Alappuzha
-
రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వైద్య విద్యార్థులు మృతి
అలప్పుజ: కేరళలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అలప్పుజలో కారు, బస్సు ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఐదుగురు వైద్య విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.బస్సు అతివేగంగా వచ్చి, కారును ఢీకొన్నదని స్థానికులు చెబుతున్నారు. బాధితులను వందనం మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న ముహ్సిన్, మహమ్మద్, ఇబ్రహీం, దేవన్‌లుగా గుర్తించారు. ఈ ఘటనలో కారు పూర్తిగా ధ్వంసమయ్యింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు విద్యార్థులను వందనం మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు.ప్రాథమిక నివేదికల ప్రకారం మృతులు కోజికోడ్, కన్నూర్, చేర్యాల, లక్షద్వీప్‌కు చెందినవారు. ఈ ప్రమాదంలో కేఎస్ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఆస్పత్రిలో వారు చికిత్స పొందుతున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు.ఇది కూడా చదవండి: Bangladesh: చిన్మయ్ కృష్ణ దాస్ తరపు న్యాయవాదిపై దాడి.. పరిస్థితి విషమం -
హనీమూన్ డెస్టినేషన్ : పడవింట్లో విహారం!
కేరళ ప్రకృతి సౌందర్యానికి నెలవు అని తెలిసిందే. ఈ సంగతిని గ్రహించిన కేరళ వాళ్లు గాడ్స్ ఓన్ కంట్రీ అనే విశేషణంతో పర్యాటకరంగాన్ని తమ వైపు తిప్పుకున్నారు. టూరిజమే ప్రధాన ఉ΄ాధి మార్గంగా ఉన్న ఉత్తరాఖండ్ వాళ్లు కూడా తమది దేవభూమి అని చెప్పుకుంటారు. ప్రకృతి వాళ్లకిచ్చిన ప్రివిలేజ్ అది. ఈ సీజన్లో కేరళలో చూడాల్సిన ప్రదేశం అలెప్పీ... అదే అళప్పుఱపడవింట్లో విహారంహౌస్బోట్ విహారం అళప్పుఱ ప్రత్యేకం. హనీమూన్ కపుల్ కోసం అందమైన హౌస్బోట్లుంటాయి. అరేబియా సముద్రంతోపాటు నదులు, చిన్న చిన్న నీటి పాయల్లో విహారం, భోజనం, రాత్రి బస కూడా హౌస్‌బోట్‌లోనే. కేరళ ఆహారం చేప లేకుండా ఉండదు. శాకాహారం కావాలంటే ముందుగా చెప్పాలి. కొబ్బరి నూనెతో వండిన వంటలు తేలిగ్గా జీర్ణమవుతాయి. కేరళలో సంతృప్తిగా భోజనం చేసినప్పటికీ మళ్లీ త్వరగా ఆకలి వేస్తుంది. జర్నీలో చిరుతిండి దగ్గరుంచుకోక తప్పదు. ఇక్కడ కొబ్బరి హల్వా, అరటి కాయ చిప్స్ రుచిగా ఉంటాయి. పర్యాటకులు కేరళలో కొబ్బరి నీటిని అమృతంలాగ తాగుతుంటే స్థానికులు మాత్రం థమ్స్ అప్, స్ప్రైట్ తాగుతుంటారు. ఇక్కడ మార్కెట్లో రకరకాల అరటిపండ్లు ఉంటాయి. తప్పకుండా రుచి చూడాలి. -
ఇంట్లోనే ప్రసవించిన మహిళ.. బిడ్డను బాత్రూం బకెట్లో పెట్టి..
తిరువనంతపురం: కేరళ అలప్పుజలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ నిండు గర్భిణి ఇంట్లోనే ప్రసవించింది. దీంతో ఆమెకు తీవ్ర రక్తస్రావమైంది. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో తన బిడ్డను ఓ వస్త్రంలో చుట్టి బాత్రూంలోని బకెట్లో పెట్టి ఆస్పత్రికి వెళ్లింది. ఇంట్లో బకెట్లో ఉన్న బిడ్డను కాపాడాలని వైద్యులను కోరింది. ఆస్పత్రి అధికారులు వెంటనే ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందించారు. నవజాత శిశువును కాపాడాలని విజ్ఞప్తి చేశారు. దీంతో పోలీసులు హుటాహుటిన బయల్దేరి వెళ్లారు. బాత్రూంలో బకెట్లో ఉన్న పసికందును బయటకు తీసుకొచ్చారు. తక్షణమే చెన్నగూర్లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. శిశువు బరువు 1.3 కీజీలు ఉన్నట్లు తెలిపారు. శిశువును ఆస్పత్రిలో చేర్చిన అనంతరం బాగోగులు చూసుకునే బాధ్యతను పథానంతిట్ట చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించారు పోలీసులు. వలంటీర్ల సహకారంతో మెరుగైన చికిత్స కోసం చిన్నారిని కొట్టాయం మెడికల్ ఆస్పత్రికి తరలించారు. అయితే మహిళ ప్రసవించినప్పుడు ఆమె చుట్టుపక్కల ఎవరూ లేనట్లు తెలుస్తోంది. తీవ్ర రక్తస్రావం కావడంతో బిడ్డను పట్టుకునే శక్తి లేక బకెట్లోనే పెట్టి చెన్నగూర్ ఆస్పత్రికి వెళ్లి అడ్మిట్ అయింది. జరిగిన విషయాన్ని అక్కడి అధికారులకు చెప్పింది. ప్రస్తుతం తల్లీబిడ్డలు ఆరోగ్యంగానే ఉన్నట్లు సమాచారం. చదవండి: ప్రియుడ్ని చంపి ముక్కలు ముక్కలుగా నరికిన ప్రియురాలు.. 400 కిలోమీటర్లు తీసుకెళ్లి బీచ్‌లో.. -
ఘోర ప్రమాదం.. ఇస్రో క్యాంటీన్లో పనిచేసే ఉద్యోగులు దుర్మరణం
తిరువనంతపురం: కేరళ అలప్పూజ జిల్లా అంబలపూజలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆంధ్రప్రదేశ్ నుంచి రైస్ లోడుతో వెళ్తున్న లారీ, కారు ఢీకొన్న ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. నలుగురు అక్కడికక్కడే మరణించగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. సోమవారం ఉదయం 1:30 గంటల సమయంలో జాతీయ రాహదారిపై ఈ దుర్ఘటన జరిగింది. మృతులను ప్రసాద్, శిజు, అమల్, సచిన్, సుమోద్‌గా గుర్తించారు. వీరంతా తిరువనంతపురంలోని ఇస్రో క్యాంటీన్లో పనిచేస్తున్నారు. మృతుల్లో నలుగురు తిరువనంతపురానికే చెందిన వారు కాగా.. ఒక్కరు కొల్లంకు చెందివారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. లారీ డ్రైవర్‌తో పాటు క్లీనర్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. చదవండి: కారును ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన ట్రక్కు.. ఆరుగురు దుర్మరణం.. -
అల్లు అర్జున్ గొప్ప మనసు.. ప్రశంసలు కురిపిస్తున్న కేరళ కలెక్టర్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గొప్ప మనసు చాటుకున్నాడు. ఓ పేద విద్యార్థిని మెడికల్ చదువుకు అయ్యే ఖర్చును భరించేందుకు బన్నీ ముందుకు వచ్చిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు.. గతంలో కేరళలో భారీ వర్షాల కారణంగా అక్కడ వరదలు వచ్చి ఎన్నో గ్రామాలు కొట్టుకొని పోయిన సంగతి తెలిసిందే. దీంతో లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.. ముఖ్యంగా అలెప్పీ ప్రాంతం పూర్తిగా నేలమట్టం అయ్యింది. దీంతో నిరాశ్రయులకు చేయూతనిచ్చేందుకు ‘వీ ఆర్ ఫర్ అలెపి’ అంటూ కలెక్టర్ కృష్ణ తేజ దాతలకు పిలుపు నిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోవిడ్ కారణంగా తండ్రిని కొల్పోయిన ఓ మెడికల్ విద్యార్థినికి పై చదువులు చదివేందుకు ఆర్థిక సమస్యలు అడ్డుగా వచ్చాయి. చదవండి: హీరోయిన్‌పై బహిరంగ కామెంట్స్.. నటుడిపై సీరియస్ అయిన చిన్మయి 92 శాతం మార్కులతో మెరిట్ తెచ్చుకున్న ఆమెను నర్సింగ్ చదివించేందుకు అలెపీ కలెక్టర్ మద్దతుగా నిలిచారు. అల్లు అర్జున్‌కు ఫోన్ చేసి సదరు విద్యార్థినిని ఒక ఏడాది ఫిజుకు అయ్యే ఖర్చును సాయం చేయాల్సిందిగా కోరారు. దీంతో ఆ విద్యార్థిని పరిస్థితి గురించి తెలుసుకున్న అల్లు అర్జున్ ఒక సంవత్సరం కాదు.. నాలుగు సంవత్సరాలు తనకు అయ్యే ఖర్చు మొత్తం భరిస్తానని.. హాస్టల్ ఫీజుల చెలించడమే కాకుండా తనని దత్తత తీసుకుంటానని బన్నీ కలెక్టర్‌కు మాట ఇచ్చాడట. ఇక బన్నీ సేవ గుణాన్ని ప్రశంసిస్తూ కలెక్టర్ కృష్ణ తేజ ట్వీట్ చేయడంతో ఈ విషయం వెలుగు చూసింది. దీంతో అల్లు అర్జున్ను ఇటూ తెలుగు ప్రజలతో పాటు కేరళ ప్రేక్షకులు కూడా ప్రశంసలతో ముంచేత్తున్నారు. చదవండి: రష్మికపై ఇంత నెగిటివిటీకి కారణం ఇదే! ఆ ఒక్క మాటకే విమర్శల దాడి -
కళ్ల ముందే కన్నబిడ్డ కొట్టుకుపోతుంటే..
అలపుజ్జా: ప్రమాదాల రూపంలో జీవితాల్ని అర్థాంతరంగా ముగించడం, ఆనందకరమైన క్షణాలను అంతలోనే విషాదాలు మార్చేయడం.. విధికి అలవాటే. సరదాగా గడిపేందుకు చుట్టాల ఇంటికి వెళ్లిన ఆ కుటుంబానికి.. తిరుగు ప్రయాణంలో తీరని శోకమే మిగిలింది. కళ్ల ముందు కన్నకూతురు కొట్టుకుపోతుంటే.. కాపాడలేని నిస్సహాయస్థితిలో విలపిస్తూ ఉండిపోయారు ఆ తల్లిదండ్రులు. కేరళ అలపుజ్జా జిల్లాకు చెందిన సుశీల, సురేంద్రన్ తమ ఒక్కగానొక్క కూతురు అర్ష(24)తో కలిసి కరువరకుండులో ఉండే బంధువుల ఇంటికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో.. అంతా కలిసి దగ్గర్లోని కొండ ప్రాంతంలో ఉన్న రిసార్ట్‌కు వెళ్లారు. సాయంత్రందాకా సరదాగా గడిపి.. ఐదున్నర గంటల ప్రాంతంలో సమీపంలో ఉన్న నీటి ప్రవాహం దగ్గరకు వెళ్లారు. వాతావరణం అంతా మాములుగా ఉండడంతో.. కుటుంబ సభ్యులంతా నీళ్లలోకి దిగి హుషారుగా గడపాలనుకున్నారు. అయితే.. అంతలో వాళ్ల సంతోషం కాస్త.. హాహాకారాలుగా మారిపోయింది. ఒక్కసారిగా ఆకస్మిక వరద సంభవించడంతో అక్కడున్న వాళ్లంతా చెల్లాచెదురైపోయారు. చిన్న చిన్న పిల్లలతో సహా కాస్త దూరం కొట్టుకుపోయారు. అందరూ ఎలాగోలా ఒడ్డుకు చేరగలిగారు. కానీ, పాపం.. అర్ష మాత్రం నిస్సహాయ స్థితిలో నీటి ప్రవాహంలో కొట్టుకునిపోయింది. ఆమెను కాపాడాలంటూ ఆమె తల్లిదండ్రులు బతిమాలినా.. సాహసం చేయాలేని స్థితిలో ఉండిపోయారంతా. చాలా దూరం కొట్టుకువెళ్లే క్రమంలో రాళ్లురప్పలు తగిలి ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. చివరకు ఎలాగోలా తీవ్రంగా గాయపడిన అర్షను గుర్తించి స్థానికులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆమె కన్నుమూసిందని వైద్యులు ప్రకటించారు. దీంతో ఆమె తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. Credits: Mathrubhumi News ఇదీ చదవండి: ప్రియుడితో కలిసి దుర్మార్గానికి దిగిన కన్నతల్లి -
పాట పాడుతూ మరణించిన ప్రముఖ సింగర్.. వీడియో వైరల్
-
పాట పాడుతూ మరణించిన ప్రముఖ సింగర్.. వీడియో వైరల్
Veteran Singer Edava Basheer Dies At 78 During Music Live Concert: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ గాయకుడు ఎడవ బషీర్ కన్నుమూశారు. ఒక మ్యూజిక్ లైవ్ కాన్సర్ట్‌లో పాట పాడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు బషీర్. హుటాహుటని ఆయన్ను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే బషీర్ మరణించినట్లు వైద్యులు తెలిపారు. అలప్పుజాలో జరిగిన బ్లూ డైమండ్ ఆర్కెస్ట్రా స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా బషీర్ ప్రదర్శన ఇస్తున్నారు. ప్రముఖ గాయకుడు యేసుదాసు పాడిన మానే హో తుమ్ అనే హిందీ సాంగ్‌ను ఆలపిస్తుండంగా ఆయనకు ఒక్కసారిగా ఛాతీలో నొప్పి వచ్చింది. దీంతో ఛాతీ నొప్పి భరించలేక స్టేజ్‌పైనే కుప్పకూలిపోయారు బషీర్. ఈ సంఘటన శనివారం (మే 28) రాత్రి 9:30 గంటలకు జరిగింది. 78 ఏళ్ల ఎడవ బషీర్ 'గాన మేళా'తో ఎంతో పాపులర్ అయ్యారు. తిరువనంతపురం జిల్లాలోని వర్కాలకు సమీపంలో ఉన్న ఎడవ అనే ప్రాంతంలో బషీర్ జన్మించారు. స్వాతి తిరునాళ్ మ్యూజిక్ అకాడమీ నుంచి అకాడమిక్ డిగ్రీ 'గానభూషణం' అభ్యసించారు. అనంతరం 1972లో కొల్లంలో 'సంగీతాలయ' గాన మేళాన్ని స్థాపించారు. అంతేకాకుండా రఘువంశం అనే సినిమాకు మొదటిసారిగా నేపథ్య గాయకుడిగా పరిచయమయ్యారు. ఆల్ కేరళ మ్యూజిషియన్స్ అండ్ టెక్నిషియన్స్ వెల్ఫేర్ అసోషియేషన్‌కు రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. ఆయనకు ఇద్దరు భార్యలు రషీదా, రెహ్నా, పిల్లలు ఉల్లాస్, బీమా, ఉమేశ్, ఉషుస్ సీత్తా ఉన్నారు. చదవండి: 👇 'సర్కారు వారి పాట'పై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్.. అమ్ముడైన టికెట్లు 20 మాత్రమే.. రూ. 85 కోట్లకుపైగా నష్టం Warning: Disturbing Content Singer dies during live performance. Malayalam singer #EdavaBasheer died after collapsing on the stage while singing. The 78-year-old was performing at the Golden jubilee of Blue Diamonds orchestra. pic.twitter.com/k6CCfhafjO — Bobins Abraham Vayalil (@BobinsAbraham) May 29, 2022 -
ర్యాలీలో బాలుడి మత విద్వేష నినాదాలు.. కేసు నమోదు
Raising Anti Communal Slogans At Rally.. ఓ ర్యాలీలో పిల్లాడు మత విద్వేష నినాదాలు చేయడం సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. అలప్పుజాలో పాపులర్ ఫ్రంట్ ఆప్ ఇండియా( PFI) ఆధ్వర్యంలో శనివారం ‘సేవ్ ది రిపబ్లిక్’ పేరుతో ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో భాగంగా వందల సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ పిల్లాడు.. రెండు వర్గాలకు వ్యతిరేకంగా మత విద్వేషాలు రెచ్చగొట్టేలా నినాదాలు చేశాడు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ మారింది. ఇదిలా ఉండగా.. PFI ఛైర్మన్ ఒమా సలామ్.. నేషనల్ మీడియాతో మాట్లాడుతూ.. జ్ఞానవాపి మసీదుపై కొనసాగుతున్న వివాదం RSS అజెండాలో భాగమని సంచలన ఆరోపణలు చేశారు. మరోవైపు.. రాజకీయ, మతపరమైన ర్యాలీల్లో పిల్లలను ఉపయోగించుకోవడంపై కేరళ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. సోమవారం ఈ కేసుపై విచారణ సందర్భంగా జస్టిస్ గోపినాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘పిల్లలు ఇలాంటి ద్వేషపూరిత వాతావరణంలో పెరగడం ఆందోళనకరమన్నారు. కొత్త తరాన్ని ఇలా పెంచడం కరెక్ట్ కాదు.. ఏదో ఒకటి చేయాలి’’ అని ఆయన కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా.. బాలల హక్కుల పరిరక్షణ కోసం జాతీయ కమిషన్ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కేరళ పోలీసులపై ఒత్తిడి తెచ్చింది. ఈ నేపథ్యంలో పిల్లాడిని ర్యాలీకి తీసుకువచ్చిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో పీఎఫ్ఐ అలప్పుజా జిల్లా అధ్యక్షుడు నవాస్ వందనం, జిల్లా కార్యదర్శి ముజీబ్‌లపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. Slogans from the PFI rally in Alappuzha, Kerala: "Hindus should keep rice for their last rites & Christians should keep incense for their last rites. If you want to here, live decently, otherwise we know how to implement Azadi" Warning by a minor boy & radicals from Kerala. pic.twitter.com/zoPxCYIzyf — Anshul Saxena (@AskAnshul) May 23, 2022 ఇది కూడా చదవండి: మందు గ్లాసుతో మాజీ మంత్రి కొడుకు అరాచకం.. ఫుల్లుగా తాగి రోడ్డుపై హల్చల్ -
Kerala: ఆమె రాకతో మహిళా కలెక్టర్ల సంఖ్య 10కి చేరింది.. అరుదైన ఘనత
మహిళ చదువు దేశానికి వెలుగు ఎలా అవుతుందో చూడాలనుకుంటే ఓసారి కేరళవైపు దృష్టి సారించాల్సిందే. భూతల స్వర్గంగా పేరున్న కేరళ రాష్ట్రంలో 14 జిల్లాలు ఉన్నాయి. వీటిలో 10 జిల్లాల కలెక్టర్లు మహిళలే కావడం గమనార్హం. రాజకీయాలు, రక్షణ, అనేక ఇతర కీలకరంగాలలో పురుషులతో పోలిస్తే మహిళా ప్రాతినిధ్యం తక్కువ ఉన్న ఈ దేశంలో ఇది అరుదైన ఘనతగా అంతా పేర్కొంటున్నారు. ప్రజాసేవ చేయడానికి పరిపాలనలో భాగంగా ఉన్నతాధికారులలో మెజారిటీ సంఖ్య ఇప్పటివరకు పురుషులదే. కానీ, కేరళలో మాత్రం ఆ సంఖ్య మహిళలదయ్యింది. డాక్టర్ రేణు రాజ్ అలప్పుళ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టబోతుండటంతో కేరళలో ఇప్పుడీ మహిళా కలెక్టర్ల సంఖ్య పదికి చేరింది. మూడింట రెండొంతులు రాష్ట్ర పరిపాలనలో దాదాపు మూడింట రెండొంతుల మంది మహిళలే నాయకత్వం వహిస్తున్నారు. రాష్ట్ర అసెంబ్లీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఉండగా, ఇప్పుడు కేరళలో పరిపాలనా సేవల్లో మహిళా కలెక్టర్లు 71.4 శాతం ఉన్నారు. కేరళలోని ఇతర జిల్లా మహిళా కలెక్టర్లలో హరిత.వి.కుమార్ (త్రిసూర్), దివ్య ఎస్ అయ్యర్ (పథనం తిట్ట), అఫ్సానా పర్వీన్ (కొల్లం), షీబా జార్జ్ (ఇడుక్కి), డాక్టర్ పికె జయశ్రీ (కొట్టాయం), భండారి స్వాగత్ రణవీర్ చంద్ (కాసర్ గోడ్), నవజోత్ ఖోసా (తిరువనంతపురం), మృణ్మయీ జోషి (పాలక్కాడ్), డాక్టర్ ఎ.గీత (వాయనాడ్)లు ఉన్నారు. వీరిలో రేణురాజ్, దివ్య.ఎస్.అయ్యర్, హరిత వి.కుమార్, పి.కె.జయశ్రీ, షీబా జార్జ్, గీత కేరళ వాసులే. 35 ఏళ్ల డాక్టర్ రేణురాజ్ మార్చి 2న అలప్పుళ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. వృత్తిరీత్యా రేణు వైద్యురాలు. 2015లో యుపిఎస్సి పరీక్షలో మొదటి ప్రయత్నంలోనే రెండవ ర్యాంక్ సాధించారు. జిల్లా కలెక్టర్‌గా ఆమెకు ఇదే తొలి పోస్టింగ్. భిన్నరంగాలలోనూ ప్రతిభ గృహిణిగా కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ కలెక్టర్‌గా విధులను చేపట్టిన ఈ కలెక్టరమ్మల్లో వివధ రంగాల్లో ప్రతిభను కనబరుస్తున్న వారున్నారు. వారిలో పథానంతిట్ట జిల్లా కలెక్టర్ డాక్టర్ దివ్యా ఎస్ అయ్యర్ ఒకరు. డాక్టర్, ఎడిటర్, రైటర్, యాక్టర్, సింగర్‌గా కూడా దివ్య పేరొందారు. మలయాళీ వెండితెర మీద క్రిస్మస్ ప్రధాన అంశం గల సినిమాలోనూ నటించారు. గతంలో మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్‌లో డాక్టర్‌గా విధులను నిర్వర్తించారు. ఆ తర్వాతి జాబితాలో త్రిసూర్ జిల్లా కలెక్టర్ హరిత వి.కుమార్ చేరుతారు. 2012లో కేరళలో సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌లో టాపర్‌గా నిలిచారీమె. ఎలక్ట్రానిక్స్ విభాగం లో ఇంజినీరింగ్ డిగ్రీ చేసిన హరిత ‘విజయం అనేది ఒక వస్తువు కాదు, ఒక రోజు కష్టంలో రాదు’ అంటారు. మలయాలీ సినిమాలంటే ఇష్టపడే హరిత మోహినీయాట్టం, భరతనాట్యం, కర్ణాటక సంగతంలోనూ ప్రావీణ్యురాలు. పాలక్కాడ్ జిల్లా కలెక్టర్ మృణ్మయి జోషి కలెక్టర్ అవడానికి ముందు ఫ్రీ లాన్స్ జర్నలిస్ట్. పుణేవాసి. ముంబయ్ హై కోర్టు మాజీ జడ్జి షాలినీ ఫన్సల్కర్ జోషి కూతురు. తల్లి లాగే న్యాయవాద చదువును పూర్తి చేశారు. ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ నుంచి పబ్లిక్ పాలిసీలో మాస్టర్స్ చేశారు. తిరువనంతపురం జిల్లా కలెక్టర్ నవ్‌జోత్ ఖోసా అమృతసర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ నుంచి బీడీఎస్ చేశారు. యూనివర్శిటీ టాపర్, గోల్డ్ మెడలిస్ట్. ‘ఐఎఎస్ ముందు నా తండ్రి కల. అదే నా లక్ష్యం అయ్యింది’ అంటారీమె. రాష్ట్ర పరిపాలన విభాగంలో ఉన్నతాధికారులుగానే కాదు 2020 కేరళ స్థానిక ఎన్నికల్లో మహిళలు 50 శాతానికి పైగా సీట్లను కైవసం చేసుకుని విజయం సాధించారు. పితృస్వామ్య సమాజంలో ఇది అంత తక్కువ విషయమేమీ కాదు. దేశ మహిళలందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. చదవండి: Mystery- Lansa Flight 508: 10 వేల అడుగుల పైనుంచి ఆమె కూర్చున్న కుర్చీ కిందపడింది.. చుట్టూ విషసర్పాలు.. అయినా -
ఇద్దరు రాజకీయ నేతల దారుణ హత్య.. 144 సెక్షన్ విధింపు
తిరువనంతపురం: కేరళలోని అలప్పుజ జిల్లాలో ఇద్దరు రాజకీయ నేతలు హత్యకు గురైన ఘటన కలకలం రేపుతోంది. రాష్ట్ర బీజేపీ ఓబీసీ మోర్చా సెక్రటరీ రంజిత్ శ్రీనివాసన్, సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎస్డీపీఐ)నేత కేఎస్ షాన్‌ను గుర్తుతెలియని దుండగులు ఆదివారం ఉదయం చేశారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఎ.అలెగ్జాండర్ అలప్పుజ జిల్లాలో 144 సెక్షన్‌ను విధించారు. బీజేపీ నేత శ్రీనివాసన్(40)ను తన ఇంటిలోనే గుర్తుతెలియని దుండగులు దాడిచేసి చంపారు. ఆయన 2016 ఎన్నికల్లో అలప్పుజ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నేత కె.ఎస్ షాన్‌ను కూడా గుర్తుతెలియని ముఠా చేతిలో హత్య గురయ్యారు. ఈ ఘటనపై ఎస్డీపీఐ స్పందిస్తూ.. తమ నాయకుడి హత్య వెనుక రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రమేయం ఉందని ఆరోపించింది. చదవండి: కోతి వర్సెస్ కుక్క! సోషల్ మీడియాలో రచ్చ రచ్చ! ఇద్దరు రాజకీయ నేతల హత్యలపై కేరళ సీఎం పినరయ్ విజయన్ స్పందిస్తూ.. హత్యలపై వేగంగా దర్యాప్తు చేయాలని పోలీసులను ఆదేశించారు. సమాజంలో గందరగోళం సృష్టించే ఈ చర్యలను ఖండిస్తున్నానని తెలిపారు. శ్రీనివాసన్ మృతిపై కేంద్ర మంత్రి వి.మురళీధరన్ మాట్లాడుతూ.. తమ పార్టీ నేతను ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్టుల గ్రూప్ హత్య చేసిందని ఆరోపించారు. శ్రీనివాసన్ హత్యకు ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. దర్యాప్తు చేసి నేరస్తులను శిక్షించాలని తెలిపారు. రెండు పార్టీల సంబంధించిన నేతలు హత్యకు గురికావడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. Kerala: I've been told that State Secy of BJP OBC Morcha was stabbed to death, this morning. This is the handy work of Islamic terrorist group is the info coming from Alleppey (Alappuzha). I demand the State govt to take strict action against perpetrators:Union Min V Muralidharan https://t.co/VRuiureFOH pic.twitter.com/BW8Z9riTjR — ANI (@ANI) December 19, 2021 -
12 వేల బాతులను చంపేశారు!
అలప్పుజ: కేరళ వాసులను బర్డ్ ఫ్లూ భయపెడుతోంది. అలప్పుజ జిల్లాలో బర్డ్ ఫ్లూ కేసులు నమోదవడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్తగా తకళి గ్రామపంచాయతీలోని 10వ వార్డులో మొత్తం 12,000 బాతులను చంపేశారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి నమూనాలను సేకరించి బర్డ్ ఫ్లూ నిర్ధారణ పరీక్షల కోసం భోపాల్‌కు పంపించారు. మరోవైపు అలపుజ జిల్లా కలెక్టర్ అధ్యక్షతన శుక్రవారం అత్యవసర సమావేశం నిర్వహించారు. బర్డ్ ఫ్లూ ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా చర్యలు ముమ్మరం చేయాలని ఈ భేటీలో నిర్ణయించారు. తకళి గ్రామ పంచాయతీలోని వార్డు నంబర్ 10లో బర్డ్ ఫ్లూ కేసులు వెలుగు చూడటంతో ఈ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్‌గా వైద్యాధికారులు ప్రకటించారు. ఇక్కడ వాహనాలు, ప్రజల రాకపోకలపై ఆంక్షలు విధించారు. బర్డ్ ఫ్లూ ప్రభావిత ప్రాంతాల్లో బాతులు, కోళ్లు, పిట్టలు, పెంపుడు పక్షుల గుడ్లు, మాంసం అమ్మకాలు, పేడ వాడకంపై జిల్లా యంత్రాంగం నిషేధించింది. చంపకుళం, నేడుముడి, ముత్తార్, వీయపురం, కరువట్ట, త్రిక్కున్నపుళ, తకళి, పురక్కాడ్, అంబలపుజ సౌత్, అంబలపుజ నార్త్, ఎడత్వ పంచాయతీలు, హరిప్పాడ్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రాంతాల్లో ఆంక్షలు అమలు చేస్తున్నారు. (Omicron Variant: తీవ్రతపై త్వరలో స్పష్టత!) తకళి పంచాయతీ 10వ వార్డులో కిలోమీటరు పరిధిలో పక్షులను చంపే ప్రక్రియను పూర్తి చేసి సురక్షితంగా పాతిపెట్టాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సహకారం అందించాలని, ఆ ప్రాంతంలో నిఘా పెట్టాలని స్థానిక పోలీసులను కోరారు. బర్డ్‌ఫ్లూ నిర్ధారిత ప్రాంతాల్లో పశుసంక్షేమ శాఖ.. రాపిడ్ రెస్పాన్స్ టీమ్‌ల ద్వారా ప్రజలకు నివారణ మందులు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసింది. బర్డ్ ఫ్లూ నివారణ చర్యలపై రోజువారీ నివేదికలు అందజేయాలని పశుసంవర్థక శాఖను కలెక్టర్ ఆదేశించారు. (చదవండి: ఒమిక్రాన్ టెన్షన్.. 2 రోజుల పాటు కర్ఫ్యూ) -
కేరళలో మరోసారి బర్డ్ ఫ్లూ కలకలం..బాతులు, కోళ్లను చంపేయండి!
తిరువనంతపురం: ఓవైపు కరోనా కేసులు.. మరోవైపు బర్డ్ ఫ్లూ విజృంభణ.. వైరస్ల బెడదతో కేరళ అతలాకుతలం అవుతోంది. కేరళలో బర్డ్ ఫ్లూ నిర్థారణ కావడం ఇది రెండోసారి. అలప్పుజ జిల్లాలో బర్డ్‌ఫ్లూ కేసులు కలకలం రేపుతున్నాయి. దీంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం.. బాతులు, కోళ్లను చంపాలని నిర్ణయించాయి. మాంసం విక్రయాలపై నిషేధాజ్ఞలు విధించాయి. తకాళి పంచాయితీ పరిధితో పాటు హరిప్పడ్ మునన్సిపాలిటీలోనూ ఈ వైరస్‌ను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. బర్డ్ ఫ్లూ నియంత్రణ కోసం ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను ఏర్పాటు చేశారు. బర్డ్ ఫ్లూ ప్రభావిత ప్రాంతాల్ని కంటెయిన్మెంట్ జోన్లుగా ప్రకటించిన అధికారులు.. వాహనాలు, ప్రజల రాకపోకలపై ఆంక్షలు విధించారు. సరిహద్దు జిల్లాల్లో బర్డ్ ఫ్లూ ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని కేరళ ప్రభుత్వం ఆదేశించింది. వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో కిలోమీటరు పరిధిలో ఉన్న బాతులు, కోళ్లు, ఇతర పక్షులను చంపాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు వలస పక్షులకు వైరస్ సోకిందో లేదో నిర్ధారించాలని అసిస్టెంట్ ఫారెస్ట్ కన్జర్వేటర్‌కు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా జిల్లాలో బర్డ్ ఫ్లూ నివారణ చర్యలపై రోజువారీ నివేదిక సమర్పించాలని పశుసంవర్ధక శాఖ అధికారులకు సూచించారు. చదవండి: ఒమిక్రాన్ అలజడి: భారత్‌లో మరో రెండు కేసులు.. -
కరోనా రోగి ప్రాణం నిలిపిన వలంటీర్లు: సీఎం ప్రశంస
తిరువనంతపురం: ప్రస్తుతం కరోనా విజృంభణ వేళ మానవమూర్తులు ఎన్నో సహాయ కార్యక్రమాలు చేపడుతున్నారు. కరోనా బాధితులకు అండగా నిలుస్తూ అందరి ప్రశంసలు పొందుతున్నారు. తాజాగా కేరళలో ఓ ఇద్దరు అత్యంత వేగంగా స్పందించడంతో ఓ కరోనా రోగి ప్రస్తుతం ప్రాణాలతో బయటపడ్డాడు. రోగి పరిస్థితి విషమంగా ఉందని తెలిసిన వెంటనే ఏమీ ఆలోచించకుండా వెంటనే బైక్‌పై అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వారు చేసిన పనిని ముఖ్యమంత్రి ప్రశంసించారు. కేరళలోని అలప్పూజ జిల్లా పున్నాప్ర ఆరోగ్య కేంద్రంలో అశ్విన్ కుంజుమన్, రేఖ వలంటీర్లుగా పని చేస్తున్నారు. కరోనా బాధితులకు ఆహారం అందించడం.. వారి అవసరాలు తీర్చడం వంటివి చేస్తున్నారు. శుక్రవారం కరోనా బాధితులకు ఆహారం అందించేందుకు వచ్చారు. ఈ సమయంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఒకరి ఆరోగ్యం విషమించిందని తెలిసింది. వెంటనే కింది అంతస్తులో ఉన్న రోగి పరిస్థితి చూసి చలించిపోయారు. అంబులెన్స్ వారికి ఫోన్ చేయగా ఆలస్యమవుతుందని తెలిసింది. దీంతో వెంటనే అశ్విన్, రేఖ ఆ రోగిని బైక్‌పై