మహిళా పోలీసు దారుణ హత్య | Kerala Woman Police Officer Set On Fire Died On Spot | Sakshi
Sakshi News home page

మహిళా పోలీసు దారుణ హత్య

Published Sat, Jun 15 2019 6:45 PM | Last Updated on Sat, Jun 15 2019 6:47 PM

Kerala Woman Police Officer Set On Fire Died On Spot - Sakshi

తిరువనంతపురం : కేరళలో దారుణం చోటుచేసుకుంది. మహిళా పోలీసు అధికారిపై తోటి ఉద్యోగి పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. వివరాలు.. కేరళలోని అలప్పుజా జిల్లాలోని ఓ పోలీసు స్టేషనులో సౌమ్య పుష్పాకరన్‌(34) సివిల్‌ కానిస్టేబుల్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. శనివారం విధులు ముగించుకుని ఇంటికి వస్తున్న సమయంలో తోటి పోలీసు అధికారి పెట్రోల్‌తో ఆమెపై దాడి చేశాడు.

ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన సౌమ్య అక్కడిక్కడే మృతిచెందారు. నిప్పంటించే క్రమంలో నిందితుడికి కూడా గాయాలయ్యాయి. కాగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని, ఐసీయూలో చికిత్స పొందుతున్నాడని పేర్కొన్నారు. ఈ హత్యకు గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. బాధితురాలికి ముగ్గురు పిల్లలు ఉన్నారని.. ఆమె కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చామని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement