మన భారతీయ వంటకాల్లో పప్పు లేకుండా భోజనం పూర్తవ్వదు. పండుగలు, ఫంక్షన్‌లో కచ్చితంగా పప్పుతో చేసిన వంటకం ఉండల్సిందే. అంతలా కందిపప్పుతో చేసే రెసిపీ భారతీయ వంటకాల్లో అగ్రస్థానంలో ఉంటుంది. ఈ పప్పులో ఫైబర్లు పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పైగా రక్తహీనతను నివారిస్తుంది. గుండె ఆరోగ్యానికి, మెరిసే చర్మానికి, ఎముకల ఆరోగ్యానికి పప్పు మేలు చేస్తుంది. అలాంటి కందిపప్పు వల్ల కొన్ని దుష్పరిణామాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఏంటీ కందిపప్పు వల్ల దుష్పరిణామాలా..?
పప్పు వల్ల బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ..ఎక్కువగా తీసుకుంటే మాత్రం సమస్యలు తప్పవని అంటున్నారు నిపుణులు. ఇంతకీ పప్పు ఎవరు తినకూడదు?, ఎందుకని తినకూడదు? సవివరంగా చూద్దామా..!
యూరిక్ యాసిడ్:
యూరిక్ యాసిడ్ సమస్య ఎక్కువగా ఉంటే పప్పులు ఎక్కువగా తినకపోవడమే మంచిది. పప్పులో ముఖ్యంగా ప్యూరిన్ ఎక్కువగా ఉంటుంది. ప్యూరిన్లు యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచి కీళ్ల నొప్పులను పెంచుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కిడ్నీ రుగ్మతలు:
అదేవిధంగా కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పప్పు తీసుకోవడం హానికరమని వైద్యులు చెబుతున్నారు. ఈ పప్పులో ఆక్సాలేట్స్ ఎక్కువగా ఉంటాయి. కిడ్నీ సమస్యలు ఉన్న వ్యక్తులు, వారి ఆహారంలో పప్పుతో కారణంగా కిడ్నీలో రాళ్లు లేదా ఇతర కొత్త మూత్రపిండ వ్యాధులలో ఆక్సలేట్ కారణం కావచ్చు.
గ్యాస్ సమస్య:
పప్పులో ఫైబర్ అధికంగా ఉంటుంది, కాబట్టి దీనిని తినడం వల్ల కొన్నిసార్లు గ్యాస్ సమస్యలు వస్తాయి. అతిగా తీసుకోవడం వల్ల ఎసిడిటీ సమస్యలు కూడా వస్తాయని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే ఈ పప్పుల్లో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దీనిని అధికంగా ఆహారంలో చేర్చుకుంటే, బరువు పెరగడం, కొవ్వు అధికంగా ఉండే ప్రమాదం ఉంది.
అలెర్జీ ప్రతిచర్యలు:
కొంతమంది వ్యక్తులు పప్పు వల్ల అలెర్జీ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇది కొందరికి దురద, వాపు, జీర్ణశయాంతర బాధ వంటి ప్రతికూల ప్రతిచర్యలకు దారితీయవచ్చు.
గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీని గురించి వ్యక్తిగత నిపుణులు, వైద్యుల సలహాలు సూచనలు మేరకు ఫాలో అవ్వడం మంచిది.
(చదవండి: ఐస్ క్రీమ్ తినడం ఆరోగ్యానికి మంచిదా? పరిశోధన ఏం చెబుతోందంటే.!.)
Comments
Please login to add a commentAdd a comment