
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గొప్ప మనసు చాటుకున్నాడు. ఓ పేద విద్యార్థిని మెడికల్ చదువుకు అయ్యే ఖర్చును భరించేందుకు బన్నీ ముందుకు వచ్చిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు.. గతంలో కేరళలో భారీ వర్షాల కారణంగా అక్కడ వరదలు వచ్చి ఎన్నో గ్రామాలు కొట్టుకొని పోయిన సంగతి తెలిసిందే. దీంతో లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.. ముఖ్యంగా అలెప్పీ ప్రాంతం పూర్తిగా నేలమట్టం అయ్యింది. దీంతో నిరాశ్రయులకు చేయూతనిచ్చేందుకు ‘వీ ఆర్ ఫర్ అలెపి’ అంటూ కలెక్టర్ కృష్ణ తేజ దాతలకు పిలుపు నిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోవిడ్ కారణంగా తండ్రిని కొల్పోయిన ఓ మెడికల్ విద్యార్థినికి పై చదువులు చదివేందుకు ఆర్థిక సమస్యలు అడ్డుగా వచ్చాయి.
చదవండి: హీరోయిన్‌పై బహిరంగ కామెంట్స్.. నటుడిపై సీరియస్ అయిన చిన్మయి
92 శాతం మార్కులతో మెరిట్ తెచ్చుకున్న ఆమెను నర్సింగ్ చదివించేందుకు అలెపీ కలెక్టర్ మద్దతుగా నిలిచారు. అల్లు అర్జున్‌కు ఫోన్ చేసి సదరు విద్యార్థినిని ఒక ఏడాది ఫిజుకు అయ్యే ఖర్చును సాయం చేయాల్సిందిగా కోరారు. దీంతో ఆ విద్యార్థిని పరిస్థితి గురించి తెలుసుకున్న అల్లు అర్జున్ ఒక సంవత్సరం కాదు.. నాలుగు సంవత్సరాలు తనకు అయ్యే ఖర్చు మొత్తం భరిస్తానని.. హాస్టల్ ఫీజుల చెలించడమే కాకుండా తనని దత్తత తీసుకుంటానని బన్నీ కలెక్టర్‌కు మాట ఇచ్చాడట. ఇక బన్నీ సేవ గుణాన్ని ప్రశంసిస్తూ కలెక్టర్ కృష్ణ తేజ ట్వీట్ చేయడంతో ఈ విషయం వెలుగు చూసింది. దీంతో అల్లు అర్జున్‌ను ఇటూ తెలుగు ప్రజలతో పాటు కేరళ ప్రేక్షకులు కూడా ప్రశంసలతో ముంచేత్తున్నారు.
చదవండి: రష్మికపై ఇంత నెగిటివిటీకి కారణం ఇదే! ఆ ఒక్క మాటకే విమర్శల దాడి
Comments
Please login to add a commentAdd a comment