సాక్షి, చేవెళ్ల: హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతున్న వ్యక్తిని ఆపిన ట్రాఫిక్ పోలీసులపై ఓ వాహనదారుడు విరుచుకుపడ్డారు. పోలీసులు ప్రజల సమయాన్ని వృథా చేస్తున్నారని వాదించాడు. ఈ ఘటన చేవెళ్ల పీఎస్ పరిధిలోని షాబాద్ చౌరస్తాలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని చనువెళ్లి గ్రామానికి చెందిన సుధాకర్‌రెడ్డి హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్నాడు. అప్పటికే షాబాద్ చౌరస్తాలో రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు.
సుధాకర్‌రెడ్డి వాహనాన్ని ఆపారు. ఆయన వాహనాన్ని నిలుపకపోవడంతో పోలీసులు వెంబడించి అడ్డుకున్నారు. దీంతో ఆయన మీకు వాహనాలు ఆపి ప్రజల సమయం వృథా చేసే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించాడు. మీరంతా మా జీతగాళ్లు అంటూ వాదించాడు. పోలీసులను అసభ్య పదజాలంతో దూషించాడు. పోలీసుల విధులకు భంగం కలిగించినందుకుగాను సుధాకర్‌రెడ్డిపై చేవెళ్ల పీఎస్‌లో ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే పోలీసులతో సుధాకర్‌రెడ్డి వారించిన వీడియోలు సామాజికమాధ్యమాల్లో వైరల్ చేశారు.
చదవండి: దారుణం: ఆసుపత్రి ఆవరణలో ఉమ్మొద్దు అన్నందుకు దాడి!
Comments
Please login to add a commentAdd a comment