కూర్చోబెట్టుకుని వెంటనే సమీపంలోని పెద్దాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ రోగి ఆరోగ్యం మెరుగైంది. అయితే వారు రోగిని ఆస్పత్రికి తీసుకెళ్తున్న ఫొటోలు వైరల్‌గా మారాయి. అయితే వారిద్దరూ పీపీఈ కిట్ ధరించడంతో వారికి కరోనా సోకే అవకాశమే లేదు. సోషల్ మీడియాలో వీరిద్దరు చేసిన పనికి ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి పినరయి విజయన్ అభినందించారు. ఆ ఇద్దరు చేసిన పనితోనే ప్రస్తుతం అతడు బతికాడని సీఎం తెలిపారు. ఏమాత్రం సమయం ఆలస్యం చేయకుండా చేసిన వారిద్దరికీ ప్రత్యేక అభినందనలు అని సీఎం పినరయి చెప్పారు. చదవండి: తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు చదవండి: ఒకేసారి నాలుగు ప్రాణాలు: కుటుంబాన్ని చిదిమేసిన కరోన -
కేరళలో ఘర్షణ: ఆర్ఎస్ఎస్ కార్యకర్త మృతి
తిరువనంతపురం: కేరళలోని అలప్పుజ జిల్లాలో బుధవారం రాత్రి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్), స్థానిక సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ (ఎస్డీపీఐ) మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో ఆర్ఎస్ఎస్కు చెందిన ఓ కార్యకర్త మృతి చెందాడు. ఇరు వర్గాలకు చెందిన పలువురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అలప్పుజ జిల్లాలోని వయలార్ పట్టణంలో ఆర్ఎస్ఎస్, ఎస్డీపీఐ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఆర్ఎస్ఎస్కు చెందిన నందు అనే కార్యకర్త మృతి చెందాడు. ఇరు వర్గాలకు చెందిన ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పార్టీకి చెందిన ఎస్డీపీఐ ఆర్గనైజేషన్ విరాళలు సేకరిస్తున్న సమయంలో ఈ ఘర్షణ చోటు చేసుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆరుగురు ఎస్డీపీఐ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా బంద్.. ఆర్ఎస్ఎస్ కార్యకర్త మృతి చెందడాన్ని నిరసిస్తూ అలప్పుజ జిల్లాలో గురువారం ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు బీజేపీ, పలు హిందూ సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎంవీ గోపకుమార్ తెలిపారు. కాజర్‌గోడ్ నుంచి తిరువనంతపురం వరకు బీజేపీ చేపట్టిన విజయ యాత్ర ప్రారంభోత్సవానికి వచ్చిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పర్యటనపై ఎస్డీపీఐ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గురువారం ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఉద్రిక్తంగా మారినట్లు తెలుస్తోంది. తమ కార్యకర్తలపై ఆర్ఎస్ఎస్ దాడి చేయాలని ముందుగానే ప్రణాళిక వేసుకుందని ఎస్డీపీఐ ఆరోపించింది. అందులో భాగంగానే గురువారం ఎస్డీపీఐ కర్యకర్తలతో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు గొడవకు దిగారని మండిపడింది. చదవండి: మందేశాడు.. ఎస్సైని ఢీకొట్టాడు -
ఆయుధాలను పట్టుకొని.. ఆమెను రోడ్డుపై పడేసి
అలప్పుజ: గల్ఫ్ నుంచి నాలుగు రోజుల క్రితం భారత్‌కు వచ్చిన మహిళను కిడ్నాప్ చేసి, బంగారం కోసం బెదిరించి అనంతరం రోడ్డుపక్కనే పడేసిన ఘటన కేరళలోని పలక్కడ్ జిల్లాలో సోమవారం చోటు చేసుకుంది. అనంతరం ఆ మహిళ పోలీస్ స్టేషన్ చేరుకొని కేసు నమోదు చేయించారని పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. గల్ఫ్‌లో సూపర్మార్కెట్లో పని చేసే బింధు నాలుగు రోజుల క్రితమే భారత్ లోని కేరళకు వచ్చారు. అనంతరం ఆమె వద్ద బంగారం ఉందో లేదో అడుగుతూ కొన్ని బెదిరింపు కాల్స్ వచ్చాయని కుటుంబ సభ్యులు తెలిపారు. సోమవారం తెల్లవారు జామున 2 గంటలకు దాదాపు 15 మంది ఆయుధాలను పట్టుకొని తలుపు తట్టారని, అనంతరం బింధును బలవంతంగా తీసుకెళ్లా రని ఆమె భర్త బినోయ్ చెప్పారు. ఆమెను కారులో ఎక్కించుకున్నప్పుడు నలుగురు వ్యక్తులు ఉన్నారని, వారంతా తన వద్ద ఉన్న బంగారం ఉందేమోనన్న దిశగా ప్రశ్నలు వేశా రని చెప్పారు. కాసేపటి తర్వాత దుండగులు ఆమెను రోడ్డుపై పడేసి వెళ్లారు. బింధు పోలీస్ స్టేషన్‌కు చేరుకొని విషయం తెలిపారు. బంగారం స్మగ్లింగ్ కేసు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల గురించి అవసరమైన మేరకు వివరాలు లభించాయని, విచారణ చేస్తున్నామని వెల్లడించారు. చదవండి: సెర్చ్ చేసి అనువైనవి గుర్తించి.. చదవండి: జాన్సన్ మీ వివరాలు పంపించాడంటూ.. రూ.48 లక్షలు -
బర్డ్ ఫ్లూ కలకలం: రెండు జిల్లాల్లో అలర్ట్
తిరువనంతపురం : దేశంలో మళ్లీ బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తి మొదలైంది. తాజాగా కేరళలోని కొట్టాయం, అలపూజ జిల్లాల్లో బర్డ్ ఫ్లూ వైరస్ గుర్తించడంతో ప్రభుత్వం అప్రమత్తమైందని అధికారులు సోమవారం వెల్లడించారు. ఈ మేరకు రాష్ట్రంలోని రెండు జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసినట్లు, తక్షణ స్పందన కోసం బృందాలను అందుబాటులో ఉంచామని అధికారులు తెలిపారు. కాగా గత వారం కొట్టాయం, అలపూజ రెండు జిల్లాలో అనేక బాతులు మరణించాయి. వీటిలో ఎనిమిది బాతుల నమూనాలను పరీక్షల నిమిత్తం భోపాల్‌కు పంపించారు. వీటిలోని 5 శాంపిల్స్‌లో బర్డ్ ఫ్లూ వైరస్ (హెచ్5ఎన్8) కనుగొన్నట్లు తేలింది. దీంతో ఆ ప్రాంతానికి ఒక కిలోమీటరు పరిధిలో ఉన్న అన్ని పక్షులను వేరే ప్రదేశాలకు మార్చారు. బర్డ్ ఫ్లూ వైరస్ కారణంగా ఇప్పటికే 12000 బాతులు మృత్యువాత పడ్డాయి. అలాగే ఈ వైరస్ మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో మరో 36,000 చనిపోయే ప్రమాదం ఉందని అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో ఈ వైరస్ మరణాలు సంభవించే ప్రాంతాల నుంచి నమూనాలను సేకరించాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఇందుకు ఫ్లూ లక్షణాలు ఉన్నట్లు అనుమానించిన సంబంధిత ప్రాంతాల్లో వాటిని గుర్తించేందుకు అధికారులు డ్రైవ్ కూడా ప్రారంభించారు. బర్డ్ ఫ్లూ మనుషులకు కూడా వ్యాప్తి చెందుతుంది. ఇది కూడా చాలా ప్రాణాంతకమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు పక్షి మరణాలు సంభవించిన ప్రాంతాల్లో నిషేధ ఉత్తర్వులు విధించాయి. అంతేకాదు అటువంటి సైట్‌కు కిలోమీటరు దూరంలో ఉంటే పౌల్ట్రీని తొలగించాలని కూడా సూచించింది. -
ప్రమాదానికి గురైన సింగర్ విజయ్ ఏసుదాసు
తిరువనంతపురం: లెజెండరీ సింగర్ కేజే యేసుదాసు కుమారుడు, గాయకుడు విజయ్ యేసుదాసు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. కేరళలోని అలప్పుజ జిల్లాలో థరువూర్ వద్ద ఆయన నడుపుతున్న కారు ఎదురుగా వస్తున్న కారుతో ఢీ కొట్టింది. సోమవారం రాత్రి 11.30 గంటలకు జరిగిన ఈ ప్రమాదం నుంచి అందరూ సురక్షితంగా బయటపడ్డారు. కానీ రెండు కార్ల ముందు భాగం మాత్రం నుజ్జునుజ్జయ్యాయి. స్నేహితుడితో కలిసి విజయ్ తిరువనంతపురం నుంచి కొచ్చికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గురైన కార్లను రోడ్డు పై నుంచి తొలగించారు. ఈ ఘటన అనంతరం సింగర్ అతడి స్నేహితుడితో కలిసి మరో కారులో కొచ్చికి వెళ్లిపోయారు. (కాపురాలు కూలిపోతాయ్ అని హెడ్డింగ్ పెట్టారు: హిమజ) విజయ్ యేసుదాసు మాలీవుడ్‌లో 20 ఏళ్లుగా సింగర్‌గా రాణిస్తున్నారు. మిలీనియం స్టార్స్ సినిమాలో తండ్రితో కలిసి విజయ్ తొలిసారి సాంగ్ పాడారు. ఓ పాత ఇంటర్వ్యూలో దేవుళ్లపై విశ్వాసం లేదని చెప్పిన విజయ్.. గుళ్లకు, చర్చిలకు వెళ్లడం మానేశానని తెలిపారు. కానీ పాజిటివ్, నెగెటివ్ ఎనర్జీలు ఉంటాయని మాత్రం నమ్ముతానని చెప్పుకొచ్చారు. (ఆ హీరో ఫ్యాన్స్‌తో నాకు ప్రమాదం: దర్శకుడు) -
మహిళా పోలీసు దారుణ హత్య
తిరువనంతపురం : కేరళలో దారుణం చోటుచేసుకుంది. మహిళా పోలీసు అధికారిపై తోటి ఉద్యోగి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. వివరాలు.. కేరళలోని అలప్పుజా జిల్లాలోని ఓ పోలీసు స్టేషనులో సౌమ్య పుష్పాకరన్(34) సివిల్ కానిస్టేబుల్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. శనివారం విధులు ముగించుకుని ఇంటికి వస్తున్న సమయంలో తోటి పోలీసు అధికారి పెట్రోల్‌తో ఆమెపై దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన సౌమ్య అక్కడిక్కడే మృతిచెందారు. నిప్పంటించే క్రమంలో నిందితుడికి కూడా గాయాలయ్యాయి. కాగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని, ఐసీయూలో చికిత్స పొందుతున్నాడని పేర్కొన్నారు. ఈ హత్యకు గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. బాధితురాలికి ముగ్గురు పిల్లలు ఉన్నారని.. ఆమె కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చామని పేర్కొన్నారు. -
రియల్ హీరో.. ఓ బాలుడిని కాపాడేందుకు
తిరువనంతపురం : భారీ వర్షాలతో కేరళ అతలాకుతలమవుతోంది. వందేళ్లలో కనీవినీ ఎరుగని వర్షాలు కేరళను ముంచేశాయి. దాదాపు అన్ని జిల్లాలు వరద ముప్పులో కూరుకుపోయాయి. అధికారిక లెక్కల ప్రకారం ఇక్కడ రుతుపవనాలు మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా 357 మంది చనిపోయారు. వరద బాధితుల్ని రక్షించేందుకు భారత సైన్యం రంగంలోకి దిగింది. తమ ప్రాణాలకు తెగించి బాధితులను కాపాడుతున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన 'గరుడ్' కమాండర్ ప్రశాంత్ అద్భుత సాహసంతో ఓ బాలుడిని కాపాడాడు. అలప్పుజ పట్టణంలో ఓ ఇంటి చుట్టూ వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఇంట్లో వారంతా ఇంటిపై కప్పుకు చేరుకున్నారు. అందులో ఓ బాలుడిని కమాండర్ ప్రశాంత్ హెలికాప్టర్ నుంచి తాడు సాయంతో పై కప్పుకు చేరుకుని ఓ చేత్తో బాలుడిని, మరో చేత్తో తాడును పట్టుకొని సాహసంతో హెలికాప్టర్లోకి చేరుకున్నారు. కాగా బాలుడిని కాపాడిన కమాండర్‌కు ప్రతి ఒక్కరు థ్యాంక్స్ చెబుతున్నారు. సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. ఆయన రియల్ హీరో, సైనికుడు మన కోసం ఏమైనా చేస్తాడు, దటీజ్ ఇండియన్ ఆర్మీ అంటూ నెటిజన్లు ప్రశాంత్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. -
రియల్ హీరో.. ఓ బాలుడిని కాపాడేందుకు
-
డ్రైనేజీ నీళ్లతో ఏం చేశారంటే...
