కె.జె.ఏసుదాస్
‘‘నేను అక్షరాల విషయంలో చాలా పర్‌ఫెక్ట్‌గా ఉండాలనుకుంటాను. ఇది నా తల్లి నుంచి నేర్చుకున్నాను. నేను క్రిష్టియన్ ఫ్యామిలీలో పుట్టినప్పటికీ సంస్కృతంలోని అక్షరాలను నేర్చుకోమని ఆమె చెప్పారు. అది ఆమె నాకు అందించిన ఆశీర్వాదం’’ అని ప్రముఖ గాయకులు కె.జె.ఏసుదాస్ అన్నారు. చాలా కాలం తర్వాత ఆయన హైదరాబాద్‌లో ఈరోజు లైవ్ కాన్సర్ట్ చేస్తున్నారు. ఈ సంగీత విభావరిలో ఏసుదాస్‌తోపాటు గాయకులు విజయ్ ఏసుదాస్, కల్పన కూడా పాల్గొంటారు.
ఈ సందర్భంగా ఏసుదాస్ మాట్లాడుతూ– ‘‘మా అమ్మ అందించిన మరో ఆశీర్వాదం ఏంటంటే.. నాకు ఐదేళ్లున్నప్పుడు చదువు గురించి ఎలాంటి బెంగా పెట్టుకోవద్దు. నార్మల్‌గా చదువుకుంటే చాలు. కానీ, కర్నాటిక్ క్లాసికల్ మ్యూజిక్‌ని ప్రాపర్‌గా నేర్చుకోమని చెప్పారు. నాకు బ్రదర్స్, సిస్టర్ ఉన్నారు. వాళ్లు కూడా బాగా పాడేవారు. కానీ, ఈ విషయంలో నాన్నగారు నన్ను మాత్రమే ప్రోత్సహించారు. గురువు లేకుండా ఎవరూ గొప్పవారు కాలేరు. మనల్ని తీర్చిదిద్దిన గురువులంతా దేవుళ్లతో సమానమని నా నమ్మకం. నేను ఇప్పటివరకు ఏం సాధించినా అదంతా నా తల్లిదండ్రులు, గురువుల వల్లే సాధ్యమైంది.
అలాగే నా పాటలు వినేవారు, సంగీత ప్రియుల ప్రార్థనల వల్లే నేను ఈ స్థాయికి వచ్చాను. అంతకుమించి మరేం లేదు. నా బ్రదర్ అలేఖ్య హోమ్స్ శ్రీనాథ్ నన్ను లైవ్ మ్యూజిక్ చెయ్యమని చెప్పారు. దాదాపు 10 సంవత్సరాల తర్వాత హైదరాబాద్‌లో లైవ్ మ్యూజిక్ చేస్తున్నాను. మా అబ్బాయి విజయ్ వయసు ఇప్పుడు 40. నా వయసు 79. కానీ, నేను ఇప్పటికీ విద్యార్థినే’’ అన్నారు. విజయ్ ఏసుదాస్ మాట్లాడుతూ– ‘‘మొదట్లో నాన్నగారి అడుగుజాడల్లోనే వెళ్లాను.
ఆ తర్వాత నా సొంతదారిలోనే వెళ్లాలని డిసైడ్ అయ్యాను. కొన్ని విషయాల్లో ఆయన గైడెన్స్ తీసుకుంటాను. ఇళయరాజాగారితో కలిసి నాన్నగారు చాలా సినిమాలకు పనిచేశారు. ఇప్పుడు నేను, యువన్‌శంకర్‌రాజా కలిసి పనిచేస్తున్నాం. నేను రెండు సినిమాల్లో నటించాను కూడా. నాన్నగారి బయోపిక్ చేసే ఆలోచన ఉందా? అని అడుగుతున్నారు. అయితే నాకు అలాంటి ప్లాన్స్ ఏమీ లేవు. కానీ, ఎవరైనా చేస్తే నేను ఇన్‌వాల్వ్ అవ్వాలనుకుంటున్నాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment