కేరళ ప్రకృతి సౌందర్యానికి నెలవు అని తెలిసిందే. ఈ సంగతిని గ్రహించిన కేరళ వాళ్లు గాడ్స్ ఓన్ కంట్రీ అనే విశేషణంతో పర్యాటకరంగాన్ని తమ వైపు తిప్పుకున్నారు. టూరిజమే ప్రధాన ఉ΄ాధి మార్గంగా ఉన్న ఉత్తరాఖండ్ వాళ్లు కూడా తమది దేవభూమి అని చెప్పుకుంటారు. ప్రకృతి వాళ్లకిచ్చిన ప్రివిలేజ్ అది. ఈ సీజన్‌లో కేరళలో చూడాల్సిన ప్రదేశం అలెప్పీ... అదే అళప్పుఱ
పడవింట్లో విహారం
హౌస్‌బోట్ విహారం అళప్పుఱ ప్రత్యేకం. హనీమూన్ కపుల్ కోసం అందమైన హౌస్‌బోట్‌లుంటాయి. అరేబియా సముద్రంతోపాటు నదులు, చిన్న చిన్న నీటి పాయల్లో విహారం, భోజనం, రాత్రి బస కూడా హౌస్‌బోట్‌లోనే. కేరళ ఆహారం చేప లేకుండా ఉండదు. శాకాహారం కావాలంటే ముందుగా చెప్పాలి. కొబ్బరి నూనెతో వండిన వంటలు తేలిగ్గా జీర్ణమవుతాయి. కేరళలో సంతృప్తిగా భోజనం చేసినప్పటికీ మళ్లీ త్వరగా ఆకలి వేస్తుంది. జర్నీలో చిరుతిండి దగ్గరుంచుకోక తప్పదు. ఇక్కడ కొబ్బరి హల్వా, అరటి కాయ చిప్స్ రుచిగా ఉంటాయి. పర్యాటకులు కేరళలో కొబ్బరి నీటిని అమృతంలాగ తాగుతుంటే స్థానికులు మాత్రం థమ్స్ అప్, స్ప్రైట్ తాగుతుంటారు. ఇక్కడ మార్కెట్‌లో రకరకాల అరటిపండ్లు ఉంటాయి. తప్పకుండా రుచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment