Pushpa Update: Allu Arjun Is Off To Pushpa Movie Shoot In Kerala - Sakshi
Sakshi News home page

‘పుష్ప’ కోసం కేరళ పయనమైన స్టైలిష్‌‌ స్టార్‌

Published Wed, Feb 17 2021 3:03 PM | Last Updated on Wed, Feb 17 2021 3:53 PM

Allu Arjun Heads To Kerala For His Pushpa Movie Shooting - Sakshi

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అ​ర్జున్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’. క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ రూపొందిస్తున్న ఈ చిత్రం గత నెల తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలోని మారేడుమల్లీ ఆటవీ ప్రాంతంలో రెండవ షూటింగ్‌ షెడ్యూల్‌ను జరుపుకున్న సంగతి తెలిసిందే. ఇక తదుపరి షెడ్యూల్‌ కోసం కాస్తా బ్రేక్‌ తీసుకున్న అల్లు అర్జున్‌ తాజాగా కేరళకు పయనమయ్యాడు. ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో సాగే ఈ చిత్రం కేరళ అడువుల్లో మూడవ షెడ్యూల్‌ను జరుపుకొనుంది. ఈ సందర్భంగా స్టైలిష్‌ స్టార్‌ తన కారులో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వెళుతున్న ఫొటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 

ఇందులో బన్నీ తన బ్లాక్‌ రేంజోవర్‌ కారులో బ్లాకకలర్‌ సన్‌గ్లాసెస్‌ పెట్టుకుని కనిపించాడు. కొన్ని వారాల పాటు కేరళలో జరిగే ఈ షూటింగ్ షెడ్యూల్‌లో అక్కడి అడవుల్లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు సమాచారం. కాగా ఇందులో కథానాయికగా రష్మికా మండన్న నటిస్తున్న సంగతి తెలిసిందే. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీలో అల్లు అర్జున్‌ తొలిసారిగా పూర్తిస్థాయి మాస్‌ రోల్‌లో మెప్పించనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్‌, ముత్తంసెట్టి మీడియా సంయుక్తం నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

(చదవండి: పుష్ప: హాలీవుడ్‌ తరహాలో భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌..)
           (చిన్న బ్రేక్‌ తీసుకున్న అల్లుఅర్జున్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement