అల్లు అర్జున్- సుకుమార్ పుష్ప2తో ప్రేక్షకులలో పూనకాలు తెప్పించారు. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం కేవలం మూడు రోజుల్లోనే రూ. 621 కోట్లు రాబట్టింది. తెలుగు,హిందీ,తమిళ,కన్నడ,మలయాళం, బెంగాలీ భాషల్లో అల్లు అర్జున్ రప్పా రప్పా ఆడించేస్తున్నాడు. కేరళలో అల్లు అర్జున్‌కు భారీ ఫ్యాన్ బేస్ ఉంది. అయితే, అక్కడి రాష్ట్రంలోని కొచ్చిన్‌లోని ఒక థియేటర్‌లో ప్రేక్షకులకు విచిత్రమైన అనుభవం ఏర్పడింది. ఈ ఘటన రిలీజ్ రోజే జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.
కేరళలో భారీ కలెక్షన్స్‌తో పుష్ప2 దూసుకుపోతుంది. డిసెంబర్ 6న కొచ్చిన్‌లోని సినీపోలిస్ సెంటర్ స్క్వేర్‌లో ‘పుష్ప 2’ సినిమా చూసేందుకు చాలామంది ప్రేక్షకులు వెళ్లారు. థియేటర్ కూడా నిండిపోయింది. అయితే, సినిమా స్క్రీనింగ్‌లో తొలి భాగం ప్రదర్శించకుండా సెకండాఫ్ వేశారు. కానీ, ఈ విషయాన్ని ప్రేక్షకులు గుర్తించలేకపోవడంతో సినిమా చూస్తూ ఎంజాయ్ చేశారు.
అయితే, ఇంటర్వెల్ సమయంలో సినిమా పూర్తి అయినట్లు టైటిల్ కార్డ్ పడటంతో అప్పుడు అసలు విషయం వారందిరికీ అర్థం అయింది. తాము ఇప్పటి వరకు సెకండాఫ్ చూశామని థియేటర్ యాజమాన్యానికి తెలిపారు. తాము చెల్లించిన డబ్బు తిరిగి చెల్లించాలని కోరడంతో వారందరికీ రిటర్న్ ఇచ్చేశారు. ఈ క్రమంలో కొంతమంది ఫస్ట్ పార్ట్‌ను ప్రదర్శించాలని కోరడంతో వారందరి కోసం యాజమాన్యం రన్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment