క్రికెట్ టీమ్ యజమానుల్లో అత్యంత సంపన్నుడు ముకేశ్ | Mukesh Ambani wealthiest Indian cricket team owner: Wealth-X | Sakshi
Sakshi News home page

క్రికెట్ టీమ్ యజమానుల్లో అత్యంత సంపన్నుడు ముకేశ్

Published Thu, Apr 24 2014 1:33 AM | Last Updated on Sat, Sep 2 2017 6:25 AM

క్రికెట్ టీమ్ యజమానుల్లో అత్యంత సంపన్నుడు ముకేశ్

క్రికెట్ టీమ్ యజమానుల్లో అత్యంత సంపన్నుడు ముకేశ్

న్యూఢిల్లీ: దేశీయ క్రికెట్ జట్ల యజమానుల్లో అత్యంత సంపన్నుడు ముకేశ్ అంబానీ. రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ, ముంబై ఇండియన్స్ టీమ్ ఓనరైన ఆయన నెట్‌వర్త్ 2,120 కోట్ల డాలర్లు. వెల్త్-ఎక్స్ అనే గ్లోబల్ వెల్త్ ఇంటెలిజెన్స్ కంపెనీ ఈ విషయం తెలిపింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కళానిధి మారన్ 220 కోట్ల డాలర్ల నెట్‌వర్త్‌తో ద్వితీయ స్థానంలో నిలిచారు.

 సుమారు 64 కోట్ల డాలర్ల నెట్‌వర్త్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓనర్ విజయ్ మాల్యా మూడో స్థానంలో, 60 కోట్ల డాలర్ల నెట్‌వర్త్‌తో కోల్‌కతా నైట్ రైడర్స్ యజమాని షారుఖ్ ఖాన్ నాలుగో స్థానంలో ఉన్నారు. ఈ జాబితాలో మిగిలిన వారు: గ్రంథి మల్లికార్జున రావు (ఢిల్లీ డేర్ డెవిల్స్, నెట్‌వర్త్ 27 కోట్ల డాలర్లు), మనోజ్ బడాలే (రాజస్థాన్ రాయల్స్, 16 కోట్లు), నారాయణస్వామి శ్రీనివాసన్ (చెన్నై సూపర్ కింగ్స్, 7 కోట్లు), ప్రీతీ జింటా (కింగ్స్ లెవన్ పంజాబ్, 3 కోట్ల డాలర్లు).

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement