riders
-
నీ సంబడం సంతకెళ్లి పోను
‘గుర్రపు స్వారీ’ అనే మాట మనకు కొత్తేమీ కాదు. అయితే ‘దున్నపోతు స్వారీ’ అనే మాట వింటే మాత్రం ‘సారీ’ అంటాం. ‘బుల్ రైడర్ 007’ కాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోలో హెల్మెట్ ధరించిన ఒక యువకుడు దున్నపోతుపై కూర్చొని రోడ్డుపై పరుగులు తీస్తుంటాడు. ఆన్లైన్ యూజర్ల తిట్లు, శాపనార్థాల సంగతి ఎలా ఉన్నా చాలా తక్కువ సమయంలోనే ఈ వీడియో వైరల్ అయింది. 8 మిలియన్లకు పైగా వ్యూస్‌ను దక్కించుకుంది. ఈ రైడర్‌తో సెల్ఫీలు దిగడానికి రోడ్డు పక్కన ఉన్న జనాలు పరుగెత్తుకు రావడం మరో వినోద విడ్డూరం. ‘నో పెట్రోల్–నో సర్వీస్–నో లైసెన్స్’లాంటి కామెంట్స్‌తో పాటు ‘ఇది జంతు హింస తప్ప మరొకటి కాదు’ ... లాంటి కామెంట్స్ కనిపించాయి. -
'వాలెంటైన్స్ డే' రోజు షాకివ్వనున్న డ్రైవర్లు, డెలివరీ బాయ్స్!
మెరుగైన వేతనం, మెరుగైన పరిస్థితుల కోసం వాలెంటైన్స్ డే సందర్భంగా టేక్అవే డెలివరీ డ్రైవర్లు సమ్మె (స్ట్రైక్) చేయాలని యోచిస్తున్నారు. ఇందులో భాగంగానే డెలివరూ, ఉబెర్ ఈట్స్‌తో సహా నాలుగు ఫుడ్ యాప్‌ల డ్రైవర్లు, రైడర్లు ఈ స్ట్రైక్‌లో పాల్గొంటారని సమాచారం. రేపు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఫుడ్-ఆర్డరింగ్ యాప్‌లలో పనిచేసే వేలమంది డెలివరీ వర్కర్లు ఈ సమ్మెలో పాల్గొంటారు. దీనికి సంబంధించి 'డెలివరీజాబ్ యూకే' ఇన్స్టాగ్రామ్ పేజీలో ఓకే పోస్ట్ చేశారు. ఇందులో చాలీచాలని వేతనాలకు నిరంతరాయంగా పని చేయడం కంటే మా హక్కుల కోసం కొన్ని గంటలు త్యాగం చేయడం చాలా అవసరమని వెల్లడించారు. స్ట్రైక్ చేయడానికి కారణం, 'ప్రతి రోజూ దోపిడీకి గురవుతూ, మా జీవితాలను పణంగా పెట్టి అలసిపోయాము. ఇది మా గొంతులను వినిపించాల్సిన సమయం వచ్చింది. మేము చేసే పనికి మాకు న్యాయమైన పరిహారం కావాలి' అని చెప్పడమే. డెలివరీ జాబ్ చేసే యూకే డ్రైవర్లు ప్రతి డెలివరీకి 2.80 పౌండ్స్ నుంచి 3.15 పౌండ్స్ మధ్య సంపాదిస్తారు. ఈ చెల్లింపు కనీసం 5 పౌండ్స్‌కు పెరగాలని కోరుకుంటున్నారు. యూకేలో మాత్రమే కాకుండా యూఎస్‌లో దాదాపు 1,30,000 మంది డ్రైవర్లు ఈ సమ్మెకు మద్దతు తెలియజేయనున్నట్లు జస్టిస్ ఫర్ యాప్ వర్కర్స్ తెలిపింది. ఇదీ చదవండి: ఈ స్కిల్ మీలో ఉంటే చాలు.. ఉద్యోగం రెడీ! View this post on Instagram A post shared by Delivery Job UK (@deliveryjobuk) -
సాదాసీదా క్యాబ్ డ్రైవరే కావొచ్చు.. ఓలా, ఉబెర్‌లకు గట్టిపోటీ ఇస్తున్నాడు!
ఓ సాదాసీదా క్యాబ్ డ్రైవర్ దేశీయ దిగ్గజ రైడ్ షేరింగ్ సంస్థలు ఓలా, ఉబెర్ గుత్తాదిపత్యానికి చెక్ పెడుతున్నాడు. చాపకింద నీరులా రైడ్ షేరింగ్ మార్కెట్‌ని శాసించే దిశగా వడిఒడిగా అడుగులు వేస్తున్నాడు. ఇంతకీ ఆ క్యాబ్ డ్రైవర్ ఎవరు? ఓలా, ఉబెర్ మార్కెట్‌ను తనవైపుకి ఎలా తిప్పుకుంటున్నాడు? చేతిలో వెహికల్ లేదు. అత్యవసరంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలి. ఆ సమయంలో మనం ఏం చేస్తాం. ఫోన్ తీసి వెంటే ఓలా, ఉబెర్‌తో పాటు ఇతర రైడ్ షేరింగ్ యాప్స్ ఓపెన్ చేసి అవసరానికి తగ్గట్లు బైక్, ఆటో, కారు ఇలా ఏదో ఒకటి బుక్ చేసుకుంటాం. సెకన్లు, నిమిషాల వ్యవధిలో సదరు క్యాబ్ డ్రైవర్ వచ్చి మనల్ని కోరుకున్న గమ్యానికి సురక్షితంగా వెళుతుంటారు. అలాంటి ఓ క్యాబ్ డ్రైవర్ సొంతంగా రైడ్ షేరింగ్ సంస్థను స్థాపించాడు. మార్కెట్లో కింగ్ మేకర్‌గా ఓలా, ఉబెర్‌లకు గట్టి పోటీ ఇస్తున్నాడు. Peak Bengaluru: Mr Lokesh my uber cab driver informed me that he has launched his own app to compete with uber and ola and already has more than 600 drivers on his app. Moreover, today they launched their IOS version for apple too. #Bengaluru #peakbengaluru@peakbengaluru pic.twitter.com/IGdiWItPG4 — The Bengaluru Man (@BetterBengaluro) December 20, 2023 600 మందికి పైగా డ్రైవర్లతో బెంగళూరు కేంద్రంగా ఒకప్పటి ఓలా, ఉబెర్‌లలో క్యాబ్ డ్రైవర్‌గా పని చేసిన లోకేష్ ‘నానో ట్రావెల్స్’ పేరుతో సొంతంగా స్టార్టప్‌ను ప్రారంభిచాడు. ఇప్పటికే ఆ సంస్థతో సుమారు 600పైగా డ్రైవర్లు భాగస్వామ్యమైనట్లు తెలుస్తోంది. డ్రైవర్ని కాదు.. ఓ కంపెనీకి బాస్‌ని ఈ తరుణంలో లోకేష్ నడుపుతున్న క్యాబ్‌ను బెంగళూరుకు చెందిన ఓ కస్టమర్ ప్రయాణించాడు. ప్రయాణించే సమయంలో కస్టమర్, నానో ట్రావెల్స్ ఓనర్ లోకేష్‌లు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అప్పుడే తాను క్యాబ్ డ్రైవర్ని కాదని, ఓలా,ఉబెర్ల తరహాలో నానో ట్రావెల్స్ పేరుతో ఓ స్టార్టప్‌ను ప్రారంభించినట్లు చెప్పాడు. అంతేకాదు నేటినుంచి యాపిల్ ఐఓఎస్ యూజర్లకు తమ సంస్థ యాప్‌ను అందుబాటులోకి తెచ్చామని, ఆ యాప్స్‌ను సొంతంగా డెవలప్ చేసింది తానేనని చెప్పడంతో ఆశ్చర్యపోవడం సదరు కష్టమర్ వంతైంది. అవసరం అయితే ఫోన్ చేయండి ఎయిర్‌పోర్ట్‌తో పాటు ఇతర అత్యవసర సమయాల్లో క్యాబ్ కావాల్సి ఉంటే ఫోన్ చేయమని కోరుతూ ఇరువురి ఒకరికొకరు ఇచ్చుపుచ్చుకున్నారు. లోకేష్ జరిపిన సంభాషణను కస్టమర్ ఎక్స్. కామ్‌లో ట్వీట్ చేయడం నెట్టింట్లో వైరల్‌గా మారింది. డ్రైవర్ నుంచి ఆంత్రప్రెన్యూర్‌గా ఆ ట్వీట్‌పై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఒక డ్రైవర్ నుంచి ఆంత్రప్రెన్యూర్‌గా ఎదుగుతున్నందుకు శుభాకాంక్షలు చెబుతుంటే రైడ్ షేరింగ్ మార్కెట్లో గట్టి పోటీ నెలకొంది. నిలబడడం కష్టమేనని అంటున్నారు. కొత్త సంస్థలు పుట్టుకు రావడం మంచిదే మరికొందరు ఉబెర్, ఓలా వంటి దిగ్గజ సంస్థ కొన్ని సార్లు ప్రయాణికులకు సౌకర్యవంతమైన, సమర్ధవంతమైన ప్రయాణాల్ని అందించలేవు. రైడ్ ధరలు ఎక్కువగా ఉండడంతో పాటు ఆ క్యాబ్ కోసం ఎదురు చూసే సమయం కూడా ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయాల్లో నానో ట్రావెల్స్ ఉపయోగం ఎక్కువగా ఉంటుందంటూ రిప్లయి ఇస్తున్నారు. చదవండి👉 రెండక్షరాల పేరు కోసం 254 కోట్లు చెల్లించిన ముఖేష్ అంబానీ! -
ఉబెర్ 'గ్రూప్ రైడ్స్' ఫీచర్: ఎగిరి గంతేస్తున్న రైడర్లు
Uber Group Rides feature క్యాబ్‌సేవల సంస్థ ఉబెర్ తనయూజర్ల కోసంకొత్త ఫీచర్‌ను లాంచ్ చేసింది. 'గ్రూప్ రైడ్స్' అనే కొత్త ఫీచర్‌ను (ఆగస్టు 22న) ఇండియాలో ప్రారంభించింది. దీని ప్రకారం ఒకే చోటుకు వెళ్లాల్సిన వేరు వేరు స్థానాల్లో ఉన్న యూజర్లకు ప్రయోజనం లభించనుంది. దీని ద్వారా గరిష్టంగా మరో ముగ్గురు వ్యక్తులతో ట్రిప్ షేరింగ్ ఆప్షన్ కల్పిస్తోంది. అంతేకాదు ఈ ఫీచర్ రోడ్లపై ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి కూడా తోడ్పడనుందని ఉబెర్ వెల్లడించింది. గ్రూప్ రైడ్స్ ఫీచర్ ఈ 'గ్రూప్ రైడ్స్' ఫీచర్‌ను ఉపయోగించే రైడర్లు తమ ఛార్జీలపై 30 శాతం వరకు ఆదా చేసుకునే అవకాశం ఉందని యాప్ ఆధారిత క్యాబ్ సర్వీస్ కంపెనీ తెలిపింది. (ఖచ్చితమైన తగ్గింపు వారు ఎంత మంది వ్యక్తులతో ఛార్జీలను పంచుకుంటారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది.) తమ ట్రిప్ వివరాలను మెసేజింగ్ యాప్‌ల ద్వారా పోస్ట్ చేయడం ద్వారా రైడ్ కోసం స్నేహితులను కూడా ఆహ్వానించవచ్చు. వీరు ట్రిప్‌లో చేరిన తర్వాత వారి స్వంత పికప్ స్థానాలను యాడ్ చేయవచ్చు. ఆ స్థానాలు రైడ్ రూట్లో అప్డేట్ చేసుకోవచ్చని ఉబెర్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడంతో పాటు, మరింత డబ్బు ఆదాతో పాటు, ఇబ్బంది లేని ప్రయాణాన్నిఅందించేలా ఈ ఫీచర్ కస్టమర్లకు అవకాశాన్ని కల్పిస్తుందని ఉబెర్ ఇండియా సెంట్రల్ ఆపరేషన్స్ డైరెక్టర్ నితీష్ భూషణ్ తెలిపారు. తద్వారా రోడ్డుపై వాహనాలను తగ్గించే అవకాశం రైడర్లకు కలుగుతుందన్నారు. ఈ ఫీచర్ ఎలా వాడాలి? ఉబర్ యాప్‌ను అప్డేట్ చేసుకోవాలి. యాప్ ఓపెన్ చేసి 'Services' ట్యాబ్‌ను ఎంచుకొని అందులో 'Group Rides' పై క్లిక్ చేయాలి. ఇక్కడ పికప్ లొకేషన్ ఎంటర్ చేయాలి. ఆ తరువాత నిర్దేశిత రైడర్లను (స్నేహితులను) ఎంచుకొని రైడ్‌లో జాయిన్ అవ్వమని వాట్సాప్ లింక్ సెండ్ చేస్తే చాలు. యాడ్ అయిన లొకేషన్ వివరాలు రైడ్‌లో యాడ్ అవ్వడంతోపాటు, ఈ సమాచారం డ్రైవర్‌కు కూడా అందుతుంది. -
Bike: బైక్‌పై ఇద్దరు పురుషులు ప్రయాణించరాదు.. ఎక్కడో తెలుసా..?
తిరువనంతపురం: ద్విచక్రవాహనంపై వెనుక సీటులో పురుషులు ప్రయాణించడంపై నిషేధం విధించారు. జిల్లా అదనపు కలెక్టర్ ఆదేశాల మేరకు కేరళలోని పాలక్కడ్‌లో ఈ రూల్ అమలులోకి వచ్చింది. కాగా, ఇటీవలే ఆర్ఎస్ఎస్ కార్యకర్త హత్య కేసు నేపథ్యంలో ఈ నిబంధన విధించినట్టు తెలిపారు. తాజా నిషేధం నుంచి మహిళలు, చిన్నారులకు మినహాయింపును ఇచ్చారు. ఈ ఆదేశాలు ఏప్రిల్ 20వరకు అమల్లో ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఈ నెల 15వ తేదీన ఆర్ఎస్ఎస్ కార్యకర్త శ్రీనివాసన్ షాపులో ఉండగా.. ఇద్దరు వ్యక్తులు వచ్చి దారుణంగా హత్య చేశారు. అయితే, పోలీసుల విచారణలో ఈ హత్య అదే రోజున ఎస్డీపీఐ కార్యకర్త సుబెయిర్ హత్యకు ప్రతీకారంగానే జరిగినట్టు తెలిసింది. దీంతో ఒకే రోజులో ఇలా రెండు హత్యలు జరగడం స్థానికంగా కలకలం రేపింది. దీంతో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఈ రెండు హత్యలే కాక మరిన్ని మర్డర్లకు ప్లాన్స్ చేసినట్టు పోలీసులకు సమాచారాం అందింది. దీంతో అడిషన్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్.. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఈ రూల్ నుంచి పిల్లలు, మహిళలను మాత్రం మినహాయించారు. -
Insurance: బేసిక్ పాలసీ సరిపోదు.. ఇవి కూడా ఉంటేనే లాభం
ఆరోగ్య బీమా ప్రతీ కుటుంబానికీ ఉండాలన్న అవగాహన విస్తృతమవుతోంది. ముఖ్యంగా కరోనా మహమ్మారి ప్రతాపంతో బీమా అవసరాన్ని చాలా మంది తెలుసుకున్నారు. ఊహించని పరిస్థితులు ఎదురైతే.. ఆస్పత్రుల్లో భారీ బిల్లుతో ఆర్థికంగా గుల్లవకుండా బీమా ప్లాన్ కాపాడుతుంది. అయితే, ఆరోగ్య బీమా అవసరమైనంత కవరేజీతో, సమగ్ర రక్షణతో ఉన్నప్పుడే అసలు లక్ష్యం సిద్ధిస్తుంది. కానీ, బేసిక్ పాలసీ ఒక్కటే సరిపోతుందా? అంటే సందేహమే. వ్యక్తులు తమ అవసరాలు, ఆరోగ్య చరిత్ర ఆధారంగా అదనపు రైడర్లను జోడించుకోవడం ద్వారా బీమా రక్షణను మరింత సమగ్రంగా మార్చుకోవచ్చు. ప్రమాద మరణం లేదా ప్రమాదంలో వైకల్యం, తీవ్ర అనారోగ్య పరిస్థితులు ఇలా భిన్నమైన సందర్భాల్లో ఆదుకునే రైడర్లను బేసిక్ హెల్త్ ప్లాన్లకు జోడించుకోవచ్చు. ఆ వివరాలే ఈ వారం కథనం. రైడర్ అన్నది అదనపు ప్రయోజనంతో కూడినది. సాధారణ హెల్త్ ప్లాన్లతోపాటు వీటిని తీసుకోవచ్చు. రైడర్ ద్వారా తక్కువ ప్రీమియంకే అదనపు రక్షణ సాధ్యపడుతుంది. ఈ రైడర్లు అన్నవి అందరికీ అన్నీ అవసరమవుతాయని కాదు. అవసరాలు అన్నవి భిన్నంగా ఉండొచ్చు. అందుకనే భిన్న రకాల రైడర్లు అందుబాటులో ఉన్నాయి. జీవిత బీమా కవరేజీని రైడర్ ద్వారా మరింత పెంచుకోవచ్చు. లేదంటే ప్రమాదంలో మరణిస్తే అదనపు పరిహారాన్నిచ్చే రైడర్‌ను తీసుకోవచ్చు. లేదంటే ప్రమాదం కారణంగా పాలసీదారు వైకల్యం పాలైనా పరిహారాన్నిచ్చే రైడర్‌ను అటు జీవిత బీమా పాలసీలతోనూ, ఇటు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలతోనూ కలిపి తీసుకోవచ్చు. క్రిటికల్ ఇల్నెస్ ఇలా ఎన్నో రైడర్లు ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల అనుకోని పరిణామం ఎదురైనా కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పాలు కాకుండా గట్టెక్కడానికి వీలుంటుంది. రైడర్ల వల్ల అంత ప్రయోజనం ఉంది. పాలసీదారులు అవసరమైన అదనపు కవరేజీలను అందుబాటు ప్రీమియంకు అందించడమే రైడర్ల ఉద్దేశ్యం. ఇక వైద్య రంగంలో ద్రవ్యోల్బణం సవాళ్లనూ రైడర్ల వల్ల అధిగమించే అవకాశం ఉంది. రూమ్ రెంట్ వెయివర్ రూమ్ రెంట్ వెయివర్ రైడర్ తీసుకున్నట్టయితే.. ఆస్పత్రిలో చేరినప్పుడు అందుబాటులో ఉన్న ఏ కేటగిరీ సదుపాయాన్నైనా తీసుకోవచ్చు. మరింత పరిమితి ఇచ్చే లేదంటే అసలు గది అద్దె పరిమితినే రద్దు చేసే రైడర్లు అందుబాటులో ఉన్నాయి. సాధారణ హెల్త్ ప్లాన్లలో స్టాండర్డ్ లేదా సెమీ ప్రైవేటు రూమ్లకే చెల్లింపులు చేసేలా నిబంధనలు ఉంటుంటాయి. లేదంటే రూమ్ రెంట్‌ను బీమా కవరేజీలో 1–2 శాతం పరిమితిగా విధిస్తుంటాయి. రూమ్ రెంట్ వెయివర్ రైడర్‌తో పాలసీదారులు తమకు ఇష్టమైన గదిని ఆస్పత్రిలో తీసుకోవచ్చు. హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ ఎక్కువ మంది పాలసీదారులు ఈ రైడర్‌ను ఎంపిక చేసుకుంటుంటారు. ఆస్పత్రిలో చికిత్స కోసం చేరినప్పుడు వైద్య పరమైన ఖర్చులే కాకుండా.. ఇతర ఖర్చులు కూడా కొన్ని ఎదురవుతుంటాయి. అటువంటి సందర్భాల్లో హాస్పిటల్ డైలీ క్యాష్ రైడర్ అక్కరకు వస్తుంది. వందల నుంచి వేల రూపాయల వరకు రోజువారీగా ఈ రైడర్ కింద పాలసీదారులకు కంపెనీలు చెల్లిస్లాయి. ఏ అవసరం కోసమైనా ఈ మొత్తాన్ని వినియోగించుకోవచ్చు. పాలసీలో కవరేజీ లేని వాటికి కంపెనీలు చెల్లింపులు చేయవు. అటువంటి వాటికి ఈ రైడర్ అవసరపడుతుంది. మెటర్నిటీ రైడర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లలో చాలా వరకు ప్రసవ ఖర్చులను చెల్లించే ఆప్షన్ రావు. కనుక పాలసీ తీసుకునే ముందే.. మేటర్నిటీ కవరేజీ ఉందేమో చూసుకోవాలి. లేకపోతే మేటర్నిటీ రైడర్‌ను తీసుకోవచ్చు. దీనివల్ల డెలివరీ కోసం ఆస్పత్రిలో చేరినప్పుడు అయ్యే వ్యయాలను కంపెనీయే చెల్లిస్తుంది. కాకపోతే ఈ రైడర్ తీసుకున్న నాటి నుంచి కనీసం 2–3 ఏళ్లపాటు వెయిటింగ్ పీరియడ్ అమలవుతుంది. అంటే ఆ తర్వాతే మేటర్నిటీ ఖర్చులను క్లెయిమ్ చేసుకోగలరు. అందుకే పెళ్లయిన వెంటనే ఈ రైడర్‌ను జోడించుకోవడం మంచిది. క్రిటికల్ ఇల్నెస్ కవర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌కు అదనంగా క్రిటికల్ ఇల్నెస్ కవరేజీని తీసుకోవడం ఎంతో అవసరం. మారిన జీవనశైలి, ఆహార నియమాల వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలను ఒక వయసు తర్వాత ఎదుర్కోవాల్సి వస్తోంది. కనుక క్రిటికల్ ఇల్నెస్ కవరేజీ ప్రతీ ఒక్కరికీ అవసరమే. దీన్ని అదనపు రైడర్‌గా తీసుకోవడం మంచిది. కేన్సర్ లేదా స్ట్రోక్ లేదా హార్ట్ ఎటాక్, మూత్రపిండాల వైఫల్యం ఇలా ఎన్నో క్లిష్టమైన అనారోగ్యాలకు కవరేజీని పొందొచ్చు. బీమా కంపెనీలు జాబితాలో పేర్కొనే ఏ క్రిటికల్ ఇల్నెస్ బారిన పడినా.. ఏక మొత్తంలో బీమా మొత్తాన్ని చెల్లిస్తాయి. వీటిని బెనిఫిట్ ప్లాన్లు అంటారు. అలా కాకుండా క్రిటికల్ ఇల్‌నెస్‌తో ఆస్పత్రిలో చేరినప్పుడు అయ్యే ఖర్చుల వరకే చెల్లింపులు చేసే ఇండెమ్నిటీ ప్లాన్లు కూడా ఉంటాయి. బెనిఫిట్ ప్లాన్‌ను (వ్యాధి నిర్ధారణతో చెల్లింపులు చేసేవి) తీసుకోవడం ఎక్కువ ప్రయోజనం. ఎందుకంటే తీవ్ర అనారోగ్యం కారణంగా పాలసీదారు మరణిస్తే.. నిలిచిపోయిన ఆదాయం, రుణాల చెల్లింపులకు ఆ పరిహారం ఉపయోగపడుతుంది. ఉదాహరణకు కేన్సర్ లేదా మూత్రపిండాల వైఫల్యం వెలుగు చూసిన తర్వాత.. మరణానికి మధ్య విరామం ఉంటుంది. ఆ సమయంలో ఆస్పత్రిలో చేరడం వల్లే కాకుండా ఇతర ఖర్చులు కూడా ఉంటాయి. మూత్రపిండాల వైఫల్యంలో డయాలసిస్ చేయించుకోవాల్సి ఉంటుంది. అందుకే ఏక మొత్తంలో చెల్లించేసే రైడర్లను హెల్త్ప్లాన్తో పాటు తీసుకోవాలి. కన్జ్యూమబుల్స్ కవర్ ఆస్పత్రుల్లో కన్జ్యూమబుల్స్కు అయ్యే వ్యయాలను బీమా కంపెనీలు చెల్లించవు. చికిత్సలో భాగంగా కొన్ని రకాల ఉత్పత్తులను రోగులకు వాడిన తర్వాత పడేస్తుంటారు. చేతి తొడుగులు, పీపీఈ కిట్లు, సర్జికల్ పరికరాలు ఇలాంటి కన్జ్యూమబుల్స్ చాలానే ఉంటాయి. బీమా కంపెనీలు మినహాయింపుల జాబితాలో కన్జ్యూమబుల్స్ గురించి వివరంగా పేర్కొంటాయి. వీటికి అయ్యే వ్యయాలను పాలసీదారే తన జేబు నుంచి పెట్టుకోవాల్సి ఉంటుంది. కన్జ్యూమబుల్స్ కవరేజీ తీసుకుంటే అప్పుడు వాటికయ్యే వ్యయాలన్నింటినీ కంపెనీయే చెల్లిస్తుంది. ఇది కూడా పాలసీదారులకు ఉపయోగపడే కవరేజీయే. వ్యక్తి ప్రమాద బీమా క్రిటికల్ ఇల్నెస్ మాదిరే పర్సనల్ యాక్సిడెంట్ (ప్రమాద బీమా) కవరేజీ కూడా ముఖ్యమైనదే. ప్రమాదంలో మరణించినట్టయితే సాధారణ బీమా కవరేజీకి అదనంగా ఈ మొత్తాన్ని కూడా కంపెనీ చెల్లిస్తుంది. ఒకవేళ ప్రమాదం వల్ల శాశ్వత వైకల్యం పాలైతే (పాక్షికం, పూర్తి) పరిహారాన్ని కూడా చెల్లిస్తాయి. నామమాత్రపు ప్రీమియానికే ఈ కవరేజీలు లభిస్తాయి. కనుక ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకునే వారు జీవిత బీమా ప్లాన్ లేదంటే హెల్త్ ఇన్సూరెన్స్ప్లాన్కు అనుబంధంగా ఈ రైడర్ తీసుకోవడం మర్చిపోవద్దు. ఒకవేళ రైడర్ లేకపోతే.. ఉదాహరణకు ప్రమాదం కారణంగా అంగవైకల్యం పాలైతే అప్పుడు మునుపటి మాదిరిగా జీవితం ఉండకపోవచ్చు. ఆదాయం లోటు ఏర్పడవచ్చు. ఈ పరిస్థితుల్లో రైడర్ ఆదుకుంటుంది. ఓపీడీ కవరేజీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లలో అధిక శాతం.. ఆస్పత్రిలో చేరడం వల్ల అయ్యే ఖర్చులనే చెల్లిస్తుంటాయి. ఔట్ పెషెంట్‌గా (ఓపీడీ) వెళ్లి తీసుకునే చికిత్సలకు కవరేజీ ఉండదు. అటువంటప్పుడు ఈ ఓపీడీ కవరేజీ సాయంగా నిలుస్తుంది. ఇది ఉంటే ఆస్పత్రిలో చేరకుండా డాక్టర్ వద్దకు వెళ్లి తీసుకునే చికిత్సలకు సైతం పరిహారం అందుకోవచ్చు. ఎన్సీబీ ప్రొటెక్షన్ ఒక ఏడాదిలో ఎటువంటి క్లెయిమ్ లేకపోతే నో క్లెయిమ్ బోనస్(ఎన్సీబీ)ను కంపెనీలు ప్రకటిస్తుంటాయి. తిరిగి క్లెయిమ్ ఎదురైతే అంతే పరిమా ణంలో అదనంగా ఇచ్చిన కవరేజీని కంపెనీలు తగ్గిస్తుంటాయి. క్లెయిమ్ చేసుకున్నా అప్పటికే ఎన్సీబీ రూపంలో ఇచ్చిన ప్రయోజనాన్ని కంపెనీలు ఉపసంహరించుకోకుండా ఈ రైడర్ కాపాడుతుంది. -
పోలీసులను బూతులు తిట్టాడు.. కారణం తెలిస్తే షాక్!
సాక్షి, చేవెళ్ల: హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతున్న వ్యక్తిని ఆపిన ట్రాఫిక్ పోలీసులపై ఓ వాహనదారుడు విరుచుకుపడ్డారు. పోలీసులు ప్రజల సమయాన్ని వృథా చేస్తున్నారని వాదించాడు. ఈ ఘటన చేవెళ్ల పీఎస్ పరిధిలోని షాబాద్ చౌరస్తాలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని చనువెళ్లి గ్రామానికి చెందిన సుధాకర్‌రెడ్డి హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్నాడు. అప్పటికే షాబాద్ చౌరస్తాలో రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. సుధాకర్‌రెడ్డి వాహనాన్ని ఆపారు. ఆయన వాహనాన్ని నిలుపకపోవడంతో పోలీసులు వెంబడించి అడ్డుకున్నారు. దీంతో ఆయన మీకు వాహనాలు ఆపి ప్రజల సమయం వృథా చేసే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించాడు. మీరంతా మా జీతగాళ్లు అంటూ వాదించాడు. పోలీసులను అసభ్య పదజాలంతో దూషించాడు. పోలీసుల విధులకు భంగం కలిగించినందుకుగాను సుధాకర్‌రెడ్డిపై చేవెళ్ల పీఎస్‌లో ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే పోలీసులతో సుధాకర్‌రెడ్డి వారించిన వీడియోలు సామాజికమాధ్యమాల్లో వైరల్ చేశారు. చదవండి: దారుణం: ఆసుపత్రి ఆవరణలో ఉమ్మొద్దు అన్నందుకు దాడి! -
మూణ్నాళ్ల ముచ్చటేనా..!
మంచిర్యాలరూరల్(హాజీపూర్) : ద్విచక్రవాహనం నడిపే సమయంలో హెల్మెట్ ధరించాలని పోలీసులు ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. లఘుచిత్రాల ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నారు. అయినా హెల్మెట్ పెట్టుకుంటే బరువని, హేర్‌స్టైల్ చెదిరిపోతుందని భావిస్తూ చాలామంది దానిని ధరించకుండానే వాహనాలు నడుపుతున్నారు. ఈ క్రమంలో ప్రమాదాలకు గురై ఎంతోమంది తమ విలువైన ప్రాణాలు కోల్పో తున్నారు. కుటుంబాలకు దూరమై తీరని దుఃఖాన్ని మిగిల్చుతున్నారు. గతంలో హెల్మెట్ వినియోగం చాలా వరకు అమలు జరిగినా పోలీసులు, రవాణాశాఖ అధికారులు రానురాను కొంత పట్టించుకోకపోవడంతో అదికాస్తా మూన్నాళ్ల ముచ్చటగా మారింది. ప్రత్యేక డ్రైవ్‌తో... గతంలో పోలీస్, రవాణాశాఖ అధికారులు సం యుక్తంగా హెల్మెట్ వినియోగాన్ని అమలు చేశా రు. సుప్రీంకోర్టు ఆదేశాలు అనుసరించి ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టి హెల్మెట్ ధరించని వాహనదారులపై కఠినంగా వ్యవహరించారు. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు పోలీస్స్టేషన్లకు వస్తే హెల్మెట్ లేకుండా రావద్దని ఫ్లెక్సీల ద్వారా ప్రచారం చేశారు. దీంతో కొంత హెల్మెట్ వినియోగంలో వాహన చోదకులు బాధ్యతగా తీసుకున్నారు. హెల్మెట్‌ను విధిగా ఉపయోగించారు. ప్రస్తుతం రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో హెల్మెట్ వినియోగం చాలా వరకు తగ్గిపోగా పోలీ సులు సైతం నామమాత్రంగా తీసుకుంటున్నారు. భారీ ఎత్తున జరిమానాలు... హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తున్న వారి సంఖ్య పెరిగిపోవడంతో నూతన రవాణ చట్టం అమలులోకి వచ్చింది. గతంలో హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడుపుతూ తనిఖీల్లో పట్టు పడితే రూ.500 నుంచి రూ.1000 వరకు జరిమానా విధించే వారు. ఇక ఇప్పుడు భారీగా జరిమానా విధించైనా సరే హెల్మెట్ వినియోగం తప్పనిసరి చేయాలని పోలీసులు భావిస్తున్నారు. నో హెల్మెట్–నో పెట్రోల్ నినాదం అమలు జరిపేలా చర్యలు తీసుకొనే విధంగా పోలీసులు చూస్తున్నారు. ఇక రవాణ శాఖాధికారులకు హెల్మెట్ లేకుండా పట్టుబడితే ఆ శాఖ నిబంధనలు ఉల్లంఘించినందుకు రూ.1వెయ్యితో పాటు హెల్మెట్ లేని కారణంగా మరో రూ. 100 మొత్తం కలిపి రూ.1,100 జరిమానా విధిస్తారు. అయితే ఇటీవల హెల్మెట్ వినియోగం తక్కువ అవుతున్న నేపథ్యంలో ఇకపై విస్తృత తనిఖీలు నిర్వహిస్తూ మరింత కఠినంగా వ్యవహరిస్తామని ఈ క్రమంలో వాహన చోదకులు హెల్మెట్ రోజూవారీగా ధరించేలా చూస్తామని రవాణ శాఖ సీనియర్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ గడ్డం వివేకానంద్‌రెడ్డి అన్నారు. ప్రాణాలు కోల్పోతున్నా... రహదారి ప్రమాదాల్లో 70శాతం మంది ద్విచక్రవాహనదారులు ఉంటున్నారు. ఇందులో 80 శాతం మంది హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తూ మృత్యువాత పడుతున్నారని గణంకాలు చెబుతున్నాయి. హెల్మెట్ లేకుండా వాహనం నడిపి రోడ్డు ప్రమాదాలకు గురైనప్పుడు కిందపడి తలకు బలమైన గాయాలు తగిలి ప్రాణాలు కోల్పోయే సంఘటనలే ఎక్కువగా ఉన్నాయి. 2016లో 222 ద్విచక్ర వాహన ప్రమాదాలు జరగగా 160 మంది మృతి చెందారు. మరో 150 మంది క్షతగాత్రులయ్యారు. 2017లో జరిగిన 236 ద్విచక్ర వాహనప్రమాదాల్లో 196 మంది మృతి చెందగా 145 మంది క్షతగాత్రులయ్యారు. ఇక 2018 మే నెల వరకు 95 ప్రమాదాలు జరగగా 80 మంది వరకు మృత్యువాత పడగా 50 మంది వరకు క్షతగాత్రులయ్యారు. కఠినంగా వ్యవహరిస్తాం... హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడిపితే కఠినంగా వ్యవహరిస్తున్నాం. జరిమానా తక్కువగా ఉండటం, తనిఖీల సమయాల్లో వాహనదారులు అప్రమత్తం కావడం వలన హెల్మెట్ వినియోగంపై నిర్లక్ష్యంగా వహిస్తున్నారు. రవాణ చట్టాలను కఠినంగా అమలు చేసి హెల్మెట్ వినియోగం తప్పనిసరి చేస్తాం. అవసరమైతే రవాణాశాఖా అధికారులతో కలిసి సంయుక్తంగా ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టి హెల్మెట్ వినియోగం పెంచడంతో పాటు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటాం. –జి.సతీశ్, ట్రాఫిక్ సీఐ, మంచిర్యాల -
క్షణికావేశంలో..
(వెబ్ ప్రత్యేకం) టైమ్ కావొస్తుంది. ఇప్పటికే లేట్ అయింది. తొందరగా గమ్యం చేరుకోవాలనుకుంటే విపరీతమైన ట్రాఫిక్. అడ్డదిడ్డంగా వెళుతున్న వాహన శ్రేణుల సందుల్లోంచి తొందరగా వెళ్లాలన్న తాపత్రయం. హైదరాబాద్ నగరంలో పెరిగిన వాహనాలతో ట్రాఫిక్ సమస్య నానాటికి తీవ్రమవుతోంది. తొందరగా వెళ్లాలనుకునే వాళ్లకు నరకం చూపిస్తున్న రోడ్లు వాహన దారుడిని మరింత తొందరపెడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇంట్లో నుంచో ఆఫీసు నుంచో అర్జెంట్ పనిమీద రోడ్డెక్కిన ప్రతి వాహన దారుడిదీ ఇదే సమస్య. ఆఫీసుకు వెళ్లాలన్నా... ఆస్పత్రికి వెళ్లాలన్నా... కాలేజీకి వెళ్లాలన్నా... కిరాణా కొట్టుకెళ్లాలన్నా... అన్ని సందర్భాల్లోనూ ఇదే పరిస్థితి. చెప్పలేని నరకం. ఆ పరిస్థితి చూసి తనలో తనకే చెప్పలేనంత కోపం. దానికి తోడు అడ్డదిడ్డంగా వెళుతున్న వాహన శ్రేణి వల్ల మరింత ఆవేశం. ఇరుకైన రోడ్లు. చెవులు చిల్లులు పడేంతగా హారన్ల జోరు. అడుగడుగునా సిగ్నల్. సిగ్నల్ పడిందంటే... అడ్డదిడ్డంగా తోసుకొచ్చే వాహనాలు. ఒక వాహనం ఇంకో వాహనాన్ని రాసుకుంటూ వెళ్లడం. ఒక్కో అడుగు ముందుకు పడుతున్నట్టు లేదా ఒకరిపై ఇంకొకరు తోసుకుంటున్నట్టు... ఎంతో బలవంతంగా కదులుతున్న ట్రాఫిక్. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైనా అర్జెంట్ పనుంటే ఇంతే సంగతులు. నగరంలో ప్రతి వాహన దారుడిదీ ఇదే పరిస్థితి. దాంతో ఎక్కడాలేని చికాకు. ఆవేశం. అత్యవసర పనులమీద వెళ్లాలనుకునే వారిలో ఉండే కోపం ఇక చెప్పక్కరలేదు. హైదరాబాద్ ఒక్కటే కాదు. దేశంలోని మహానగరాల్లో ఎక్కడ చూసినా ఈ పరిస్థితే. ముందస్తు ప్లాన్ లేకుండా రోడ్డెక్కితే రోడ్లపై దుమ్ము దూళితో పాటు మిగతా వాహనాల అంతరాయాలతో చికూచింత మరింత పెరుగుతుంది. ఒక్కోసారి ఒకరినొకరు దూషించుకుంటూ వాహనదారు ఆవేశంతో ఊగిపోతున్న దృశ్యాలు ప్రతి రోడ్డులోనూ కనిపిస్తాయి. పరస్పరం బీపీలు పెంచుకుని కొట్టుకుని పోలీస్ స్టేషన్ల వరకు వెళ్లిన అనేక సందర్భాలు చూస్తుంటాం. ఆటో, కారు, టు వీలర్, బస్సు, లారీ... ఎవరైనా సరే. ఇలాంటి సందర్భాల్లోనే వాహన దారులకు ఓపిక, సహనం ఎంతో అవసరం. క్షణికావేశానికి వెళ్లడం వల్ల అనవసరమైన అనేక ఇబ్బందులను కొని తెచ్చుకుంటున్న సందర్భాలు ఇటీవలి కాలంలో తరచూ సంభవిస్తున్నాయి. తాను వెళ్లాల్సిన రోడ్డు మూల మలుపులో మరో కారు అడ్డంగా నిలిపాడన్న కారణంగా ఇరు వాహనదారుల మధ్య గొడవ ఏ స్థాయికి వెళ్లిందో ఒక్కసారి ఈ కింద ఇచ్చిన వీడియో చూస్తే తెలుస్తుంది. చిన్న చిన్న సంఘటనలు కూడా ఒక్కోసారి వాహనాలు నడిపే వారి మధ్య కోపతాపాలు తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయడానికి ఇటీవల హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 1 లో జరిగిన ఒక సంఘటన ఇది. ప్రధాన మార్గం నుంచి ఒక వాహనదారుడు సందులాంటి మరో రోడ్డులోకి వెళుతున్న దశలో మూల మలుపు వద్ద అడ్డంగా ఆగిఉన్న వాహనం తీవ్ర ఆవేశాన్ని తెప్పించింది. అంతే... హారన్ కొట్టడం.. అప్పటికి అవతలి నుంచి స్పందన రాకపోయేసరికి ఇంకేం... నోటికి పనిచెప్పాడు. ఇతనేదో అన్నాడని, కారులో ఉన్న వ్యక్తి కిందకు దిగి ఒకరినొకరు దూషించుకోవడం మొదలైంది. అంతటితో ఆగిందా అంటే అదీ లేదు. వారు వెళ్లాల్సిన గమ్యం గురించి మరిచిపోయారు. ఒకరినొకరు తిట్టుకోవడం తీవ్రస్థాయికి చేరుకుంది. ఆవేశకావేశాలతో పరస్పరం ఊగిపోయారు. అంతే ఆవేశంతో ఒక వ్యక్తి పక్కనే ఉన్న పెద్ద బండరాయి ఎత్తి అవతలివాడిపై వేసేందుకు సిద్ధపడ్డాడు. అవతలివాడు తానేం తక్కువ తినలేదన్నట్టు వెంటనే తన కారులోంచి పెద్ద ఇనుప రాడ్ ను బయటకు తీశాడు. నీ అంతు చూస్తా... అంటూ పైపైకి వచ్చాడు. జనం మాత్రం ఎవరి పనిలో వారున్నట్టు ఏదో వింత సినిమా చూస్తున్నట్టు... సస్పెన్స్ కు ఎలా తెరపడుతుందా అని ఆతృతగా చూస్తున్నారు. ఒకరి చేతిలో ఐదారు కిలోల బరువున్న పెద్ద బండరాయి... మరొకరి చేతిలో ఇనుప రాడ్డు. ఆవేశంగా ఊగిపోయారు. రాడ్డు కింద పడేయ్... అంటుండగా, ఆ వ్యక్తి రాయిని కింద పడేసినప్పటికీ తన వద్ద కత్తి ఉందంటూ ఒరలోంచి కత్తిని బయటకు తీశాడు. ఇంతలో పక్కనే ధైర్యం చేసిన ఒక వ్యక్తి కాస్తా ముందుకొచ్చి జో హోగయా... హోగయా.. భయ్... చలో చలో... అంటూ చల్లార్చే ప్రయత్నం. అంతే.. దాంతో వాళ్లిద్దరు తీవ్రస్థాయి ఆవేశం నుంచి కొంచెం తగ్గి ఆయుధాలను కింద పడేసి కొద్దిసేపు మాటల యుద్దం కొనసాగించి ఎవరి దారిలో వారు వెళ్లిపోయారు. ఆ సందర్భంలో క్షణికావేశానికి లోనై ఉంటే... పరస్పరం దాడులకు దిగి ఉంటే ఏం జరిగేది. అర్జెంటుగా వెళ్లాల్సిన వ్యక్తులు అసలు పని మరిచిపోయి తమ ఆవేశం నెగ్గడానికి చేసిన ప్రయత్నంలో పెనుగులాటలో జరగరానిది ఏదైనా జరిగితే. నిజానికి ఇలాంటి సంఘటనలు నిత్యం ఎక్కడో ఒకచోట చోటుచేసుకుంటూనే ఉన్నాయి. వాహనదారులు.. ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇక్కడ గమనించాల్సిందేమంటే... ఆ ఒక్క క్షణంలో కనుక ఏదైనా జరగరానిది జరిగి ఉంటే. ఆవేశంలో వాళ్లిద్దరి మధ్య ఉన్న ఆయుధాలు మామూలు ప్రమాదానికి కాదు... ఏకంగా ప్రాణాలమీదకు రావొచ్చు. అందుకే... ఈ మహానగరంలో ప్రయాణం విషయంలో ఒకరినొకరు అర్థం చేసుకుంటూ కాస్త మీకోసం ఇంట్లో ఎదురుచూసే వాళ్లను దృష్టిలో పెట్టుకొని ముందుకు కదలండి. -
రైడర్లతో బహుళ ప్రయోజనాలు
బీమా రంగంలో తరచూ వినిపించే పదాల్లో ‘రైడర్’ ఒకటి. ఉదాహరణకు ఐదు లక్షల రూపాయల ఒక ప్రధాన బీమా పాలసీ మొత్తానికి రూ.2,000 వేలు చెల్లించాలనుకుంటే, అదనంగా మరికొంత అతి స్వల్ప మొత్తం చెల్లించి మరో ఐదు లక్షల బీమా పొందగల సౌలభ్యం ఇందులో ఉంటుంది. అంటే ఒక ప్రాథమిక పాలసీకి అనుబంధంగా స్వల్ప మొత్తం చెల్లింపుల ద్వారా ఎన్నో రకాల ప్రయోజనాలు పొందే అవకాశాన్ని రైడర్లు పాలసీదారుకు కల్పిస్తున్నాయి.యాక్సిడెంట్ డెత్ అడిషనల్ కవర్, డిజేబిలిటీ కవర్, క్రిటికల్ ఇల్నెస్ కవర్, హాస్పిటలైజేషన్ కవర్ వంటి పలు అదనపు ప్రయోజనాలను రైడర్ల ద్వారా పొందవచ్చు. ఐచ్ఛికాలు.. మీ లైఫ్‌స్టైల్‌కు అనుగుణంగా రైడర్లు ఏవి తీసుకుంటే ప్రయోజనమన్న విషయాన్ని మీరే నిర్ణయించుకునే వీలు మీకుంటుంది. మీ బేస్ బీమా పాలసీ ప్రయోజనాలకు అదనంగా నాణ్యతాపూర్వక, పరిమాణాత్మకమైన లబ్ధిని చేకూర్చడానికి ఇది దోహదపడుతుంది. పలు కాంబినేషన్లలో రైడర్లు లభ్యమవుతుంటాయి. ఉదాహరణకు అవీవా లైఫ్‌లాంగ్ పాలసీని తీసుకుందాం. ఇందులో బేసిక్ జీవిత బీమా పాలసీకి మూడు రకాల రైడర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రమాదవశాత్తు మరణం, అంగవైకల్యం (ఏడీఅండ్డీ), కేన్సర్, గుండెపోటు, అంగ వైఫల్యం వంటి తీవ్ర అస్వస్థత, ప్రమాదం లేదా ఏదైనా వ్యాధి వల్ల మొత్తంగా శాశ్వత అంగవైకల్యం (సీఐఅండ్పీటీడీ), ఆసుపత్రి వ్యయాల ప్రయోజనాలు (హెచ్‌సీబీ) వీటిలో ఉన్నాయి. స్వల్ప ప్రీమియంలు... బేస్ పాలసీ ప్రీమియంలతో పోల్చితే, రైడర్లపై ప్రీమియంలు కూడా అతి స్వల్పంగా ఉంటాయి. ఇక బేసిక్ పాలసీ కాల వ్యవధితో సమానంగా రైడర్లను తీసుకోవాల్సిన పనిలేదు. అంటే వీటిని బేసిక్ పాలసీ ఉన్నన్నాళ్లూ కొనసాగించుకోవాల్సిన అవసరం లేదన్నమాట. మీ బీమా అవసరాలకు, ఎప్పటిక ప్పటి ప్రయోజనాలకు కాలానుగుణంగా రైడర్లు తీసుకోవచ్చు. మరో మాటలో చెప్పాలంటే- బీమా రైడర్ ప్రయోజనాన్ని మొబైల్ ఫోన్ రీచార్జ్‌కి ఎక్స్ట్రా టాపప్‌గా పరిగణించవచ్చు. బేసిక్ ప్రయోజనాలకు మరింత అదనపు ప్రయోజనాన్ని ఇక్కడ పాలసీదారుకు రైడర్ అందిస్తుంది. విభిన్న రూపాలు... బీమా కంపెనీలు రైడర్లను వివిధ రూపాల్లో ఆఫర్ చేస్తున్నాయి. యాక్సిడెంటల్ రైడర్స్, హెల్త్ రైడర్స్, టర్మ్ రైడర్స్, ప్రీమియం రద్దు రైడర్స్, పన్నుల భారాలు తగ్గించుకోవడం... ఇలా వివిధ రూపాల్లో పాలసీదారుకు ఇవి అందుబాటులో ఉంటాయి. వయసు, అవసరాలు, జీవన శైలి, లైఫ్‌స్టైల్ అలవాట్లు, వంశపారంపర్యంగా వచ్చే వ్యాధులు... ఇలా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని అందుకు అనుగుణమైన అమిత బీమా ప్రయోజనాలను పొందడానికి రైడర్లు దోహదపడతాయి. రెగ్యులర్ బీమా పాలసీ తీసుకునే ముందు కస్టమర్ ఈ రైడర్లపైనా తప్పనిసరిగా దృష్టి పెట్టాలన్నది ముఖ్య సలహా. -
దయతో బెయిల్ ఇవ్వండి
న్యూఢిల్లీ: నాలుగు నెలలుగా తీహార్ జైలులో నిర్బంధంలో ఉన్న తనకు ‘దయతో’ తాత్కాలిక బెయిల్ మంజూరు చేయాలని సహారా చీఫ్ సుబ్రతారాయ్ శుక్రవారం సుప్రీంకోర్టును అభ్యర్థించారు. తద్వారా గ్రూప్ ఆస్తులను విక్రయించి రెగ్యులర్ బెయిల్‌కు సంబంధించి మార్కెట్ రెగ్యులేటర్- సెబీ వద్ద డిపాజిట్ చేయాల్సిన రూ.10,000 కోట్ల సమీకరించడానికి వీలుకలుగుతుందని వివరించారు. దీనిపై న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తన ఉత్తర్వులను రిజర్వ్ చేసుకుంది. ఐటీ అఫిడవిట్‌కు 2 వారాల గడువు... కాగా కేసుకు సంబంధించి గ్రూప్ కంపెనీలు తనకూ రూ.7,000 కోట్ల పన్ను చెల్లింపులు జరపాల్సి ఉందని ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. ఈ వివరాలు తెలుపుతూ రెండు వారాల్లో ఒక అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది. -
ఆస్తులు అమ్ముకుంటాం.. పెరోల్ ఇవ్వండి
న్యూఢిల్లీ: ఆస్తుల విక్రయానికి వీలు కల్పిస్తూ తనకు కనీసం 40 రోజుల పెరోల్ మంజూరు చేయాలని సహారా చీఫ్ సుబ్రతారాయ్ సుప్రీంకోర్టును గురువారం కోరారు. నిబంధనలకు వ్యతిరేకంగా మదుపుదారుల నుంచి సహారా గ్రూప్‌నకు చెందిన రెండు సంస్థలు డబ్బు వసూలు చేసిన కేసులో గత 4 నెలలుగా ఆయన తీహార్ జైలులో కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన బెయిల్‌కు రూ.10,000 కోట్లు కట్టాలని కోర్టు షరతు విధించింది. ఈ నిధుల సమీకరణకు వీలు కల్పించాలని ఇప్పటికే సహారా చీఫ్ పలు ప్రతిపాదనలతో కోర్టు ముందుకు వచ్చారు. వీటిని సుప్రీం తోసిపుచ్చింది. ప్రస్తుత పెరోల్ విజ్ఞప్తి ఈ దిశలో తాజాది. న్యూయార్క్, లండన్లలో లగ్జరీ హోటళ్లను విక్రయిస్తామని సహారా పేర్కొంది. అయితే విదేశాల్లో ఉన్న ఆస్తుల విక్రయానికన్నా ముందు దేశీయంగా ఉన్న ఆస్తులను మొదట ఎందుకు విక్రయించకూడదని జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సహారా న్యాయవాది రాజీవ్ ధావన్‌ను ప్రశ్నించారు. దీనికి ధావన్ సమాధానం ఇస్తూ, తద్వారా రూ.5,000 కోట్ల సమీకరణ కష్టమని వివరించారు. ఈ పరిస్థితుల్లో న్యూయార్క్‌లోని డ్రీమ్ డౌన్‌టౌన్, ప్లాజా హోటళ్లను, అలాగే లండన్‌లోని గ్రాస్‌వీనర్ హౌస్‌ను తొలుత విక్రయించాలని భావిస్తున్నట్లు తెలిపారు. దీనితో... ఒకవేళ విదేశాల్లోని ఆస్తుల విక్రయింపు ప్రక్రియ పర్యవేక్షణ ఎలా అన్న విషయంలో సలహాలను ఇవ్వాలని మార్కెట్ రెగ్యులేటర్ సెబీని బెంచ్‌కు సూచించింది. కేసు తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఐటీ షాక్... మరోవైపు గ్రూప్ చెల్లించాల్సిన పన్నుల విషయంలో ఆదాయపు పన్నుల (ఐటీ) శాఖ కూడా రంగంలోకి దిగింది. పన్నుగా సంస్థ రూ.7,000 కోట్లు చెల్లించాలని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. విచారణలో భాగంగా తమ వాదనలూ వినాలని కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఆదాయపు పన్నుకు సంబంధించి ఐటీ చేసిన వాదనను తిరస్కరిస్తున్నట్లు తెలిపారు. దీనిని కంపెనీ అప్పిలేట్ ట్రిబ్యునల్‌లో సవాలు చేస్తుందని తెలిపారు. -
ఇన్ఫీ ఆదాయాన్ని మూర్తి పెంచారు: కామత్
విశాల్ మరింత వృద్ధి సాధిస్తారని వ్యాఖ్య న్యూఢిల్లీ: ఇన్ఫోసిస్ ఆదాయాన్ని పెంచడంలో కంపెనీ సహవ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సఫలీకృత ం అయ్యారని నాన్‌ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కేవీ కామత్ పేర్కొన్నారు. కొత్త సీఈవోగా ఎంపికైన విశాల్ శిక్కా భవిష్యత్‌లో కంపెనీని మరింత వృద్ధిబాటన నడిపిస్తారని అభిప్రాయపడ్డారు. ఇన్ఫోసిస్ ప్రస్తుత సీఈవో శిబూలాల్ నుంచి శిక్కా ఆగస్ట్‌లో బాధ్యతలను స్వీకరించనున్నారు. కంపెనీ వ్యవస్థాపకులు లేదా ఎగ్జిక్యూటివ్‌ల నుంచి కాకుండా ఇతర సంస్థలో బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తిని ఇన్ఫోసిస్ సీఈవోగా ఎంపిక చేయడం ఇదే తొలిసారికావడం గమనార్హం. కాగా, ఇన్ఫీని గాడిలో పెట్టేందుకు రెండోసారి అత్యున్నత పదవీ బాధ్యతలు చేపట్టిన నారాయణమూర్తి అమ్మకాలు పెంచడంపై దృష్టిపెట్టారని, ఇకపై శిక్కా ఈ ఎజెండాను ముందుకు తీసుకువెళతారని కామత్ వ్యాఖ్యానించారు. గతేడాది జూన్‌లో ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా మూర్తి పదవీ బాధ్యతలను చేపట్టిన విషయం విదితమే. సానుకూల ధృక్పథంతోనే విజయాలను సాధించగలమని, ఇన్ఫోసిస్‌ను తాను ఈ దృష్టితోనే చూస్తానని చెప్పారు. నారాయణమూర్తి ఈ నెల 14న ఇన్ఫోసిస్‌ను వీడారు. 1981లో ఆవిర్భవించిన ఇన్ఫోసిస్ 8 బిలియన్ డాలర్ల(రూ. 48,000 కోట్లు) కంపెనీగా నిలిచింది. -
ఇన్ఫోసిస్‌లో 12వ వికెట్
కంపెనీ గ్లోబల్ హెడ్ ప్రసాద్ నిష్ర్కమణ బెంగళూరు: భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో సీనియర్ అధికారుల నిష్ర్కమణ కొనసాగుతోంది. తాజాగా కంపెనీ గ్లోబల్ హెడ్(సేల్స్ అండ్ మార్కెటింగ్) ప్రసాద్ త్రికూటం గురువారం ఇన్ఫోసిస్ నుంచి వైదొలిగారు. కొత్తగా సీఈవో ఎంపిక కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా ఇన్ఫోసిస్ కార్యకలాపాలను కూడా చూసే ప్రసాద్ రాజీనామా చేయడం గమనార్హం. ఈయన బాధ్యతలను కంపెనీ ప్రస్తుత అధ్యక్షుడు, బోర్డ్ సభ్యుడు కూడా అయిన యు.బి. ప్రవీణ్‌రావు చూస్తారని ఇన్ఫోసిస్ ప్రతినిధి పేర్కొన్నారు. గతంలో ప్రసాద్ ఎనర్జీ, యుటిలిటీస్, కమ్యూనికేషన్స్ విభాగానికి అధినేతగా పనిచేశారు. ఇన్ఫోసిస్‌కు సీఈవో కానున్నారని ఊహాగానాలున్న బి.జి. శ్రీనివాస్ రాజీనామా చేసిన వారం రోజుల్లోనే ప్రసాద్ వైదొలగుతున్నారు. ఇలా అయితే కష్టమే.. కాగా నారాయణ మూర్తి మళ్లీ ఇన్ఫోసిస్‌లో చేరిన ఏడాది కాలంలో కంపెనీ నుంచి ఇప్పటిదాకా 12 మంది సీనియర్ అధికారులు రాజీనామా చేశారు. అశోక్ వేమూరి, వి. బాలకృష్ణన్, బసాబ్ ప్రధాన్, చంద్రశేఖర్ కకాల్, స్టీఫెన్ ప్రట్ వంటి ఉద్దండులు కంపెనీని వీడిపోయారు. సీనియర్ ఆధికారులే కాకుండా, సీనియర్ ఉద్యోగులు కూడా కంపెనీ నుంచి వైదొలుగుతున్నారని, ఇలా అయితే కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్న ఆదాయాన్ని ఆర్జించలేకపోవచ్చని పలు బ్రోకరేజ్ సంస్థలు పెదవి విరుస్తున్నాయి. ఆవేక్ష టెక్నాలజీస్‌లో ఇన్ఫీ ‘బాల’ న్యూఢిల్లీ: ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ వి.బాల కృష్ణన్ అవేక్ష టెక్నాలజీలో చేరారు. తమ కంపెనీ సలహా మండలి సభ్యుడిగా బాలకృష్ణన్‌ను నియమించుకున్నామని అవేక్ష టెక్నాలజీస్ పేర్కొంది. బెంగళూరు కేంద్రంగా పనిచేసే ఈ సంస్థను కొందరు ఇన్ఫోసిస్ మాజీ ఉద్యోగులే స్థాపిం చారు. ఈ కంపెనీ ఐటీ కన్సల్టింగ్, సొల్యూషన్స్ సర్వీసులను అందిస్తోంది. బాలకృష్ణన్ గత ఏడాది డిసెంబర్లో ఇన్ఫోసిస్ నుంచి వైదొలిగారు. ఇటీవల ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తరపున ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు. -
పీఎస్‌యూలకు భారీ రుణాలు వద్దు
ముంబై: ప్రభుత్వ రంగ సంస్థ(పీఎస్‌యూ)లకు భారీ రుణాలు మంజూరు చేయవద్దని అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులను రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ఆదేశించింది. స్వల్ప, మధ్యతరహా ఆదాయ వర్గాలకు మేలు చేయడమే ఈ బ్యాంకుల రుణాల ముఖ్యోద్దేశమని ఉద్ఘాటించింది. పీఎస్‌యూలకు పట్టణ సహకార బ్యాంకులు భారీ లోన్లు ఇస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని ఆయా బ్యాంకులకు బుధవారం పంపిన సమాచారంలో ఆర్బీఐ తెలిపింది. స్వల్ప, మధ్యతరహా ఆదాయ వర్గాలు, రైతులు, చిన్నతరహా వ్యాపారుల రుణ అవసరాలు తీర్చడమే అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల ప్రధాన కర్తవ్యమని స్పష్టం చేసింది. కేంద్ర బ్యాంకులు సంఘటితం కావాలి: రాజన్ ద్రవ్య విధానాల్లో వివిధ దేశాల కేంద్ర బ్యాంకుల మధ్య మరింత సహకారం అవసరమని ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ చెప్పారు. పెద్ద దేశాల విధానాలు వర్ధమాన మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపడాన్ని నివారించేందుకు ఆయా దేశాల్లోని కేంద్ర బ్యాంకులు సంఘటితం కావాల్సి ఉందన్నారు. బ్యాంక్ ఆఫ్ జపాన్ బుధవారం టోక్యోలో ఏర్పాటు చేసిన సదస్సులో రాజన్ ప్రసంగించారు. ద్రవ్య విధానాలపై ఇతర దేశాల స్పందననూ పరిగణనలోకి తీసుకోవాలన్నారు. అంతర్జాతీయ ద్రవ్య విధానానికి ఎలాంటి పద్ధతీ లేకపోవడం ప్రగతికి, ద్రవ్యరంగానికి ముప్పుగా పరిణమిస్తుందని అభిప్రాయపడ్డారు. -
క్రికెట్ టీమ్ యజమానుల్లో అత్యంత సంపన్నుడు ముకేశ్
న్యూఢిల్లీ: దేశీయ క్రికెట్ జట్ల యజమానుల్లో అత్యంత సంపన్నుడు ముకేశ్ అంబానీ. రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ, ముంబై ఇండియన్స్ టీమ్ ఓనరైన ఆయన నెట్‌వర్త్ 2,120 కోట్ల డాలర్లు. వెల్త్-ఎక్స్ అనే గ్లోబల్ వెల్త్ ఇంటెలిజెన్స్ కంపెనీ ఈ విషయం తెలిపింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కళానిధి మారన్ 220 కోట్ల డాలర్ల నెట్‌వర్త్‌తో ద్వితీయ స్థానంలో నిలిచారు. సుమారు 64 కోట్ల డాలర్ల నెట్‌వర్త్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓనర్ విజయ్ మాల్యా మూడో స్థానంలో, 60 కోట్ల డాలర్ల నెట్‌వర్త్‌తో కోల్‌కతా నైట్ రైడర్స్ యజమాని షారుఖ్ ఖాన్ నాలుగో స్థానంలో ఉన్నారు. ఈ జాబితాలో మిగిలిన వారు: గ్రంథి మల్లికార్జున రావు (ఢిల్లీ డేర్ డెవిల్స్, నెట్‌వర్త్ 27 కోట్ల డాలర్లు), మనోజ్ బడాలే (రాజస్థాన్ రాయల్స్, 16 కోట్లు), నారాయణస్వామి శ్రీనివాసన్ (చెన్నై సూపర్ కింగ్స్, 7 కోట్లు), ప్రీతీ జింటా (కింగ్స్ లెవన్ పంజాబ్, 3 కోట్ల డాలర్లు). -
వీటిని గమనించాల్సిందే..
జీవిత బీమా ప్రాధాన్యంపై దేశంలో అవగాహన పెరుగుతోంది. రిస్క్ కవరేజీ, దీర్ఘకాలిక పొదుపు, పన్ను ప్రయోజనాలు - ఈ మూడింటినీ సమకూర్చేది జీవిత బీమా మాత్రమే. తాము కొనుగోలు చేస్తున్న పాలసీల గురించి ప్రజలు క్షుణ్నంగా తెలుసుకోవడం ఎంతైనా అవసరం. అవి మనకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరుస్తాయనే అంశం పాలసీ డాక్యుమెంట్లలో వివరంగా ఉంటుంది. పాలసీ పత్రాలు మీ చేతికి అందగానే పరిశీలించాల్సిన పది ముఖ్యమైన అంశాలు ఇవీ; వ్యక్తిగత వివరాలు... క్లెయిమ్‌లను పరిష్కరించే సమయంలో వ్యక్తిగత వివరాలు కీలక పాత్ర పోషిస్తాయి. కనుక, పాలసీ డాక్యుమెంట్లలోని మీ వివరాలు అంటే పేరు, వయసు తదితరాలు సరిగా ఉన్నాయా అనేది పరిశీలించాలి. వ్యక్తిగత అలవాట్లు, ఆరోగ్యం వివరాలు కూడా కరెక్టుగా ఉన్నాయో లేదో చూడాలి. ఒకవేళ ఈ వివరాలు సరిగా లేని పక్షంలో క్లెయిమ్ తిరస్కారానికి గురయ్యే అవకాశాలు హెచ్చుగా ఉన్నాయి. ప్రయోజనాలను చూడండి.. దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా జీవిత బీమా పాలసీ ఉండాలి. పాలసీ కొనుగోలు సమయంలో ఇచ్చిన హామీలు పాలసీ డాక్యుమెంట్లలో ఉన్నాయా అనేది తనిఖీ చేయాలి. బీమా చేసిన మొత్తం, ప్రీమియం, ప్లాన్ ఫ్లెక్సిబిలిటీ తదితరాలను గమనించాలి. రైడర్లను గమనించాలి... జీవిత బీమాతో పాటు ఇతర రకాల అత్యవసరాల కోసం మీరు యాడ్ ఆన్ కవర్స్(రైడర్లు)ను కొనుగోలు చేసి ఉండవచ్చు. వీటిని పాలసీ డాక్యుమెంట్లో చేర్చారా అనే విషయాన్ని పరిశీలించండి. పాలసీలో రైడర్లను చేర్చకపోతే, తీవ్ర అస్వస్థతకు గురై క్లెయిమ్ చేసిన సమయంలో నిరాశ ఎదురుకావచ్చు. చెల్లింపుల వ్యవధి... మీ అవసరాలు, లక్ష్యాలకు అనుగుణంగా ప్రీమియంను ఎంతకాలం చెల్లించేదీ ముందుగానే నిర్ణయించుకుని ఉంటారు. ప్రీమియంలను మూడు నెలలు లేదా ఆరునెలలకోసారి చెల్లించడానికి మీరు సిద్ధపడి ఉండవచ్చు. పాలసీ పత్రంలో ఈ వివరాలను చెక్ చేసుకోవాలి. రిటర్నులపై కన్ను... ఆదాయ హామీలను గుడ్డిగా నమ్మవద్దు. పాలసీ డాక్యుమెంట్లు చేతికి రాగానే రిటర్నుల గురించిన వివరాలను క్షుణ్నంగా అధ్యయనం చేయండి. గ్యారంటీ ఉన్న అంశాలను, గ్యారంటీ లేని అంశాలను పరిశీలించండి. సర్వీసు కాంట్రాక్టు: డాక్యుమెంట్లో పేర్కొన్న బెనిఫిట్లతో పాటు సర్వీసు కాంట్రాక్టులోని నియమ నిబంధనలను జాగ్రత్తగా చదవండి. వాటిని ఆకళింపు చేసుకోవడం కష్టంగా ఉంటే, ఆ నిబంధనల ప్రభావం గురించి బీమా కంపెనీని సంప్రదించండి. సరెండర్ చార్జీలు... అత్యవసర సమయాల్లో ప్రజలు తమ పాలసీలను సరెండర్ చేస్తారు. లేదంటే పాక్షికంగా ఉపసంహరించుకుంటారు. కనుక, సరెండర్ చార్జీలు ఏ స్థాయిలో ఉన్నాయో గమనించాలి. తద్వారా మీ ఆర్థిక అవసరాలను మదింపు చేసుకుని, నష్టాన్ని తగ్గించుకునే అవకాశం కలుగుతుంది. మినహాయింపులను గమనించాలి... ఏయే పరిస్థితుల్లో బీమా కవరేజీ ఉండదో వాటిని మినహాయింపులని అంటారు. వీటి గురించి తెలుసుకోకపోతే కవరేజీ నిరుపయోగమయ్యే అవకాశముంది. కనుక, మినహాయింపులన్నిటినీ పరిశీలించాలి. ఆత్మహత్య, నేరానికి పాల్పడుతుండగా మృత్యువుకు గురికావడం, యుద్ధం, ఉగ్రవాద దాడుల్లో మరణించడం... వంటి అంశాలు మినహాయింపుల జాబితాలో ఉండవచ్చు. కొన్ని మినహాయింపులు నిర్ణీత కాలవ్యవధి వరకే ఉంటాయి. కనుక వీటిని పరిమితులని వ్యవహరించవచ్చు. చాలా రకాల జీవిత బీమా పాలసీల్లో నిర్ణీత కాలం వరకు కొన్ని రకాల మరణాలకు కవరేజీని నిరాకరిస్తారు. నామినీలు: పాలసీ డాక్యుమెంట్లో నామినీల వివరాలు సరిగా ఉన్నాయో లేదో చూడండి. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మందిని మీరు నామినీలుగా పేర్కొనవచ్చు. క్లెయిమ్‌లో వారి వాటా ఎంతో నిర్దిష్టంగా చెప్పాలి. పాలసీ నచ్చకపోతే: జీవిత బీమా కంపెనీలన్నీ తమ పాలసీదారులకు 15 రోజుల గడువును ఇస్తాయి. పాలసీ విక్రయ సమయంలో ఏజెంటు చెప్పిన అంశాలు డాక్యుమెంట్లో లేకపోవడం వంటి కారణాల వల్ల పాలసీదారులు అసంతృప్తి చెందితే పాలసీని తిరిగి ఇచ్చెయ్యవచ్చు. తాము చెల్లించిన మొత్తాన్ని తిరిగి పొందవచ్చు. -
ఈ-ఫైలింగ్ ప్రక్రియ మరింత సరళతరం
న్యూఢిల్లీ: ఇన్‌కం ట్యాక్స్ రిటర్నులను ఈ-ఫైలింగ్ చేసే ప్రక్రియను మరింత సులభతరం చేయనున్నట్లు ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చైర్మన్ ఆర్కే తివారి తెలిపారు. ఆన్లైన్ పద్ధతిలో రిటర్నులు దాఖలు చేసే వారి సంఖ్య పెరుగుతుండటంతో నిబంధనలను సరళతరం చేసేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. గత ఆర్థిక సంవత్సరం మార్చ్ 22 నాటికి 1.80 కోట్ల మేర ఈ-రిటర్నులు రాగా ఈసారి 40 శాతం పెరిగి 2.56 కోట్ల దాకా వచ్చాయని తివారీ చెప్పారు. బెంగళూరులోని సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్ (సీపీసీ) నెలకు 2.80 లక్షల రిటర్నులను ప్రాసెస్ చేస్తోందని తెలిపారు. ఈ-రిటర్నుల ప్రాసెసింగ్‌కి పట్టే సమయం కూడా 70 రోజుల నుంచి 61 రోజులకు తగ్గిందని తివారీ చెప్పారు. మరోవైపు, ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ వివాదాలను నివారించడానికి మార్చ్ 31లోగా మరిన్ని బహుళ జాతి సంస్థలతో అడ్వాన్స్ ప్రైసింగ్ ఒప్పందాలు (ఏపీఏ) కుదుర్చుకోనున్నట్లు తివారీ తెలిపారు. భవిష్యత్‌లో కొన్నేళ్ల పాటు అంతర్జాతీయ లావాదేవీలకు సంబంధించి అనుసరించే ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ విధానం గురించి పన్నుల శాఖతో కంపెనీలు ఈ ఏపీఏ ఒప్పందాలు కుదుర్చుకుంటాయి. ఒకే గ్రూప్‌లోని రెండు సంస్థల మధ్య జరిగే లావాదేవీల విషయంలో సదరు గ్రూప్ పాటించే ధరల విధానాన్ని ట్రాన్స్ఫర్ ప్రైసింగ్‌గా పరిగణిస్తారు. చాలా మటుకు బహుళ జాతి కంపెనీలు దీన్ని అడ్డం పెట్టుకుని తమ లాభాలన్నీ .. తక్కువ పన్నులు ఉండే దేశాల్లోకి మళ్లిస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై వివాదాలను తగ్గించే ఉద్దేశంతో ఏపీఏలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రత్యక్ష పన్ను వసూళ్ల లక్ష్యాన్ని సాధిస్తాం.. ప్రత్యక్ష పన్ను వసూళ్ల లక్ష్యాన్ని సాధిస్తామన్న విశ్వాసాన్ని తివారీ వ్యక్తం చేశారు. ఇక్కడ సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో తివారీ మాట్లాడారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కేంద్రం రూ.6.36 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్ల లక్ష్యాన్ని పెట్టుకుంది. మార్చి 22 వరకూ వీటిలో రూ.5.82 లక్షల కోట్ల వసూళ్లు జరిగినట్లు తివారీ తెలిపారు. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే ఇది 13.6 శాతం అధికం. ముందస్తు పన్ను వసూళ్లు మొత్తంగా చూస్తే మార్చి 22తో ముగిసిన యేడాదికాలంలో 8.7 శాతం వృద్ధితో రూ.2,90,323 కోట్లుగా ఉన్నట్లు తివారీ వివరించారు. -
మహిళలకు టాటా ప్రత్యేక హోమ్‌లోన్
ముంబై: టాటా క్యాపిటల్ సంస్థ మహిళల కోసం తక్కువ వడ్డీ రేటుకే రుణాలను ఆఫర్ చేస్తోంది. ఎస్బీఐ, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సంస్థల మాదిరి టాటా క్యాపిటల్ కూడా ఈ తరహా రుణాలను అందిస్తోంది. మహిళలకు రూ.40 లక్షల లోపు రుణాలను 10.15 శాతానికే అందిస్తామని కంపెనీ పేర్కొంది. గతంలో ఈ వడ్డీరేటు 10.50 శాతంగా ఉండేదని పేర్కొంది. ఈ పథకం అంతర్జాతీయ మహిళా దినోత్సవమైన వచ్చే నెల 8 వరకూ అందుబాటులో ఉంటుందని వివరించింది. మహిళలు తాము కలలు గన్న ఇంటిని సొంతం చేసుకోవడం ద్వారా మహిళల ఆర్థిక సాధికారితకు తోడ్పడం తమ లక్ష్యమని కంపెనీ పేర్కొంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మహిళలకు గృహ రుణాలు 10.10% వడ్డీకే అందిస్తోంది. ఇక ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ మహిళల కోసం ప్రత్యేక గృహరుణ పథకాన్ని ఆఫర్ చేస్తోంది.