సాక్షి, తిరువనంతపురం: సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియో, కేరళ అధికారుల్లో కదలిక తీసుకొచ్చింది. హోటల్ సిబ్బంది మురుగు నీటితో ప్లేట్లు కడుగుతుండటం గమనించిన ఓ యువకుడు.. వీడియో తీసి వైరల్ చేశాడు. వివరాల్లోకి వెళ్లితే.. అలప్పుజా మున్సిపాలిటీ పరిధిలోని ఓ హోటల్ ప్రాంగణం వర్షాల కారణంగా వరద నీటితో నిండిపోయింది. పైగా హోటల్ డ్రైనేజీ వ్యవస్థ దెబ్బతినటంతో ఆ నీరు కూడా వరద నీటిలో కలిసిపోయింది. ఈ క్రమంలో పక్కనే ఉన్న ఓ థియేటర్‌కు.. ఓ యువకుడు సినిమా చూసేందుకు వచ్చాడు. సరిగ్గా అదే సమయంలో ఆ దృశ్యం కనిపించేసరికి వీడియో తీసి.. వాట్సాప్ గ్రూప్‌లకు పంపించాడు. అది కాస్త వైరల్ కావటం.. ఆ వీడియో మున్సిపాలిటీ అధికారుల దృష్టికి రావటంతో హోటల్‌ను సీజ్ చేసి.. యాజమానికి జరిమానా విధించారు. -
మురుగునీటితో హోటల్ సిబ్బంది చేసిన నిర్వాకం
-
తినడానికి డబ్బుల్లేవా.. ఆ రెస్టారెంట్లో ఫ్రీ
తిరువనంతపురం : ఆదివాసి యువకుడు మధు హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కేవలం బియ్యం దొంగలించినందుకు ఒక గుంపు ఎగబడి ఆ యువకుడిని(27) దారుణంగా కొట్టిచంపిన సంగతి తెలిసిందే. మతిస్థిమితం లేని ఆ ఆదివాసీ కొడుతూ... ఆ సమయంలో సెల్ఫీ, సెల్ఫీ వీడియోలు తీసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన తర్వాత కేరళ ప్రభుత్వంలో కదలిక వచ్చినట్లు కనిపిస్తోంది. ఆకలి చావుల రహిత రాష్ట్రంగా కేరళను తీర్చి దిద్దేందుకు నడుం బిగించింది. ఈ క్రమంలో అలప్పుఝా జిల్లాలో క్యాష్ కౌంటర్ లెస్ రెస్టారెంట్‌ను ప్రారంభించింది. జనకీయ భక్షణశాల పేరుతో స్నేహజలకమ్ అనే ఎన్జీవో సంస్థ ప్రజలకు ఉచితంగా భోజనం అందించేందుకు ముందుకు వచ్చింది. శనివారం ఈ రెస్టారెంట్‌ను రాష్ట్ర ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్ ప్రారంభించారు. ‘మధులా మరెవరూ బలి కాకూడదు. అందుకే ప్రభుత్వ ప్రోత్సాహకంతో ఈ రెస్టారెంట్‌ను ప్రారంభించాం’ స్నేహజలకమ్ కన్వీనర్ వెల్లడించారు. ఆకలితో ఉండి.. జేబులో డబ్బులు లేని వాళ్లు ఇక్కడికొచ్చి కడుపు నిండా తినోచ్చు. ఒకవేళ తమకు ఏదైనా ఇవ్వాలనిపిస్తే మాత్రం అక్కడే ఉండే డ్రాప్ బాక్స్‌లో వేయాలి. ఎవరూ బలవంతం చెయ్యరు. సుమారు రూ.11లక్షల తో ఏర్పాటు చేసిన ఈ హోటల్ రోజుకు రోజుకు సుమారు 2వేల మందికి ఈ హోటల్ భోజనం సమకూరుస్తోంది. ఈ హోటల్ కోసం సీఎస్ఆర్ ఫండ్ ఆఫ్ కేరళ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్(కేఎస్ఎఫ్ఈ) ఆధ్వర్యంలో నిధుల సేకరణ చేపట్టగా... డొనేషన్ల రూపంలో ఇప్పటిదాకా రూ. 20 లక్షల సేకరించారు. ఈ రెస్టారెంట్‌తోపాటు పక్కనే రెండున్నర ఎకరాల భూమిలో కూరగాయలను సాగు చేస్తున్నారు. రెస్టారెంట్ అవసరాలతోపాటు ప్రజలకు అతితక్కువ ధరలకే కూరగాయలను అమ్ముతున్నారు. త్వరలో ఇలాంటి రెస్టారెంట్లను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. -
అత్యంత పరిశుభ్రమైన నగరాలు మూడే
న్యూఢిల్లీ: దేశంలో మూడే మూడు పరిశుభ్రమైన నగరాలుగా నిలిచాయి. అత్యంత పరిశుభ్రమైన నగరాల జాబితాను సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సెంటర్ (సీఎస్ఈ) సోమవారం విడుదల చేసింది. సీఎస్ఈ తాజా రేటింగ్స్ ప్రకారం వీటిలో కేరళలోని అలెప్పు, గోవా రాజధాని పనాజి, కర్ణాటకలోని మైసూరు అతి పరిశుభ్రమైన నగరాలుగా పేరు దక్కించుకున్నాయి. దేశంలో సాలిడ్ వేస్టే మేనేజ్ మెంట్ పద్ధతిపై 'నాట్ ఇన్ మై బ్యాక్ యార్డ్' పేరుతో ఈ నివేదికను విడుదల చేసింది. ఘన వ్యర్థాల నిర్వహణలో ఢిల్లీ లాంటి మెట్రో నగరాల్లో పరిస్థితులు అంత మెరుగ్గా లేవని సీఎస్సీ వ్యాఖ్యానించింది . దేశవ్యాప్తంగా పట్టణాల్లో ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ పద్ధతులు ఆధారంగా ఒక సర్వే నిర్వహించింది. మున్సిపల్ వ్యర్థ పదార్థాల నిర్వహణ వ్యవస్థల భారతదేశం లో పరిశుభ్రమైన నగరాల్లో ఈ మూడు నగరాలు ఉన్నాయని సర్వే తేల్చింది. ఈ విషయంలో దేశరాజధాని నగరం ఢిల్లీ అట్టడుగు స్థాయిలో ఉండగా, మైసూర్ తన స్థానాన్ని నిలబెట్టుకోవడం విశేషం. గ్రౌండ్ లెవల్ సమాచారం పూర్తిగా లభ్యంకానప్పటికీ, 2009 ఘన వ్యర్థాల నిర్వహణ ఆర్థిక వ్యవహారాల శాఖ స్థాయీ పత్రాన్ని ప్రస్తావిస్తూ, భారతదేశ అర్బన్ ఏరియాల్లో ఇప్పటికే ఒక రోజు వ్యర్థాలు సుమారు 80,000 మెట్రిక్ టన్నులకు చేరిందన్నారు . 2047 నాటికి ఇది 260 మిలియన్ టన్నులకు చేరుతుందని అంచనా వేశారు. దీనికోసం 1,400 చదరపు కిలోమీటర్ల అవసరమవుతుందనీ, ఇది హైదరాబాద్, ముంబై , చెన్నై నగరాలకు కలిపితే వచ్చే ప్రదేశానికి సమానమవుతుందని సునీత హెచ్చరించారు. భారతదేశం అత్యంత పరిశుభ్రమైన నగరాన్ని కొనుక్కొనే క్రమంలో ఈ సర్వేనిర్వహించామని సీఎస్ సీ డైరెక్టర్ జనరల్ సునీతా నారాయణ్ తెలిపారు. వ్యర్థాల నియంత్రణలోపాలపై ఆమె అసంతృప్తి వ్యక్తంచేశారు. ఈ పరిస్థితుల్లో కేరళలో మున్సిపాలిటీ కంటే ప్రజలు అనుసరిస్తున్న పద్ధతులే ఉత్తమమైనవి అని ఆమె తెలిపారు. ప్రజలే కంపోస్ట్ , ఇతర వ్యర్థాలను వేరుచేసి రీసైక్లింగ్ చేసి సేకరించి అమ్ముతున్నారన్నారు. ఫ్యూచర్ వేస్ట్ మేనేజ్ మెంట్ లో ఇదే అద్భుతమైన మోడల్ అనీ, వ్యర్థాలను నిరోధించకపోతే దేశంలోని ఇతర నగరాలకు భారీ గుణపాఠం తప్పదని నారాయణ్ చెప్పారు.