తిరువనంతపురం: లెజెండరీ సింగర్ కేజే యేసుదాసు కుమారుడు, గాయకుడు విజయ్ యేసుదాసు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. కేరళలోని అలప్పుజ జిల్లాలో థరువూర్ వద్ద ఆయన నడుపుతున్న కారు ఎదురుగా వస్తున్న కారుతో ఢీ కొట్టింది. సోమవారం రాత్రి 11.30 గంటలకు జరిగిన ఈ ప్రమాదం నుంచి అందరూ సురక్షితంగా బయటపడ్డారు. కానీ రెండు కార్ల ముందు భాగం మాత్రం నుజ్జునుజ్జయ్యాయి. స్నేహితుడితో కలిసి విజయ్ తిరువనంతపురం నుంచి కొచ్చికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గురైన కార్లను రోడ్డు పై నుంచి తొలగించారు. ఈ ఘటన అనంతరం సింగర్ అతడి స్నేహితుడితో కలిసి మరో కారులో కొచ్చికి వెళ్లిపోయారు. (కాపురాలు కూలిపోతాయ్ అని హెడ్డింగ్ పెట్టారు: హిమజ)
విజయ్ యేసుదాసు మాలీవుడ్‌లో 20 ఏళ్లుగా సింగర్‌గా రాణిస్తున్నారు. మిలీనియం స్టార్స్ సినిమాలో తండ్రితో కలిసి విజయ్ తొలిసారి సాంగ్ పాడారు. ఓ పాత ఇంటర్వ్యూలో దేవుళ్లపై విశ్వాసం లేదని చెప్పిన విజయ్.. గుళ్లకు, చర్చిలకు వెళ్లడం మానేశానని తెలిపారు. కానీ పాజిటివ్, నెగెటివ్ ఎనర్జీలు ఉంటాయని మాత్రం నమ్ముతానని చెప్పుకొచ్చారు. (ఆ హీరో ఫ్యాన్స్‌తో నాకు ప్రమాదం: దర్శకుడు)
Comments
Please login to add a commentAdd a comment