Tender period
-
బ్యాంకింగ్ షేర్ల ర్యాలీ
దేశీ బ్యాంకింగ్ రంగానికి ఊపునిస్తూ కొటక్ మహీంద్రా, ఐఎన్జీ వైశ్యా మధ్య జరిగిన విలీన ఒప్పందం ఇన్వెస్టర్లకు జోష్‌నిచ్చింది. మరోవైపు చైనాసహా, యూరోపియన్ దేశాలు నామమాత్ర వడ్డీ రేట్లకే కట్టుబడటంతోపాటు సహాయక ప్యాకేజీలకు తెరలేపడం సెంటిమెంట్‌కు బలాన్నిచ్చింది. దీంతో మరిన్ని విదేశీ పెట్టుబడులకు అవకాశముంటుందన్న అంచనాలు దేశీ స్టాక్ మార్కెట్లను మళ్లీ కొత్త రికార్డులవైపు పరుగు పెట్టించాయి. వెరసి 75 పాయింట్లు ఎగసిన నిఫ్టీ 8,477 వద్ద నిలవగా, సెన్సెక్స్ 267 పాయింట్లు జంప్‌చేసి 28,335 వద్ద ముగిసింది. ఇంట్రాడేలోనూ సెన్సెక్స్ గరిష్టంగా 28,361కు చేరగా, నిఫ్టీ 8,490ను తాకింది. తద్వారా మార్కెట్ చరిత్రలో తొలిసారి నిఫ్టీ 8,500, సెన్సెక్స్ 28,500 పాయింట్ల మైలురాళ్ల సమీపానికి చేరాయి. బీఎస్ఈలో బ్యాంకింగ్ రంగం అత్యధికంగా 2.5% ఎగసింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వం మరిన్ని సంస్కరణలకు తెరలేపుతుందన్న అంచనాలు కూడా కొనుగోళ్లకు కారణమైనట్లు నిపుణులు పేర్కొన్నారు. మరిన్ని విశేషాలివీ.... ఐఎన్జీ వైశ్యా బ్యాంక్‌ను విలీనం చేసుకోనున్న కొటక్ మహీంద్రా షేరు మరోసారి 4% పుంజుకోవడం ద్వారా రూ. 1,200 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 9% జంప్‌చేసి రూ. 1,261కు చేరింది. ఇది సరికొత్త గరిష్టంకావడం విశేషం! బ్యాంకింగ్ దిగ్గజాలు హెచ్డీఎఫ్సీ, యాక్సి స్, ఐసీఐసీఐ, ఎస్బీఐ, పీఎన్బీ, ఫెడరల్ బ్యాంక్ 1.5-4% మధ్య పురోగమించాయి. ఈ బాటలో సౌత్ ఇండియా బ్యాంక్, కర్టాటక బ్యాంక్, యస్ బ్యాంక్ సైతం 5.5-4% మధ్య ఎగశాయి. గతంలో నిలిపివేసిన కేటాయింపులను విడుదల చేసేందుకు రైల్వే బోర్డు నిర్ణయించడంతో రైలు షేర్లు లాభాల పరుగందుకున్నాయి. సిమ్కో 20%, టిటాగఢ్ వ్యాగన్స్ 11%, టెక్స్మాకో 5%, కాళిందీ రైల్ 4% చొప్పున దూసుకెళ్లాయి. మరిన్ని విలీనాలకు అవకాశముందన్న అంచనాలతో ప్రయివేట్ రంగ బ్యాంకింగ్ షేర్లు పుంజుకుంటే, అవసరమైనమేర పెట్టుబడులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు ఆర్థిక శాఖ ప్రకటించడంతో ప్రభుత్వ బ్యాంకింగ్ షేర్లు పురోగమించాయి. ఇక ఎఫ్ఐఐల తాజా పెట్టుబడులకు ఆర్బీఐ అనుమతించడంతో యస్ బ్యాంక్ షేరు ఊపందుకోగా, రూ. 10 ముఖవిలువగల షేరుని రూ. 2 ముఖ విలుగల 5 షేర్లుగా విభజించేందుకు డిసెంబర్ 5ను రికార్డు డేట్‌గా ప్రకటించడంతో ఐసీఐసీఐ బ్యాంక్ జంప్ చేసింది. యస్ బ్యాంక్‌లో పరిమితికంటే దిగువకు ఎఫ్ఐఐల పెట్టుబడులు చేరుకోవడంతో తాజా నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఆర్బీఐ పేర్కొంది. స్పైస్‌జెట్ షేరు జూమ్ స్పైస్‌జెట్‌లో ప్రమోటర్లకున్న వాటాను పూర్తిగా లేదా కొంతమేర విక్రయించనున్నట్లు మీడియాలో వార్తలు వెలువడ్డాయి. కంపెనీలో సన్ గ్రూప్‌నకు 53.4% వాటా ఉంది. అయితే స్పైస్‌జెట్ ప్రమోటర్ కళానిధి మారన్ ఎంతమేర వాటా విక్రయించేదీ స్పష్టంకాలేదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ వార్తల నేపథ్యంలో స్పైస్‌జెట్ షేరు 15% జంప్‌చేసింది. -
