
కొచ్చి:కేరళలో ఏనుగుల ఆగ్రహానికి వీడియో జర్నలిస్టు బలయ్యాడు. పాలక్కాడ్‌లో ఏనుగుల గుంపు దృశ్యాలు చిత్రీకరిస్తుండగా ఓ ఏనుగు ముఖేష్(34) అనే వీడియో జర్నలిస్టుపై దాడి చేసింది. ఈ దాడిలో ముఖేష్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడ్డ ముఖేష్‌ను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
దారితప్పిన ఏనుగుల గుంపు మలంబుజా, కంజికోడ్‌ల మధ్య నది దాటుతుండగా వీడియో తీస్తున్నపుడు ముఖేష్‌పై దాడి జరిగింది. టీవీ ఛానల్ రిపోర్టర్, డ్రైవర్ మాత్రం వాహనంలో అక్కడి నుంచి తప్పించుకున్నారు.
కాగా, ముఖేష్ తన వేతనంలో కొంత సామాజిక కార్యక్రమాలకు ఖర్చు చేసే మనస్తత్వమున్న వ్యక్తి అని స్నేహితులు చెప్పారు. ముఖేష్ మృతి పట్ల సీఎం పినరయి విజయన్, ప్రతిపక్ష నాయకుడు వీడీ సతీషన్ తదితరులు సంతాపం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment