రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వైద్య విద్యార్థులు మృతి | Kerala Five medical Students Killed in Alappuzha car bus Collision | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వైద్య విద్యార్థులు మృతి

Published Tue, Dec 3 2024 7:30 AM | Last Updated on Tue, Dec 3 2024 7:30 AM

Kerala Five medical Students Killed in Alappuzha car bus Collision

అలప్పుజ: కేరళలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.  అలప్పుజలో కారు, బస్సు  ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఐదుగురు వైద్య విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

బస్సు అతివేగంగా వచ్చి, కారును ఢీకొన్నదని స్థానికులు చెబుతున్నారు. బాధితులను వందనం మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న ముహ్సిన్, మహమ్మద్, ఇబ్రహీం, దేవన్‌లుగా గుర్తించారు. ఈ ఘటనలో కారు పూర్తిగా ధ్వంసమయ్యింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు విద్యార్థులను వందనం మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు.

ప్రాథమిక నివేదికల ప్రకారం మృతులు కోజికోడ్, కన్నూర్, చేర్యాల, లక్షద్వీప్‌కు చెందినవారు. ఈ ప్రమాదంలో కేఎస్‌ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఆస్పత్రిలో వారు చికిత్స పొందుతున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు.

ఇది కూడా చదవండి: Bangladesh: చిన్మయ్ కృష్ణ దాస్ తరపు న్యాయవాదిపై దాడి.. పరిస్థితి విషమం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement