ఒంట్లో బాగోలేదని డాక్టర్ వద్దకు పోతే పరీక్షలన్ని నిర్వహించి ఏవో మందులు రాసిస్తారు జౌనా!. ఐతే ఆ మందుల చీటి చూస్తే మనకేం అర్థం కాదు. చదువకున్న వాడికైనా కాస్త పరీశీలించి చూస్తే ఏదో కొంచెం అర్థమవుతుందే తప్ప ఒక పట్టాన అర్థమైతే కాదు. కేవలం మందుల షాపు వాడికి మాత్రమే అర్థమవుతుంది. ఐతే ఇక్కడో ఒక డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాసిన మందుల పేర్లు ఎవరైన ఈజీగా చదివేయొచ్చు. ఎందుకంటే అంత నీట్‌గా సులభంగా అర్థమైరీతీలో చాలా క్లియర్‌గా రాశాడు.
వివరాల్లెళ్తే...కేరళకు చెందిన డాక్టర్ నితిన్ నారాయణ పాలక్కడ్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో పీడియాట్రిక్(చిన్న పిల్లల డాక్టర్)గా పనిచేస్తున్నాడు. ఆయన గత మూడేళ్లుగా అక్కడే వైద్యుడిగా పనిచేస్తున్నాడు. తాను ఎంత బిజీగా ఉన్న ఇలానే బ్లాక్ లెటర్స్(క్యాపిటల్ లెటర్స్)లోనే రాస్తానని అంటున్నాడు. తాను బాల్యం నుంచే గుడ్ హ్యండ్ రైటింగ్ స్కిల్స్‌పై దృష్టిసారించినట్లు చెబుతున్నాడు.
మిగతా డాక్టర్లు బిజీగా ఉండటం వల్ల కుదరదని కానీ తనకు చిన్నప్పటి నుంచి ఇలా నీట్‌గా రాయడం అలవాటు కాబట్టి రాయగలుగుతున్నానని తెలిపాడు. ఆ డాక్టర్‌కి సంబంధించి ప్రిస్క్రిప్షన్ చీటి ఫోటో తీసి బెన్సీ అనే వ్యక్తి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడంతో నెట్టింట వైరల్ అయ్యింది. ఈ ఫోటో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహింద్రను కూడా ఆకర్షించింది. ఆయన కూడా ఈ వైరల్ ఫోటోని షేర్ చేస్తూ అతని విభిన్న విద్యా విధానాన్ని తేటతెల్లం చేస్తుంది. స్కూల్ లెవల్ నుంచి దృష్టి సారిస్తేనే ఇలా రాయగలం అంటూ ఆ డాక్టర్‌ని ట్విట్టర్‌లో ప్రశంసించారు.
(చదవండి: భావోద్వేగ దృశ్యం.. రాహుల్‌ను చూడటంతో వెక్కి వెక్కి ఏడ్చిన యువతి)
Comments
Please login to add a commentAdd a comment