పుష్ప2..ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ. సినిమా చూసిన వాళ్లు బన్నీ నటన గురించి, క్లైమాక్స్, జాతర సీన్లను గురించి మాట్లాడుకుంటే..చూడలి వాళ్లు సినిమా అలా ఉందట..ఆ సీన్లు బాగున్నాయట వెళ్లి చూద్దాం అని చర్చించుకుంటున్నారు. ఇక కలెక్షన్ల పరంగా ఈ సినిమా సృష్టిస్తున్న రికార్డులు అంతా ఇంతా కాదు. తొలి రోజే ఏకంగా రూ.294 కోట్ల వసూళ్లను రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది. ఇండియన్ సినిమా హిస్టరీలో తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఇదే. ఇక ఐదు రోజుల్లో రూ. 922 కోట్లను రాబట్టి చరిత్ర సృష్టించింది.
(చదవండి: 'పుష్ప 2' ఐదు రోజుల కలెక్షన్స్.. రూ.1000 కోట్లకు చేరువ)
సినిమా విడుదలై ఐదు రోజులు దాటినా.. ఇప్పటికీ థియేటర్స్ వద్ద సందడి కొనసాగుతుంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ఇంకా పుష్ప సెలెబ్రేషన్స్ చేస్తూనే ఉన్నారు. పుష్పరాజ్ వేషధారణ ధరిస్తూ థియేటర్స్ వద్ద సందడి చేస్తున్నారు. తాజాగా కేరళకు చెందిన ఓ బన్నీ అభిమాని.. గంగమ్మ తల్లి వేషాధారణతో థియేటర్స్‌కి వెళ్లి డ్యాన్స్ చేశాడు.
పొట్టపై బన్నీ లుక్..
పుష్ప 2 రిలీజ్ సందర్భంగా బన్నీ ఫ్యాన్స్ కేరళలో సందడి చేస్తున్నారు. ఓ వ్యక్తి అయితే ఏకంగా పుష్ప 2లో అల్లు అర్జున్ వేసిన గంగమ్మ తల్లి వేషాధారణలో కనిపించి అందరిని అలరించాడు. థియేటర్స్ వద్ద నిలబడి చిందులేశాడు. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కాగా, కేరళలో బన్నీకి చాలా మంది అభిమానులు ఉన్న సంగతి తెలిసేందే. అక్కడ బన్నీని ముద్దుగా మల్లు అర్జున్ అని పిలుచుకుంటారు. బన్నీ నుంచి వచ్చే ప్రతి సినిమాను అక్కడి ప్రేక్షకులు ఆదరిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment