ఇడ్లీ అనంగానే తేలిగ్గా అరిగిపోయే వంటకం. చాలా సులభంగా జీర్ణమయ్యే అల్పాహారం కూడా. పేషెంట్లే కాదు, సామాన్య ప్రజల వరకు అందరూ బ్రేక్‌ఫాస్ట్ మొదటగా ఈ రెసిపీకే ప్రాధాన్యత ఇస్తారు. అంతలా ఇడ్లీలు అందరి మనసులో దోచుకున్న గొప్ప ప్రసిద్ధ వంటకంగా పేరుగాంచింది. అయితే వీటిని పలు రకాలుగా చేస్తారు. ఆయా ప్రాంతాల వారీగా చేసే విధానం మారుతుంటుంది. అందులోకి ఆరోగ్య స్ప్రుహతో మరింత ఆరోగ్యవంతంగా ఆస్వాదించే వైరైటీ ఇడ్లీలు కూడా మన ఆహారంలో భాగమైపోతుండటం మరింత విశేషం. అయితే ఇడ్లీలకే కింగ్‌గా పిలిచే వెరైటీ ఇడ్లీ వంటకం గురించి విన్నారా..?.
ఇడ్లీలకే రాజుగా పేరుగాంచిన ఈ వంటకం కేరళలోని పాలక్కాడ్‌లోని గ్రామానికి చెందింది. ఈ ఇడ్లీలు మనం తినే ఇడ్లీలకు చాలా విభిన్నంగా ఉంటుంది. పేరుకు తగ్గట్టు ఆకృతి పరంగా పెద్దవిగానూ మల్లెపువ్వులా మృదువుగా ఆకర్షణీయంగా ఉంటాయి. వీటిని తయారు చేసే విధానం కూడా అత్యంత విభిన్నంగా ఉంటుంది. పాలక్కాడ్‌లోని రామస్సేరి గ్రామం కింగ్ ఆఫ్ ఇడ్లీలకు పేరుగాంచింది. ఈ ఇడ్లీలనే తినేందుకు పర్యాటకులు ఈ గ్రామానికి తరలి వస్తుంటారా..!. వీటిని పాన్‌కేక్ మాదిరిగా తయారు చేస్తారు.
తయారు చేయు విధానం..
మట్టికుండపై ఒక గుడ్డ కప్పి ఆవిరిపై ఉడకబెడతారు. 200 ఏళ్ల క్రితం తమిళనాడు, కాంచీపురం, తిరుపూర్, తంజావూర్ వంటి ప్రాంతాల నుంచి కొన్ని ముదలియార్ కుటుంబాలు కేరళకు రావడంతో ఈ వంటకం పుట్టుకొచ్చిందని స్థానికులు చెబుతుంటారు. వాళ్లంతా బతుకుదెరువు కోసం రామస్సేరి అనే చిన్న గ్రామానికి వచ్చి స్థిరపడటంతో ఈ వంటకం ఉనికిలోకి వచ్చిందని ఓ కథనం. ఆయా కుటుంబాల్లో మగవాళ్లంత చేనేత కార్మికులు కాగా, మహిళలు రుచికరంగా వంట చేసేవారట. అలా ఈ రామస్సేరి ఇడ్లీలు ప్రాచుర్యంలోకి రావడం జరిగింది. ఇక్కడ ఈ ఇడ్డీని తయారు చేసేందుకు ఉపయోగించే మెష్‌క్లాత్ ఇడ్డీని సమానంగా ఉడికేలా చేయగా, స్లీమింగ్ కోసం ఉపయోగించే మట్టికుండా ఆ ఇడ్లీలకు ఒక విధమైన రుచిని అందిస్తాయి.
తయారీ..
కావాల్సిన పదార్థాలు..
కప్పుల బియ్యం (ఇడ్లీ బియ్యం మరియు ముడి బియ్యం)
ఉరద్ పప్పు 1 కప్పు
నీరు 1 కప్పు
మెంతు గింజలు 1 స్పూన్
తగినంత ఉప్పు
నాలుగు గంటలు పైనే నానబెట్టిటన మినపప్పు, బియ్యం, మెంతులు కలిపి మెత్తగా అయ్యేలా మిక్సీ పట్టాలి. ఆ తర్వాత ఉప్పు వేసి కనీసం ఓ పది నుంచి 12 గంటలు వదిలేయాలి. ఆ తర్వాత ఇడ్లీల్లా మట్టిప్లేటులో పెద్ద మొత్తంలో పరుచుకుని మట్టికుండపై ఉడికిస్తే.. ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే రామస్సేరి ఇడ్లీలు రెడీ..!.
(చదవండి:
Comments
Please login to add a commentAdd a comment