ploughing field
-
నీ సంబడం సంతకెళ్లి పోను
‘గుర్రపు స్వారీ’ అనే మాట మనకు కొత్తేమీ కాదు. అయితే ‘దున్నపోతు స్వారీ’ అనే మాట వింటే మాత్రం ‘సారీ’ అంటాం. ‘బుల్ రైడర్ 007’ కాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోలో హెల్మెట్ ధరించిన ఒక యువకుడు దున్నపోతుపై కూర్చొని రోడ్డుపై పరుగులు తీస్తుంటాడు. ఆన్లైన్ యూజర్ల తిట్లు, శాపనార్థాల సంగతి ఎలా ఉన్నా చాలా తక్కువ సమయంలోనే ఈ వీడియో వైరల్ అయింది. 8 మిలియన్లకు పైగా వ్యూస్‌ను దక్కించుకుంది. ఈ రైడర్‌తో సెల్ఫీలు దిగడానికి రోడ్డు పక్కన ఉన్న జనాలు పరుగెత్తుకు రావడం మరో వినోద విడ్డూరం. ‘నో పెట్రోల్–నో సర్వీస్–నో లైసెన్స్’లాంటి కామెంట్స్‌తో పాటు ‘ఇది జంతు హింస తప్ప మరొకటి కాదు’ ... లాంటి కామెంట్స్ కనిపించాయి. -
రైతు పొలం దున్నుతుండగా.. పులి ఎంట్రీ.. ఆ తర్వాత..
లక్నో: జనావాసాల్లోకి పులులు వచ్చిన సందర్భాలను మనం చూశాం. వాటిని చూసి మనం సహజంగా భయాందోళనకు గురవుతాం. కానీ ఉత్తరప్రదేశ్‌లోని పిలిబిత్ జిల్లాలో ఓ అరుదైన ఘటన కెమెరాకు చిక్కింది. వ్యవసాయ పొలంలో రైతు ఓ పక్క సాగు చేస్తుంటే.. మరో పక్క పులి పొలంలో దర్జాగా తిరుగుతూ కనిపించింది. పితిబిత్ జిల్లాలో ఓ రైతు ఉదయాన్నే పొలం పనులకు వచ్చాడు. ట్రాక్టర్‌తో పొలాన్ని దున్నిస్తున్నాడు. ఈ క్రమంలో అక్కడికి ఓ పులి ఎంట్రీ ఇచ్చింది. వరిచేనులో సంచరిస్తూ కనిపించింది. పొలం దున్నతున్న రైతును ఏ మాత్రం పట్టించుకోకుండా సంచరించింది. ఈ దృశ్యాలను మరో రైతు కెమెరాలో బంధించాడు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. This is Pilibhit, UP A tiger roaming in the field & in the background farmer plowing the field. Video shot by another farmer. pic.twitter.com/LXjOv1HVho — Raj Lakhani (@captrajlakhani) July 12, 2023 ఈ వీడియోకు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కేవలం ఒక్కరోజులోనే 1,20,000 వ్యూస్ వచ్చాయి. 2,000 లైకులు వచ్చాయి. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. మనుషులు, జంతువులు కలిసి జీవించడం అంటే ఇదేనంటూ కామెంట్ చేశారు. టైగర్ గంభీరమైన నడకపై కొనియాడారు. మరో అవకాశం లేనప్పుడు టైగర్ కూడా గడ్డే తినాలి అంటూ మరికొందరు కామెంట్ చేశారు. పులులకు భారత్ పెట్టింది పేరు. దేశంలో ఇప్పటికీ 3000 పులులు ఉన్నాయి. పులుల సంరక్షణ చేపట్టిన దగ్గర నుంచి దేశంలో వీటి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇదీ చదవండి: టమాటాలకు కాపలాగా.. ముట్టుకుంటే అంతే సంగతులు.. -
స్టేషన్‌కి చేరిన దున్నపోతు పంచాయితీ! మాదంటే..మాది అని గొడవ
ఉండేది ఒకేఒక్క దేవర దున్నపోతు.. రోజుల వ్యవధిలో రెండు గ్రామాల్లో దేవర (జాతర) ఉంది. దేవరపోతు లేకుంటే జాతరే జరగదు. ఊరి దేవర చేయకపోతే గ్రామానికి అరిష్టమని అందరూ భావిస్తున్నారు. దీంతో ఉన్న ఒక్క దేవరపోతును వదులుకునేందుకు రెండు గ్రామాల ప్రజలు ఇష్ట పడడం లేదు. దీంతో ఆ దున్నపోతు తమదంటే.. తమదంటూ గ్రామస్తుల మధ్య వివాదం నెలకొంది. ఈ అంశాన్ని రెండు గ్రామాల పెద్దలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఉత్కంఠ నెలకొంది. సాక్షి, కణేకల్లు: కణేకల్లు మండలానికి పడమట అంబాపురం, ఉత్తరాన రచ్చుమర్రి గ్రామాలున్నాయి. పదేళ్లకోసారి ఊరి దేవర జరపడం ఈ రెండు గ్రామాల్లో ఆనవాయితీగా వస్తోంది. ఊరి దేవర జరిగిన నెల తర్వాత అమ్మవారి పేరున ఓ మూడు నెలల వయసున్న దున్నపోతును కొనుగోలు చేసి వదులుతుంటారు. ఈ క్రమంలో పదేళ్ల క్రితం ఈ రెండు గ్రామాల్లోనూ ఊరి దేవర ముగిసిన తర్వాత మళ్లీ దున్నపోతును అమ్మవారి పేరున వదిలేశారు. ప్రస్తుతం ఈ రెండు గ్రామాల్లో ఊరి దేవరకు గ్రామస్తులు పెద్త ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు. పట్టుదలకు పోయిన గ్రామ పెద్దలు.. ఈ నెల 17న అంబాపురంలో, మరో రెండు నెలల్లోపు రచ్చుమర్రిలో ఊరి దేవర నిర్వహించాలని గ్రామ పెద్దలు నిశ్చయించారు. ఈ క్రమంలో తాము అమ్మవారి పేరుతో వదిలిన దేవర దున్నపోతు కోసం అంబాపురం గ్రామస్తులు నెల రోజులుగా వివిధ ప్రాంతాల్లో గాలించి, చివరకు బొమ్మనహాళ్ మంలడం కొలగానహళ్లిలో కనిపించిన దున్నపోతును తీసుకెళ్లి గ్రామంలోని బందులదొడ్డిలో బంధించారు. విషయం తెలుసుకున్న ఉద్దేహాళ్ గ్రామస్తులు అంబాపురానికి చేరుకుని బందులదొడ్డిలో ఉంచిన దున్నపోతును గమనించి, అది తమదని వాదనకు దిగారు. అయితే ఆ పోతు తమదేనంటూ అంబాపురం వాసులు నచ్చచెప్పడంతో వారు వెనుదిరిగారు. ఈ సమస్య సద్దుమణిగిందనుకుంటున్న తరుణంలో రచ్చుమర్రి గ్రామస్తులొచ్చి పోతు తమదేనంటూ భీష్మించారు. తాము వదిలిన దున్నపోతును ఎలా బంధిస్తారంటూ అంబాపురం గ్రామ పెద్దలను నిలదీశారు. వారం రోజులుగా ఇరు గ్రామాల మధ్య ఈ వివాదం చెలరేగుతూ వస్తోంది. ఇరు గ్రామాల పెద్దలు పట్టుదలకు పోయి విశ్వ ప్రయత్నాలు చేస్తుండడంతో పలు మార్లు పంచాయితీలూ జరిగాయి. ఎవరూ రాజీ పడలేదు. ఊరి దేవరకు తేదీ నిశ్చయించుకున్నామని, ఊరంతా సంబరాలకు సిద్ధమైన తరుణంలో ఇలా ఘర్షనకు దిగడం సరికాదంటూ అంబాపురం వాసులు అంటున్నారు. అయితే ఈ పోతును వదులుకుంటే రెండు నెలల్లోపు తమ గ్రామంలో ఊరి దేవర ఎలా జరుపుకోవాలంటూ రచ్చుమర్రి వాసులు నిలదీస్తున్నారు. దీంతో పోతును వదులుకునేందుకు ఇరు గ్రామస్తులూ సిద్ధంగా లేకపోవడంతో వివాదం మరింత ముదిరింది. స్టేషన్‌కు చేరినా తెగని పంచాయితీ.. చివరకు దేవర పోతు సమస్య కణేకల్లు పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. రెండు గ్రామాల పెద్దల మధ్య సఖ్యత కుదిర్చేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆ పోతు తమదంటే తమదంటూ స్టేషన్లోనే రెండు గ్రామాల ప్రజలు మొండిగా వాదనకు దిగారు. దీంతో ఎవరికీ సర్ది చెప్పలేక పోలీసు అధికారులు తలలు పట్టుకున్నారు. పోతు కోసం తాము ఎందాకైనా పోతామంటూ ఒకరిపై మరొకరు సవాల్ విసురుకుంటున్నారు. ఈ క్రమంలో అంబాపురంలో రేయింబవళ్లూ దున్నపోతుకు యువకులు పహారా కాస్తున్నారు. గ్రామంలో కొత్త వ్యక్తుల కదలికలపై పటిష్ట నిఘా వేశారు. (చదవండి: -
తుపాకీ పట్టిన చేతులతో మేడి పట్టిన మాజీ సైనికులు
తుపాకీ చేతపట్టి సరిహద్దు రేఖపై పహారా కాసిన వారే.. నాగలి చేతబూని పంటచేలో సేద్యం చేస్తున్నారు. ప్రాణాలకు తెగించి దేశం కోసం పరితపించిన వారే నిరంతర శ్రామికులై శ్వేదం చిందిస్తూ అన్నదాతలుగా మారారు. వేలాది మంది సైనికులు, మాజీ సైనికులకు నిలయమైన జిల్లాలో ఏళ్ల తరబడి దేశసేవలో తరించిన మాజీ సైనికులు వ్యవసాయ అనుబంధ రంగాల్లో రాణిస్తున్నారు. కష్టం మాకు లెక్కేం కాదంటూ అవిశ్రాంతంగా మండుటెండల్లో.. పంట చేలల్లో కాయకష్టం చేస్తూ గర్వంగా మీసం మెలేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జై జవాన్.. జై కిసాన్.. అన్న నినాదాన్ని సార్థకం చేస్తున్నారు ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ సైనికులు. జిల్లాలో దేశానికి సేవ చేసిన.. చేస్తున్న జవాన్లు వేల సంఖ్యలో ఉన్నారు. సైనికులకు పశ్చిమ ప్రకాశం పెట్టింది పేరు. ప్రధానంగా గిద్దలూరు నియోజకవర్గంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న సైనికులు, మాజీ సైనికులతో పోల్చుకుంటే అత్యధిక శాతం ఉన్నారు. నియోజకవర్గంలోని అర్థవీడు మండలం జిల్లాలోనే అత్యధికంగా సైనికులు, మాజీ సైనికులున్న మండలంగా గుర్తింపు పొందింది. ఆ తరువాత స్థానాల్లో కూడా గిద్దలూరు నియోజకవర్గంలోని కొమరోలు, బేస్తవారిపేట, రాచర్ల, కంభం మండలాలున్నాయి. ఆ తరువాత స్థానాల్లో కనిగిరి నియోజకవర్గం, మార్కాపురం నియోజకవర్గాలు ఉన్నాయి. దేశానికి సేవలందించటంలో జిల్లాకు గుర్తింపు దేశ సేవలో వేలాది మంది జిల్లావాసులు పునీతులయ్యారు. జిల్లా వ్యాప్తంగా మాజీ సైనికులు 28 వేల మంది ఉన్నారు. అదేవిధంగా ప్రస్తుతం దాదాపు 15 వేల మందికి పైగా త్రివిధ దళాల్లో పనిచేస్తున్నారు. గ్రామాలకు గ్రామాలే సైన్యంలో పనిచేస్తున్నారు. మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం, పాకిస్థాన్, చైనాతో జరిగిన యుద్ధాల్లోనూ జిల్లా సైనికులు అత్యంత సాహసాన్ని కనబరిచారు. కార్గిల్‌లాంటి యుద్ధాల్లో ప్రాణాలు ఫణంగా పెట్టారు. త్రివిధ దళాల్లో 15 నుంచి 30 సంవత్సరాల వరకు సేలందించి పదవీ విరమణ చేసిన వారు వేల సంఖ్యలో ఉన్నారు. సైనికులుగా పనిచేసిన తరువాత వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలు కూడా పొందే అవకాశం మాజీ సైనికులకు ఉంటుంది. అలా వెళ్లిన వారు కొంతమంది మాత్రమే ఉంటారు. మరికొంతమంది వివిధ రంగాల్లో అంటే వ్యాపారాలు, పరిశ్రమలు, ఇతర రంగాల్లో స్థిరపడ్డారు. ఎక్కువ మంది వ్యవసాయం మీద మక్కువతో కష్టమైనా ఇష్టంగా పనిచేస్తున్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లోనే అత్యధికంగా.. సైనికుడంటే ఒక క్రమశిక్షణతో కూడిన జీవనం. ఆ క్రమశిక్షణ సోమరితనాన్ని పారదోలుతుంది. జవానుగా పదవీ విరమణ చేసిన వేలాది మంది మాజీ సైనికులు విశ్రాంత జీవితాన్ని ఖాళీగా గడపకుండా.. వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాల్లో రాణిస్తున్నారు. మాజీ సైనికులు ఇతర రంగాలతో పోల్చుకుంటే వ్యవసాయ అనుబంధ రంగాల్లో స్థిరపడినవారి సంఖ్య అధికంగా ఉంది. ప్రధానంగా పశ్చిమ ప్రాంతంలో వీరి సంఖ్య దాదాపు 10 వేల మంది వరకు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. వ్యవసాయ, ఉద్యాన పంటలు ఎక్కువగా సాగు చేస్తున్నారు. మరికొందరు పశువుల పెంపకం ప్రధాన వృత్తిగా చేసుకున్నారు. కొందరు వ్యవసాయంతోపాటు చేపల చెరువులు వేస్తూ అందులో మంచి ఫలితాలు సాధిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వ్యవసాయం, చేపల పెంపకంతో.. ఇతని పేరు దూదేకుల మౌలాలి. రాచర్ల మండలంలోని గుడిమెట్ట కొత్తపల్లె గ్రామానికి చెందిన ఈయన 26 ఏళ్లపాటు ఆర్మీ జవానుగా పని చేసి 2018లో పదవీ విరమణ చేశారు. అనంతరం స్వగ్రామానికి వచ్చి కుటుంబ సభ్యులతో కలిసి వారికున్న 6.50 ఎకరాల వ్యవసాయ భూమిని సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. టమోటా, మిరప, బత్తాయి, పత్తి పంటలతో పాటు చేపల పెంపకం చేపడుతున్నారు. తక్కువ ఆదాయం వస్తున్నా వ్యవసాయంపై మక్కువతో పంటలు సాగుచేస్తున్నట్లు మౌలాలి చెబుతున్నారు. జత ఎడ్లతో పాటు, నాలుగు పాడి గేదెలను పెంచుకుంటున్నారు. కుటుంబంలోని అందరూ వ్యవసాయ పనులు చేసుకుంటూ మరికొంత మందికి తన వ్యవసాయం, చేపల పెంపకం ద్వారా ఉపాధి కల్పిస్తున్నారు. పొలం కౌలుకు తీసుకొని.. రాచర్ల మండలం అంకిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన కఠారు పూర్ణ రంగయ్య 22 ఏళ్ల పాటు మిలిటరీలో పనిచేశారు. తనకు పెన్షన్ వస్తున్నా, మిలిటరీ క్యాంటీన్లో కావాల్సిన వస్తువులు నాణ్యమైనవి, తక్కువ ధరకు వస్తున్నా సరిపెట్టుకోలేదు. శరీరంలో శక్తి ఉన్నంత వరకు ఖాళీగా ఉండకూడదని నిర్ణయించుకున్నారు. తనకు పొలం లేకపోయినా 4 ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నారు. ఆ పొలంలో ఒక ఎకరంలో వరి సాగుచేస్తుండగా మిగతా మూడెకరాల్లో మిర్చితో పాటు కూరగాయల సాగు చేపడుతూ శ్రమను నమ్ముకున్నారు. భార్యాభర్తలు ఇద్దరూ కష్టపడుతూ కౌలుకు తీసుకున్న పొలం అయినా ఇష్టంగా పంటలు పండిస్తున్నారు. పెట్టుబడి, కౌలు ఖర్చులు, కూలీ ఖర్చులు పోనూ ప్రతి సంవత్సరం ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. (క్లిక్ చేయండి: వెలుగులు విరజిమ్మనున్న చీమకుర్తి గెలాక్సీ గ్రానైట్) -
మూఢ విశ్వాసం: ఆడపిల్ల దున్నితే అరిష్టమట! తగ్గేదెలే!
రెండు రోజుల క్రితం జార్ఖండ్‌లో ఈ వింత జరిగింది. తన పొలంలో దున్నడానికి కొత్తగా కొనుక్కున్న ట్రాక్టర్‌తో బయలుదేరిన 22 ఏళ్ల యువతి మంజును గ్రామస్తులు ఆపేశారు. ఆడపిల్ల పొలం దున్నడం అరిష్టమన్నారు. మహమ్మారి కమ్ముకుంటుందన్నారు. జరిమానా వేస్తామన్నారు. సాంఘిక బహిష్కరణ చేస్తామన్నారు. మంజు లెక్క చేయలేదు. బుద్ధి, జ్ఞానం ఉన్న ఎవరైనా అదే పని చేస్తారు కదా. ఆడపిల్ల ఎదిగితే ఆపాలని మూఢ విశ్వాసాల పేరుతో చూసే కుట్ర ఇది. జార్ఖండ్ రాష్ట్రం. గుమ్లా జిల్లా. సిసాయి మండలం. డహుటోలి గ్రామం. 22 ఏళ్ల మంజూ ఉరవ్ తన పొలం మీద వచ్చిన ఆదాయంతో సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ కొంది. ట్రాక్టర్ నడపడం నేర్చుకుంది. దాంతో తన పొలం దున్నుకోవాలనుకుంది. ఆడపిల్ల పొలం ఎందుకు దున్నాలనుకుంటోంది? మంజు డిగ్రీ ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయ్యింది. అయితే ఉద్యోగం వెతుక్కునేలోపు కరోనా వచ్చి పడింది. ఊళ్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. మంజూకు తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఐదెకరాల పొలం ఉంది. చిన్నప్పటి నుంచి పొలం పనులు చేస్తూ పెరిగింది. ఈ కరోనా ఎప్పుడు పోతుందోనని వ్యవసాయం మొదలెట్టింది. చదువుకున్న అమ్మాయి, పైగా వ్యవసాయం అంటే ఇష్టం. కష్టపడే తత్వం ఉంది. ఐదెకరాల్లో వరి, మొక్కజొన్న, బంగాళాదుంప, టొమాటో వేసింది. రెండేళ్లు చేసిన సేద్యం ఆమెకు లాభం తెచ్చింది. జబ్బల్లో సత్తువ ఉంటే ఎవరు అడ్డుకుంటారు. ఇంకో పదెకరాల పొలం ఇటీవల కౌలుకు తీసుకుంది. అంటే ఇప్పుడు తన కింద 15 ఎకరాలు ఉన్నాయన్న మాట. అన్ని ఎకరాల పొలం దున్నాలంటే ట్రాక్టర్ ఉంటే మేలు కదా. కొత్త ట్రాక్టరుకు డబ్బు లేదు. సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ కొంది. తన పొలం తనే దున్నుకోగలదు అనుకుంది. అయితే ఈమె పాటికి ఈమె ఇలా డెవలప్ అయిపోతే ఎలా అనుకున్నారో నిజంగానే ఈమె ప్రతాపానికి భయపడ్డారోగాని పొలం దున్నుకోవడం మొదలెట్టిన మంజూను గ్రామస్తులు అడ్డుకున్నారు. పంచాయతీ పెట్టి పిలిపించారు. మంజూ వెళ్లింది. ‘దుక్కి దున్నే పని మగవాడిది. ఆ సంగతి నీకు తెలియదు. మగవాళ్లు కాకుండా ఆడవాళ్లు నాగలి పట్టినా, ట్రాక్టర్‌తో దున్నినా ఊరికి అరిష్టం. కరువొచ్చి పడుతుంది. లేని పోని మహమ్మారులు చుట్టు ముడతాయి. కనుక వెంటనే నువ్వు దున్నడం ఆపేయాలి. తప్పు కట్టి ఇక ఈ పని చేయనని హామీ ఇవ్వాలి. కాదూ కూడదని మళ్లీ దున్నావో నిన్ను, నీ కుటుంబాన్ని ఊరి నుంచి బహిష్కరిస్తాం’ అన్నారు. మంజు జంకలేదు ‘ఇవాళ ఆడపిల్లలు రాకెట్లు ఎక్కి అంతరిక్షానికి వెళుతుంటే నేను నేల మీద దున్నకూడదా? ఇలాగని ఏ పుస్తకంలో ఉంది. అమ్మాయి మంచి పని చేస్తున్నదని మెచ్చుకోవాల్సింది పోయి అడ్డు పుల్ల వేస్తారా? మీరు చెప్తే ఆగేది లేదు. మీరు చెప్పిన తప్పు కట్టేది లేదు. ఏం చేసుకుంటారో చేసుకోండి’ అని ట్రాక్టర్ ఎక్కి పని చేసుకోవడానికి వెళ్లిపోయింది. మీడియాకు ఈ సంగతి తెలిసి వార్తయ్యింది. లోకల్ పోలీసులు ఇరు వర్గాలను కూచోబెట్టి ‘ఇది మూఢ విశ్వాసం. ఆ అమ్మాయిని దండించేందుకు పంచాయితీకి హక్కు లేదు. అలా ఆపడానికి లేదు’ అని ఊరి పెద్దలకు చెప్పారు. ఊరు వింటేగా? ఎందుకు? ఒక అమ్మాయి తన కాళ్ల మీద తాను నిలబడి సక్సెస్ఫుల్ రైతుగా ఎదిగితే కుర్రకారు దానిని స్ఫూర్తిగా తీసుకోవాల్సింది పోయి అవమానంగా భావిస్తారు. పేదవాళ్లు పేదగా ఉండాలిగాని ఇలా ఎదిగితే ఉన్నోళ్లు కన్నెర్ర చేస్తారు. ఆడవాళ్లు నాలుగ్గోడల్లో ఉండకుండా ఇలా ఆత్మవిశ్వాసం ప్రదర్శిస్తే మగవాళ్లు ఆగ్రహిస్తారు. వీటన్నింటి ఫలితమే ‘అరిష్టం’ అనే మూఢవిశ్వాసం. ఆడవాళ్లు ముందుకు సాగేకొద్ది ఎక్కడో ఒక చోట అడ్డు పడే పురుష ప్రపంచం ఉంటుంది. వారిని ఓడించి ముందుకు సాగే మంజు వంటి యువతులూ ఉంటారు. ఉండాలి కూడా. ఇవాళ ఆడపిల్లలు రాకెట్లు ఎక్కి అంతరిక్షానికి వెళుతుంటే నేను నేల మీద దున్నకూడదా? ఇలాగని ఏ పుస్తకంలో ఉంది. అమ్మాయి మంచి పని చేస్తున్నదని మెచ్చుకోవాల్సింది పోయి అడ్డుపుల్ల వేస్తారా? మీరు చెప్తే ఆగేది లేదు. మీరు చెప్పిన తప్పు కట్టేది లేదు. ఏం చేసుకుంటారో చేసుకోండి. – మంజూ ఉరవ్ -
దీనస్థితిలో కాడెద్దులుగా మారిన రైతులు
-
శ్రీమంతుడి తండ్రి వీడియో హల్చల్
శ్రీమంతుడు సినిమాలో కొడుకు పాత్ర పోషించిన మహేష్ బాబు పల్లెల్లో తిరుగుతూ.. వాటి అభివృద్ధి కోసం కృషిచేసే పాత్రలో కనపడితే, అతడి తండ్రి పాత్ర పోషించిన జగపతి బాబు మాత్రం పూర్తి సూటు, బూటు వేసుకుని విమానాల్లో తిరుగుతూ పెద్ద బిజినెస్ మాగ్నెట్‌లా కనపడతారు. కానీ నిజజీవితంలో జగపతి బాబు ఏం చేస్తున్నారో తెలుసా.. పొలం దున్నుతున్నారు. అవును.. స్వతహాగా గ్రామీణ వాతావరణం అంటే ఇష్టమున్న జగపతి బాబు ట్రాక్టర్ నడుపుతూ మరికొందరితో కలిసి పొలాన్ని దున్నుతున్నారు. ఆ వీడియోను జగ్గుభాయ్ శుక్రవారం మధ్యాహ్నం తన ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. అప్పుడే ఆ వీడియోను దాదాపు 22వేల మంది చూసేశారు. అలాగే దానికి లైకులు కూడా బాగానే వస్తున్నాయి. ఈ వీడియోలో జగ్గుభాయ్ అచ్చతెలుగు పెద్దమనిషిలా పంచెకట్టుకుని, తలపాగా చుట్టుకుని ట్రాక్టర్ నడుపుతూ కనిపిస్తారు. కేవలం 25 సెకన్లు మాత్రమే ఉన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆ వీడియో మీరు కూడా చూడండి..