Vijay Yesudas
-
యేసుదాస్ కొడుకు ఇంట్లో చోరీ.. బంగారు, వజ్రాభరణాలు మాయం
ఇటీవలి కాలంలో సెలబ్రిటీల ఇళ్లలో వరుస దొంగతనాలు హాట్‌టాపిక్‌గా మారాయి. కొన్ని రోజుల క్రితం సూపర్‌స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో భారీ చోరి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే మరో సెలబ్రిటీ ఇంట్లో దొంగతనం జరిగింది. ప్రముఖ గాయకుడు యేసుదాస్ కుమారుడు, సింగర్ విజయ్ యేసుదాసు ఇంట్లో భారీగా చోరీ జరిగింది. చెన్నైలోని అభిరామపురంలోని విజయ్ నివాసంలో 60 సవర్ల బంగారు నగలు, వజ్రాభరణాలతో పాటు పలు డాక్యుమెంట్లు చోరీకి గురయ్యాయి. ఈ విషయంపై విజయ్ భార్య దర్శన పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ ఇంట్లో పని చేస్తున్నవారే దొంగతనానికి పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా యేసుదాస్ కుమారుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన విజయ్ ప్రస్తుతం నేపథ్య గాయకుడిగా, నటుడిగా సత్తా చాటుతున్నారు. -
ప్రమాదానికి గురైన సింగర్ విజయ్ ఏసుదాసు
తిరువనంతపురం: లెజెండరీ సింగర్ కేజే యేసుదాసు కుమారుడు, గాయకుడు విజయ్ యేసుదాసు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. కేరళలోని అలప్పుజ జిల్లాలో థరువూర్ వద్ద ఆయన నడుపుతున్న కారు ఎదురుగా వస్తున్న కారుతో ఢీ కొట్టింది. సోమవారం రాత్రి 11.30 గంటలకు జరిగిన ఈ ప్రమాదం నుంచి అందరూ సురక్షితంగా బయటపడ్డారు. కానీ రెండు కార్ల ముందు భాగం మాత్రం నుజ్జునుజ్జయ్యాయి. స్నేహితుడితో కలిసి విజయ్ తిరువనంతపురం నుంచి కొచ్చికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గురైన కార్లను రోడ్డు పై నుంచి తొలగించారు. ఈ ఘటన అనంతరం సింగర్ అతడి స్నేహితుడితో కలిసి మరో కారులో కొచ్చికి వెళ్లిపోయారు. (కాపురాలు కూలిపోతాయ్ అని హెడ్డింగ్ పెట్టారు: హిమజ) విజయ్ యేసుదాసు మాలీవుడ్‌లో 20 ఏళ్లుగా సింగర్‌గా రాణిస్తున్నారు. మిలీనియం స్టార్స్ సినిమాలో తండ్రితో కలిసి విజయ్ తొలిసారి సాంగ్ పాడారు. ఓ పాత ఇంటర్వ్యూలో దేవుళ్లపై విశ్వాసం లేదని చెప్పిన విజయ్.. గుళ్లకు, చర్చిలకు వెళ్లడం మానేశానని తెలిపారు. కానీ పాజిటివ్, నెగెటివ్ ఎనర్జీలు ఉంటాయని మాత్రం నమ్ముతానని చెప్పుకొచ్చారు. (ఆ హీరో ఫ్యాన్స్‌తో నాకు ప్రమాదం: దర్శకుడు) -
ఆ క్రెడిట్ వాళ్లదే
‘‘నేను అక్షరాల విషయంలో చాలా పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటాను. ఇది నా తల్లి నుంచి నేర్చుకున్నాను. నేను క్రిష్టియన్ ఫ్యామిలీలో పుట్టినప్పటికీ సంస్కృతంలోని అక్షరాలను నేర్చుకోమని ఆమె చెప్పారు. అది ఆమె నాకు అందించిన ఆశీర్వాదం’’ అని ప్రముఖ గాయకులు కె.జె.ఏసుదాస్ అన్నారు. చాలా కాలం తర్వాత ఆయన హైదరాబాద్‌లో ఈరోజు లైవ్ కాన్సర్ట్ చేస్తున్నారు. ఈ సంగీత విభావరిలో ఏసుదాస్‌తోపాటు గాయకులు విజయ్ ఏసుదాస్, కల్పన కూడా పాల్గొంటారు. ఈ సందర్భంగా ఏసుదాస్ మాట్లాడుతూ– ‘‘మా అమ్మ అందించిన మరో ఆశీర్వాదం ఏంటంటే.. నాకు ఐదేళ్లున్నప్పుడు చదువు గురించి ఎలాంటి బెంగా పెట్టుకోవద్దు. నార్మల్‌గా చదువుకుంటే చాలు. కానీ, కర్నాటిక్ క్లాసికల్ మ్యూజిక్‌ని ప్రాపర్‌గా నేర్చుకోమని చెప్పారు. నాకు బ్రదర్స్, సిస్టర్ ఉన్నారు. వాళ్లు కూడా బాగా పాడేవారు. కానీ, ఈ విషయంలో నాన్నగారు నన్ను మాత్రమే ప్రోత్సహించారు. గురువు లేకుండా ఎవరూ గొప్పవారు కాలేరు. మనల్ని తీర్చిదిద్దిన గురువులంతా దేవుళ్లతో సమానమని నా నమ్మకం. నేను ఇప్పటివరకు ఏం సాధించినా అదంతా నా తల్లిదండ్రులు, గురువుల వల్లే సాధ్యమైంది. అలాగే నా పాటలు వినేవారు, సంగీత ప్రియుల ప్రార్థనల వల్లే నేను ఈ స్థాయికి వచ్చాను. అంతకుమించి మరేం లేదు. నా బ్రదర్ అలేఖ్య హోమ్స్ శ్రీనాథ్ నన్ను లైవ్ మ్యూజిక్ చెయ్యమని చెప్పారు. దాదాపు 10 సంవత్సరాల తర్వాత హైదరాబాద్‌లో లైవ్ మ్యూజిక్ చేస్తున్నాను. మా అబ్బాయి విజయ్ వయసు ఇప్పుడు 40. నా వయసు 79. కానీ, నేను ఇప్పటికీ విద్యార్థినే’’ అన్నారు. విజయ్ ఏసుదాస్ మాట్లాడుతూ– ‘‘మొదట్లో నాన్నగారి అడుగుజాడల్లోనే వెళ్లాను. ఆ తర్వాత నా సొంతదారిలోనే వెళ్లాలని డిసైడ్ అయ్యాను. కొన్ని విషయాల్లో ఆయన గైడెన్స్ తీసుకుంటాను. ఇళయరాజాగారితో కలిసి నాన్నగారు చాలా సినిమాలకు పనిచేశారు. ఇప్పుడు నేను, యువన్‌శంకర్‌రాజా కలిసి పనిచేస్తున్నాం. నేను రెండు సినిమాల్లో నటించాను కూడా. నాన్నగారి బయోపిక్ చేసే ఆలోచన ఉందా? అని అడుగుతున్నారు. అయితే నాకు అలాంటి ప్లాన్స్ ఏమీ లేవు. కానీ, ఎవరైనా చేస్తే నేను ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటున్నాను’’ అన్నారు. -
మైక్ ముందు నుంచి... కెమేరా ముందుకు..!
తమిళ చిత్రం ‘మారి’ తాజా ప్రచార చిత్రం చూస్తే అందులో ఓ సర్ప్రైజ్ కనిపిస్తుంది. ఆ ట్రైలర్లో పోలీస్ దుస్తుల్లో ఉన్నది - గాయకుడు విజయ్ ఏసుదాస్. ‘చిన్నారికి ఓణీలిచ్చే బంగారి బావా’ (గోవిందుడు అందరివాడేలే), ‘నిమిషం నిమిషం’(దృశ్యం), ‘చిట్టి జాబిలి’ (కడలి), ‘నువ్వంటేప్రాణమని’ (నా ఆటోగ్రాఫ్ స్వీట్‌మెమొరీస్) - ఈ పాటలన్నీ వింటే గుర్తొచ్చే గాయకుడు విజయ్. ప్రముఖ గాయకుడు కేజే ఏసుదాస్ తనయుడైన విజయ్ ఇప్పటికే తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాటలు పాడారు. ఇప్పుడు ధనుష్ హీరోగా నటిస్తున్న ‘మారి’ చిత్రంతో తెరంగేట్రం చేస్తున్నారు. ‘‘దర్శకుడు బాలాజీ మోహన్ ఈ పోలీస్ పాత్ర గురించి చెప్పినప్పుడు ముందు చాలా సందేహించాను. కానీ ఆయన నమ్మకం చూసి, ‘ఎస్’ చెప్పేశా. మా నాన్నగారిని అడిగితే కూడా ‘ఇక నీ ఇష్టం... కానీ గొంతు జాగ్రత్త. అది మాత్రం పోగొట్టుకోకు’ అని హెచ్చరించారు’’ అని చెప్పారీ సరికొత్త నటుడు.