టీసీఎస్ లాభం 45% అప్
ముంబై: సాఫ్ట్వేర్ సేవలకు టాప్ ర్యాంక్‌లో ఉన్న దేశీ దిగ్గజం టీసీఎస్ మరోసారి ప్రోత్సాహకర ఫలితాలను సాధించింది. ఈ ఆర్థిక సంవత్సరం(2014-15) క్యూ1(ఏప్రిల్-జూన్)లో 45% అధికంగా రూ. 5,568 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది(2013-14) ఇదే కాలంలో రూ. 3,840 కోట్లను మాత్రమే ఆర్జించింది. ఇదే కాలానికి ఆదాయం సైతం 23% ఎగసి రూ. 22,111 కోట్లను తాకింది. గతంలో రూ. 17,987 కోట్లు నమోదైంది. దేశీ అకౌంటింగ్ ప్రమాణాల ప్రకారం వెల్లడించిన కన్సాలిడేటెడ్ ఫలితాలివి. పబ్లిక్ ఇష్యూ చేపట్టి 10 వసంతాలు పూర్తయిన సందర్భంగా వాటాదారులకు షేరుకి రూ. 40 ప్రత్యేక డివిడెండ్‌ను ప్రతిపాదించింది. పటిష్ట నిర్వహణ కారణంగా కరెన్సీ కదలికలు, తరుగుదల, వేతన పెంపు వంటి ప్రతికూల అంశాలను సమర్థవంతంగా ఎదుర్కోగలిగినట్లు కంపెనీ సీఎఫ్‌వో రాజేష్ గోపీనాథన్ పేర్కొన్నారు. ఆశలు తక్కువే... మధ్యప్రాచ్యం, ఆఫ్రికా మార్కెట్ల నుంచి సవాళ్లు ఎదురయ్యాయని, బీమా రంగం మినహా ఇతర విభాగాలలో ప్రోత్సాహకర పనితీరును చూపగలిగామని చంద్రశేఖరన్ వివరించారు. అయితే బీమా రంగ విభాగంపై అధిక అంచనాలు లేకపోవడంతో ఆందోళనచెందాల్సినదేమీ లేదని వ్యాఖ్యానించారు. కొత్త ప్రభుత్వం ఐటీ ఆధారిత ప్రకటనలు చేసినప్పటికీ, దేశీ మార్కెట్‌పై అంతగా ఆశలు పెట్టుకోలేదని, అయితే అవకాశాలను అందిపుచ్చుకుంటామని పేర్కొన్నారు. కాగా, తరుగుదల లెక్కింపు విధానాల్లో చోటుచేసుకున్న మార్పులవల్ల రూ. 490 కోట్లమేర లాభాలు పెరిగినట్లు రాజేష్ తెలిపారు. అయితే అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం చూస్తే లాభాలపై ఇదే స్థాయిలో ప్రతికూల ప్రభావం పడుతుందని వివరించారు. ఫలితాలపై అంచనాల నేపథ్యంలో బీఎస్ఈలో షేరు 0.8% క్షీణించి రూ. 2,381 వద్ద ముగిసింది. క్యూ1 ఫలితాలను కంపెనీ మార్కెట్లు ముగిశాక సాయంత్రం విడుదల చేసింది. ఇతర కీలక అంశాలివీ... క్యూ1లో స్థూలంగా 15,817 మందికి ఉద్యోగాలివ్వగా, నికరంగా 4,967 మంది మిగిలారు. దీంతో జూన్ చివరికి మొత్తం సిబ్బంది సంఖ్య 3,05,431కు చేరింది. గత 12 నెలల్లోలేని విధంగా ఉద్యోగవలస రేటు 12%గా నమోదైంది. మొత్తం 25,000 మంది క్యాంపస్ విద్యార్థులను ఎంపిక చేసుకోగా, 3,000 మందితో ఇప్పటికే శిక్షణా తరగతులను మొదలుపెట్టినట్లు కంపెనీ మానవ వనరుల గ్లోబల్ హెడ్ అజయ్ ముఖర్జీ చెప్పారు. మిగిలినవారిని కూడా ఈ ఏడాదిలో తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది కొత్తగా 55,000 మందికి ఉద్యోగావకాశాలను కల్పించనున్నట్లు అజయ్ తెలిపారు. నిర్వహణ లాభం 22.5%గా నమోదైంది. ట్రయినీలను మినహాయిస్తే ఉద్యోగుల వినియోగ రేటు అత్యధికంగా 85.3%ను తాకింది. డాలర్లలో క్యూ1: నికర లాభం 20.5% పుంజుకుని 84.5 కోట్ల డాలర్లను తాకింది. గతంలో 70.1 కోట్ల డాలర్లు ఆర్జించింది. ఆదాయం కూడా 16.4% పెరిగి 369 కోట్ల డాలర్లకు చేరింది. గతంలో 317 కోట్ల డాలర్ల ఆదాయం నమోదైంది. మీడియా, ఇన్ఫర్మేషన్ సర్వీసులు, లైఫ్‌సెన్సైస్, రిటైల్, టెలికం వంటి బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌యేతర సర్వీసులలో 5% వృద్ధిని సాధించినట్లు కంపెనీ పేర్కొంది. రిటైల్, లైఫ్‌సెన్సైస్, బ్యాంకింగ్ రంగాలలో 5 కోట్ల డాలర్ల స్థాయిలో 7 భారీ ఆర్డర్లను సంపాదించింది. ప్రస్తుతం ఇలాంటి మరో 8 కాంట్రాక్ట్‌ల కోసం చర్చలు నిర్వహిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. -
దుమ్మురేపిన మార్కెట్
ఇటీవల కన్సాలిడేషన్ దిశలో కదలుతున్న మార్కెట్లు మళ్లీ పుంజుకున్నాయి. వెరసి సెన్సెక్స్ గత పది రోజుల్లోలేని విధంగా 319 పాయింట్లు ఎగసింది. తొలిసారి 24,500కు ఎగువన 24,693 వద్ద నిలిచింది. ఈ బాటలో నిఫ్టీ కూడా 91 పాయింట్లు పురోగమించి 7,400 సమీపాన 7,367 వద్ద స్థిరపడింది. ఇవి కొత్త గరిష్ట స్థాయి ముగింపులుకాగా, బ్యాంకింగ్, విద్యుత్, ఆయిల్, రియల్టీ, మెటల్, క్యాపిటల్ గూడ్స్ రంగాలు 4-2% మధ్య బలపడ్డాయి. ఎఫ్ఎంసీజీ నామమాత్రంగా నష్టపోయింది. మోడీ అధ్యక్షతన బాధ్యతలు చేపట్టనున్న ఎన్డీఏ ప్రభుత్వం విద్యుత్, ఇన్ఫ్రా, తయారీ, బ్యాంకింగ్ తదితర రంగాలకు జోష్‌నిచ్చేందుకు పటిష్ట చర్యలను చేపడుతుందన్న అంచనాలు ఆయా రంగాల షేర్లకు డిమాండ్ పెంచుతున్నాయని నిపుణులు విశ్లేషించారు. ఎన్డీఏ ప్రభుత్వం తీసుకురానున్న సంస్కరణలు, మెరుగుపడనున్న పెట్టుబడి వాతావరణం కారణంగా వచ్చే ఏడాది ఆర్థిక వృద్ధి 6.5%కు పుంజుకుంటుందన్న అంచనాను గోల్డ్‌మన్ శాక్స్ వెలువరించడంతో సెంటిమెంట్ మెరుగుపడిందని తెలిపారు. ప్రభుత్వ బ్యాంకుల జోష్ ఆర్థిక ఫలితాలు ప్రకటించిన ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్బీఐ ఏకంగా 10% జంప్‌చేయడంతో బ్యాంక్ మార్కెట్ విలువ రూ. 18,000 కోట్లకుపైగా ఎగసి రూ. 2,05,700 కోట్లకు చేరింది. షేరు ఇంట్రాడేలో మూడేళ్ల గరిష్టం రూ. 2,775ను తాకి చివరికి రూ. 2,755 వద్ద ముగిసింది. ఈ బాటలో కెనరా బ్యాంక్ 13% దూసుకె ళ్లగా, ఓబీసీ, ఆంధ్రా, సెంట్రల్, సిండికేట్, కార్పొరేషన్, అలహాబాద్ బ్యాంక్‌లతోపాటు బీవోఐ, పీఎన్బీ, బీవోబీ 9-3% మధ్య లాభపడ్డాయి. ఇక సెన్సెక్స్ దిగ్గజాలలో టాటా పవర్, మారుతీ, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, సెసాస్టెరిలైట్, భెల్, భారతీ, ఆర్ఐఎల్, ఎంఅండ్ఎం, ఎల్అండ్టీ 6-2% మధ్య పుంజుకోగా, హిందాల్కో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఐటీసీ 2-5% మధ్య నష్టపోయాయి. గత మూడు రోజుల్లో రూ. 650 కోట్లకుపైగా అమ్మకాలు చేపట్టిన ఎఫ్ఐఐలు తాజాగా రూ. 417 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. చిన్న షేర్లకు డిమాండ్ యథాప్రకారం చిన్న షేర్లకు డిమాండ్ కొనసాగింది. మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు దాదాపు 2% లాభపడ్డాయి. మిడ్ క్యాప్స్‌లో రెయిన్, కోల్టే పాటిల్, హెచ్‌సీఎల్ ఇన్ఫో, బజాజ్ హిందుస్తాన్, అశోక్ లేలాండ్, స్పైస్‌జెట్, టాటా టెలీ, జిందాల్ సౌత్, జైన్ ఇరిగేషన్, ఐఎఫ్సీఐ, సుజ్లాన్, ల్యాంకో ఇన్ఫ్రా, మహీంద్రా హాలిడే, నాల్కో, అడ్వాంటా, ఐఐఎఫ్ఎల్, హిందుస్తాన్ జింక్, బీఏఎస్ఎఫ్, బాంబే డయింగ్, బాల్మర్ లారీ, మోనట్ ఇస్పాత్, పుంజ్లాయిండ్, పొలారిస్ ఫైనాన్షియల్ 20-7% మధ్య జంప్ చేశాయి. -
క్రికెట్ టీమ్ యజమానుల్లో అత్యంత సంపన్నుడు ముకేశ్
న్యూఢిల్లీ: దేశీయ క్రికెట్ జట్ల యజమానుల్లో అత్యంత సంపన్నుడు ముకేశ్ అంబానీ. రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ, ముంబై ఇండియన్స్ టీమ్ ఓనరైన ఆయన నెట్‌వర్త్ 2,120 కోట్ల డాలర్లు. వెల్త్-ఎక్స్ అనే గ్లోబల్ వెల్త్ ఇంటెలిజెన్స్ కంపెనీ ఈ విషయం తెలిపింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కళానిధి మారన్ 220 కోట్ల డాలర్ల నెట్‌వర్త్‌తో ద్వితీయ స్థానంలో నిలిచారు. సుమారు 64 కోట్ల డాలర్ల నెట్‌వర్త్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓనర్ విజయ్ మాల్యా మూడో స్థానంలో, 60 కోట్ల డాలర్ల నెట్‌వర్త్‌తో కోల్‌కతా నైట్ రైడర్స్ యజమాని షారుఖ్ ఖాన్ నాలుగో స్థానంలో ఉన్నారు. ఈ జాబితాలో మిగిలిన వారు: గ్రంథి మల్లికార్జున రావు (ఢిల్లీ డేర్ డెవిల్స్, నెట్‌వర్త్ 27 కోట్ల డాలర్లు), మనోజ్ బడాలే (రాజస్థాన్ రాయల్స్, 16 కోట్లు), నారాయణస్వామి శ్రీనివాసన్ (చెన్నై సూపర్ కింగ్స్, 7 కోట్లు), ప్రీతీ జింటా (కింగ్స్ లెవన్ పంజాబ్, 3 కోట్ల డాలర్లు). -
మర్ జవాన్...మర్ కిశాన్
నాందేడ్, న్యూస్‌లైన్: పత్తి ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించడం విదర్భ రైతుకు శపంగా పరిణమించిందని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఆరోపించారు. యూపీఏ సర్కార్ తీసుకున్న విధాన నిర్ణయాల వల్ల లాల్ బహుదూర్ శాస్త్రి నినాదమైన జై జవాన్ జై కిసాన్ కాస్తా మర్ జవాన్, మర్ కిశాన్గా మారిందని అకోలాలో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచారంలో మోడీ మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో వారి నినాదం ఇదేనని చమత్కరించా రు. విదర్భ కన్నా గుజరాత్లో అనేక మంది రైతులు ఉన్నారని, అయితే ఇక్కడి వారి మాదిరిగా అక్కడ ఆత్మహత్యలు చేసుకోవడం లేదన్నారు. ఉత్పాదక నాణ్య త పెరిగేలా కేంద్రం ఏమీ చర్య లు తీసుకోవడం లేదని, అందుకే విదర్భలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని చెప్పారు. అకోలాలో వ్యవసాయ విశ్వ విద్యాలయమున్నా స్థానిక రైతులకు ఉపయోగపడం లేదన్నారు. రైతులను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్, కాంగ్రెస్ వంచి స్తోందని మండిపడ్డారు. మాజీ సీఎం అశోక్ చవాన్‌కు టికెటివ్వడమేంటి? ‘ఆదర్శ్ సొసైటీ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ అభ్యర్థిత్వంపై నేను ప్రశ్నిం చినప్పుడు, సమగ్ర దర్యాప్తు చేసి ఆయనపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఢిల్లీలో విలేకరుల సమావేశంలో హామీ ఇచ్చారు. చర్యలు తీసుకోవడమంటే ఎన్నికల్లో పోటీచేసేందుకు టికెట్ ఇవ్వడమా..? అ’ని మోడీ ఎద్దేవా చేశారు. నాందేడ్ లోక్‌సభ నియోజకవర్గం బీజేపీ, శివసేన, ఆర్పీఐ (ఆఠవలే వర్గం) మహా కూటమి అభ్యర్థి డీబీ పాటిల్‌కు మద్దతుగా ఆదివారం నిర్వహించిన ప్రచారసభకు మోడీ హాజరయ్యారు. నాందేడ్‌లోని శ్రీ గురుగోవింద్ సింగ్ స్టేడియంలో ఏర్పాటుచేసిన ప్రచార సభకు సుమారు లక్షన్నరకుపైగా జనం వచ్చారు. ఈ సందర్భంగా భారీ జనానుద్ధేశించి మోడీ మాట్లాడుతూ... దేశంలో కాంగ్రెస్‌కు నూక లు చెల్లాయని, మే 16వ తేదీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆఖరు రోజ న్నారు. కార్గిల్ యుద్ధంలో తమ భర్తలను పొగొట్టుకున్న వితంతువులకు తీరని అన్యాయం చేశారని దుయ్యబట్టారు. మన సంస్కృతిలో సోదరికి ఇవ్వడమే తప్ప వారి నుంచి పుచ్చుకునే సంప్రదా యం లేదని, అయితే ఓ సోదరుడు సోదరి ఇంటి టికెట్నే కాజేశారని చవాన్ ఉద్ధేశించి పరోక్షంగా విమర్శించారు. శ్రీగురుగోవింద్ సింగ్ పుట్టిన ఈ నాందే డ్ గడ్డమీద ఒట్టేసి చెబుతున్న కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాగానే, అవినీతి కుంభకోణంలో చిక్కుకున్న వారిని చట్టపరంగా శిక్షించి తీరుతామని, వారి ని వదిలే ప్రసక్తి లేదన్నారు. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలతో పేదలు బేజారైపోయారని, ఎక్క డ చూసిన కాంగ్రెస్ నాయకుల అవినీతి భాగోతాలే వెలుగులోకి వస్తున్నాయన్నారు. అవినీతిలో కూరుకుపోయిన కాం గ్రెస్‌కు గుణపాఠం చెప్పాలంటే అధికారంలోంచి గద్దె దింపడమే ప్రత్యామ్నా య మార్గమని ప్రజలకు మోడీ పిలుపునిచ్చారు. అనంతరం బీజేపీ నాయకుడు గోపీనాథ్ ముండే మాట్లాడుతూ...అశోక్ చవాన్ పరాజయం తథ్యమని జోస్యం చెప్పారు. అకాల వర్షాల వల్ల తీవ్రం గా నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో దాదాపు 40 లోక్‌సభ స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం ఆర్పీఐ అధ్యక్షుడు రాందాస్ అథవలే, బీజేపీ ప్రదేశ్ అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవీస్, అభ్యర్థి డి.బి.పాటిల్ తదితరు లు మాట్లాడుతూ కాంగ్రెస్ గుణపాఠం చెప్పి, మహా కూటమికి అధికారం అప్పగించాలని అన్నారు. పాటిల్‌ను గెలిపించేందుకు నడుం బిగించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సభలో మహాకూటమి నాయకులు, ఎమ్మెల్యేలు, పదాధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ఎన్నికలు శివసేనకు సవాల్: ఉద్ధవ్‌ఠాక్రే ముంబై: తన తండ్రి బాల్‌ఠాక్రే మరణం తర్వాత తొలిసారిగా జరుగుతున్న ఈ ఎన్నికలు తమ పార్టీకి సవాల్ అని శివసేన పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్‌ఠాక్రే స్పష్టం చేశారు. ఇప్పటికీ బాల్‌ఠాక్రే సమక్షంలోనే పార్టీ నడుస్తుందన్న భావన కలుగుతోందని ఆదివా రం సామ్నా సంపాదకీయంలో పేర్కొన్నారు. కొంత మంది నాయకులే పార్టీ వీడుతున్నారే తప్ప క్యాడర్ అంతా తమతోనే ఉందన్నారు. టికెట్లు నిరాకరించడంతో కొంత మంది బయటకు వెళుతున్నారని చచెప్పారు. అక్రమాస్తుల కేసులో శివసేన పార్టీ నాయకుడు బాబన్‌రావ్ గోలప్కు శిక్ష పడటంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 14 ఏళ్ల తర్వాత కూడా, అది కూడా ఎన్నికల సమయంలో తీర్పు రావడం ఏంటోనని అన్నారు. కాగా, దేశవ్యాప్తంగా బీజేపీ నేతృత్వం లోని నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ (ఎన్డీఏ) అనుకూల పవనాలు వీస్తున్నాయన్నారు. త్వరలోనే ఇది కాషాయ తుఫానుగా మారుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు బలమైన నాయకత్వం లోపించిం దని, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేం ద్ర మోడీని ప్రత్యమ్నాయంగా ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు. అటల్ బీహారి వాజ్‌పేయి మినహా మిగతా ఏ నాయకుల గురించి బీజేపీ ప్రచారంలో పేర్కొనడం లేదని, అదే కాంగ్రెస్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ పేర్లు వాడుకుంటున్నా రాహుల్ గాంధీ, అదే సమయంలో ప్రియాంక వాద్రాను ప్రజల ముందు కు తేవడంలో విఫలమైం దన్నారు. ప్రతిపక్ష పార్టీలన్నీ నరేంద్ర మోడీకి సంపూర్ణ మద్దతును ప్రకటించాయని తెలిపారు. -
కుబేరుల ఖిల్లా.. భారత్!
-
కుబేరుల ఖిల్లా.. భారత్!
న్యూఢిల్లీ: భారత్‌లో సంపన్నుల సంఖ్య అంతకంతకూ ఎగబాకుతోంది. ప్రపంచవ్యాప్తంగా కుబేరుల సంఖ్య పరంగా భారత్ అయిదోస్థానాన్ని చేజిక్కించుకుంది. దేశంలో మొత్తం 70 మంది బిలియనీర్లు లెక్కతేలారు. చైనాకు చెందిన రీసెర్చ్ సంస్థ హురున్... ప్రపంచ సంపన్నుల జాబితా-2014లో ఈ వివరాలను వెల్లడించింది. కాగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీయే ఈసారి కూడా భారత్‌లో అత్యంత ధనిక వ్యక్తిగా నిలిచినట్లు తెలిపింది. ఆయన వ్యక్తిగత సంపద 18 బిలియన్ డాలర్లు(దాదాపు 1.12 లక్షల కోట్లు)గా అంచనా. కాగా, ప్రపంచ బిలియనీర్ల జాబితాలో ఆయన 41వ ర్యాంక్‌లో నిలిచారు. నంబర్ వన్ స్థానం బిల్‌గేట్స్‌కు దక్కింది. ఆయన సంపద 68 బిలియన్ డాలర్లు(సుమారు రూ.4.22 లక్షల కోట్లు). భారత్‌లో జోరు... ప్రపంచ టాప్ బిలియనీర్లలో భారత్ నుంచి చోటు దక్కించుకున్నవారిలో ఉక్కు దిగ్గజం లక్ష్మీ మిట్టల్ 49 ర్యాంక్‌లో ఉన్నారు. ఆయన వ్యక్తిగత సంపద 17 బిలియన్ డాలర్లు. సన్ ఫార్మా వ్యవస్థాపకుడు, ఎండీ అయిన దిలీప్ సంఘ్వీ, విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీలు సంయుక్తంగా 77వ స్థానంలో నిలిచారు. వీళ్లిద్దరి సంపద చెరో 13.5 బిలియన్ డాలర్లుగా అంచనా. కాగా, టాటా సన్స్‌కు చెందిన పల్లోంజీ మిస్త్రీ(12 బిలియన్ డాలర్లు), హిందూజా గ్రూప్‌నకు చెందిన ఎస్పీ హిందుజా కుటుంబం(12 బిలియన్ డాలర్లు) కూడా 93 ర్యాంక్‌లో ఉన్నారు. గడిచిన ఏడాది వ్యవధిలో డాలరుతో రూపాయి మారకం విలువ 12 శాతం పైగా క్షీణించడంతో బిలియనీర్ల ర్యాంకింగ్స్‌లో భారతీయులు కొంత వెనుకబడటానికి కారణమైందని హురున్ పేర్కొంది. అయినప్పటికీ.. 2013తో పోలిస్తే 17 మంది కుబేరులు పెరిగినట్లు వెల్లడించింది. జర్మనీ, స్విట్టర్లాండ్, ఫ్రాన్స్, జపాన్ల కంటే భారత్‌లోనే బిలియనీర్లు అధికంగా ఉండటం విశేషం. కాగా, మొత్తం 70 మంది భారతీయ కుబేరుల సంపద విలువ 390 బిలియన్ డాలర్లుగా అంచనా. హురున్ జాబితాలో ఇతర ముఖ్యాంశాలివీ... గేట్స్ తర్వాత బెర్క్‌షైర్ హ్యాత్వే అధిపతి వారెన్ బఫెట్ 64 బిలియన్ డాలర్ల సంపదతో 2వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. స్పెయిన్‌కు చెందిన ఇండిటెక్స్ గ్రూప్ చైర్మన్, సహ వ్యవస్థాపకుడు అమన్షియో ఒర్టెగా 3వ ర్యాంక్‌లో నిలిచారు. ఆయన సంపద 62 బిలియన్ డాలర్లు. నాలుగో స్థానంలో మెక్సికో టెలికం దిగ్గజం కార్లోస్ స్లిమ్ హెలూ కుటుంబం(60 బిలియన్ డాలర్లు), ఐదో ర్యాంక్‌లో ఒరాకిల్ సీఈఓ లారీ ఎలిసన్(60 బిలియన్ డాలర్లు) నిలిచారు. కుబేరుల సంఖ్య పరంగా 481 మందితో అమెరికా అగ్రస్థానంలో ఉంది. తర్వాత స్థానంలో చైనా(358 మంది బిలియనీర్లు) నిలిచింది. ప్రపంచ కుబేరుల్లో సగం మంది ఈ రెండు దేశాల్లోనే ఉన్నారు. ముంబైలో 33 మంది బిలియనీర్లు ఉన్నారు. అత్యధిక సంపన్నులున్న ప్రపంచ నగరాల్లో ఆరో స్థానం. న్యూయార్క్ నగరం 84 మంది కుబేరులతో ప్రపంచ బిలియనీర్ల రాజధానిగా నంబర్ వన్ ర్యాం క్‌ను చేజిక్కించుకుంది. గతేడాది ఈ సంఖ్య 70. అమెరికా డాలర్లలో సంపదను లెక్కించారు. ఈ ఏడాది జనవరి 17 నాటి గణాంకాల ఆధారంగా జాబితాను రూపొందించారు. మొత్తం ఈ సూపర్ రిచ్ లిస్ట్‌లో 68 దేశాల నుంచి 1,867 మంది బిలియనీర్లు లెక్కతేలారు. వీళ్ల మొత్తం సంపద కళ్లు చెదిరేరీతిలో 6.9 లక్షల కోట్లు. ఈ ఏడాది లిస్ట్‌లో ప్రతి 9 మందిలో ఒకరు మహిళ కావడం గమనార్హం. 2013లో ప్రతి పది మందిలో ఒక మహిళా బిలియనీర్ ఉన్నారు.