Male Pillion Riders Banned In Kerala Palakkad, Reason In Telugu - Sakshi
Sakshi News home page

Bike: బైక్‌పై ఇద్దరు పురుషులు ప్రయాణించరాదు.. ఎ‍క్కడో తెలుసా..?

Published Tue, Apr 19 2022 12:44 PM | Last Updated on Tue, Apr 19 2022 1:18 PM

Male Pillion Riders Banned In Kerala Palakkad - Sakshi

తిరువనంతపురం: ద్విచక్రవాహనంపై వెనుక సీటులో పురుషులు ప్రయాణించడంపై నిషేధం విధించారు. జిల్లా అదనపు కలెక్టర్‌ ఆదేశాల మేరకు కేరళలోని పాలక్కడ్‌లో ఈ రూల్‌ అమలులోకి వచ్చింది. కాగా, ఇటీవలే ఆర్​ఎస్ఎస్ కార్యకర్త హత్య కేసు నేపథ్యంలో ఈ నిబంధన విధించినట్టు తెలిపారు. తాజా నిషేధం నుంచి మహిళలు, చిన్నారులకు మినహాయింపును ఇచ్చారు. ఈ ఆదేశాలు ఏప్రిల్ 20వరకు అమల్లో ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. 

ఇంతకీ ఏం జరిగిందంటే.. ఈ నెల 15వ తేదీన ఆర్​ఎస్ఎస్ కార్యకర్త శ్రీనివాసన్​ షాపులో ఉండగా.. ఇద్దరు వ్యక్తులు వచ్చి దారుణంగా హత్య చేశారు. అయితే, పోలీసుల విచారణలో ఈ హత్య అదే రోజున ఎస్​డీపీఐ కార్యకర్త సుబెయిర్ హత్యకు ప్రతీకారంగానే జరిగినట్టు తెలిసింది. దీంతో ఒకే రోజులో ఇలా రెండు హత్యలు జరగడం స్థానికంగా కలకలం రేపింది. దీంతో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఈ రెండు హత్యలే కాక మరిన్ని మర్డర్లకు ప్లాన్స్‌ చేసినట్టు పోలీసులకు సమాచారాం అందింది. దీంతో అడిషన్​ డిస్ట్రిక్ట్​ మెజిస్ట్రేట్​.. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఈ రూల్‌ నుంచి పిల్లలు, మహిళలను మాత్రం మినహాయించారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement