
లక్నో: జనావాసాల్లోకి పులులు వచ్చిన సందర్భాలను మనం చూశాం. వాటిని చూసి మనం సహజంగా భయాందోళనకు గురవుతాం. కానీ ఉత్తరప్రదేశ్‌లోని పిలిబిత్ జిల్లాలో ఓ అరుదైన ఘటన కెమెరాకు చిక్కింది. వ్యవసాయ పొలంలో రైతు ఓ పక్క సాగు చేస్తుంటే.. మరో పక్క పులి పొలంలో దర్జాగా తిరుగుతూ కనిపించింది.
పితిబిత్ జిల్లాలో ఓ రైతు ఉదయాన్నే పొలం పనులకు వచ్చాడు. ట్రాక్టర్‌తో పొలాన్ని దున్నిస్తున్నాడు. ఈ క్రమంలో అక్కడికి ఓ పులి ఎంట్రీ ఇచ్చింది. వరిచేనులో సంచరిస్తూ కనిపించింది. పొలం దున్నతున్న రైతును ఏ మాత్రం పట్టించుకోకుండా సంచరించింది. ఈ దృశ్యాలను మరో రైతు కెమెరాలో బంధించాడు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
This is Pilibhit, UP
— Raj Lakhani (@captrajlakhani) July 12, 2023
A tiger roaming in the field & in the background farmer plowing the field.
Video shot by another farmer. pic.twitter.com/LXjOv1HVho
ఈ వీడియోకు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కేవలం ఒక్కరోజులోనే 1,20,000 వ్యూస్ వచ్చాయి. 2,000 లైకులు వచ్చాయి. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. మనుషులు, జంతువులు కలిసి జీవించడం అంటే ఇదేనంటూ కామెంట్ చేశారు. టైగర్ గంభీరమైన నడకపై కొనియాడారు. మరో అవకాశం లేనప్పుడు టైగర్ కూడా గడ్డే తినాలి అంటూ మరికొందరు కామెంట్ చేశారు.
పులులకు భారత్ పెట్టింది పేరు. దేశంలో ఇప్పటికీ 3000 పులులు ఉన్నాయి. పులుల సంరక్షణ చేపట్టిన దగ్గర నుంచి దేశంలో వీటి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
ఇదీ చదవండి: టమాటాలకు కాపలాగా.. ముట్టుకుంటే అంతే సంగతులు..
Comments
Please login to add a commentAdd a comment