దయతో బెయిల్ ఇవ్వండి | Subrata Roy urges Supreme Court to release him on parole to sell properties | Sakshi
Sakshi News home page

దయతో బెయిల్ ఇవ్వండి

Published Sat, Jul 5 2014 12:47 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM

దయతో బెయిల్ ఇవ్వండి - Sakshi

దయతో బెయిల్ ఇవ్వండి

న్యూఢిల్లీ: నాలుగు నెలలుగా తీహార్ జైలులో నిర్బంధంలో ఉన్న తనకు ‘దయతో’ తాత్కాలిక బెయిల్ మంజూరు చేయాలని సహారా చీఫ్ సుబ్రతారాయ్ శుక్రవారం సుప్రీంకోర్టును అభ్యర్థించారు. తద్వారా గ్రూప్ ఆస్తులను విక్రయించి రెగ్యులర్ బెయిల్‌కు సంబంధించి మార్కెట్ రెగ్యులేటర్- సెబీ వద్ద డిపాజిట్ చేయాల్సిన  రూ.10,000 కోట్ల సమీకరించడానికి వీలుకలుగుతుందని వివరించారు. దీనిపై న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తన ఉత్తర్వులను రిజర్వ్ చేసుకుంది.

ఐటీ అఫిడవిట్‌కు 2 వారాల గడువు...
కాగా కేసుకు సంబంధించి గ్రూప్  కంపెనీలు తనకూ రూ.7,000 కోట్ల పన్ను చెల్లింపులు జరపాల్సి ఉందని ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. ఈ వివరాలు తెలుపుతూ రెండు వారాల్లో ఒక అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement