buffalo race
-
నీ సంబడం సంతకెళ్లి పోను
‘గుర్రపు స్వారీ’ అనే మాట మనకు కొత్తేమీ కాదు. అయితే ‘దున్నపోతు స్వారీ’ అనే మాట వింటే మాత్రం ‘సారీ’ అంటాం. ‘బుల్ రైడర్ 007’ కాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోలో హెల్మెట్ ధరించిన ఒక యువకుడు దున్నపోతుపై కూర్చొని రోడ్డుపై పరుగులు తీస్తుంటాడు. ఆన్లైన్ యూజర్ల తిట్లు, శాపనార్థాల సంగతి ఎలా ఉన్నా చాలా తక్కువ సమయంలోనే ఈ వీడియో వైరల్ అయింది. 8 మిలియన్లకు పైగా వ్యూస్‌ను దక్కించుకుంది. ఈ రైడర్‌తో సెల్ఫీలు దిగడానికి రోడ్డు పక్కన ఉన్న జనాలు పరుగెత్తుకు రావడం మరో వినోద విడ్డూరం. ‘నో పెట్రోల్–నో సర్వీస్–నో లైసెన్స్’లాంటి కామెంట్స్‌తో పాటు ‘ఇది జంతు హింస తప్ప మరొకటి కాదు’ ... లాంటి కామెంట్స్ కనిపించాయి. -
కంబాళ: మరి ఈ జాకీని ఏమని పిలవాలో!
సాక్షి, బెంగుళూరు : కర్ణాటక సంప్రదాయ క్రీడ కంబాళలో 30 ఏళ్ల రికార్డు తిరగరాసిన శ్రీనివాస గౌడను ఉసేన్ బోల్ట్‌తో పోల్చాం. మరి శ్రీనివాస గౌడ రికార్డు తిరగరాసిన నిశాంత్ శెట్టీనీ ఏమని పిలవాలో..! అవును, వేనూర్లో ఆదివారం జరిగిన కంబాళ క్రీడలో బజగోళి జోగిబెట్టుకు చెందిన ఈ నయా కంబాళ జాకీ 143 మీటర్ల దూరాన్ని కేవలం 13.68 సెకండ్లలో పరుగెత్తాడు. దీనిని 100 మీటర్లకు లెక్కించినపుడు.. ఉసేన్ బోల్ట్ (9.58 సెకండ్లలో 100 మీటర్లు) ప్రపంచ రికార్డు వేగాన్ని మించిన వేగం నమోదైనట్టే. అంటే బోల్ట్ కంటే 0.07 సెకండ్లు వేగంగా నిశాంత్ పరుగు పూర్తి చేశాడు. (చదవండి: ఏమి ఆ వేగం.. బోల్ట్‌ను మించి పోయాడు..!) ఇక కన్నడనాట వారం క్రితం జరిగిన ఇదే ‘కంబాళ’ క్రీడలో శ్రీనివాస గౌడ 13.62 సెకండ్లలో 142.50 మీటర్లు పరుగెత్తిన సంగతి తెలిసిందే. ఈ రికార్డు వేగానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. అతనిపై ప్రశంసల వర్షం కురిసింది. పంట పొలాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన శ్రీనివాస్ గౌడకు ట్రైనింగ్ ఇస్తే గొప్ప అథ్లెట్ అవుతాడని ఆనంద్ మహింద్రా ట్వీట్ చేయడం.. దానికి క్రీడల మంత్రి కిరన్ రిజుజు స్పందించి అతనికి సాయ్ నుంచి ఆహ్వానం పంపుతామని బదులివ్వడం తెలిసిందే. ఇక శ్రీనివాస గౌడ రికార్డును తిరగరాసిన నిశాంత్‌కు ఎలాంటి ఆహ్వానం అందుతుందో చూడాలి..! (చదవండి : కంబాల రేసర్‌కు సాయ్ పిలుపు!) వాటి వల్లే ఈ విజయం.. శ్రీనివాస గౌడపై ప్రశంసలు కురిపించిన ముఖ్యమంత్రి యడియూరప్ప రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.3 లక్షల నదగు బహుమతి కూడా అందించడం విశేషం. అయితే, సీఎంతో సమావేశం అనంతరం మీడియాతో మాడ్లాడిన శ్రీనివాస్ గౌడ తన విజయంలో దున్నపోతుల పాత్రే కీలకమని అన్నాడు. అవి వేగంగా పరుగెత్తడం వల్లే తాను అంతే వేగంగా దూసుకెళ్లానని చెప్పుకొచ్చాడు. చెప్పులు లేకుండా.. పంట పొలాల్లో పరుగెత్తడం తెలిసిన తనకు వేరే ఆటలేవీ వద్దని అన్నాడు. అనుభవం లేని కారణంగానే పెద్దల సూచనల్ని కాదంటున్నానని పేర్కొన్నాడు. -
కంబాల రేసర్‌కు సాయ్ పిలుపు!
బెంగుళూరు: అంతర్జాతీయంగా ఫీల్డ్ అండ్ ట్రాక్ అథ్లెటిక్స్‌లో ఇప్పటికే తనదైన ముద్రతో దూసుకుపోతున్న భారత్‌కు మరో ఉసేన్ బోల్డ్ దొరికాడా అంటే అవుననే చెప్పాలేమో. ఉసేన్ బోల్డ్‌ను మించిన వేగంతో దూసుకొచ్చిన కర్ణాటకకు చెందిన 28 ఏళ్ల శ్రీనివాస గౌడ ఇప్పుడు యావత్ భారతావనిని ఆకర్షించాడు. అది ఇప్పుడు కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు చెంతకు చేరింది. దాంతో శ్రీనివాస గౌడకు సాయ్ నుంచి ఆహ్వానం పంపుతామని ఆయన స్పష్టం చేశారు. తానే స్వయంగా శ్రీనివాస గౌడకు కాల్ చేసి సాయ్ నిర్వహించే ట్రయల్‌కు రమ్మని పిలుస్తానని పేర్కొన్నారు. ‘నేను శ్రీనివాస గౌడను సాయ్ ట్రయల్స్‌కు రమ్మని పిలుస్తా. చాలామందికి ఒలింపిక్స్ స్టాండర్స్ గురించి సరైన అవగాహన ఉండటం లేదు. ప్రత్యేకంగా అథ్లెటిక్స్‌లో శరీర ధృడత్వంతో పాటు ఓర్పు కూడా అవసరం. దాంతోనే ఎన్నో ఘనతలు సాధ్యం. భారత్‌లో టాలెంట్ అనేది నిరూపయోగంగా ఉండకూడదు’ అని కిరణ్ రిజుజు అన్నారు. ప్రధానంగా మంగుళూరు, ఉడిపి ప్రాంతాల్లో నిర్వహించే సంప్రదాయ ‘కంబాల’క్రీడలో శ్రీనివాస గౌడ ముప్పయ్ ఏళ్ల రికార్డును తిరగరాశాడు. దక్షిణ కన్నడ జిల్లాలోని మూడబిద్రికి చెందిన ఈ రేసర్ 13.62 సెకండ్లలో 142.50 మీటర్లు పరుగెత్తి.. ఉసేన్ బోల్ట్ (9.58 సెకండ్లలో 100 మీటర్లు) ప్రపంచ రికార్డును గుర్తు చేశాడు. 142.50 మీటర్ల దూరాన్ని 100 మీటర్లకు లెక్కించినపుడు.. కన్నడ యువకుడు ‘జైమైకా చిరుత’ కన్నా 0.03 సెకండ్లు ముందంజలో ఉండటం విశేషం. రెండు దున్నపోతులతో పాటు పరుగెత్తే ఈ క్రీడను బురదమయమైన పంట పొలాల్లో నిర్వహిస్తారు. ఇక శ్రీనివాస గౌడ బోల్ట్ కన్నా వేగంగా పరెగెత్తుతున్నాడని సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. (ఇక్కడ చదవండి: ఏమి ఆ వేగం.. బోల్ట్‌ను మించి పోయాడు..!) -
ఏమి ఆ వేగం.. బోల్ట్‌ను మించి పోయాడు..!
-
ఏమి ఆ వేగం.. బోల్ట్‌ను మించి పోయాడు..!
సాక్షి, బెంగుళూరు : చిరుత పులిలా పరుగెత్తే స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ వేగం చూసి ఆశ్చర్యపోయాం. అబ్బురపడ్డాం..! మన పొరుగునే ఉన్న కర్ణాటక యువకుడొకరు అలాంటి వేగాన్నే పరిచయం చేశాడు. ప్రధానంగా మంగుళూరు, ఉడిపి ప్రాంతాల్లో నిర్వహించే సంప్రదాయ ‘కంబాల’క్రీడలో శ్రీనివాస గౌడ (28) ముప్పయ్ ఏళ్ల రికార్డును తిరగరాశాడు. దక్షిణ కన్నడ జిల్లాలోని మూడబిద్రికి చెందిన ఈ రేసర్ 13.62 సెకండ్లలో 142.50 మీటర్లు పరుగెత్తి.. ఉసేన్ బోల్ట్ (9.58 సెకండ్లలో 100 మీటర్లు) ప్రపంచ రికార్డును గుర్తు చేశాడు. 142.50 మీటర్ల దూరాన్ని 100 మీటర్లకు లెక్కించినపుడు.. కన్నడ యువకుడు ‘జైమైకా చిరుత’ కన్నా 0.03 సెకండ్లు ముందంజలో ఉండటం విశేషం. రెండు దున్నపోతులతో పాటు పరుగెత్తే ఈ క్రీడను బురదమయమైన పంట పొలాల్లో నిర్వహిస్తారు. ఇక శ్రీనివాస గౌడ బోల్ట్ కన్నా వేగంగా పరెగెత్తుతున్నాడని సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత ప్రభుత్వం అతన్ని ఒలింపిక్స్‌కు తయారు చేయించాలని కొందరు నెటిజన్లు సలహాలు ఇస్తున్నారు. అయితే, వేగంగా పరుగెత్తే దున్నల వల్లనే శ్రీనివాస గౌడ పరుగు ముడిపడి ఉందని గమనించడం మరువొద్దు..! కంబాల అంటే ఎంతో ఇష్టం.., ‘బురద పొలంలో రెండు దున్నలను పరుగెత్తిస్తూ.. వాటితో పాటు లక్ష్యాన్ని చేరుకోవడమే ఈ క్రీడ. సంస్కృతి పరిరక్షణే ధ్యేయంగా నిర్వహిస్తున్నకంబాల క్రీడలో ప్రధానంగా యువకులు పాల్గొంటారు. నాకు కంబాల అంటే ఎంతో ఇష్టం. ఈ విజయం నా దున్నల వల్లనే సాధ్యమైంది. అవి వేగంగా పరుగెత్తడంతో.. నేనూ అంతే వేగంగా పరుగెత్తగలిగా’అని శ్రీనివాస గౌడ ఆనందం వ్యక్తం చేశారు. ఇదిలాఉండగా.. పశువులను హింస పెడుతున్నారని జంతు ప్రేమికుల అభ్యంతరం గతంలో కొన్నాళ్లపాటు కంబాలను నిషేధించారు. సిద్ధరామయ్య ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ ఈ ఆటను పునరుద్ధరించారు. కంబాల ఆటలో గెలిచిన వారికి లక్షల్లో బహుమతి కూడా ఉంటుంది. -
‘బఫెలో రేస్’