Palakkad
-
'కింగ్ ఆఫ్ ఇడ్లీలు" గురించి విన్నారా?
ఇడ్లీ అనంగానే తేలిగ్గా అరిగిపోయే వంటకం. చాలా సులభంగా జీర్ణమయ్యే అల్పాహారం కూడా. పేషెంట్లే కాదు, సామాన్య ప్రజల వరకు అందరూ బ్రేక్‌ఫాస్ట్ మొదటగా ఈ రెసిపీకే ప్రాధాన్యత ఇస్తారు. అంతలా ఇడ్లీలు అందరి మనసులో దోచుకున్న గొప్ప ప్రసిద్ధ వంటకంగా పేరుగాంచింది. అయితే వీటిని పలు రకాలుగా చేస్తారు. ఆయా ప్రాంతాల వారీగా చేసే విధానం మారుతుంటుంది. అందులోకి ఆరోగ్య స్ప్రుహతో మరింత ఆరోగ్యవంతంగా ఆస్వాదించే వైరైటీ ఇడ్లీలు కూడా మన ఆహారంలో భాగమైపోతుండటం మరింత విశేషం. అయితే ఇడ్లీలకే కింగ్‌గా పిలిచే వెరైటీ ఇడ్లీ వంటకం గురించి విన్నారా..?.ఇడ్లీలకే రాజుగా పేరుగాంచిన ఈ వంటకం కేరళలోని పాలక్కాడ్‌లోని గ్రామానికి చెందింది. ఈ ఇడ్లీలు మనం తినే ఇడ్లీలకు చాలా విభిన్నంగా ఉంటుంది. పేరుకు తగ్గట్టు ఆకృతి పరంగా పెద్దవిగానూ మల్లెపువ్వులా మృదువుగా ఆకర్షణీయంగా ఉంటాయి. వీటిని తయారు చేసే విధానం కూడా అత్యంత విభిన్నంగా ఉంటుంది. పాలక్కాడ్‌లోని రామస్సేరి గ్రామం కింగ్ ఆఫ్ ఇడ్లీలకు పేరుగాంచింది. ఈ ఇడ్లీలనే తినేందుకు పర్యాటకులు ఈ గ్రామానికి తరలి వస్తుంటారా..!. వీటిని పాన్కేక్ మాదిరిగా తయారు చేస్తారు.తయారు చేయు విధానం..మట్టికుండపై ఒక గుడ్డ కప్పి ఆవిరిపై ఉడకబెడతారు. 200 ఏళ్ల క్రితం తమిళనాడు, కాంచీపురం, తిరుపూర్, తంజావూర్ వంటి ప్రాంతాల నుంచి కొన్ని ముదలియార్ కుటుంబాలు కేరళకు రావడంతో ఈ వంటకం పుట్టుకొచ్చిందని స్థానికులు చెబుతుంటారు. వాళ్లంతా బతుకుదెరువు కోసం రామస్సేరి అనే చిన్న గ్రామానికి వచ్చి స్థిరపడటంతో ఈ వంటకం ఉనికిలోకి వచ్చిందని ఓ కథనం. ఆయా కుటుంబాల్లో మగవాళ్లంత చేనేత కార్మికులు కాగా, మహిళలు రుచికరంగా వంట చేసేవారట. అలా ఈ రామస్సేరి ఇడ్లీలు ప్రాచుర్యంలోకి రావడం జరిగింది. ఇక్కడ ఈ ఇడ్డీని తయారు చేసేందుకు ఉపయోగించే మెష్క్లాత్ ఇడ్డీని సమానంగా ఉడికేలా చేయగా, స్లీమింగ్ కోసం ఉపయోగించే మట్టికుండా ఆ ఇడ్లీలకు ఒక విధమైన రుచిని అందిస్తాయి. తయారీ..కావాల్సిన పదార్థాలు..కప్పుల బియ్యం (ఇడ్లీ బియ్యం మరియు ముడి బియ్యం)ఉరద్ పప్పు 1 కప్పు నీరు 1 కప్పు మెంతు గింజలు 1 స్పూన్ తగినంత ఉప్పునాలుగు గంటలు పైనే నానబెట్టిటన మినపప్పు, బియ్యం, మెంతులు కలిపి మెత్తగా అయ్యేలా మిక్సీ పట్టాలి. ఆ తర్వాత ఉప్పు వేసి కనీసం ఓ పది నుంచి 12 గంటలు వదిలేయాలి. ఆ తర్వాత ఇడ్లీల్లా మట్టిప్లేటులో పెద్ద మొత్తంలో పరుచుకుని మట్టికుండపై ఉడికిస్తే.. ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే రామస్సేరి ఇడ్లీలు రెడీ..!.(చదవండి: -
హీరోయిన్గా పొందిన ప్రేమను హ్యూమన్‌గా తిరిగి ఇస్తున్నా
పాలక్కాడ్ టు హైదరాబాద్... చెన్నై... ముంబై... సినిమా అనేది సంయుక్తను అన్ని రాష్ట్రాల్లోనూ పాపులర్ చేసింది. రీల్‌పై హీరోయిన్... రియల్‌గానూ అంతే... ఆపన్న హస్తం అందించడానికి వెనకాడరామె. 2018లో కేరళలో వరదలు సంభవించినప్పుడు స్వయంగా సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు సంయుక్త. తాజాగా వయనాడ్ బాధితులకు విరాళం ఇచ్చారు. ‘ఆది శక్తి’ పేరుతో సేవా సంస్థను ఆరంభించారు. తెలుగులో స్టార్ హీరోయిన్గా దూసుకెళుతున్న ఈ మలయాళ బ్యూటీ ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ...→ కేరళలో పుట్టి పెరిగిన మీకు ఇప్పుడు వయనాడ్‌ని చూస్తుంటే బాధ అనిపించడం సహజం. వయనాడ్ ఎన్నిసార్లు వెళ్లారు? సంయుక్త: ఇప్పటివరకూ నేను ఒకే ఒక్కసారి వెళ్లాను. చాలా అందమైన ప్రదేశం. మంచి హిల్ స్టేషన్. హాయిగా గడపడానికి అక్కడికి వెళుతుంటారు. అలాంటి వయనాడ్ రూపు రేఖలు వర్షాల వల్ల మారి΄ోవడంతో బాధ అనిపించింది. ఇప్పుడు వయనాడ్ వెళదామనుకున్నాను కానీ సందర్శనలకు అనుమతి లేదు.→ వయనాడ్‌లో షూటింగ్స్ ఏమైనా చేశారా?ఆ అవకాశం ఇప్పటివరకూ రాలేదు. యాక్చువల్లీ అక్కడ వర్షాలప్పుడు నేను హైదరాబాద్‌లో ఉన్నాను. ప్రతి గంటకూ మా అమ్మగారు ఫోన్ చేసి, పరిస్థితులు చెప్పేవారు. ఆ బీభత్సం చూసి, ఆవిడైతే నాలుగైదు రోజులు నిద్ర΄ోలేదు. నిజానికి వయనాడ్‌కి ఏమైనా చేయమని అమ్మే చెప్పింది. నేనూ అదే అనుకున్నాను కాబట్టి వెంటనే విరాళం ఇచ్చాను. → ఆర్థిక సహాయమేనా? 2018 కేరళ వరదలప్పుడు స్వయంగా సహాయ కార్యక్రమాలు చేసినట్లు చేయాలనుకుంటున్నారా? ఇంకా చేయాలని ఉంది. కేరళలోని ఓ స్వచ్ఛంద సేవా సంస్థతో మాట్లాడాను. ఏం చేస్తే బాగుంటుందో వాళ్లు గ్రౌండ్ లెవల్లో స్టడీ చేస్తున్నారు. దాన్నిబట్టి సహాయ కార్యక్రమాలను ΄్లాన్ చేస్తాను.→ 2018లో చేసిన సేవా కార్యక్రమాల గురించి...2018లో కేరళ వరదలప్పుడు నేను చెన్నైలో ఇరుక్కు΄ోయాను. బాధితుల కోసం చాలా చిన్న స్థాయిలో ఓ కలెక్షన్ సెంటర్ ఏర్పాటు చేశాను. నేను ఊహించినదానికన్నా ఎక్కువ నిత్యావసర వస్తువులు రావడంతో పెద్ద గోడౌన్ తీసుకోవాల్సి వచ్చింది. వచ్చినవి వచ్చినట్లు సరఫరా చేశాం. ఇక కేరళ వెళ్లాక పాడై΄ోయిన ఇళ్లను బాగు చేసే కార్యక్రమంలో పాల్గొన్నాను. చెప్పలేనంత మట్టి పేరుకు΄ోవడంతో క్లీన్ చేయడానికి ఇబ్బందిపడ్డాం.→ సంయుక్తా మీనన్లోంచి ‘మీనన్’ ఎందుకు తీసేశారు? మా అమ్మానాన్న విడి΄ోయారు. అమ్మంటే నాకు చాలా ప్రేమ, గౌరవం. తన ఫీలింగ్స్‌ని గౌరవించి పేరులోంచి సర్ నేమ్ తీసేశాను. ఇంకో విషయం ఏంటంటే... నేను ఆడ.. మగ సమానం అని నమ్ముతాను. సర్ నేమ్ వద్దనుకోవడానికి అదో కారణం. → సింగిల్ పేరెంట్‌గా మీ అమ్మగారు మిమ్మల్ని పెంచారు కాబట్టి తండ్రి ప్రేమను మిస్సయిన ఫీలింగ్... యాక్చువల్లీ నాకు అమ్మానాన్న ఇద్దరి ప్రేమనీ పంచారు మా తాతగారు (సంయుక్త అమ్మ తండ్రి). నేను ఏం అడిగినా కాదని చెప్పలేనంత ప్రేమ మా తాతగారిది. అలాగని గుడ్డిగా ఓకే చెప్పలేదు. ఆయన బాధపడే పనులు చేయనని, అసలు తప్పు చేయనని నమ్మకం. అంత ప్రేమ పంచి, నమ్మకాన్ని పెంచుకున్న మా తాత నా ఫస్ట్ బాక్సాఫీస్ సక్సెస్‌ని చూడకుండానే తిరిగి రాని లోకాలకు వెళ్లి΄ోయారు. కానీ, ఎక్కడున్నా తన మనవరాలి విజయాన్ని చూస్తున్నారన్నది నా నమ్మకం.→ ‘స్వయంభూ’, హిందీ ‘మహారాజ్ఞి’ కోసం ఫైట్స్ కూడా నేర్చుకున్నారు... ఇప్పటివరకూ దాదాపు సున్నితమైన పాత్రల్లో కనిపించిన మీరు ఇప్పుడు పవర్‌ఫుల్‌గా కనిపించనున్నారన్న మాట... ‘స్వయంభూ’ కోసం గుర్రపు స్వారీ, ఫైట్స్‌లో శిక్షణ తీసుకున్నాను. అటు హిందీ ‘మహారాజ్ఞి’ కోసం కూడా యాక్షన్ నేర్చుకున్నాను. ఒకప్పుడు సినిమాలకు దూరంగా పారి΄ోవాలనుకున్న నేను ఇప్పుడు సినిమా కోసం ఏం నేర్చుకోవడానికైనా రెడీ అయి΄ోయాను. చేసే ప్రతి పాత్ర ఒకదానికి ఒకటి భిన్నంగా ఉండాలనుకుంటున్నాను. స్క్రీన్ మీద చూసి నాపై ప్రేమ పెంచుకున్న ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి ఎంతైనా కష్టపడొచ్చు. → ప్రేక్షకుల మీద ప్రేమతోనేనా ఈ సేవా కార్యక్రమాలు...అవును. పాలక్కాడ్‌లో మొదలై ఇతర రాష్ట్రాల్లో ఆదరణ పొందడం అంటే చిన్న విషయం కాదు. నటిగా నేను సక్సెస్ అయ్యానంటే అది నా విజయం కాదు. నన్ను ప్రేక్షకులే సక్సెస్ చేశారు. హీరోయిన్గా నేను పొందిన ప్రేమను హ్యూమన్‌గా తిరిగి ఇవ్వాలనుకున్నాను. ఏదైనా అర్థవంతంగా, ఉపయోగపడేది చేయాలన్నది నా సంకల్పం. అందుకే ‘ఆది శక్తి’ సేవా సంస్థ ఆరంభించాను. → కేరళ నుంచి నిత్యామీనన్, నయనతార, సమంత (సమంత అమ్మ మలయాళీ) వంటివారిని హైదరాబాద్ తీసుకొచ్చి స్టార్స్‌ని చేసింది టాలీవుడ్. ఇప్పుడు మీరు... మాలీవుడ్ అమ్మాయిలకు టాలీవుడ్ లక్కీ అనొచ్చా? ఒక్క మాలీవుడ్ ఏంటి? ఎవరికైనా ఆహ్వానం పలుకుతుంది టాలీవుడ్. సో.. మాకే కాదు అందరికీ లక్కీయే. ఇక్కడి ప్రేక్షకులు ఇష్టపడటం మొదలుపెట్టారంటే ఇక ఆ స్టార్‌ని ఎప్పటికీ ఇష్టపడతారు. అలాగే తెలుగు ఇండస్ట్రీ సినిమాని సెలబ్రేట్ చేస్తుంది. ఇంతగా ప్రేమించే తెలుగు పరిశ్రమలో భాగం కావడం హ్యాపీగా ఉంది. అందుకే కేరళ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. → మీ ‘ఆది శక్తి’ ఫౌండేషన్ గురించి క్లుప్తంగా... ఎవరికైనా సహాయం చేయాలంటే జస్ట్ డబ్బులు ఇచ్చేస్తే సరి΄ోదు. వాళ్లు జీవించినంత కాలం పనికొచ్చే సహాయం చేయాలి. నేను స్త్రీ సంక్షేమంపై దృష్టి పెట్టాను. చదువు, ఆరోగ్యం, ఉద్యోగం... వీటికి సంబంధించి సహాయం చేయాలన్నది నా ఆశయం. ముఖ్యంగా నేటి స్త్రీల మానసిక ఆరోగ్యం చాలా దెబ్బ తింటోంది. ఆ విషయం మీద వారిని ఎడ్యుకేట్ చేయాలి. నేను ‘ఆది శక్తి’ ఆరంభించే ముందు పలు స్వచ్ఛంద సేవా సంస్థలతో మాట్లాడాను. కొంత రిసెర్చ్ చేసి, అవగాహన తెచ్చుకుని ‘ఆది శక్తి’ ఆరంభించాను. – డి.జి. భవాని -
ఏనుగుల దాడిలో వీడియో జర్నలిస్టు మృతి
కొచ్చి:కేరళలో ఏనుగుల ఆగ్రహానికి వీడియో జర్నలిస్టు బలయ్యాడు. పాలక్కాడ్‌లో ఏనుగుల గుంపు దృశ్యాలు చిత్రీకరిస్తుండగా ఓ ఏనుగు ముఖేష్(34) అనే వీడియో జర్నలిస్టుపై దాడి చేసింది. ఈ దాడిలో ముఖేష్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడ్డ ముఖేష్‌ను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.దారితప్పిన ఏనుగుల గుంపు మలంబుజా, కంజికోడ్‌ల మధ్య నది దాటుతుండగా వీడియో తీస్తున్నపుడు ముఖేష్‌పై దాడి జరిగింది. టీవీ ఛానల్ రిపోర్టర్, డ్రైవర్ మాత్రం వాహనంలో అక్కడి నుంచి తప్పించుకున్నారు.కాగా, ముఖేష్ తన వేతనంలో కొంత సామాజిక కార్యక్రమాలకు ఖర్చు చేసే మనస్తత్వమున్న వ్యక్తి అని స్నేహితులు చెప్పారు. ముఖేష్ మృతి పట్ల సీఎం పినరయి విజయన్, ప్రతిపక్ష నాయకుడు వీడీ సతీషన్ తదితరులు సంతాపం తెలిపారు. -
మూత్రం నుంచి విద్యుత్
పాలక్కడ్: కాలుష్యకారక శిలాజ ఇంథనాలకు బదులు పునరుత్పాదక ఇంథనంపై ప్రపంచం దృష్టిపెట్టాలన్న ఆకాంక్షల నడుమ ఐఐటీ పాలక్కడ్ పరశోధకులు పునరుత్పాదక ఇంథనాన్ని మూత్రం నుంచి ఉత్పత్తిచేసి ఔరా అనిపించారు. సంబంధిత పరిశోధనా పత్రాన్ని ప్రముఖ ఆన్లైన్ జర్నల్ ‘సపరేషన్ అండ్ ప్యూరిఫికేషన్ టెక్నాలజీ’లో ప్రచురించారు. ఈ పునరుత్పాదక విద్యుత్ తయారీ కోసం వారు కొత్తగా ఎలక్ట్రో కెమికల్ రిసోర్స్ రికవరీ రియాక్టర్(ఈఆర్ఆర్ఆర్)ను తయారుచేశారు. ఇందులో మూత్రాన్ని నింపి ఎలక్ట్రోరసాయనిక చర్యల ద్వారా విద్యుత్‌ను, సహజ ఎరువును ఉత్పత్తిచేస్తారు. ఈ విద్యుత్‌తో స్మార్ట్ఫోన్లును చార్జ్చేయొచ్చు. విద్యుత్ దీపాలను వెలిగించవచ్చు. రీసెర్చ్ స్కాలర్ వి.సంగీత, ప్రాజెక్ట్ సైంటిస్ట్ డాక్టర్ శ్రీజిత్ పీఎం, డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్‌లో రీసెర్చ్ అసోసియేట్ రీను అన్నా కోషీల బృందం ఈ పరిశోధన చేపట్టింది. ఈఆర్ఆర్ఆర్ ద్వారా నైట్రోజన్, ఫాస్పరస్, మెగ్నీషియంలు ఎక్కువగా ఉండే సహజ ఎరువునూ పొందొచ్చని ఐఐటీ పాలక్కడ్ ఒక ప్రకటనలో పేర్కొంది. అమ్మోనియా సంగ్రహణి, క్లోరినేషన్ గది, ఎలక్ట్రికల్ గొట్టాల సమన్వయంతో ఈ రియాక్టర్ పనిచేస్తుంది. ఇందులో మెగ్నీషియంను ఆనోడ్‌గా, గాలి కార్భన్ను కాథోడ్‌గా వాడతారు. థియేటర్లు, షాపింగ్ మాల్స్ ప్రాంగణాల్లో మూత్ర విసర్జన ఎక్కువ. ఇలాంటి చోట్ల ఈ రియాక్టర్ల ద్వారా ఎక్కువ స్థాయిలో విద్యుత్‌ను ఉత్పత్తిచేసి అక్కడి విద్యుత్దీపాలను వెలిగించవచ్చు. ప్రస్తుతం ఈ సాంకేతికత ప్రయోగ దశలోనే ఉందని ఐఐటీ పాలక్కడ్ స్పష్టంచేసింది. ఈ టెక్నాలజీపై పేటెంట్ కోసం బృందం ఇప్పటికే దరఖాస్తు చేసుకుంది. ప్రాజెక్టుకు కేంద్రమే నిధులిచ్చింది. -
Lotus: కుండీల్లో తామరల పెంపకం.. ధర 300 నుంచి 4 వేల వరకు! నెలకు 50 వేలు
కొలనుల్లో తామరలు సూర్య నమస్కారాలు చేస్తాయి. దొరువుల్లో కలువలు చంద్రునికి మోహలేఖలు రాస్తాయి. కాని అవి పాత రోజులు. ఇప్పుడు ఇళ్లల్లో అలంకరణ కోసం తామరలు కొని నీటి తొట్లలో వదులుతున్నారు. అవి ఎక్కడి నుంచి వస్తాయి? కేరళలో అంజలి లాంటి స్త్రీలు కుండీల్లో, ప్లాస్టిక్ తొట్లలో తామరలను పెంచి అమ్ముతున్నారు. దాదాపు 40 రకాల తామరలు ఉన్నాయి. 300 నుంచి ఒక్కో పువ్వు 4000 రూపాయల వరకూ పలుకుతాయి. నెలకు 30 నుంచి 50 వేలు సంపాదిస్తూ ఉంది అంజలి. కోవిడ్ వల్ల ఎవరికి ఎన్ని కష్టాలు వచ్చినా అది అంజలికి తామరలు కూడా పూయించింది. కేరళలోని పాలక్కాడ్‌కు చెందిన 28 ఏళ్ల అంజలిని చూడండి. కోవిడ్ కాలంలో భర్తకు సంపాదన పోవడంతో తామరలను నమ్ముకుంది. ముందు మిద్దె మీద పెంచింది. ఆదాయం బాగుండటంతో ఇప్పుడు 20 సెంట్ల భూమి సంపాదించి అక్కడ తామరలు పెంచుతోంది. అన్నీ కుండీల్లోనే. లేకుంటే ప్లాస్టిక్ టబ్బుల్లో. దీనిని ‘నీటి తోట’ అనొచ్చు. నీటి మొక్క తామర. దీనితో పాటు కలువ. అంజలి జీవితం ఇప్పుడు మూడు కలువలు ఆరు తామరలుగా సాగిపోతోంది. వేసిన 15 రోజులకే పూస్తుంది ‘ముందు నాటు రకం తామరలు పెంచాను. అవి ఏడాదికి కాని పూలు పూయవు. ఇలా కాదని హైబ్రిడ్ తామరలను పెంచడం నేర్చాను. కొన్ని హైబ్రిడ్ తామర మొక్కలు నెలకే పూస్తాయి. వీటిని థాయ్‌లాండ్ వాళ్లు డెవలప్ చేశారు. అమిరి కెమిలియా అనే తామర రకం ఉంది. అదైతే వేసిన 15 రోజులకే పూస్తుంది. ఇప్పుడు నా తామర సాగులో దాదాపు 40 రకాలు ఉన్నాయి’ అంటుంది అంజలి. ఆమెకు పూలు పూయించడంతో పాటు ప్రచారం చేయడం కూడా వచ్చు. ఫేస్బుక్లో, ఇన్‌స్టాలో ఆ తామర మొక్కలు, పూలు ఫోటోలు పెడుతుంది. మొదట కేరళ నుంచి ఆర్డర్లు రావడం మొదలైంది. ఇప్పుడు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి. ‘తామరలు దుంపవేరు నుంచి వస్తాయి. దుంపవేర్లు కొనేవాళ్లు ఉంటారు. కాని వాటిని పెంచడం తెలియాలి. కొందరు నేరుగా మొక్కలు కొంటారు. అవి కొన్న తర్వాత పది రోజులకు మించి బతకవు. అందుకని వెంటనే వాడుకోవాల్సి ఉంటుంది. కొందరు ఒట్టి పూలే కొంటారు’ అంటుంది అంజలి. రూ. 4000 పెడతారు కూడా! నాటు తామరలకు రెక్కలు తక్కువ ఉంటాయి. హైబ్రిడ్ తామరలకు రెక్కలు ఎక్కువ. ‘మిరకిల్’ అనే వెరైటీలో పువ్వుకు 700 రెక్కలు ఉంటాయి. ఇక సహస్రదళపద్మానికి డిమాండ్ జాస్తి. దీనిలో వేయి రెక్కలు ఉంటాయి. ‘బుద్ధ పద్మం’, ‘దుర్గపద్మం’ అని చాలా రకాలే ఉన్నాయి. ‘పసుపు రంగు తామరలకు బాగా గిరాకీ ఉంది. ఒక్కో మొక్కకు రూ. 4000 పెట్టడానికి కూడా సిద్ధమవుతారు’ అంటుంది అంజలి. నెలకు యాభైవేల వరకు సంపాదన ఆమె దగ్గర పూలు, దుంపవేర్లు, మొక్కలు రకాన్ని బట్టి 300 నుంచి మొదలవుతాయి. నెలకు అన్ని రకాలూ 100 పూల వరకూ అమ్ముతుంది. అన్నీ కుదిరితే 50 వేలు కూడా సంపాదిస్తుంది. వీటితోపాటు కలువలు కూడా సాగు చేస్తుంది. వాటి మీద ఆదాయం కూడా బాగుంది. ‘మొక్కలను జాగ్రత్తగా చూడాలి. తామరకు బాగా ఎండ తగలాలి. నీటి కుండీల్లో దోమలు చేరకుండా గుప్పీ చేపలను వదిలితే మంచిది’ అంటుంది అంజలి. తన దగ్గర మొక్కలు కొన్నవారికి వాటిని ఎలా సంరక్షించాలో చెబుతుంది. ఇప్పుడు శ్రీమంతులే కాదు మధ్యతరగతి వారు కూడా ఇంటి ముంగిలిలో ఒక తామరతావును లేదా పూలను అలంకరించడానికి ఇష్టపడుతున్నారు. ఈ సాగు నేర్చితే మహిళలు ఇంటి దగ్గరి నుంచే ఆదాయం గడించవచ్చు. చదవండి: Spineless Cactus: 5 ఎకరాల జామ తోట చుట్టూ ముళ్లు లేని బ్రహ్మజెముడు! ఈ ఉపయోగాలు తెలుసా.. కూర వండుకుని తింటే Bio Fence: వారెవ్వా.. అప్పుడు ఖర్చు 40 వేలు.. ఇప్పుడు 1500.. కోతుల బెడద లేదు! కాకర, చిక్కుడు.. అదనపు ఆదాయం కూడా.. -
ఓవర్ స్పీడ్.. కేరళలో ఘోర ప్రమాదం
పాలక్కడ్: ఓ డ్రైవర్ నిర్లక్ష్యం పలువురి ప్రాణాలు బలిగొంది. కేరళలో బుధవారం అర్ధరాత్రి దాటాక ఘోర ప్రమాదం జరిగింది. పాలక్కడ్ వడక్కన్‌చ్చెర్రి వద్ద కేరళ ఆర్టీసీ బస్సును ఓ టూరిస్ట్ బస్సు ఢీ కొట్టడంతో తొమ్మిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో విద్యార్థులు సైతం ఉన్నట్లు తెలుస్తోంది. బేస్లియస్ స్కూల్‌కు చెందిన 10, 11, 12వ తరగతి విద్యార్థులను టూర్‌కు తీసుకెళ్లిన బస్సు.. ఓవర్ స్పీడ్‌తో ఓ కారును ఓవర్టేక్ చేయబోయే ప్రయత్నంలో అదుపు తప్పింది. అంజుమూర్తీ మంగళం బస్టాప్ వద్ద ఓ ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. ఆపై అదుపు తప్పి పక్కనే ఉన్న వాగులో పడి బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు దుర్మరణం పాలయ్యారు. వలయార్-వడక్కన్‌చెర్రి జాతీయ రహదారిపై అర్ధరాత్రి 12 గం. తర్వాత ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన టైంలో జోరుగా వాన కురుస్తోందని అధికారులు తెలిపారు. టూరిస్ట్ బస్సులో 41 మంది చిన్నారులు, ఐదుగురు టీచర్లు, బస్సుకు సంబంధించి ఇద్దరు సిబ్బంది ఉన్నారు. ఇక ఆర్టీసీ బస్సులో 49 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. పన్నెండు మంది పరిస్థితి విషమంగా ఉందని, 28 మంది చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారని తెలిపారు. ఆర్టీసీ బస్సు కొట్టారక్కరా నుంచి కొయంబత్తూరు రూట్లో వెళ్తోంది. ప్రమాదం తీవ్రమైంది కావడంతో.. మృతుల సంఖ్య పెరగొచ్చని అధికారులు చెప్తున్నారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. క్షతగాత్రులకు పాలక్కడ్ జిల్లా ఆస్పత్రిలో చికిత్స అందుతోంది. వానలో టూరిస్ట్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడం వల్లే ఘోరం జరిగిందని పోలీసులు వెల్లడించారు. Kerala | 9 people died while 38 were injured after a tourist bus crashed into Kerala State Road Transport Corporation (KSRTC) bus in Vadakkenchery in Palakkad district: State minister MB Rajesh — ANI (@ANI) October 6, 2022 ఇదీ చదవండి: బీఆర్ఎస్పై కర్ణాటక మాజీ సీఎం కీలక వ్యాఖ్యలు -
వాట్ ఏ ప్రిస్క్రిప్షన్.. ఈజీగా చదివేయొచ్చు: వైరల్
ఒంట్లో బాగోలేదని డాక్టర్ వద్దకు పోతే పరీక్షలన్ని నిర్వహించి ఏవో మందులు రాసిస్తారు జౌనా!. ఐతే ఆ మందుల చీటి చూస్తే మనకేం అర్థం కాదు. చదువకున్న వాడికైనా కాస్త పరీశీలించి చూస్తే ఏదో కొంచెం అర్థమవుతుందే తప్ప ఒక పట్టాన అర్థమైతే కాదు. కేవలం మందుల షాపు వాడికి మాత్రమే అర్థమవుతుంది. ఐతే ఇక్కడో ఒక డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాసిన మందుల పేర్లు ఎవరైన ఈజీగా చదివేయొచ్చు. ఎందుకంటే అంత నీట్‌గా సులభంగా అర్థమైరీతీలో చాలా క్లియర్‌గా రాశాడు. వివరాల్లెళ్తే...కేరళకు చెందిన డాక్టర్ నితిన్ నారాయణ పాలక్కడ్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో పీడియాట్రిక్(చిన్న పిల్లల డాక్టర్)గా పనిచేస్తున్నాడు. ఆయన గత మూడేళ్లుగా అక్కడే వైద్యుడిగా పనిచేస్తున్నాడు. తాను ఎంత బిజీగా ఉన్న ఇలానే బ్లాక్ లెటర్స్(క్యాపిటల్ లెటర్స్)లోనే రాస్తానని అంటున్నాడు. తాను బాల్యం నుంచే గుడ్ హ్యండ్ రైటింగ్ స్కిల్స్‌పై దృష్టిసారించినట్లు చెబుతున్నాడు. మిగతా డాక్టర్లు బిజీగా ఉండటం వల్ల కుదరదని కానీ తనకు చిన్నప్పటి నుంచి ఇలా నీట్‌గా రాయడం అలవాటు కాబట్టి రాయగలుగుతున్నానని తెలిపాడు. ఆ డాక్టర్‌కి సంబంధించి ప్రిస్క్రిప్షన్ చీటి ఫోటో తీసి బెన్సీ అనే వ్యక్తి ఫేస్బుక్లో పోస్ట్ చేయడంతో నెట్టింట వైరల్ అయ్యింది. ఈ ఫోటో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహింద్రను కూడా ఆకర్షించింది. ఆయన కూడా ఈ వైరల్ ఫోటోని షేర్ చేస్తూ అతని విభిన్న విద్యా విధానాన్ని తేటతెల్లం చేస్తుంది. స్కూల్ లెవల్ నుంచి దృష్టి సారిస్తేనే ఇలా రాయగలం అంటూ ఆ డాక్టర్ని ట్విట్టర్లో ప్రశంసించారు. (చదవండి: భావోద్వేగ దృశ్యం.. రాహుల్‌ను చూడటంతో వెక్కి వెక్కి ఏడ్చిన యువతి) -
అన్యాయంపై పోరాటానికే.. జోడో యాత్ర: రాహుల్
పాలక్కడ్ (కేరళ): కుబేరుల లక్షల కోట్ల రుణాలను మాఫీ చేస్తూ, రైతులు, చిన్న వ్యాపారులను రుణాల పేరిట వేధిస్తున్న మోదీ అవినీతి సర్కార్‌పై పోరాటమే భారత్ జోడో యాత్ర అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. సోమవారం యాత్ర 19వ రోజు పాలక్కడ్ జిల్లా కొప్పమ్‌లో పార్టీ మద్దతుదారులు, గిరిజన యువతతో రాహుల్ భేటీ అయ్యారు. బీజేపీ సర్కారు తెర తీసిన రెండు రకాల హిందుస్తాన్ పాలనను దేశం సహించబోదన్నారు. గిరిజన వైద్యాన్ని కేంద్రం ఆయుష్‌లో భాగం చేయాలని, గిరి పుత్రుల స్కూల్, కాలేజీ డ్రాప్ఔట్స్ తగ్గించేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని గిరిజనులు రాహుల్‌తో అన్నారు. -
కొత్త ఆట మొదలైంది
రోడ్డుకు అడ్డంగా బండరాళ్లు పడి ఉంటే... వెనక్కి వెళ్లడం పరిష్కారం కాదు. వాటిని రోడ్డుపై లేకుండా చేసి ముందుకెళ్లడమే అసలుసిసలు ప్రయాణం. ‘తోలుబొమ్మలాట అనేది పురుషులకు మాత్రమే పరిమితమైన కళ’ అనే నానుడిని ఛేదించి కొత్త ప్రయాణం మొదలు పెట్టింది రజితా రామచంద్రన్... రజిత తండ్రి రామచంద్రన్ పాలక్కడ్ (కేరళ)లో తోలుబొమ్మలాడించడంలో సుప్రసిద్ధుడు. ‘నేను నేర్చుకుంటాను నాన్నా’ అని తండ్రిని అడిగితే ‘ఆడపిల్లలకెందుకమ్మా ఈ ఆట’ అని చిన్నబుచ్చలేదు ఆ తండ్రి. ఎంతో శ్రద్ధగా కూతురికి ‘తోలుబొమ్మలాట’ నేర్పించాడు. ఆ సమయంలో రజితకు అది సరదా మాత్రమే. అయితే ఒకానొక సంఘటన తోలుబొమ్మలాటను సీరియస్‌గా తీసుకునేలా చేసింది. ఒకచోట తోలుబొమ్మలాట జరుగుతోంది. ఒక విదేశీ మహిళ ఈ ఆటను చూస్తూనే వివరాలు అడిగి తెలుసుకుంటోంది. ఇది చూసి కొందరు పురుషులు మండిపడ్డారు. బొమ్మలను ఆడించే చోట ఒక మహిళను ఎలా అనుమతిస్తారు? అనేది వారి కోపం. వారి దృష్టిలో మహిళలు ప్రేక్షకుల్లో మాత్రమే కూర్చోవాలి. తోలుబొమ్మలాట కళ అనేది పురుషుల సొంతం కాదు అని నిరూపించడానికి రజిత రంగంలోకి దిగింది. జిల్లా పంచాయత్ హాల్లో పెన్పవక్కోతు(మహిళల ఆధ్వర్యంలో జరిగే తోలుబొమ్మలాట) పేరుతో కొత్త చరిత్రకు శ్రీకారం జరిగింది. ఈ బృందంలోని సభ్యులు అందరూ మహిళలే. వీరిని ఒక తాటిపైకి తీసుకువచ్చింది రజిత. ఈ బృందంలోని సభ్యులు గురించి చెప్పుకోవాలంటే... సల్ఫి స్క్రిప్ట్ రాసింది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాధ్యతను తలకెత్తుకుంది జాస్మిన్. రాజ్యలక్ష్మి, అశ్వతి, నిత్య, నైవేద్య, శ్రీనంద, సంధ్య... బొమ్మలను ఆడించారు. సాధారణంగా బొమ్మలాటలో వినోదం ప్రధానంగా ఉంటుంది. అయితే ఈ బొమ్మలాటతో మహిళల సమస్యలను, భద్రతకు సంబంధించిన అంశాలను వివరించారు. ‘వినోదానికి అలవాటు పడిన వారికి ఇది నచ్చుతుందా’ అనే సంశయం రజితలో ఉండేది. అయితే ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ‘ఇలాంటి ప్రదర్శనలు మరిన్ని జరగాలి’ అంటూ ముక్తకంఠంతో కోరుకున్నారు ప్రేక్షకులు. ‘ఇదేం చోద్యమమ్మా’ అంటూ కొందరు విమర్శలు చేస్తున్నప్పటికీ, వారి విమర్శలకు రజిత బృందం ప్రాధాన్యత ఇవ్వ లేదు. బొమ్మలను ఆడించడానికి శ్రీనంద బయలుదేరే సమయంలో ఇంట్లో వాళ్లే అభ్యంతర పెట్టారు. మిగిలిన వారి పరిస్థితి కూడా అంతే. అయితే ప్రేక్షకలోకంలో మంచి స్పందన వచ్చిన తరువాత వారి ఆలోచన ధోరణిలో మార్పు వచ్చింది. ‘చరిత్రలో గుర్తుండిపోయే కార్యక్రమంలో భాగం అయినందుకు గర్వంగా ఉంది’ అంటుంది నిత్య. ‘ఒకప్పుడు మా ఇంట్లో ఆడవాళ్లను బొమ్మల దగ్గరకు రానిచ్చేవారు కాదు. తాకడాన్ని తప్పుగా భావించేవారు. ఈ రకంగా చూస్తే రజిత బృందం కొత్త చరిత్రను సృష్టించిందని చెప్పుకోవాలి. మార్పు మొదలైనప్పుడు విమర్శకులు ఎప్పుడూ ఉంటారు. అయితే తమ విమర్శలలో పస లేదనే విషయం వారికి త్వరలోనే అర్థమవుతుంది’ అంటుంది సుగుణ అనే బామ్మ. తొలితరం తోలుబొమ్మలాట మహిళా కళాకారుల బృందం ఈతరం అమ్మాయిలకు కూడా ఆ ప్రాచీన కళను నేర్పించి ఈ పరంపరను ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తోంది. -
1996 నాటి ఘటన.. కలెక్టర్ నిర్బంధం ఉదంతం.. సందర్శకుల్లా వచ్చి
సాక్షి, హైదరాబాద్: 1996 అక్టోబర్ 4 ఉదయం 10.45.. కేరళలోని పాలక్కడ్ కలెక్టర్ కార్యాలయం.. ట్రైబల్ ల్యాండ్ ఎలియెనేషన్ యాక్ట్‌కు వ్యతిరేకంగా నలుగురు సాయుధులు అప్పటి కలెక్టర్ ఉదారు రామ్ పుల్లారెడ్డిని (డబ్ల్యూఆర్ రెడ్డి) నిర్బంధించారు. 9 గంటల ఉత్కంఠ తర్వాత ఆయన్ను విడిచి పెట్టారు. నష్ట నివారణ కోసం కేరళ సర్కారు కూడా కలెక్టర్‌నే టార్గెట్ చేసింది. అయినా ఆయన అధైర్యపడలేదు. సీన్ కట్ చేస్తే.. పదవీ విరమణ చేసిన డబ్ల్యూఆర్ రెడ్డి ప్రస్తుతం నార్సింగిలో ఉంటున్నారు. ఆ ఘటన జరిగిన పాతికేళ్ల తర్వాత తాజాగా మలయాళ సినిమా ‘పడ’గా తెరకెక్కింది. ఈ నేపథ్యంలోనే నాటి అనుభవాలను డబ్ల్యూఆర్ రెడ్డి, ఆయన భార్య డబ్ల్యూ మాలతిరెడ్డి ‘సాక్షి’తో పంచుకున్నారు. గిరిజనుల భూమి కోసం.. గిరిజనులకు సంబంధించిన భూములను ఎవరైనా ఖరీదు చేస్తే.. వాళ్లు దరఖాస్తు చేసుకుంటే తిరిగి ఇచ్చేయాలనే చట్టం దేశవ్యాప్తంగా అమలులో ఉంది. దీనికి భిన్నంగా కేరళ ప్రభుత్వం ట్రైబల్ ల్యాండ్ ఎలియెనేషన్ యాక్ట్‌ను తీసుకొచ్చింది. గిరిజనుల భూములు ఎవరైనా డబ్బు చెల్లించి ఖరీదు చేస్తే తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదన్నది దాని సారాంశం. దీంతో ప్రభుత్వం, మీడియా దృష్టిని ఆకర్షించి గిరిజనుల భూముల్ని రక్షించడానికి గాను సీపీఐ (ఎంఎల్) అధీనంలోని అయ్యంకాళి పడ ఉద్యమకారులు ఓ పథకం వేశారు. అందులో భాగంగానే 1996లో పాలక్కడ్ కలెక్టర్ నిర్భంధం జరిగింది. సందర్శకుల్లా కలెక్టరేట్‌లోకి వచ్చి.. నలుగురు అయ్యంకాళి పడ ఉద్యమకారులు ఆ రోజు ఉదయం చేతి సంచులతో సందర్శకుల్లా కలెక్టరేట్‌లోకి వచ్చారు. నేరుగా డబ్ల్యూఆర్ రెడ్డి వద్దకు వెళ్లి ఆయన తలకు తుపాకీ గురిపెట్టారు. చేతులు వెనుక్కు విరిచికట్టి మెడకు తాడు బలంగా బిగించారు. ఆయన చాంబర్లోనే ఓ చిన్న బాంబు పేల్చి తక్షణం ప్రభుత్వం ట్రైబల్ ల్యాండ్ ఎలియెనేషన్ యాక్ట్‌ను వెనక్కు తీసుకోవాలని, లేదంటే కలెక్టర్ ప్రాణాలు తీస్తామని బెదిరించారు. దాదాపు 9 గంటల ఉత్కంఠ తర్వాత యాక్ట్ ఉపసంహరణకు కేరళ సర్కారు హామీ ఇవ్వడంతో కలెక్టర్‌ను విడిచిపెట్టారు. కలెక్టర్‌నే అనుమానించిన ప్రభుత్వం కలెక్టర్ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన ఉద్యమకారులు తెలివిగా వ్యవహరించారు. తమ వద్ద మారణాయుధాలు, బాంబులు లేవని.. బొమ్మ తుపాకులు, ఉత్తుత్తి బాంబులకే సర్కారు భయపడిందని మీడియాకు చెప్పారు. విషయం సరిచూసుకోకుండా, డబ్ల్యూఆర్ రెడ్డిని సంప్రదించకుండా మీడియా కూడా ఇదే ప్రచారం చేసింది. అది ఎన్నికల ఏడాది కావడంతో కేరళ ప్రభుత్వం నష్ట నివారణ చర్యల్లో భాగంగా డబ్ల్యూఆర్ రెడ్డినే టార్గెట్ చేసింది. ఈయన స్వస్థలం కర్నూలు అయినా వరంగల్‌గా ప్రచారం చేస్తూ మావోయి స్టులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించింది. మావోయిస్టుల సహకారంతోనే పడ ఉద్యమకారులకు కలెక్టర్, ఎస్పీ, జిల్లా జడ్జి సహకరించారని సంజాయిషీ నోటీసు ఇచ్చింది. పాలక్కడ్ నుంచి కొల్లాం బదిలీ చేసింది. అయినా డబ్ల్యూఆర్ రెడ్డి మొక్కవోని దీక్షతో విధులు నిర్వర్తించారు. -
దారుణం: బర్త్ డే పేరుతో యువతిని ఇంటికి పిలిచి..
తిరువనంతపురం: దేశంలో రోజురోజుకు మహిళలు, యువతులపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ఏదో ఒక చోటు వారిపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ యువకుడు బర్త్‌డే సెలబ్రేషన్ పేరుతో యువతిని ఇంటికి పిలిచి ఆమెకు నిప్పంటించి.. ఆ తర్వాత తానూ కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ దారుణ ఘటన కేరళలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. పాలక్కాడ్ జిల్లాలోని కొల్లెంగోడ్ గ్రామానికి చెందిన బాలసుబ్రమణియం(23) తన బర్త్‌డే ఉందంటూ యువతిని తన ఇంటికి పిలిచాడు. దీంతో ఆదివారం ఉదయం ఆమె అతడి ఇంటికి వెళ్లింది. అనంతరం ఆమెను గదిలోకి తీసుకెళ్లి బాలసుబ్రమణియం.. యువతికి నిప్పంటించాడు. తర్వాత తాను కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ క్రమంలో వారి అరుపులు విన్న బాలసుబ్రమణియం తల్లి, తమ్ముడు మంటలను ఆర్పివేశారు. మంటల్లో వారికి తీవ్ర గాయాలు కాగా.. వైద్యం కోసం ఎర్నాకులంలోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. చాలా కాలంగా వారిద్దరూ ప్రేమించుకుంటున్నట్లు తెలిసింది. వారి ప్రేమను రెండు కుటుంబాలు నిరాకరించిన కారణంగానే బాలసుబ్రమణియం ఇలా చేశాడని స్థానికులు తెలిపారు. ఈ సందర్బంగా బాలసుబ్రమణియం తల్లి మాట్లాడుతూ.. ఈరోజు బాలసుబ్రమణియం పుట్టినరోజు సందర్భంగా ఆమె తమ ఇంటికి వచ్చిందని తెలిపారు. వారిద్దరూ ప్రేమించుకుంటున్నారని అన్నారు. వారిద్దరికి పెళ్లి చేస్తామని చెప్పినప్పటికీ ఇలా ఎందుకు చేశాడో తెలియడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది చదవండి: యువతికి గర్భం.. ఏప్రిల్ 8న వివాహానికి ఒప్పుకొని, తెల్లారేసరికి.. -
Bike: బైక్‌పై ఇద్దరు పురుషులు ప్రయాణించరాదు.. ఎక్కడో తెలుసా..?
తిరువనంతపురం: ద్విచక్రవాహనంపై వెనుక సీటులో పురుషులు ప్రయాణించడంపై నిషేధం విధించారు. జిల్లా అదనపు కలెక్టర్ ఆదేశాల మేరకు కేరళలోని పాలక్కడ్‌లో ఈ రూల్ అమలులోకి వచ్చింది. కాగా, ఇటీవలే ఆర్ఎస్ఎస్ కార్యకర్త హత్య కేసు నేపథ్యంలో ఈ నిబంధన విధించినట్టు తెలిపారు. తాజా నిషేధం నుంచి మహిళలు, చిన్నారులకు మినహాయింపును ఇచ్చారు. ఈ ఆదేశాలు ఏప్రిల్ 20వరకు అమల్లో ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఈ నెల 15వ తేదీన ఆర్ఎస్ఎస్ కార్యకర్త శ్రీనివాసన్ షాపులో ఉండగా.. ఇద్దరు వ్యక్తులు వచ్చి దారుణంగా హత్య చేశారు. అయితే, పోలీసుల విచారణలో ఈ హత్య అదే రోజున ఎస్డీపీఐ కార్యకర్త సుబెయిర్ హత్యకు ప్రతీకారంగానే జరిగినట్టు తెలిసింది. దీంతో ఒకే రోజులో ఇలా రెండు హత్యలు జరగడం స్థానికంగా కలకలం రేపింది. దీంతో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఈ రెండు హత్యలే కాక మరిన్ని మర్డర్లకు ప్లాన్స్ చేసినట్టు పోలీసులకు సమాచారాం అందింది. దీంతో అడిషన్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్.. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఈ రూల్ నుంచి పిల్లలు, మహిళలను మాత్రం మినహాయించారు. -
సంచలన హైడ్రామా పడ.. ఆ నలుగురు ఏమయ్యారు?
వాస్తవ కథ తెర రూపానికి క్రియేటివిటీని జోడించడం షరా మామూలుగా మారింది ఈరోజుల్లో. కానీ, మలయాళ చిత్రం ‘పడ’(సైన్యం)కి అలాంటివేం ఎదురు కాలేదు. ఎందుకంటే.. ఇదొక నాటకీయమైన పరిణామం. నలుగురు అతివాదులు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనే పడ చిత్రానికి కథ. ఇందుకోసం ఓ కలెక్టర్‌ను కలెక్టర్ కార్యాలయంలోనే కొన్ని గంటలపాటు బంధించి.. అధికారులతో పాటు రాజకీయ నాయకులనూ హడలెత్తిస్తారు. చివరికి డిమాండ్ నెరవేర్చే హామీతో.. కలెక్టర్ నిర్బంధం నుంచి విడిచిపెట్టి, పోలీసులు తమనేం చేయకూడదనే షరతు మేరకు స్వేచ్ఛగా బయటకు వచ్చేస్తారు. ఆఖర్లో.. మీడియా ముందు తాము తెచ్చినవి డమ్మీ ఆయుధాలంటూ ట్విస్ట్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతారు. పడ కథ ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ, ఆ తర్వాత ఆ నలుగురు అతివాదులు ఏమయ్యారు?. అసలు పాలక్కాడ్ కలెక్టర్ బంధీ ఎపిసోడ్‌కి ముందు.. తర్వాత ఏం పరిణామాలు జరిగాయి?. ఈ హైడ్రామా చివర్లో ఆ నలుగురు మీడియా ముందు ఇచ్చిన ట్విస్ట్‌ను కలెక్టర్ రెడ్డి ఎందుకు నమ్మట్లేదు?.. 1996 అక్టోబర్ 4వ తేదీన.. అయ్యన్‌కాళి పడ గ్రూప్ ఉద్యమకారులు కల్లార బాబు, విలయోడి శివన్కుట్టి, కజంగద్ రమేషన్, అజయన్ మన్నూర్లు.. అప్పటి పాలక్కాడ్ జిల్లా కలెక్టర్ డబ్ల్యూఆర్ రెడ్డిని తొమ్మిది గంటలపాటు బంధీ చేశారు. కలెక్టర్ ఆఫీస్‌కు రోజూవారీ వచ్చే ఫిర్యాదుదారుల్లాగా వచ్చి.. తుపాకీ, డైనమెట్లు చూపించి సిబ్బందిని బెదిరించి కలెక్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు. సుమారు తొమ్మిది గంటలకు పైగా ఈ హైడ్రామా నడిచింది. మావోయిస్ట్ సానుభూతి పరులైన ఈ గ్రూప్ సభ్యులు.. వివాదాస్పదమైన ఆదివాసీ ల్యాండ్ బిల్లు రద్దు కోసం ఈ పని చేశారు. చాలాకాలం నుంచే రెక్కీ.. 1996లో ఈకే నాయర్ నేతృత్వంలోని(ముఖ్యమంత్రి) లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ సర్కార్ కేరళ షెడ్యూల్ తెగల (భూముల బదిలీపై పరిమితి, అన్యాక్రాంతమైన భూముల పునరుద్ధరణ) చట్టాన్ని సవరించింది. ఈ సవరణల ద్వారా తమ భూమిపై ఆదివాసీల హక్కులకు భంగం కలుగుతుందనేది అయ్యన్‌కాళి పడ ఆవేదన. అందుకే పాలక్కాడ్ కలెక్టర్ డబ్ల్యూఆర్ రెడ్డిని బంధించి.. డమ్మీ ఆయుధాలతో నిరసన వ్యక్తం చేయాలని, తద్వారా దేశం దృష్టిని ఆ అంశంపైకి మళ్లించాలని ప్లాన్ వేసింది. ఈ మొత్తం ఆపరేషన్‌కి రావుణ్ణి మాస్టర్ మైండ్. కల్లార బాబు, విలయోడి శివన్కుట్టి, కజంగద్ రమేషన్, అజయన్ మన్నూర్ నలుగురు సభ్యులు. తమ ప్రాణాలు పోయినా ఫర్వాలేదు అనుకుని ఈ ఆపరేషన్‌కి ముందుకొచ్చారు వాళ్లు. వాస్తవానికి ఈ ఆపరేషన్‌ను చాలాకాలం వాయిదా వేస్తూ వచ్చారు. అందుకుకారణం.. నలుగురిలో ఒకరు వెనుకంజ వేయడం. చివరికి.. ఆవ్యక్తి సైతం ముందుకు రావడంతో పనులు మొదలుపెట్టారు. పాలక్కాడ్ కలెక్టరేట్ దగ్గర రెండువారాలు రెక్కీ వేశారు. పర్యావరణ వేత్తల ముసుగులో కలెక్టరేట్‌కు వెళ్లారు. ఈ ఆపరేషన్‌లో బాబును రాజకీయ మధ్యవర్తిగా, రమేషన్ మిలిటరీ కమాండర్ పాత్ర పోషించారు. మార్షల్ ఆర్ట్స్‌లోనూ ఆ నలుగురు శిక్షణ తీసుకున్నారు. గుడ్డు పొరలు, ప్లాస్టిక్ పైపులు, వైర్లు టేపుతో డమ్మీ డైనమెట్లు, డమ్మీ తుపాకీ.. ఇలా కొంత సామాగ్రిని బ్యాగుల్లో వేసుకుని వెళ్లారు. కూడా ఆకలి తీర్చుకునేందుకు డ్రైఫ్రూట్స్, విటమిన్ సి ట్యాబెట్స్, బ్రెడ్ బిస్కెట్లు అరటి పండ్లు మోసుకెళ్లారు. వాస్తవానికి.. వాళ్ల లక్ష్యం డిప్యూటీ కలెక్టర్. కానీ, ఆ ఆఫీస్ దూరంగా ఉండడంతో.. కలెక్టర్‌ను లక్ష్యంగా చేసుకున్నారట. తొమ్మిది గంటల హైటెన్షన్ 1996 అక్టోబర్ 4వ తేదీన ఉదయం 10.30 ప్రాంతంలో.. కల్లార బాబు, విలయోడి శివన్కుట్టి, కజంగద్ రమేషన్, అజయన్ మన్నూర్ నలుగురు అయ్యన్‌కాళి పడ సభ్యులు పాలక్కాడ్ కలెక్టర్ రెడ్డిని బంధించారు. ఆపై తమ డిమాండ్‌ను సీఎస్ సీపీ నాయర్‌తో పాటు కోజికోడ్‌లోని ఏషియన్ నెట్ ఛానెల్(ఆ టైంకి కేరళలో అదొక్కటే ప్రైవేట్ ఛానెల్)కు సమాచారం అందించారు. మధ్యలో కలెక్టర్‌ను తన భార్యతోనూ ఫోన్లో మాట్లాడించి.. ఆమెనూ బెదిరించారు కూడా. మధ్యలో పోలీసుల బలవంతపు చర్యను అడ్డుకునేందుకు క్రాకర్స్ మందు గుండును కాల్చి భయపెట్టారట. ఇక మధ్యవర్తిత్వం కోసం ఉద్యమవేత్త ముకుందన్ మీనన్, జస్టిస్ వీఆర్ కృష్ణ అయ్యర్.. ఈ ఇద్దరి పేర్లను తొలుత పరిశీలించారు. చివరగా.. అడ్వొకేట్ వీరచంద్ర మీనన్ మధ్యవర్తిగా వ్యవహరించమని కోరారు. మధ్యవర్తి వీరచంద్ర మీనన్ చర్చలతో చివరకు హామీ మీద చర్చలకు సిద్ధమయ్యారు. అదే రాత్రి.. జిల్లా జడ్జి కే. రాజప్పన్ ఆచారీ సమక్షంలో కలెక్టర్‌ను వదిలేయడంతో పాటు ఎలాంటి కేసు లేకుండా స్వేచ్ఛగా బయటకు వచ్చేశారు. ఆ నలుగురూ జైలుకు వెళ్లేందుకు సిద్ధమయ్యే జేబులో పైసా లేకుండా వెళ్లారట. అందుకే అడ్వోకేట్ వీరచంద్ర మీనన్ కారులోనే త్రిస్సూర్‌లో దిగి వాళ్ల వాళ్ల ఇళ్లకు వెళ్లిపోయారు. వేట.. అరెస్టులు పాలక్కాడ్ కలెక్టర్ బంధీ వ్యవహారంలో కలెక్టర్ రెడ్డి ఎలాంటి అభ్యంతరాలు, ఫిర్యాదు చేయలేదు. దీంతో జడ్జి ఆచారీ ఎలాంటి కేసులు ఉండవనే హామీ ఇవ్వడంతో పోలీసులను వాళ్లను వదిలేసినట్లు సినిమాలో చూపించారు. కానీ, కలెక్టర్ రెడ్డితో బలవంతంగా పోలీసులు కేసు పెట్టించారని శివకుట్టీ ఆరోపిస్తున్నారు. ఆ నలుగురి కోసం వేట ఉధృతిన సాగింది. ఈ నలుగురినే కాదు.. ఆ సమయంలో ఆదివాసి భూహక్కుల కోసం పోరాడిన కొందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. ఏడు నెలల తర్వాత.. అజయన్ మన్నూర్ను మువట్టుపులలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆపై ఏడాదిన్నరలో రమేషన్, శివకుట్టీని వయనాడ్, అట్టపుడి ప్రాంతాల్లో అరెస్ట్ చేశారు. అయితే నాలుగో నిందితుడు బాబు మాత్రం ఘటన జరిగిన 14 ఏళ్లకు .. అంటే 2010లో పాలక్కాడ్ కోర్టులో సరెండర్ అయ్యాడు. ఈ వ్యవహారంలో బాబు తప్ప అందరినీ దోషులుగా నిర్ధారించింది కోర్టు. బాబును కలెక్టర్ రెడ్డి గుర్తు పట్టకపోవడమే అందుకు కారణం!. వాస్తవానికి ముగ్గురు నిందితులకు పదమూడున్నర ఏళ్ల శిక్ష పడాల్సి ఉందని, కానీ, కుట్రకు సంబంధించిన ఆరోపణలేవీ రుజువు కాకపోవడం, వాళ్లది ఉన్నత లక్ష్యం కావడం, కలెక్టర్ రెడ్డితో మర్యాదపూర్వకంగా వ్యవహరించినందుకుగానూ నిందితులకు మూడున్నరేళ్లకు శిక్ష తగ్గించింది కోర్టు. ఆపై అభ్యర్థన పిటిషన్ల మేరకు.. ఆ శిక్షను ఏడాదికే కుదించారు. ఈ కేసులో అప్పీల్ పిటిషన్ ఇంకా కేరళ హైకోర్టులో పెండింగ్‌లోనే ఉంది. ఈ వ్యవహారంలో ఆ నలుగురు మొత్తంగా.. 113 రోజులపాటు రిమాండ్‌లో గడిపారు. The four 'extremists' called up @NewIndianXpress office in Palakkad, and informed their intention to hold a press conference. Express was told to alert this to other media offices in Palakkad, as per this report. In the film, Express was changed to Asianet? https://t.co/hxPCYGtEbx — Rajesh Abraham🇮🇳 (@pendown) April 1, 2022 నాటకీయత లేదు కానీ.. ఆంధ్రప్రదేశ్ అబ్దుల్లాపురంలో పుట్టిన డబ్ల్యూఆర్ రెడ్డి.. కేరళ 1986 క్యాడర్‌కు చెందిన అధికారి. అయితే పాలక్కాడ్ ఘటన తర్వాత రాజకీయంగానూ ఆయన విమర్శలు ఎదుర్కొవాల్సి వచ్చింది. ఆయన మావోయిస్టుల సానుభూతిపరుడని, పలక్కడ్ ఘటనలో నిందితులకు సహకరించారనే విమర్శల్ని ఎల్డీఎఫ్ గుప్పించింది. అయితే.. రాజకీయాల్లో, ప్రత్యేకించి కేరళ రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని అంటున్నారు ఆయన. విమర్శలను ఆయన చాలా తేలికగా తీసుకున్నారు. పడ కథలో నాటకీయత అనే అంశం కనిపించలేదు. చాలా బాగా తీశారు. క్లైమాక్స్‌లో మీడియా వాళ్లను ప్రశ్నిస్తున్నప్పుడు, వారు కేవలం బొమ్మ పిస్టల్ మరియు నకిలీ పేలుడు పదార్థాలను మాత్రమే తీసుకెళ్లారని చెప్పారు. వారు ఆయుధాలు కలిగి ఉన్నారని నేను 'అనుకోవడం' లేదు. ఎందుకంటే వారు నిజంగా ఆయుధాలు కలిగి ఉన్నారని నాకు తెలుసు. ఆ విషయంలో నాకు ఏ మాత్రం సందేహం లేదు. వారి బ్యాగ్‌లను తనిఖీ చేయడానికి, వారి వాదనను ధృవీకరించడానికి ఎవరు ఆ సమయానికి ప్రయత్నించలేదు. బదులుగా, కథనాన్ని వేగంగా మార్చడంలో వాళ్లు విజయం సాధించారు. ఇదంతా జర్నలిజం వైఫల్యంగా నేను భావిస్తున్నాను. వాళ్లు నాకు ఎలాంటి హాని తలపెట్టలేదని, మర్యాదపూర్వకంగా వ్యవహరించారని మాత్రమే జడ్జి ముందు చెప్పాను. అంతేగానీ కేసు పెట్టనని అనలేదు(బహుశా అది దర్శకుడి క్రియేటివిటీ ఏమో!). ఆ మరుసటి రోజే పోలీసులకు ఫిర్యాదు చేశా. ఈ విషయంలో ఎవరి ఒత్తిడి నాపై లేదు అని ఆ ఇంటర్వ్యూలో వెల్లడించారు రెడ్డి. కేరళలో కొన్నాళ్లపాటు పని చేసిన తర్వాత కేంద్రం సర్వీసులకు ఆయన బదిలీపై వెళ్లారు. నటుడు అర్జున్ రాధాకృష్ణన్(ఎడమ).. డబ్ల్యూఆర్ రెడ్డి (ఫైల్ ఫొటో.. కుడి వైపు) పాలక్కాడ్ కలెక్టర్ బంధీ ఉదంతంలో.. డమ్మీ ఆయుధాలతో పది గంటలపాటైన నిలువరించగలిగామని చెప్తున్నారు అజయన్. అయితే అప్పటి సీఎం ఈకే నాయర్.. ఆ ఘటన జరిగిన సమయానికి ఎమ్మెల్యే కూడా కాదు. తలస్సెరీ బై ఎలక్షన్ హడావిడిలో ఉన్నారాయన. ఆ ఎన్నికలు ఆయనకు ఎంతో ప్రతిష్టాత్మకం. అందుకే కలెక్టర్‌ను కాపాడాలనే ప్రయత్నాలు చేయించారు. ఒకవేళ.. ఈరోజుల్లో గనుక అలాంటి ఘటనే జరిగి ఉంటే.. ఈపాటికే చచ్చి ఉండేవారేమో అంటున్నారు ఆ నలుగురు. మరి ఇంత చేసి.. వాళ్ల డిమాండ్ ఏమైంది?.. ఎవరూ పట్టించుకోలేదు. మీడియా అదంతా బంధీ నాటకంగా అభివర్ణించింది. ఆ తర్వాత ఆ విషయమూ, బంధీ వ్యవహారమూ కనుమరుగు అయి పోయాయి. పడ సినిమా షూటింగ్లో దర్శకుడు కమల్ దళిత నేత అయ్యన్‌కాళి పేరిట వెలిసిన రెబల్ గ్రూప్(మావోయిస్ట్ సానుభూతి).. అయ్యన్‌కాళి పడ. ప్రస్తుతం ఈ నలుగురు ఉద్యమవేత్తలుగా క్రియాశీలకంగా ఉన్నారు. కలెక్టర్‌ను బంధించిన ఘటన ఆధారంగానే.. జర్నలిస్ట్ కమ్ దర్శకుడు అయిన కేఎం కమల్ ‘పడ’ సినిమాను తీశాడు. ప్రకాశ్ రాజ్, కున్జక్కో బోబన్, దిలీశ్ పోతన్, ఇంద్రన్స్, సలీం కుమార్, వినాయకన్, జోజు జార్జ్ లాంటి తారాగణంతో సినిమాను తెరకెక్కించాడు. పాలక్కాడ్ కలెక్టర్ బంధీ ఘటన జరిగిన సమయంలో కమల్ జర్నలిజం డిప్లోమా స్టూడెంట్‌గా ఉన్నాడట. 2018 నుంచి నాలుగేళ్లపాటు ఈ ఉదంతంలో ఉన్న అందరినీ కలుసుకుని.. సినిమాగా తెరకెక్కించాడు. క్యారెక్టర్ల పేర్లకు మాత్రమే కొంచెం మార్పులు చేశాడు. అందుకే సినిమా పట్ల ఆ నలుగురే కాదు.. ఎవరూ పెద్దగా అభ్యంతరాలేవీ వ్యక్తం చేయలేదు. పడ మూవీ.. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది -
రాజకీయాలకు మెట్రోమ్యాన్ గుడ్‌బై
సాక్షి, మలప్పురం: కేరళ అసెంబ్లీకి ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి, ఓటమిపాలైన మెట్రోమ్యాన్ ఈ. శ్రీధరన్ క్రియాశీల రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ‘సహజంగా నేనెప్పుడూ రాజకీయ నాయకుడిని కాను. ఉండాలనుకోలేదు. నాకిప్పుడు 90ఏళ్లు. అందుకే క్రియాశీల రాజకీయాల్లో కొనసాగాలనుకోవడం లేదు. ప్రస్తుతం మూడు ట్రస్టుల ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతున్నాను ’అని శ్రీధరన్ గురువారం పొన్నానిలో మీడియాతో అన్నారు. ఈ పరిణామంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.సురేంద్రన్ స్పందించారు. క్రియాశీల రాజకీయాల్లో లేకున్నా శ్రీధరన్ సేవలను పార్టీ ఇతర అంశాలకు సంబంధించి ఉపయోగించుకుంటుందని చెప్పారు. శ్రీధరన్ ప్రస్తుతం బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా కొనసాగుతున్నారు. బీజేపీ తరఫున కేరళ సీఎం అభ్యర్థిగా పాలక్కడ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన శ్రీధరన్ కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓటమిపాలయ్యారు. చదవండి: కొన్ని రోజులు కలిసుంటే సహజీవనం కాదు! -
ప్రేయసిని పదేళ్లపాటు దాచి.. పెళ్లి చేసుకున్నాడు
పాలక్కాడ్ (కేరళ): రెహమాన్.. గుర్తున్నాడా? ప్రియురాలు సజితాను ఏకంగా పదేళ్లపాటు తన ఇంట్లోనే ఓ గదిలో ఎవరికీ తెలియకుండా దాచిపెట్టి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన రెహమాన్ ఇప్పుడు ఆమెను చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్నాడు. కేరళలోని పాలక్కాడ్ జిల్లా నెన్మారా పట్టణంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రత్యేక వివాహ చట్టం కింద బుధవారం ఈ పెళ్లి జరిగింది. పాలక్కాడ్ జిల్లా అయిలూర్కు చెందిన రెహమాన్ తన ప్రియురాలిని తన ఇంటి ప్రాంగణంలోనే ఓ గదిలో పదేళ్లపాటు రహస్యంగా దాచిపెట్టాడు. కొన్ని నెలల క్రితం బయటపడిన ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచనలం సృష్టించింది. చట్టవిరుద్ధంగా యువతిని నిర్బంధించాడంటూ కేరళ రాష్ట్ర మహిళా కమిషన్ అతడిపై కేసు పెట్టింది. చదవండి: ప్రేమకై పదేళ్లు దాక్కుంది.. మరీ అంత చిన్న గదిలో! -
14 ఏళ్లకే ఇంట్లో నుంచి పరార్.. 2 ఏళ్ల తర్వాత 4 నెలల శిశువుతో!
చెన్నై/తిరువనంతపురం: కేరళలో కనిపించకుండా పోయిన ఓ మైనర్ బాలికను రెండేళ్ల తరువాత తమిళనాడులోని మదురైలో పోలీసులు గుర్తించారు. తప్పిపోయిన సమయంలో బాలిక వయస్సు 14 ఏళ్లు కాగా ప్రస్తుతం ఆమెకు 16 ఏళ్లు. అయితే ఇప్పుడు నాలుగు నెలల శిశువుకు తల్లి. ఆమె తమిళనాడు 22 ఏళ్ల వ్యక్తితో కలిసి జీవిస్తున్నట్లు పోలీసులు కనుగొన్నారు. కేరళ రాష్ట్రం పాలక్కాడ్ జిల్లాలోని(తమిళనాడుకు సరిహద్దు ప్రాంతం)కోజింజపారాకు చెందిన 14 ఏళ్ల బాలిక రెండేళ్ల క్రితం తప్పిపోయింది. ఓ వ్యక్తితో కలిసి 2019లో ఇంట్లోనుంచి పారిపోయినట్లు తెలిసింది. ఈ విషయంపై బాలిక తల్లిదండ్రులు పోలీసులను సంప్రదించగా.. కోజింజంపారా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినప్పటికీ ఆమె ఆచూకీ లభించలేదు. ఇక తాజాగా రెండేళ్ల తరువాత జూన్ 18న వీరిద్దరూ మదురైలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఆమె తన తల్లితో కలిసి క్యాటరింగ్ పనిచేసే వ్యక్తితో మదురైలోని ఇంట్లో కనిపించింది. కాగా ఆ వ్యక్తికి చెందిన దూరపు బంధువులు అతని ఇంటి సమీపంలో నివసిస్తున్నారని, బాలికను అతని భార్యగా వారు తెలిపారని పోలీసులు పేర్కొన్నారు. అయితే బాలిక వయసు గురించి ఖచ్చితంగా తెలియదన్నారు. ప్రస్తుతం ఆమె ఇప్పుడు నాలుగు నెలల శిశువుకు తల్లి అని పాలక్కాడ్ జిల్లా డీఎస్పీ జాన్ సీ తెలిపారు. వీర్దిరూ కలిసి జీవిస్తున్నారన్న ఈ విషయం బాలిక తల్లిదండ్రులకు తెలిసి ఉందో లేదో తమకు తెలియదని పోలీసులు అన్నారు. బాలికను, శిశువును తిరిగి కేరళకు పంపించామని, సదరు వ్యక్తి పరారీలో ఉన్నాడని తెలిపారు. అతని కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం సెక్షన్ల కింద వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు, ఈ కేసులో తదుపరి దర్యాప్తు కోసం శిశువు, బాలిక డీఎన్ఏ నమూనాలను సేకరిస్తామని వెల్లడించారు. చదవండి: దారుణం: దెయ్యం పట్టిందని కొడుకును కొట్టి చంపిన తల్లి -
ప్రేమకై పదేళ్లు దాక్కుంది.. మరీ అంత చిన్న గదిలో!
ప్రేమ కోసం లైలా, పార్వతి, జూలియెట్‌లు పడిన బాధ, వేదన వారిని కాలంతోపాటు నిలబెట్టింది. కేరళకు చెందిన సజిత ఇప్పుడు వీరి సరసన చేరనుంది. ప్రేమ కోసం ఇంటి నుంచి పారిపోయిన సజిత తన ఇంటి పదిళ్ల అవతల తన ప్రేమికుడి ఇంట్లో గత పదేళ్లుగా దాక్కుంది. ఆమె తన గదిలో ఉన్నట్టు ప్రేమికుడికి తప్ప ఎవ్వరికీ తెలియదు. తాజాగా ఈ ప్రేమ కథ బయటపడి అంతా దిగ్భ్రాంతి చెందుతున్నారు. ప్రేమకు కుల మతాలు అడ్డుగా ఉంటాయని భయపడినంత కాలం ఇలాంటి ప్రేమికులు తారసపడుతూనే ఉంటారు. సలీమ్‌ను ప్రేమించిన అనార్కలీని సలీమ్ నుంచి విడగొట్టడానికి అక్బర్ పాదుషా చీకటి గుహల్లోకి ఆమెను పంపించాడని ఒక కథనం. అయితే ఇక్కడ సలీమ్ ఉన్నాడు. అనార్కలీ కూడా ఉంది. అతని ప్రేమ కోసం ఆమె ఒక గదిలో చాటులో ఒకటి కాదు రెండు కాదు పదేళ్లు ఉండిపోయింది. రెండు రోజుల క్రితం కేరళలో ఈ ఘటన బయటపడింది. 2010లో ఫిబ్రవరి 2, 2010న పాలక్కాడ్ జిల్లాలోని అలియూర్ అనే పల్లెలో వేలాయుధన్ అనే వ్యక్తి 18 ఏళ్ల తన కుమార్తె సజిత కనపడటం లేదని పోలీస్ కంప్లయింట్ ఇచ్చాడు. పోలీసులు వెంటనే సజితను వెతకడం ప్రారంభించారు. ఆ ఊళ్లో ఉన్న కుర్రాళ్లను పిలిచి ఎంక్వయిరీ చేశారు. ఏమీ క్లూ దొరకలేదు. మరోవైపు సజిత తల్లిదండ్రులు అలుపెరగకుండా సజితను వెతికారు. కాని ఆమె కనిపించలేదు. ఏళ్లు గడిచే కొద్ది వారు ఆమెపై ఆశ వదులుకున్నారు. మెల్లగా ఆమె చనిపోయిందనే నిర్థారణకు వచ్చారు. రేషన్ కార్డులో ఆమె పేరు తీయించేశారు కూడా. కాని ఆమె బతికే ఉంది. వాళ్లింటికి పదిళ్ల అవతలే ఉంది. నాలుగు గోడల గదిలో సజిత తన వీధిలోనే ఉన్న రహమాన్‌ను ప్రేమించింది. అతను చిన్నపాటి ఎలక్ట్రీషియన్. పెయింటర్. అయితే ఇరువురి మతాలు వేరు కాబట్టి పెళ్లికి ఇద్దరి పెద్దలు అడ్డం పడతారని వాళ్లకు సందేహం వచ్చింది. మరోవైపు సజితకు పెళ్లి ప్రయత్నాలు మొదలయ్యాయి. సొంతంగా పారిపోయి బతికే ధైర్యం రహమాన్‌కు లేదు. అలాగే ఆర్థికంగా ఆమెను పోషించే స్థితిలో లేడు. కనుక వాళ్లిద్దరూ ఒక ఆలోచన చేశారు. ఫిబ్రవరి 2, 2010న ఎవరూ లేని సమయంలో ఆమె అతని ఇంటికి వచ్చేసింది. ఆ ఇంట్లో అతనికి ప్రత్యేకం ఒక గది ఉంది. ఆ గదిలో ఉండిపోయింది. ఆ గది లో ఆమె ఉన్నట్టు రహమాన్‌కు తప్ప ఇంకెవరికీ తెలియదు. రహమాన్ తండ్రి అబ్దుల్ ఘని, అతని భార్య డైలీ లేబర్స్. వాళ్లు ఉదయాన్నే పనికి వెళ్లి సాయంత్రానికి తిరిగి వచ్చేవారు. రహమాన్‌కు ఒక చెల్లెలు ఉంది. ఆమె ఇంట్లో ఉండేది. అయినప్పటికీ గత పదేళ్లుగా సజిత రహమాన్ గదిలో దాక్కుని ఉండిపోయింది. రహమాన్‌కు ముక్కోపం. అదీగాక సజితను తన గదిలో దాచాక కావాలని తిక్క తిక్కగా వ్యవహరించేవాడు. దాంతో అతనికి కొంచెం స్క్రూలూజ్ అని అతని జోలికి ఎవరూ వచ్చేవారు కాదు. అతను ఇంట్లో ఉంటే గదిలో ఉండేవాడు. బయటకు వెళితే గదికి తాళం వేసుకొని వెళ్లేవాడు. ఆ తాళం ఎవరూ తీయకుండా ప్రత్యేకంగా చేయించాడు. ఆ గదిలోనే అన్నం తీసుకెళ్లి తినేవాడు. ఆ గదికి అటాచ్డ్ బాత్రూమ్ లేదు. అందుకని కిటికీ ఊచలను తొలగించి అవి అవసరం ఉన్నప్పుడు తీసి పెట్టుకునేలా ఏర్పాటు చేశాడు. సజిత తన టాయిలెట్ అవసరాలను ఆ కిటికీ గుండా రాత్రిళ్లు బయటకు వెళ్లి తీర్చుకునేది. గదిలో సజిత ఉన్నందున రహమాన్ తక్కువగా పనికి వెళ్లేవాడు. ఎక్కువగా ఇంట్లో లేదా గదిలో ఉండేవాడు. ఆమె లోపలే ఉండిపోయేది. ఒక టీవీ ఉంది ఆ గదిలో. అదే ఆమె కాలక్షేపం. ఎలా బయటపడింది? మూడు నెలల క్రితం రహమాన్ ఇంట్లో వాళ్లతో గొడవపడ్డాడు. ఆ తర్వాత కనిపించకుండా పోయాడు. దాంతో రహమాన్ అన్న (మరో ఊరిలో ఉంటాడు) పోలీస్ కంప్లయింట్ ఇచ్చాడు. అయితే పోలీసులు ఇతణ్ణి వెతకలేకపోయారు. నాలుగు రోజుల క్రితం రహమాన్ అన్న ఏదో పని మీద దాపునే ఉన్న ‘నెమర’ అనే చిన్న టౌన్‌కి వెళితే అక్కడ మోపెడ్ మీద వెళుతున్న రహమాన్ కనిపించాడు. వెంటనే అన్న పోలీసులకు చెప్తే వాళ్లు అతణ్ణి పట్టుకున్నారు. ఆ సమయంలోనే అతను సజితతో ఒక అద్దె ఇంట్లో జీవిస్తున్నాడని తెలిసింది. ఇద్దరూ విముక్తులు పోలీసులు ఇద్దర్నీ కోర్టులో హాజరు పరిచారు. జడ్జి సజితను ‘ఎక్కడ ఉంటావమ్మా’ అని అడిగితే రహమాన్తోనే అని చెప్పింది. కోర్టు ఇద్దరినీ పంపించేసింది. అయితే ఈ సంగతి విన్న ఊరి వాళ్లు ఇరు పక్షాల పెద్దలు దిగ్భ్రమలో ఉండిపోయారు. పోలీసులు వీరి కథనాన్ని ఏ మాత్రం నమ్మలేదు. రహమాన్‌ను విడిగా, సజితను విడిగా ప్రశ్నిస్తే ఒకే కథ చెప్పారు ఇద్దరూ. వారు ఉన్న గదిని చూసి ఇంత చిన్న గదిలో ఇన్నాళ్లు ఈమె ఎలా ఉందా అని పోలీసులు ఆశ్చర్యపోయారు. సమాజం ఇంత ముందుకు పోయినా మన దగ్గర అమ్మాయిలు, అబ్బాయిలు తమ ప్రేమను, జీవిత భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ పూర్తిగా లేదు. అడ్డంకులు జాస్తి. ఆ అడ్డంకులు జీవితాలను, ప్రాణాలను నాశనం చేసే వరకూ వెళతాయని అనేక ఘటనలు నేటికీ రుజువు చేస్తూనే ఉన్నాయి. కాని ప్రేమ ఆగదు. ప్రేమను గట్టిగా కాపాడుకోవాలనుకునేవారు అందుకై కొత్త కొత్త మార్గాలు వెతుకుతూనే ఉంటారు. అయితే సజిత ఎంచుకున్న మార్గం మాత్రం అనూహ్యం. ఏ వ్యక్తికీ అన్ని రోజులు అలా ఒక గదిలో ఉండటం సాధ్యం కాదు. బహుశా ప్రేమ ఆమెకు ఆ శక్తి ఇచ్చిందేమో. ప్రస్తుతానికి వీరి కథ సుఖాంతం. వీరి ప్రేమను విడగొట్టాలనే సాహసం ఇంత కథ విన్నాక ఏ పెద్దలూ చేయరేమో. సమాజం ఇంత ముందుకు పోయినా మన దగ్గర అమ్మాయిలు, అబ్బాయిలు తమ ప్రేమను, జీవిత భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ పూర్తిగా లేదు. అడ్డంకులు జాస్తి. ఆ అడ్డంకులు జీవితాలను, ప్రాణాలను నాశనం చేసే వరకూ వెళతాయని అనేక ఘటనలు నేటికీ రుజువు చేస్తూనే ఉన్నాయి. కాని ప్రేమ ఆగదు. ప్రేమను గట్టిగా కాపాడుకోవాలనుకునేవారు అందుకై కొత్త కొత్త మార్గాలు వెతుకుతూనే ఉంటారు. అయితే సజిత ఎంచుకున్న మార్గం మాత్రం అనూహ్యం. – సాక్షి ఫ్యామిలీ -
కేరళలో బీజేపీకి భారీ షాక్.. మెట్రోమ్యాన్ ఓటమి
కేరళలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. 2016 అసెంబ్లీ ఎన్నికలలో కేరళలో ఒక సీటు గెలిచిన భారతీయ జనతా పార్టీ ఈసారి ఖాతా కూడా తెరవదని ముఖ్యమంత్రి పినరయి విజయన్ చేసిన వ్యాఖ్యలు నిజమయ్యాయి. కేరళ ఎన్నికల్లో తీవ్రంగా పోరాడినప్పటికీ విజయం సాధించడంలో కేంద్ర పాలక పార్టీ విఫలమైంది. 2016 అసెంబ్లీ ఎన్నికలలో ప్రముఖ బిజెపీ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి ఓ.రాజగోపాల్ తిరువనంతపురం జిల్లాలోని నెమోమ్ అసెంబ్లీ నియోజకవర్గంలో గెలుపొందారు. కేరళ రాష్ట్రంలో బిజెపీకి ఇక్కడ నుంచే తొలి స్థానం లభించింది. నేడు ఆదివారం లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి నెమోమ్, పాలక్కాడ్, త్రిస్సూర్ అనే మూడు స్థానాల్లో బిజెపీ ఆధిక్యంలో ఉంది. బీజేపీ తన సిట్టింగ్ స్థానం నెమోమ్‌లో కూడా కోల్పోయింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్ సహా నటుడు సురేశ్ గోపీ, మెట్రోమ్యాన్ శ్రీధరన్ కూడా ఓటమి పాలయ్యారు. పాలక్కడ్ నుంచి పోటి చేస్తోన్న శ్రీ ధరణ్ సిట్టింగ్ ఎమ్మెల్యే షఫి పరంబిల్ (కాంగ్రెస్) చేతిలో ఓడిపోయారు. 1000పైగా మెజార్టీతో పాలక్కడ్‌ను తిరిగి కాంగ్రెస్ అభ్యర్థి గెలుచుకుంది. పాలక్కడ్ నియోజకవర్గంపై కాంగ్రెస్ మరోసారి తన సత్తాచాటింది. ఇదిలా ఉంటే కేరళలో ఎల్డీఫ్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశలో అడుగులు వేస్తోంది. చదవండి: 44 ఏళ్ల చరిత్రను తిరగ రాసిన పినరయి విజయన్ -
చిరుతపులిపైకి దూసుకెళ్లిన వాహనం.. ఫలితం
కేరళ: తెల్లవారుజామున.. సూర్యుడు అప్పుడప్పుడే ఉదయిస్తున్నాడు.. ఈ సమయంలో రోడ్డుపై దూసుకెళ్తుండగా అడ్డం వచ్చిన చిరుతపులిని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. ఫలితంగా ఆ చిరుత పులి తీవ్రంగా గాయపడి మృతిచెందింది. అయితే అటవీ ప్రాంతంలో వాహనాల ప్రయాణాలపై నిషేధం ఉన్నా పట్టించుకోకపోవడంతో ఫలితం వన్యమృగం కన్నుమూసింది. ఈ ఘటన కేరళలోని పాలక్కాడ్ జిల్లా ముల్లి-పిల్లర్ డ్యామ్‌కు సమీపంలో మోనార్ ప్రాంతంలో జరిగింది. నీలగిరి కొండల ప్రాంతం దట్టమైన అడవి. ఇక్కడ అధిక సంఖ్యలో పులులు ఉంటాయి. డ్యామ్‌కు సమీపంలోని మోనార్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం 6.30 సమయంలో రోడ్డుపై నుంచి చిరుత సంచరిస్తోంది. ఈ సమయంలో ఒక్కసారిగా దూసుకొచ్చిన గుర్తు తెలియని వాహనం పులిని ఢీకొట్టింది. దీంతో పులి ఎగిరిపడి రోడ్డు అవతల పడిపోయిందని కోయంబత్తూర్ అటవీ శాఖ అధికారి సుకుమార్ తెలిపారు. ఘటన సమాచారం అందడంతో అటవీ అధికారులు సింహాన్ని పరిశీలించగా తీవ్ర గాయాలతో పడి ఉంది. వెంటనే దాన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే మెడ, తోక, పొట్ట భాగంలో తీవ్ర గాయాలవడంతో పులి కన్నుమూసింది. పులికి పోస్టుమార్టం చేశారు. పులిని ఢీకొట్టిన వాహనం వివరాలు అధికారులు సేకరిస్తున్నారు. అటవీ ప్రాంతంలో వేగంగా నడిపి ఓ వన్యమృగం ప్రాణం తీసిన అంశంపై కేసు నమోదు చేసే అవకాశం ఉంది. చదవండి: సెల్ఫీ తీసుకుంటూ ఫోన్‌తో నీటిలోకి కొట్టుకుపోయిన బాలుడు చదవండి: డబ్బుల్లేక భార్యతో గొడవ.. కూతుళ్లతో విషం తాగి -
అమృత సంధ్య ఇదీ జీవితం
‘నా భార్య నాకు అండగా నిలిచిన తీరు ఏ పెద్ద వాళ్లు చెప్పిన అప్పగింతలోనూ లేదు. బతుకు నావ ఒడిదొడుకులకు లోనయినప్పుడు తనకు తానుగా నాకు తోడు వచ్చింది. నేను ఈ రోజు ఇలా నవ్వుతూ ఉన్నానంటే కారణం మా సంధ్య ప్రోత్సాహం, సహకారమే’ అని ఓ భర్త తన భార్యను ప్రశంసల్లో ముంచెత్తాడు. భార్య గొప్పతనాన్ని చెప్పడానికి ఇష్టపడని మగ ప్రపంచంలో ఈ భర్త మాటలు వినడానికి మగవాళ్లకు ఎలా ఉందో కానీ ఆడవాళ్లు వినసొంపుగా ఆస్వాదిస్తున్నారు. ఆ భర్త కేరళ రాష్ట్రం, పాలక్కాడ్‌లోని శివకుమార్. నోరూరించే ఉపాధి ఓ పదహారేళ్ల కిందట... శివకుమార్ బీపీఎల్ లో ఉద్యోగం చేసేవాడు. ఆ బీపీఎల్ మూతపడడంతో అతడి ఉద్యోగం పోయింది. కొత్త ఉద్యోగం కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నాడు. ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. ఇంటిని నడపాల్సిన తన బాధ్యతను నిర్వర్తించడంలో విఫలమవుతున్నానేమోననే ఆందోళనను అతడి భార్య సంధ్య పసిగట్టేసింది. ‘ఇల్లు గడవాలంటే ఉద్యోగమే చేయాలా? సొంతంగా మనకు వచ్చిన పని ఏదైనా చేయవచ్చు కదా’ అన్నదామె. శివకుమార్ ముఖంలో ప్రశ్నార్థకానికి బదులుగా ఆమె ‘చిరుతిండ్లు బాగా చేస్తాను. ఆ పనే మనకు అన్నం పెడుతుంది’ అన్నది. ‘మార్కెట్లో కొత్తరకాల స్వీట్లు ఎన్ని రకాలున్నప్పటికీ బాల్యంలో తిన్న రుచి కనిపిస్తే ఎవరికైనా నోరూరుతుంది. అదే మనకు బతుకుదెరువవుతుందని కూడా ఆమె భర్తకు భరోసానిచ్చింది. ప్రయోగాత్మంగా కొన్నింటిని చేసి బంధువులకు, స్నేహితులకు రుచి చూపించారు. వాళ్లు పాస్ మార్కులు వేయడంతో 2005లో అమృత ఫుడ్స్ పేరుతో చిరుతిళ్లను తయారు చేసే పరిశ్రమ మొదలైంది. పదిహేనేళ్లు గడిచేసరికి ఇప్పుడా దంపతులు ఏడాదికి పది లక్షల ఆదాయాన్ని చూడగలుగుతున్నారు. పదిమందికి పైగా ఉద్యోగం కల్పించారు. తమ ఆహార ఉత్పత్తులకు ‘ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా’ గుర్తింపు కూడా వచ్చింది. వ్యక్తి వికాస పాఠం ఈ ఆధునిక యుగంలో నెలకు లక్షల జీతం తీసుకుంటున్న భార్యాభర్తలు ఎక్కువగానే ఉన్నారు. అంత సౌకర్యవంతమైన జీవితంలో కూడా నాలుగు నెలల పాటు ఉద్యోగంలో మాంద్యం ఏర్పడితే ఆ జీవితాలు తలకిందులవుతున్నాయి. మనోధైర్యాన్ని కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. శివకుమార్, సంధ్య దంపతుల జీవితం ఒక వ్యక్తిత్వ వికాస పాఠం అనే చెప్పాలి. ఉన్నత చదువు చదివిన భర్తతో ‘నాకు తెలిసిన పని, తక్కువ పెట్టుబడితో మన చేతుల శ్రమతో కొత్త వృత్తిని చేపడదా’మని చెప్పడంలో ఓ చొరవ ఉంది. తన చదువుకు తగిన ఉద్యోగం అని బేషజాలకు పోకుండా భార్య ప్రతిపాదనను గౌరవించడంలో అతడి పరిణతి ఉంది. -
ఇష్టం లేని పెళ్లి.. పరువు హత్యకు దారి
తిరువనంతపురం : కేరళలోని పాలక్కడ్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తమకు ఇష్టం లేకుండా తమ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడన్న కారణంతో ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన జిల్లాలోని తెన్కురిస్సి ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాలు.. 27 ఏళ్ల అనీష్ అనే వ్యక్తి ఒక యువతిని ప్రేమించాడు. అయితే యువతి తండ్రి ప్రభుకుమార్ ఆ ప్రాంతంలో బాగా పలుకుబడి ఉన్న వ్యక్తిగా పేరు సంపాదించాడు. తన కూతురును ప్రేమించడానికి వీలేదని అనీష్‌ను చాలాసార్లు హెచ్చరించాడు. అయితే యువతి కూడా అనీష్‌ను ఇష్టపడడంతో మూడు నెలల క్రితం వారిద్దరు పెళ్లి చేసుకున్నారు. అనీష్ పెళ్లి ఇరు కుటుంబాల మధ్య చిచ్చును రేపి గొడవలకు దారి తీసింది. దీంతో అనీష్ దంపతులు పోలీసులను ఆశ్రయించగా వారు జోక్యం చేసుకొని కుటుంబాల మధ్య రాజీ కుదిర్చారు. అయితే యువతి కుటుంబసభ్యులు రాజీకి అంగీకరించినా అనీష్ దంపతులను మాత్రం చంపుతామని బెదిరించేవారు. అప్పటినుంచి అనీష్ దంపతులు ఇరు కుటుంబాలకు దూరంగా ఉంటున్నారు. కాగా శుక్రవారం సాయంత్రం అనీష్ ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా యువతి తండ్రి ప్రభు కుమార్, ఆమె మేనమామ సురేశ్‌లు అతన్ని అడ్డుకున్నారు. అతనిపై పదునైన వస్తువులతో దాడి చేసి అక్కడినుంచి పారిపోయారు. రక్తపు మడుగులో పడి ఉన్న అనీష్‌ను స్థానికులు సమీప ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. కాగా ఆసుపత్రికి చేరేలోగానే అనీష్ ప్రాణాలు విడిచాడు. అనీష్ భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమె తండ్రి ప్రభు కుమార్, మేనమామ సురేశ్‌లను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. -
దారుణం : హత్య చేసి శవాన్ని ఇంట్లోనే ..
పాలక్కడ్ : తనను నమ్మి వచ్చిన ఒక మహిళను మోసగించడమే కాకుండా ఆమెను దారుణంగా చంపి తన ఇంట్లోనే పాతిపెట్టిన ఘటన కేరళలోని పాలక్కడ్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. కొల్లామ్ జిల్లాకు చెందిన 42 ఏళ్ల సుచిత్ర అనే మహిళ కొట్టాయంలో ట్రైనీ బ్యుటిషియన్‌గా విధులు నిర్వహిస్తోంది. కాగా మార్చి 17న తన మామయ్యకు బాగా లేదని, తాను వెంటనే అలప్పుజాకు వెళ్లి ఆయనను చూసుకోవాల్సి ఉందని తనకు సెలవు కావాలని కంపెనీకి మెయిల్ చేసింది. తర్వాతి రోజు మరో ఐదు రోజులు సెలవులు పొడిగించాలంటూ మళ్లీ మెయిల్ చేసింది. అప్పటికే ఇంటికి చేరుకున్న సుచిత్ర తనను ట్రైనింగ్ పని మీద ఎర్నాకుళం పంపిస్తున్నారని ఇంట్లో వాళ్లతో చెప్పి వెళ్లింది. ఐదు రోజులైనా సుచిత్ర ఒక్కసారి కూడా ఫోన్ చేయకపోవడంతో అనుమానుమొచ్చి సుచిత్ర పని చేస్తున్న సంస్థకు ఫోన్ చేయగా ఇక్కడికి రాలేదని, తాను వాళ్ల మామయ్యకు బాగా లేదని చెప్పి ఐదు రోజులు సెలవు తీసుకుందని పేర్కొన్నారు. దీంతో వెంటనే కొట్టాయం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కుటుంబసభ్యులు సుచిత్రపై మిస్సింగ్ కేసు నమోదు చేశారు. సుచిత్ర తన భర్తతో విడాకులు తీసుకొని భర్త తరపు కుటుంబసభ్యులకు దూరంగా ఉంటుందని పోలీసులకు వెళ్లడించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. (వ్యక్తి ప్రాణం తీసిన కోడి ధర) మనాలీకి చెందిన కీబోర్డ్ ప్లేయర్ 32 ఏళ్ల ప్రశాంత్ సోషల్ మీడియా ద్వారా సుచిత్రకు పరిచయమయ్యాడు. కొంతకాలంగా ప్రశాంత్, సుచిత్రల మధ్య ప్రేమాయణం కొనసాగుతందని దర్యాప్తులో తేలింది. ప్రశాంత్‌ను కలవడానికే సుచిత్ర మనాలీ వెళ్లిందని తేలింది. దీంతో కొల్లాయం క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మనాలీ వెళ్లి ప్రశాంత్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. మొదట సుచిత్ర, తాను పెళ్లి విషయమై పోట్లాడుకున్నామని, తర్వాత సుచిత్ర ఆత్మహత్య చేసుకుందని ప్రశాంత్ తెలిపాడు. చివరకు పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయం బయటపెట్టాడు. గత కొంతకాలంగా సుచిత్ర తనను ప్రేమిస్తుందని, పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో ఆమెను హత్య చేసినట్లు ప్రశాంత్ ఒప్పుకున్నాడు. తర్వాత ఆమె శవాన్ని తాను ఉంటున్న ఇంట్లోనే పాతి పెట్టానని తెలిపాడు. ప్రశాంత్ చెప్పిన వివరాల ప్రకారం సుచిత్ర పాతిపెట్టిన చోటును తవ్వించగా ఆమె మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో లభించింది.ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించగా ఆ మృతదేహం సుచిత్రదేనని తేలింది. దీంతో ప్రశాంత్‌ను అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. -
పల్లె సీమలో కేంద్రీయ విద్య
పల్లె సీమలో కేంద్రీయ విద్యాలయానికి పునాదులు పడుతున్నాయి. పచ్చని వ్యవసాయ పొలాలు.. ఆహ్లాదకరమైన వాతావరణం మధ్య పాలచ్చూరులో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు వేగవంతంగా అడుగులు పడుతున్నాయి. నెల్లూరు, చిత్తూరు జిల్లాల సరిహద్దు మండలంగా ఉన్న పెళ్లకూరు దశాబ్దాలుగా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. ఉన్నత విద్యా సంస్థలను నెలకొల్ప లేకపోయాయి. గత టీడీపీ ప్రభుత్వం విద్యాభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపట్టకపోగా, ఉన్న విద్యాలయాలను తొలగించింది. గ్రామీణ విద్యార్థులు ప్రాథమిక విద్యకే దూరమయ్యే పరిస్థితి కల్పించింది. ఈ దశలో స్థానిక నేతల ప్రతిపాదనలతో ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌రావు చొరవతో మండలానికి గుర్తింపు వచ్చే కేంద్రీయ విద్యాలయం మంజూరు అయింది. సాక్షి, పెళ్లకూరు: దశాబ్దాల తర్వాత పెళ్లకూరు మండలానికి జిల్లా స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించింది. ప్రతిష్టాత్మకమైన కేంద్రీయ విద్యాలయం మండలంలో ఏర్పాటు చేయనుంది. 2020–21 విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభించనున్నారు. విద్యాలయం ప్రారంభించేందుకు అధికారులు ఇప్పటికే గ్రామ సమీపంలో పది ఎకరాల స్థలాన్ని సేకరించారు. రెవెన్యూ అధికారులు పూర్తి స్థాయిలో సర్వే చేసి కేంద్రీయ విద్యాలయ నిర్మాణానికి త్వరలో స్థలాన్ని అందజేసేలా చర్యలు చేపట్టారు. విద్యాలయం ప్రారంభించేందుకు అధికారులు ఇప్పటికే గ్రామ సమీపంలో పది ఎకరాలు స్థలాన్ని సేకరించారు. ప్రస్తుతానికి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనంతో పాటు అద్దె భవనాల్లో కేంద్రీయ విద్యాలయం నిర్వహించేలా అధికారులు చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తుంది. పాలచ్చూరులో విద్యాలయం ఏర్పాటు చేస్తే అటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలతో పాటు స్థానిక విద్యార్థులు సీబీఎస్ఈలో ఉన్నత చదువులు చదువుకొనే అవకాశం కలుగుతుంది. ఒకటో తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుకొనే అవకాశం ఉన్న కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశం కోసం ప్రతి ఏటా మార్చి నెలలో నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా ఎస్సీ, ఎస్టీలకు 15 శాతం, దివ్యాంగులకు 3 శాతం చొప్పున సీట్లు కేటాయించనునన్నారు. దీని వల్ల పేద కుటుంబాలకు చెందిన పిల్లలు మంచి అవకాశం లభిస్తుంది. చదువుతో పాటు వ్యాయామం, క్రీడలు, యోగా తదితర అంశాల్లో ప్రత్యేక తర్ఫీదు ఉంటుంది. ప్రతి క్షణం విద్యార్థులపై ప్రత్యేక నిఘా ఉంచడం, క్రమశిక్షణతో కూడిన సీబీఎస్ఈ సిలబస్‌లో విద్యా బోధన ఉంటుంది. నియోజకవర్గంలోని అన్నీ మండలాల్లో గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ హాస్టళ్లు, మోడల్ స్కూళ్లు ఉన్నాయి. కానీ పెళ్లకూరు మండలంలో మాత్రం ఇప్పటి వరకు అలాంటి అవకాశం లేదు. వైఎస్సార్ పాలనలో.. మండలంలో 24 పంచాయతీలు ఉండగా గతంలో 16 పంచాయతీలు చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజక వర్గంలో, 6 పంచాయతీలు సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలో ఉండేవి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో 24 పంచాయతీలను సూళ్లూరుపేట నియోజక వర్గంలో విలీనం చేశారు. అప్పటి నుంచి పెళ్లకూరు, చెంబేడు, శిరసనంబేడు, రోసనూరు గ్రామాల్లో సంక్షేమ వసతి గృహాలు ఏర్పాటు చేసి పేద పిల్లలు చదువుకొనే అవకాశం కలిగించారు. అయితే టీడీపీ అధికారంలోకి రావడంతో సంక్షేమ వసతి గృహాలు పూర్తిగా తొలగించడం వల్ల మళ్లీ ఇక్కడి విద్యార్థులకు ఇక్కట్లు తప్పలేదు. ప్రస్తుతం వైఎస్సార్సీపీ పాలనలో తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌రావు చొరవతో పాలచ్చూరులో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. టీడీపీ హయాంలో.. మండలంలో 51 ప్రాథమిక, 7 ప్రాథమికోన్నత, 7 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. 1,816 మంది ప్రాథమిక విద్యార్థులు, 972 మంది ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల విద్యార్థులు మొత్తం 2,788 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. స్వాతంత్య్రం సిద్ధించి 73 ఏళ్లు పూర్తయినా మండలంలో కనీసం ఒక్క ప్రభుత్వ కళాశాల గానీ, గురుకుల పాఠశాల గానీ, మోడల్ స్కూల్ గానీ లేకపోవడం గమనార్హం. దీనికి తోడు గత టీడీపీ పాలనలో మండలంలోని మూడు సాంఘిక సంక్షేమ వసతి గృహాలు మూసివేసింది. ఆయా ప్రాంతాల్లోని నిరుపేద కుటుంబాలకు చెందిన పలువురు విద్యార్థులు చదువులకు దూరమయ్యారు. మరి కొందరు విద్యార్థులు ఉన్నత చదువుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. మండలంలో ఎక్కువ మంది వ్యవసాయ కూలీల కుటుంబాలు ఉండడం వల్ల అక్షరాస్యత లేని తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నత చదువుల చదివించకుండా అర్ధాంతరంగా ఆపేస్తున్నారు. దీంతో కొందరు విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకొనే అవకాశం లేక నివాసాలకే పరిమితమవుతున్నారు. ఎంపీ దుర్గాప్రసాద్‌రావు చొరవతో మండలంలోని గ్రామీణ ప్రాంత ప్రజలు చదువుకొనే అవకాశం లేక ఇబ్బందులు పడుతున్న ఇక్కడి పరిస్థితిని తెలుసుకున్న తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌రావు చొరవ తీసుకుని కేంద్ర విద్యాలయ అధికారులతో సంప్రదింపులు జరిపారు. పాలచ్చూరులో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, వైఎస్సార్సీపీ నేతలు కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి, డాక్టర్ వెడిచర్ల ప్రద్యుమ్నకుమార్‌రెడ్డి తదితరులు ఇక్కడి ఉన్నత విద్యపై నెలకొన్న సమస్యపై ఎంపీతో మాట్లాడారు. ఎంపీ చొరవతో పాలచ్చూరులో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేసేలా కసరత్తు మొదలు పెట్టారు. పాలచ్చూరు పంచాయతీ పరిధిలోని జంగాలపల్లి కూడలి వద్ద ఇప్పటికే 10 ఎకరాల భూములను సేకరించి కేంద్రీయ విద్యాలయం నిర్మాణానికి ప్రాథమిక దశ పనులు చేపట్టేలా పాలకులు పనులు మొదలు పెట్టారు. -
మ్యాచ్ ప్రారంభానికి ముందు కూలిన గ్రౌండ్ గ్యాలరీ
పాలక్కాడ్ : కేరళలోని పాలక్కాడ్ ఫుట్‌బాల్ గ్రౌండ్లో ఆదివారం పెను ప్రమాదం తప్పింది. మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుండగా.. గ్రౌండ్లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గ్యాలరీ కూలిపోయింది. ఈ ఘటనలో దాదాపు 50 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన జరిగిన సమయంలో ఇండియన్ ఫుట్‌బాల్ ప్రముఖులు ఐఎమ్ విజయన్, భైచుంగ్ భూటియా అక్కడే ఉన్నారు. అయితే వారు క్షేమంగా ఉన్నట్టు కేరళ పోలీసులు తెలిపారు. కాగా, గతేడాది డిసెంబర్ 29న ఆల్ ఇండియా సెవెన్స్ మ్యాచ్ ఆడుతున్న సమయంలో గుండెపోటుతో మరణించిన ఆర్ ధన్‌రాజన్ కుటుంబానికి సాయం అందించేందుకు నిధుల సేకరణ కోసం ఈ మ్యాచ్‌ను నిర్వహించారు. ఈ ప్రమాదంలో గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించినట్టు పోలీసులు చెప్పారు. ఎవరు కూడా తీవ్రంగా గాయపడలేదని వెల్లడించారు. ఈ ఘటనపై పాలక్కాడ్ ఎంపీ వీకే శ్రీకందన్ మాట్లాడుతూ.. ‘మ్యాచ్ ప్రారంభానికి ముందు గ్యాలరీ కూలిపోవడం దురదృష్టకరం. ప్రాథమిక సమాచారం ప్రకారం ఎవరికి తీవ్ర గాయాలు కాలేదని తెలుస్తోంది. గాయపడినవారికి పోలీసులు, ఫైర్ సిబ్బంది, వాలంటీర్లు సాయం అందించారు’ అని తెలిపారు. -
‘వాళ్ల వల్లే నా భర్త చనిపోయాడు’
తిరువనంతపురం : ఉన్నత అధికారుల వేధింపుల వల్లే తన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడని కేరళకు చెందిన ఓ పోలీసు అధికారి భార్య ఆరోపించారు. గిరిజనులమైన కారణంగానే తమకు ఈ దుస్థితి పట్టిందని ఆవేదన చెందారు. అట్టాపడి ప్రాంతంలోని ఓ తండాకు చెందిన కుమార్ అనే వ్యక్తికి పాలక్కాడ్‌లోని ఆర్మ్డ్ విభాగంలో పోస్టింగ్ వచ్చింది. అయితే విధుల్లో చేరిన కుమార్ గత గురువారం ఓ రైల్వేట్రాక్ వద్ద శవమై తేలారు. ఘటనాస్థలంలో సూసైడ్ నోట్ లభించడంతో అతడు ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈ క్రమంలో కుమార్ పోస్టుమార్టం నివేదిక వెల్లడైన తర్వాతే పూర్తి వివరాలు వెలుగులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో తన భర్త మృతిపై స్పందించిన కుమార్ భార్య సాజిని మీడియాతో మాట్లాడారు. సూసైడ్‌లో నోట్లో ఉన్నది తన భర్త చేతిరాతే అని ఆమె స్పష్టం చేశారు. ఉద్యోగంలో చేరిన నాటి నుంచి ఉన్నత స్థాయి అధికారులు తన భర్తను వేధించేవారని ఆరోపించారు. ‘ నా భర్తను అకారణంగా పొట్టనబెట్టుకున్నారు. తనను వేధించిన అధికారుల పేర్లను ఆయన సూసైడ్ నోట్లో స్పష్టంగా రాశాడు. తన నేపథ్యం గురించి పై అధికారులు హేళనగా మాట్లాడేవారని నాతో చెప్పి తరచూ బాధపడేవాడు. ఇటీవలే ఆయన కొత్త క్వార్టర్‌కు మారాడు. ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయింది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం గురించి పాలక్కాడ్ ఎస్పీకి ఫిర్యాదు చేస్తానని సాజిని తెలిపారు. కాగా త్రిస్సూరు రేంజ్ డీఐజీ ఇప్పటికే ఈ కేసు దర్యాప్తునకై ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.