న్యూఢిల్లీ: దేశంలో మూడే మూడు పరిశుభ్రమైన నగరాలుగా నిలిచాయి. అత్యంత పరిశుభ్రమైన నగరాల జాబితాను సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సెంటర్ (సీఎస్ఈ) సోమవారం విడుదల చేసింది. సీఎస్ఈ తాజా రేటింగ్స్ ప్రకారం వీటిలో కేరళలోని అలెప్పు, గోవా రాజధాని పనాజి, కర్ణాటకలోని మైసూరు అతి పరిశుభ్రమైన నగరాలుగా పేరు దక్కించుకున్నాయి. దేశంలో సాలిడ్ వేస్టే మేనేజ్ మెంట్ పద్ధతిపై 'నాట్ ఇన్ మై బ్యాక్ యార్డ్' పేరుతో ఈ నివేదికను విడుదల చేసింది. ఘన వ్యర్థాల నిర్వహణలో ఢిల్లీ లాంటి మెట్రో నగరాల్లో పరిస్థితులు అంత మెరుగ్గా లేవని సీఎస్సీ వ్యాఖ్యానించింది .
దేశవ్యాప్తంగా పట్టణాల్లో ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ పద్ధతులు ఆధారంగా ఒక సర్వే నిర్వహించింది. మున్సిపల్ వ్యర్థ పదార్థాల నిర్వహణ వ్యవస్థల భారతదేశం లో పరిశుభ్రమైన నగరాల్లో ఈ మూడు నగరాలు ఉన్నాయని సర్వే తేల్చింది. ఈ విషయంలో దేశరాజధాని నగరం ఢిల్లీ అట్టడుగు స్థాయిలో ఉండగా, మైసూర్ తన స్థానాన్ని నిలబెట్టుకోవడం విశేషం.
గ్రౌండ్ లెవల్ సమాచారం పూర్తిగా లభ్యంకానప్పటికీ, 2009 ఘన వ్యర్థాల నిర్వహణ ఆర్థిక వ్యవహారాల శాఖ స్థాయీ పత్రాన్ని ప్రస్తావిస్తూ, భారతదేశ అర్బన్ ఏరియాల్లో ఇప్పటికే ఒక రోజు వ్యర్థాలు సుమారు 80,000 మెట్రిక్ టన్నులకు చేరిందన్నారు . 2047 నాటికి ఇది 260 మిలియన్ టన్నులకు చేరుతుందని అంచనా వేశారు. దీనికోసం 1,400 చదరపు కిలోమీటర్ల అవసరమవుతుందనీ, ఇది హైదరాబాద్, ముంబై , చెన్నై నగరాలకు కలిపితే వచ్చే ప్రదేశానికి సమానమవుతుందని సునీత హెచ్చరించారు.
భారతదేశం అత్యంత పరిశుభ్రమైన నగరాన్ని కొనుక్కొనే క్రమంలో ఈ సర్వేనిర్వహించామని సీఎస్ సీ డైరెక్టర్ జనరల్ సునీతా నారాయణ్ తెలిపారు. వ్యర్థాల నియంత్రణలోపాలపై ఆమె అసంతృప్తి వ్యక్తంచేశారు. ఈ పరిస్థితుల్లో కేరళలో మున్సిపాలిటీ కంటే ప్రజలు అనుసరిస్తున్న పద్ధతులే ఉత్తమమైనవి అని ఆమె తెలిపారు. ప్రజలే కంపోస్ట్ , ఇతర వ్యర్థాలను వేరుచేసి రీసైక్లింగ్ చేసి సేకరించి అమ్ముతున్నారన్నారు. ఫ్యూచర్ వేస్ట్ మేనేజ్ మెంట్ లో ఇదే అద్భుతమైన మోడల్ అనీ, వ్యర్థాలను నిరోధించకపోతే దేశంలోని ఇతర నగరాలకు భారీ గుణపాఠం తప్పదని నారాయణ్ చెప్పారు.
అత్యంత పరిశుభ్రమైన నగరాలు మూడే
Published Tue, Jul 12 2016 12:05 PM | Last Updated on Mon, Sep 4 2017 4:42 AM
Advertisement