
ర్యాగింగ్ భూతానికి ఓ కేరళ బాలుడు బలైన సంగతి తెలిసిందే. కేరళలోని ఎర్నాకుళం ప్రాంతానికి చెందిన మిహిర్(15)(Mihir) అనే బాలుడు..తోటి విద్యార్థుల ర్యాగింగ్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. జనవరి 15న ఈ ఘటన చోటు చేసుకోకగా.. తమ కుమారుడు ఎదుర్కొన్న ఇబ్బందికర పరిస్థితులను తెలియజేస్తూ విద్యార్థి తల్లి ఇటీవల సోషల్‌మీడియా వేదికగా పోస్ట్ పెట్టడంతో ఈ విషయం ప్రపంచానికి తెలిసింది. ఈ అమానవీయ ఘటనపై అందరూ విచారం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా హీరోయిన్ సమంత(Samantha) కూడా ఈ ఘటనపై స్పందిచింది. మిహిర్ ఆత్మహత్య గురించి తెలిసి షాకయ్యానని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరారు. ఈమేరకు ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ పెట్టింది.
‘మనం 2025లో ఉన్నాం. అయినప్పటికీ కొంతమంది స్వార్థం, ద్వేషం కారణంగా ఓ బాలుడు తన జీవితాన్ని కోల్పోయాడు. వేధింపులు, ర్యాగింగ్ వంటికి ఎంతటి ప్రమాదకరమో ఈ ఘటన తెలియజేస్తుంది. వీటి వల్ల మనిషి శారీరకంగా, మానసికంగా కుంగిపోతాడు. మన దగ్గర ఎన్నో కఠినమైన ర్యాగింగ్ చట్టాలు ఉన్నాయి. తాము ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి చెబితే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తోందోనని చాలామంది విద్యార్థులు భయపడుతున్నారు. లోలోనే కుమిలి పోతున్నారు. మనం ఎక్కడో విఫలం అవుతున్నాం. ఈ ఘటనపై సంతాపం తెలియజేయడమే కాదు.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయాలి. అధికారులు ఈ ఘటన గురించి క్షుణ్ణంగా పరిశీలించాలని కోరుకుంటున్నా.

నిజానిజాలు బయటకు వస్తాయని ఆశిస్తున్నా. ఆ విద్యార్థికి న్యాయం జరగాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. అలాగే, ఎదుటి వారినుంచి బెదిరింపులు, వేధింపులు, అవమానకర చర్యలు ఎదురైతే వాటి గురించి బయటకు మాట్లాడాలి. అలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులకు సపోర్ట్‌గా నిలవండి’అని సమంత కోరింది.
వాష్‌రూమ్‌కు తీసుకెళ్లి..
తన కుమారుడితో తోటి విద్యార్థులు అమానవీయంగా ప్రవర్తించారని మిహిర్ తల్లి సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. మిహిర్‌ను తోటి విద్యార్థులు కొట్టారని, దుర్భాషలాడారని, అతడి చివరి రోజున ఊహించలేని అవమానాన్ని ఎదుర్కొన్నాడని తెలిపారు. వాష్‌రూమ్‌కు తీసుకెళ్లి టాయిలెట్ సీటును నాకించారని, టాయిలెట్‌ను ఫ్లష్ చేసి తలని అందులో పెట్టారని, అవన్నీ భరించలేకనే తన క కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది.మిహిర్ మరణం తర్వాత కూడా వేధింపులు ఆగలేదని చెబుతూ కొన్ని స్క్రీన్ షాట్లను పంచుకున్నారు.మ కుమారుడి మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కార్యాలయానికి, డీజీపీకి బాధిత తల్లిదండ్రులు వినతిపత్రం సమర్పించారు. ఈ నేపథ్యంలో త్రిప్పునితుర హిల్ ప్యాలెస్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అయితే మిహిర్ తల్లి ఆరోపణలను సదరు స్కూల్ యాజమాన్యం ఖండించింది.
Comments
Please login to add a commentAdd a comment