కేరళ: తెల్లవారుజామున.. సూర్యుడు అప్పుడప్పుడే ఉదయిస్తున్నాడు.. ఈ సమయంలో రోడ్డుపై దూసుకెళ్తుండగా అడ్డం వచ్చిన చిరుతపులిని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. ఫలితంగా ఆ చిరుత పులి తీవ్రంగా గాయపడి మృతిచెందింది. అయితే అటవీ ప్రాంతంలో వాహనాల ప్రయాణాలపై నిషేధం ఉన్నా పట్టించుకోకపోవడంతో ఫలితం వన్యమృగం కన్నుమూసింది. ఈ ఘటన కేరళలోని పాలక్కాడ్ జిల్లా ముల్లి-పిల్లర్ డ్యామ్‌కు సమీపంలో మోనార్ ప్రాంతంలో జరిగింది. నీలగిరి కొండల ప్రాంతం దట్టమైన అడవి. ఇక్కడ అధిక సంఖ్యలో పులులు ఉంటాయి.
డ్యామ్‌కు సమీపంలోని మోనార్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం 6.30 సమయంలో రోడ్డుపై నుంచి చిరుత సంచరిస్తోంది. ఈ సమయంలో ఒక్కసారిగా దూసుకొచ్చిన గుర్తు తెలియని వాహనం పులిని ఢీకొట్టింది. దీంతో పులి ఎగిరిపడి రోడ్డు అవతల పడిపోయిందని కోయంబత్తూర్ అటవీ శాఖ అధికారి సుకుమార్ తెలిపారు. ఘటన సమాచారం అందడంతో అటవీ అధికారులు సింహాన్ని పరిశీలించగా తీవ్ర గాయాలతో పడి ఉంది. వెంటనే దాన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే మెడ, తోక, పొట్ట భాగంలో తీవ్ర గాయాలవడంతో పులి కన్నుమూసింది. పులికి పోస్టుమార్టం చేశారు. పులిని ఢీకొట్టిన వాహనం వివరాలు అధికారులు సేకరిస్తున్నారు. అటవీ ప్రాంతంలో వేగంగా నడిపి ఓ వన్యమృగం ప్రాణం తీసిన అంశంపై కేసు నమోదు చేసే అవకాశం ఉంది.
చదవండి: సెల్ఫీ తీసుకుంటూ ఫోన్‌తో నీటిలోకి కొట్టుకుపోయిన బాలుడు
చదవండి: డబ్బుల్లేక భార్యతో గొడవ.. కూతుళ్లతో విషం తాగి
Comments
Please login to add a commentAdd a comment