఎంతకాలం వాడాలి, ఏ మోతాదులో ఇవ్వాలి... అనే ఈ మార్గదర్శకాలను పాటించాలి. తక్షణ ఫలితాలను మాత్రమే ఆశించి, యాంటీబయాటిక్స్‌ను వాడటంతో కొన్ని దుష్పరిణామాలు సంభవిస్తున్నాయి. ఎన్నో చోట్ల దుర్వినియోగ : యాంటీబయాటిక్స్‌ను విచక్షణతో సరైన మోతాదును నిర్ణయించి రోగికి ఇవ్వాలి. కానీ వీటి దుర్వినియోగం ఎన్నో చోట్ల, వివిధ స్థాయుల్లో అవుతోంది. ఉదాహరణకు... రోగుల వద్ద: ఒకసారి ఒక తరహా జబ్బుకు డాక్టర్ వద్దకు వచ్చి ఒక రకం యాంటీబయాటిక్స్ తీసుకున్న రోగి... ఆ తర్వాత అదే తరహా జబ్బుకు గాని, అదే లక్షణాలతో వ్యక్తమయ్యే మరికొన్ని ఇతర జబ్బులకు గాని డాక్టర్ సలహా లేకుండా అదే మందును సొంతగా వాడుతుంటాడు. ఇలా రోగుల స్థాయిలో యాంటీబయాటిక్స్ దుర్వినియోగమవుతుంటాయి. అర్హత లేని వైద్యుల వద్ద (క్వాక్స్): వైద్యం చేయడానికి అర్హత లేని వ్యక్తులు (వీళ్లను క్వాక్స్ అంటారు) కొందరు డాక్టర్ చేసే చికిత్సను గమనించి, పైన రోగి వ్యవహరించే తరహాలోనే ఈ మందులను వాడుతుంటారు. డాక్టర్ల వద్ద : కొందరు డాక్టర్లు సైతం విచక్షణరహితంగా యాంటీబయాటిక్స్‌ను వాడుతుంటారు. త్వరగా ఫలితం కనిపించాలని కోరుకునే కొందరు డాక్టర్లు వీటి దుష్పరిణామాలు తమకు తెలిసి కూడా ఉపయోగిస్తుంటారు. ఫార్మసిస్టుల వద్ద: మన దేశంలో మందుల షాపు వారికే తమ లక్షణాలను వివరించి మందులు పొందడం చాలా సాధారణం. దీంతో ఫార్మసిస్టుల స్థాయిలో కూడా యాంటీబయాటిక్స్ దుర్వినియోగం జరుగుతుంటుంది. వాడకూడనిచోట వాడకం... జలుబు, దగ్గు వంటి సాధారణ రుగ్మతలు ప్రధానంగా వైరస్ వల్ల సంక్రమిస్తాయి. వైరల్ జ్వరాలు, రుగ్మతలకు యాంటీబయాటిక్స్ ఉపయోగకరం కాదు. అయినప్పటికీ జలుబు, దగ్గు వంటి సమస్యలకు అజిథ్రోమైసిన్, సెఫిక్సిమ్, సెపోడోక్సిమ్ వంటి యాంటీబయాటిక్స్ వాడుతుంటారు. అలాగే నీళ్లవిరేచనాలు అవుతున్న సందర్భాల్లోనూ నార్‌ఫ్లాక్స్ వంటి మందులు వాడుతుంటారు. నీళ్ల విరేచనాల కారణం కనుగొని మందును సూచించాలి. సమస్యలు: ఆరోగ్యానికి చెరుపు చేసే బ్యాక్టీరియాను తుదముట్టించడం కోసం ఒక నిర్దిష్టమైన మోతాదులో, నిర్ణీతమైన వ్యవధి మేరకు మనం యాంటీబయాటిక్స్ వాడుతుంటాం. సరైన మోతాదులో, సరైన వ్యవధి మేరకు యాంటీబయాటిక్స్ వాడకపోవడంవల్ల రోగకారక బ్యాక్టీరియా మందు నుంచి నిరోధకతను పొందుతాయి. దీనివల్ల రోగికే కాదు... ఇతరులకూ ప్రమాదమే. ఉదాహరణకు ఒక జబ్బుతో బాధపడే వ్యక్తికి నిర్దిషమైన యాంటీబయాటిక్స్ ఇచ్చినా, అతడు సరిగ్గా వాడకపోవడం వల్ల, అతడిలో ఉన్న రోగకారకక్రిములు ఆ మందుతో ప్రభావితం కానివిధంగా మారతాయి. దాంతో ఆ రోగక్రిములు ఇతరులకు వ్యాపిస్తే... ఈ మందు వారికీ పనిచేయదు. దీనికి ఉదాహరణ మెథిలిసిన్ రెసిస్టెంట్ స్టెఫలోకాకస్ ఆరియస్ అనే జబ్బు. ఇది ఆసుపత్రుల్లో ఇన్ఫెక్షన్తో బాధపడే రోగులకు ఇచ్చే యాంటీబయాటిక్స్ దుర్వినియోగం కావడం వల్ల ఆసుపత్రుల్లో చేరేవారి పట్ల పరిణమించిన సరికొత్త జబ్బు లేదా రిస్క్‌గా మారింది. సైడ్ ఎఫెక్ట్స్: ప్రతి మందుకూ ఏవో కొన్ని దుష్పరిణామాలుంటాయి. వైద్యశాస్త్రం చదివి, అన్నీ తెలుసుకుని వైద్యం చేసేవారు... వాటి ప్రయోజనం, దుష్పరిణామాలు... రెండింటినీ బేరీజు వేసుకుని, రోగి పరిస్థితిని బట్టి ప్రయోజనాలు గరిష్ఠంగా, దుష్పరిణామాలు (సైడ్ఎఫెక్ట్స్) కనిష్ఠంగా ఉండేలా మందును సూచిస్తారు. ఒకవేళ అవసరాన్ని బట్టి తప్పనిసరి పరిస్థితుల్లో సైడ్ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉండే మందులు వాడాల్సివస్తే, వాటిని తగ్గించే మందులను సైతం రాస్తారు. దుష్పరిణామాలు తెలియనివారు మందును ప్రిస్క్రైబ్ చేయడం వల్ల రోగికి జరిగే హాని ఎక్కువ. రోగిపై ఆర్థిక భారం: తెలిసీతెలియని విధంగా డాక్టర్లు వైద్యం చేసినా, గ్రామీణ ప్రాంతాల్లోని రోగులు అర్హతలేని వైద్యుల (క్వాక్స్) వద్ద చికిత్స చేయించుకున్నా, తెలిసీతెలియని పరిజ్ఞానంతో రోగులే సొంత వైద్యం చేసుకున్నా... యాంటీబయాటిక్స్ దుర్వినియోగంతో రోగికి జబ్బు మరింత ముదిరి, మందుకు లొంగకపోయినా ఆ ఆర్థిక భారమంతా రోగిపైనే పడుతుంది. అందుకే యాంటీబయాటిక్స్‌ను డాక్టర్లు సూచించిన విధంగా, సూచించిన మోతాదుతో, నిర్దిష్టమైన కాలపరిమితి ప్రకారం వాడాలి. కాలపరిమితి ప్రధానం: ఒక యాంటీబయాటిక్‌ను నిర్దేశించిన కాల పరిమితికి తగ్గనివ్వకూడదు, మించనివ్వకూడదు. ఉదాహరణకు టీబీ జబ్బులో వాడే మందులు మొదలుపెట్టిన కొద్దిరోజుల్లోనే లక్షణాలన్నీ తగ్గిపోతాయి. కానీ రోగకారక క్రిమి ఇంకా శరీరంలో బతికే ఉంటుంది. ఒకవేళ లక్షణాలన్నీ తగ్గాయన్న కారణంగా ముందే మందులు మానేస్తే... శరీరంలోని రోగకారక క్రిమి మందు నుంచి నిరోధకత పొందుతుంది. ఇది మరింత ప్రమాదకరమైన జబ్బుకు కారణమవుతుంది. కొందరు డాక్టర్ సూచించిన వ్యవధి తర్వాత కాకుండా, అదే మందును మరికొంతకాలం కొనసాగించి, అప్పుడు డాక్టర్ వద్దకు వస్తారు. అలా వ్యక్తిగతంగా రోగి డాక్టరు వద్దకు రాలేని సందర్భాల్లో ఏదో విధంగా డాక్టర్‌ను సంప్రదించి, ఆ మందును తాము మళ్లీ డాక్టర్‌ను కలిసేవరకు కొనసాగించడం మంచిదో కాదో తెలుసుకోవాలి. ఒకవేళ ముందే అలా రాలేమని తెలిసినవారు, ముందుగానే ఆ విషయాన్ని డాక్టర్‌కు తెలియపరచి అలా కొనసాగించవచ్చా లేక ఆ నిర్దిష్ట కాలం తర్వాత ఆ మందు ఆపేయాలా అన్న విషయాన్ని ముందే తెలుసుకోవాలి. వివిధ కారణాల వల్ల మందుల షాపుల్లో ఓవర్ ద కౌంటర్ మందులు ఇవ్వడం అనే సంప్రదాయం కొనసాగుతోంది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు తీసుకోవడం మంచిదికాదన్న విషయాన్ని గ్రహించి, అలా చేయడం మనకే మంచిదికాదని అందరూ గుర్తించి, ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు ఇవ్వకూడదు, తీసుకోకూడదని తెలుసుకోవాలి. ప్రిస్క్రిప్షన్ లేకుండా మందుల లభ్యతను నిరోధించే విధానం గట్టిగా అమలయ్యేలా చూడాలి * యాంటీబయాటిక్స్ ఏ సందర్భాల్లో పనిచేస్తాయో తెలిసిన డాక్టర్లు, ప్రతి చిన్న సమస్యకూ వాటిని సూచించరు. అలా ప్రిస్క్రైబ్ చేయని సందర్భాల్లో తప్పనిసరిగా తమ లక్షణాలు తగ్గడానికి మందు ఇవ్వమని డాక్టర్‌ను బలవంతం చేయకండి. ఉదాహరణకు జబులు, గొంతునొప్పి, ఆక్యూట్ బ్రాంకైటిస్, ఫ్లూ, గొంతులో అసౌకర్యం వంటి కొన్ని సమస్యలు వైరస్ల కారణంగా వస్తాయి. ఇక మధ్య చెవిలో ఇన్ఫెక్షన్ వంటి కొన్ని సమస్యలకు కూడా యాంటీబయాటిక్స్ వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. అలాంటి సందర్భాల్లో డాక్టర్ మీ మేలుకోరి మందులు రాయకపోతే వాటిని లక్షణాలను బట్టి యాంటీబయాటిక్స్ కోసం పట్టుపట్టకండి. వాటికి బదులు డాక్టర్ సలహాతో గృహవైద్యం... అంటే గొంతునొప్పి కోసం ఉప్పు వేసిన గోరువెచ్చని నీటితో పుక్కిలించడం, జబులు, ఫ్లూ వంటి సమస్యలకు ఆవిరిపట్టడం లేదా గొంతునొప్పి, సోర్‌థ్రోట్ వంటి సమస్యలకు వేణ్ణీళ్లలో కొద్దిగా నిమ్మరసం, తేనె కలుపుకుని తాగడం వంటివి చేయాలి. వ్యాక్సిన్స్ తీసుకోవడం ద్వారా: చాలా జబ్బులకు వాటిని ముందే నివారించే చాలా రకాల వ్యాక్సిన్స్ మనకు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. చికిత్స కంటే నివారణ ప్రధానం అన్న సూక్తిని గుర్తెరిగి, వ్యాక్సిన్స్ తీసుకోండి. దీనివల్ల చాలా రకాల ఆర్థిక బాధలు, జబ్బు వల్ల కలిగే బాధలు నివారితమవుతాయి. భవిష్యత్ తరాలకు మిగలనివ్వండి... మనకు అందుబాటులో ఉన్న యాంటీబయాటిక్స్ అన్నీ చాలా విలువైనవి. అవి రకరకాల ఇన్ఫెక్షన్లను అరికట్టి కోటానుకోట్లమంది రోగులకు ప్రాణరక్షణ చేస్తున్నాయి. వాటిని మనం దుర్వినియోగం చేసి, వాటివల్ల రెసిస్టెన్స్ వచ్చే పరిస్థితిని కల్పించుకుంటే అవి భవిష్యత్తులో నిరుపయోగం అవుతాయి. గత శతాబ్దిలో కనుగొన్నవి మినహా కొత్త యాంటీబయాటిక్స్ పెద్దగా రూపొందలేదు. రూపొందే అవకాశమూ పెద్దగా కనిపించడం లేదు. అందుకే వీటన్నింటినీ దురుపయోగంతో నిరుపయోగం చేసేసి, భవిష్యత్తరాలను రోగగ్రస్థులను చేయకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. దుర్వినియోగం అవుతున్న యాంటీబయాటిక్స్ ఇవే... మనకు కారణం తెలియకుండానే, నిర్దిష్టంగా ఏయే యాంటీబయాటిక్స్ ఏయే జబ్బులకు పనిచేస్తాయో అవగాహన లేకుండానే యాంటీబయాటిక్స్ అన్న పేరుంటే చాలు... వాటిని దుర్వినియోగం చేస్తున్నాం. అవి... ఎరిథ్రోమైసిన్, అజిథ్రోమైసిన్, సెఫిక్సిమ్, సెపొడోక్సిమ్, ఓఫ్లాక్సిన్, నార్‌ఫ్లాక్సిన్, సిఫ్రాన్, నార్‌ఫ్లాక్స్, సెప్ట్రాన్, మోనోసెఫ్, పైపర్‌సిలిన్ టాజోబాక్టమ్ మొదలైనవి.