భోపాల్: ఇటీవలి కాలంలో మధ్యప్రదేశ్‌లోని బాంధవ్‌గఢ్ అభయారణ్యంలో 10 ఏనుగులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాయి. దీనినిపై విచారణ జరిపిన అటవీశాఖ అధికారులు వీటి మృతికి ‘న్యూరోటాక్సిన్ సైక్లోపియాజోనిక్ ఆమ్లం’ కారణమని తెలిపారు. ఏనుగులకు విషం ఇవ్వడం కారణంగానే అవి మరణించాయని వస్తున్న వార్తలను ఒక అటవీశాఖ అధికారి ఖండించారు. వాటి మృతికి విషపూరితమైన మొక్కలు కారణమని స్పష్టం చేశారు.
అదనపు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (వైల్డ్ లైఫ్) ఎల్. కృష్ణమూర్తి మాట్లాడుతూ ఏనుగులు పెద్ద మొత్తంలో ‘కోడో’ మొక్కలను తినడం వలన వాటి శరీరంలోకి విషం వ్యాపించిందని అన్నారు. అక్టోబర్ 29 బాంధవ్‌గఢ్ పులుల అభయారణ్యంలో నాలుగు ఏనుగులు మృతిచెందాయి. ఆ తరువాత వాటి మరణాల సంఖ్య 10కి చేరింది.
ఇంత పెద్ద సంఖ్యలో ఏనుగులు చనిపోయిన దరిమిలా ప్రభుత్వం దీనిపై దర్యాప్తునకు ఒక కమిటీని నియమించింది. ఈ దర్యాప్తులో కోడో మొక్కలే ఆ ఏనుగుల మృతికి కారణమై ఉండవచ్చని తేలింది. కాగా ఏనుగుల మృతి గురించి తెలిసిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ వెంటనే స్పందించారు. ఏనుగుల మరణాలను నివారించడం, మానవులపై వాటి దాడులను ఆపడం అనే లక్ష్యంతో దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.
ఇది కూడా చదవండి: ప్లీజ్... ఇంకో బిడ్డను కనవచ్చు కదా!
Comments
Please login to add a commentAdd a comment