![Man with bunny helmet rides buffalo on busy Delhi road - Sakshi](/styles/webp/s3/article_images/2024/03/3/bull1.jpg.webp?itok=0hOOvwXI)
వైరల్
‘గుర్రపు స్వారీ’ అనే మాట మనకు కొత్తేమీ కాదు. అయితే ‘దున్నపోతు స్వారీ’ అనే మాట వింటే మాత్రం ‘సారీ’ అంటాం. ‘బుల్ రైడర్ 007’ కాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోలో హెల్మెట్ ధరించిన ఒక యువకుడు దున్నపోతుపై కూర్చొని రోడ్డుపై పరుగులు తీస్తుంటాడు. ఆన్‌లైన్ యూజర్‌ల తిట్లు, శాపనార్థాల సంగతి ఎలా ఉన్నా చాలా తక్కువ సమయంలోనే ఈ వీడియో వైరల్ అయింది. 8 మిలియన్‌లకు పైగా వ్యూస్‌ను దక్కించుకుంది.
ఈ రైడర్‌తో సెల్ఫీలు దిగడానికి రోడ్డు పక్కన ఉన్న జనాలు పరుగెత్తుకు రావడం మరో వినోద విడ్డూరం. ‘నో పెట్రోల్–నో సర్వీస్–నో లైసెన్స్’లాంటి కామెంట్స్‌తో పాటు ‘ఇది జంతు హింస తప్ప మరొకటి కాదు’ ... లాంటి కామెంట్స్ కనిపించాయి.
Comments
Please login to add a commentAdd a comment