Cleanest Cities
-
ప్రపంచంలోని టాప్ 10 అత్యంత పరిశుభ్రమైన నగరాలు (ఫోటోలు)
-
టన్నుల కొద్ది వ్యర్థాలతో కోట్లు గడిస్తూ...వరుసగా ఆరోసారి తొలిస్థానం దక్కించుకున్న నగరం
భారతదేశంలోనే స్వచ్ఛ నగరంగా ఇండోర్ వరుసగా ఆరోసారి తొలిస్థానం దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఐతే ఇండోర్ నగరమే ఎందుకు ఆ ఘనతను దక్కించుకోగలిగందంటే..ఎక్కడైన పొడిచెత్తను, తడిచెత్తను విభజించడం సర్వసాధారణం. కానీ ఇండోర్‌లో మాత్రం చెత్త సేకరణ వద్దే ఆరు విభాగాలుగా విభజిస్తారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర వాణిజ్య రాజధానిగా పిలిచే ఇండోర్ సుమారు 35 లక్షల జనాభా కలిగిన అతి పెద్ద నగరం. ప్రతిరోజు దాదాపు 1200 టన్నుల పొడి చెత్త, సుమారు 700 టన్నుల తడి చెత్తను విడుదల చేస్తున్నప్పటికీ చెత్త డబ్బాల్లో చెత్త మాత్రం కనిపించదు. ఎందుకంటే... అక్కడ దాదాపు 850 వాహనాలతో గృహాలు, వ్యాపార సంస్థలను నుంచి సేకరించే వేస్ట్‌ను ఆరు విభాగాలు విభజించి ఎప్పటికప్పుడూ తరలిస్తారని ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ సూపరింటెండెంట్ ఇంజనీర్ మహేష్ శర్మ తెలిపారు. వాహానాల్లోని వ్యర్థాలకు సంబంధించి ప్రత్యేక కంపార్ట్మెంట్లు ఉంటాయి. దీంతో సేకరణ ప్రారంభంలోనే సమర్ధవంతంగా ఆ వేస్ట్‌ని ప్రాసెస్ చేసేందుకు సులభంగా ఉంటుంది. ప్రధానంగా సేకరించిన తడి చెత్త కోసం బయో సీఎన్జీ(కంప్రెషన్ నేచురల్ గ్యాస్) ప్లాంట్ ఏర్పాటు చేశారు. ఈ ప్లాంట్ ఆసియాలోనె అతిపెద్దది. ఈ ఏడాది ఫిబ్రవరి 19న ప్రధాని నరేంద్ర మోదీ 150 కోట్లతో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్‌ని ప్రారంభించారు. ఈ ప్లాంట్ రోజుకు 550 మిలియన్ టన్నుల పొడి చెత్తను ప్రాసెస్ చేయడమే కాకుండా సుమారు 17 వేల నుంచి 18 వేల కిలోల బయో సీఎన్జీ తోపాటు దాదాపు 10 టన్నుల సేంద్రీయ ఎరువును ఉత్పత్తి చేయగలదు. ఈ సీఎన్జీతో దాదాపు 150 సీటీ బస్సులు నడుపుతోంది. దీని ధర వాణిజ్య సీఎన్జీ కంటే రూ. 5లు తక్కువ కూడా. గత ఆర్థిక సంవత్సరంలో వ్యర్థాల తొలగింపుతో సుమారు రూ. 14 కోట్లు ఆర్జించింది. అందులో కార్బన్ క్రెడిట్ అమ్మకం ద్వారానే దాదాపు రూ. 8 కోట్లు కాగా, బయో సీఎన్జీ ప్లాంట్‌కి వ్యర్థాలను సరఫరా చేసినందుకు ప్రైవేట్ కంపెనీ నుంచి వార్షిక ప్రీమియం సుమారు రూ. 2 కోట్లు ఆర్జించింది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో ఈ వ్యర్థాల తొలగింపుతో దాదాపు రూ. 20 కోట్లు ఆర్జించాలని పౌర సంఘం లక్ష్యంగా పెట్టుకుందని సూపరింటెండెంట్ మహేష్ శర్మ చెప్పారు. అంతేకాదు నగరంలో విడుదలయ్యే మరుగు నీటిని సైతం ప్రత్యేక ప్లాంట్లలో శుద్ధి చేసి సుమారు 200 పబ్లిక్ గార్డెన్లు, పొలాలు, నిర్మాణ కార్యకలాపాలకు తిరిగి ఉపయోగిస్తారని ఉద్యానవన అధికారి చేతన్ పాట్ తెలిపారు. (చదవండి: దేశంలోనే స్వచ్ఛ నగరంగా మళ్లీ ‘ఇండోర్’.. విజయవాడకు నాలుగో స్థానం) -
స్వచ్ఛ సర్వేక్షణ్ 2022: వరుసగా ఆరోసారి తొలిస్థానంలో ‘ఇండోర్’
న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత స్వచ్ఛమైన నగరంగా వరుసగా ఆరో ఏడాది తొలిస్థానాన్ని కైవసం చేసుకుంది మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరం. స్వచ్ఛ సర్వేక్షన్ 2022 అవార్డుల జాబితాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. గుజరాత్‌లోని సూరత్ నగరం తన రెండో స్థానాన్ని నిలబెట్టుకుంది. మహారాష్ట్రలోని నావి ముంబై మూడో స్థానంలో నిలవగా, ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నాలుగో స్థానంలో ఉంది. ‘స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్- 2022’లో మంచి పనితీరు కనబరిచిన రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ తొలి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలు నిలిచాయి. పెద్ద నగరాల జాబితాలో ఇండోర్, సూరత్ తొలి రెండు స్థానాల్లో ఉండగా.. నావి ముంబై, విజయవాడలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు.. 100లోపు అర్బన్ లోకల్ బాడీస్ ఉన్న రాష్ట్రాల జాబితాలో త్రిపురకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లోని మరిన్ని అంశాలు ఇలా ఉన్నాయి.. ► ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ విజేతలకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ► లక్షలోపు జనాభా కలిగిన నగరాల జాబితాలో మహారాష్ట్రలోని పంచ్‌గాని నగరం తొలి స్థానం సాధించింది. ఆ తర్వాత పటాన్(ఛత్తీస్‌గఢ్), కర్హాద్(మహారాష్ట్ర)లు ఉన్నాయి. ► లక్షకుపైగా జనాభా కలిగిన గంగా పరివాహక నగరాల్లో హరిద్వార్ తొలిస్థానంలో నిలవగా.. ఆ తర్వాతి స్థానాల్లో వారణాసి, రిషికేశ్‌లు ఉన్నాయి. లక్షలోపు జనాభా కలిగిన నగరాల్లో బిజ్నోర్కు ఫస్ట్ ర్యాంక్, ఆ తర్వాత కన్నౌజ్, గర్‌ముఖ్తేశ్వర్ నగరాలు నిలిచాయి. ► మహారాష్ట్రలోని డియోలాలి దేశంలోనే స్వచ్ఛమైన కంటోన్మెంట్ బోర్డుగా నిలిచింది. స్వచ్ఛ సర్వేక్షన్లో భాగంగా 2016లో 73 నగరాలను పరిగణనలోకి తీసుకోగా.. ఈ ఏడాది ఏకంగా 4,354 నగరాలను పరిశీలించి అవార్డులు ప్రకటించారు. ఇదీ చదవండి: ‘పోక్సో’ కేసులో సంచలన తీర్పు.. ఆ మానవ మృగానికి 142 ఏళ్ల జైలు శిక్ష -
దేశంలోనే తొలి స్థానంలో ఇండోర్.. విజయవాడకు మూడోస్థానం
న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత స్వచ్ఛమైన నగరంగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ మరోసారి ప్రథమ స్థానంలో నిలిచింది. ఇలా ఇండోర్ తొలి స్థానాన్ని కైవసం చేసుకోవడం ఇది అయిదోసారి విశేషం. రెండో స్థానంలో సూరత్(గుజరాత్), ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. దేశంలో పరిశుభ్ర రాష్ట్రంగా జార్ఖండ్ ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ‘స్వచ్ఛ్ సర్వేక్షణ్-2021’ అవార్డులను శనివారం ప్రకటించింది. విజేతలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అవార్డులను ప్రదానం చేశారు. చదవండి: మాజీ మిస్ కేరళ, రన్నరప్ మృతి: ఆడి కారులో వెంటాడి మరీ కాగా ఇండోర్ సాధించిన విజయానికి నగర ప్రజలకు కలెక్టర్ అభినందనలు తెలిపారు. ‘ఇండోర్ నగరాన్ని దేశంలోని అత్యంత పరిశుభ్రమైన నగరంగా వరుసగా ఐదవసారి నిలిపినందుకు ఇండోర్ వాసులకు అభినందనలు. పౌరులకు పరిశుభ్రతపై అవగాహన కల్పించడం వల్లే ఇది సాధ్యమైంది’ అని కలెక్టర్ మనీష్ సింగ్ ట్వీట్ చేశారు. అంతేగాక ఇంతకుముందు దేశంలోనే తొలి వాటర్ ప్లస్ నగరంగా ఇండోర్ నిలిచింది. ఇదిలా ఉండగా స్వచ్ఛ్ సర్వేక్షణ్ అనేది ‘స్వచ్ఛ భారత్ మిషన్’లో భాగంగా దేశంలోని నగరాలు, పట్టణాలలో పరిశుభ్రత, పారిశుద్ధ్యానికి సంబంధించిన వార్షిక సర్వే. చదవండి: యువత ఆలోచనల్లో మార్పు తెస్తున్న ‘జై భీమ్’.. लगातार पाँचवी बार देश का सबसे स्वच्छ शहर घोषित होने पर इंदौर के नागरिकों को बधाई। कलेक्टर श्री मनीष सिंह ने कहा है कि नागरिकों की स्वच्छता जागरूकता के कारण यह संभव हो सका है।@CMMadhyaPradesh @PMOIndia pic.twitter.com/GVaxap54oS — Collector Indore (@IndoreCollector) November 20, 2021 -
‘స్వచ్ఛ’ నగరాల ఏపీ
సాక్షి, అమరావతి/ సాక్షి విశాఖపట్నం/సాక్షి, న్యూఢిల్లీ: పారిశుధ్యం, పరిశుభ్రత నిర్వహణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ‘స్వచ్ఛ్ సర్వేక్షణ్’ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ రికార్డుల మోత మోగించింది. పరిశుభ్రమైన రాష్ట్రాల జాబితాలో ఆరో స్థానం (2018–19లో ర్యాంక్ 20) సాధించి సత్తా చాటింది. రాష్ట్రంలో పలు నగరాలు, పట్టణాలు కూడా జాతీయస్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు దక్కించుకున్నాయి. 2019–20కి కేంద్రం గురువారం ప్రకటించిన ర్యాంకుల్లో 10 లక్షల కంటే మించిన జనాభా ఉన్న నగరాల కేటగిరీలో విజయవాడ నాలుగో ర్యాంకు సాధించగా.. విశాఖపట్నానికి తొమ్మిదో ర్యాంకు దక్కింది. 10 లక్షల లోపు జనాభా ఉన్న నగరాల కేటగిరీలో తిరుపతికి ఆరో ర్యాంకు లభించింది. టీడీపీ ప్రభుత్వ హయాం (2018–19)లో టాప్– 20లో కూడా చోటు దక్కించుకోలేని నగరాలు ఈసారి టాప్–10లోకి దూసుకెళ్లాయి. కాగా, జాతీయస్థాయిలో మొదటి ర్యాంకు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు దక్కింది. హైదరాబాద్ 23వ ర్యాంక్ సాధించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పారిశుధ్య నిర్వహణపై చూపిన ప్రత్యేక శ్రద్ధతో రాష్ట్రం ర్యాంకుల్లో పైకి ఎగబాకింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విప్లవాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ ఇందుకు ఎంతో ఉపకరించింది. దీంతో విజయవాడ గతేడాది కంటే 8 స్థానాలు, విశాఖపట్నం 14 స్థానాలు, తిరుపతి రెండు స్థానాలు మెరుగుపరుచుకుని టాప్–10లో చోటు సాధించాయి. 4,242 నగరాలు/పట్టణాల పరిధిలో.. ►4,242 నగరాలు/పట్టణాలు, 62 కంటోన్మెంట్ బోర్డుల పరిధిలో కేంద్రం సర్వే నిర్వహించింది. ►డిజిటల్ విధానంలో 28 రోజులపాటు నిర్వహించిన సర్వేలో భాగంగా 24 లక్షలకుపైగా ఫొటోలను జియోట్యాగింగ్ చేశారు. ►దాదాపు 2 కోట్ల మంది ప్రజల అభిప్రాయాలు సేకరించారు. వివిధ కేటగిరీల్లో టాప్ ర్యాంకులు మనవే.. ►100కుపైగా పట్టణ స్థానిక సంస్థలు ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఆరో ర్యాంక్ సాధించింది. ►10 లక్షల లోపు జనాభా కేటగిరీలో టాప్–100 ర్యాంకుల్లో రాజమహేంద్రవరం 51, ఒంగోలు 57, కాకినాడ 58, తెనాలి 75, కడప 76, చిత్తూరు 81, హిందూపూర్ 93, తాడిపత్రి 99 ర్యాంకులు దక్కించుకున్నాయి. ►10 లక్షల నుంచి 40 లక్షల జనాభా ఉన్న నగరాల కేటగిరీలో అతిపెద్ద శుభ్రమైన నగరంగా విజయవాడ ూ లక్ష నుంచి 3 లక్షలు జనాభా ఉన్న నగరాల కేటగిరీలో ఉత్తమ స్థిరమైన (సస్టైన్‌బుల్) చిన్ననగరంగా తిరుపతి ►50 వేల నుంచి లక్ష జనాభా ఉన్న కేటగిరీలో ఉత్తమ స్థిరమైన చిన్ననగరంగా చీరాల ూ 25 వేల నుంచి 50 వేల జనాభా ఉన్న కేటగిరీలో ఉత్తమ స్థిరమైన చిన్ననగరంగా ఆత్మకూరు ూ సౌత్ జోన్లో 50 వేల నుంచి లక్ష జనాభా కలిగినవాటిలో పరిశుభ్రమైన నగరంగా పలమనేరు ూ 25 వేలు లోపు జనాభా కలిగిన వాటిలో అతిచిన్న ఫాస్ట్ మూవింగ్ సిటీగా ముమ్మడివరం సౌత్ జోన్‌లోనూ ఏపీదే అగ్రస్థానం ►50 వేల నుంచి లక్ష జనాభా కలిగిన నగరాల కేటగిరీలో సౌత్ జోన్లో టాప్–100 ర్యాంకుల్లో ఏకంగా 40 ర్యాంకులు రాష్ట్రానికి దక్కాయి. 1 నుంచి 8 ర్యాంకులు పలమనేరు, చీరాల, పుంగనూరు, కందుకూరు, మండపేట, పులివెందుల, నర్సాపూర్, తణుకు సాధించాయి. ►25 వేల నుంచి 50 వేల జనాభా ఉన్న నగరాల కేటగిరీలో టాప్–10లో పుట్టపర్తి 2, జమ్మలమడుగు 5, నిడదవోలు 6, రామచంద్రాపురం 7వ ర్యాంకులు సాధించాయి. ఈ కేటగిరీలో టాప్–100 ర్యాంకుల్లో మన రాష్ట్రానికి 32 ర్యాంకులు దక్కాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ఉపరాష్ట్రపతి అభినందనలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ్ సర్వేక్షణ్–2020 ర్యాంకుల్లో విజయవాడ, విశాఖపట్నం నగరాలు మెరుగైన స్థానాలు దక్కించుకున్నందుకు ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు. ‘పది లక్షలకు పైగా ఉన్న జనాభా కేటగిరీలో నాలుగో స్థానంలో విజయవాడ, 9వ స్థానంలో విశాఖపట్నం నిలవడం ఆనందదాయకం. ఏపీ ప్రభుత్వంతోపాటు ఆయా నగరాల అధికార యంత్రాంగానికి అభినందనలు’ అని ఆయన గురువారం ట్వీట్ చేశారు. సీఎం వైఎస్ జగన్ అభినందనలు స్వచ్ఛ సర్వేక్షన్ ర్యాంకుల్లో అత్యుత్తమ ప్రతిభ చూపినవారికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. విజయవాడ, తిరుపతి, విశాఖ నగరాల్లోని కుటుంబాలు, పారిశుధ్య కార్మికులు, మున్సిపల్ అధికారులు, ఇతర భాగస్వాములను ఆయన ప్రశంసించారు. -
వైజాగ్‌కు 9వ ర్యాంకు రావడమే దీనికి నిదర్శనం
సాక్షి, ఢిల్లీ : విశాఖపట్నం అన్ని రంగాలలో వేగంగా అభివృద్ధి చెందుతోందని, స్వచ్ఛ సర్వేక్షన్ లో వైజాగ్ కు 9వ ర్యాంకు రావడమే దీనికి నిదర్శనమని వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. గతంలో 23వ స్థానంలో ఉన్న విశాఖపట్నం సీఎం జగన్ నాయకత్వంలో 9వ ర్యాంక్‌కి చేరుకుందన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ నాయకత్వంలో విశాఖ అభివృద్ధికి కృషి చేస్తున్న జీవీఎంసీ కి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. Vizag is witnessing REAL PROGRESS on all metrics. The testimony for it is the fact that Vizag has JUMPED UP PHENOMENALLY and ended up with 9th RANK as against 23rd rank min the Swatch Survekshan 2020. Kudos to GVMC under the able leadership of Hon. CM YS Jagan garu. — Vijayasai Reddy V (@VSReddy_MP) August 20, 2020 -
బెస్ట్ క్లీన్ సిటీగా విజయవాడ
సాక్షి, విజయవాడ : స్వచ్ఛ సర్వేక్షణ్-2020లో విజయవాడ నగరానికి నాలుగో ర్యాంకు రావడం సంతోషంగా ఉందని నగర మున్సిపల్ కమిషర్ ప్రసన్న వెంకటేష్ అన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహకంతో పాటు, విజయవాడ ప్రజల సహకారం వల్లే 4వ ర్యాంక్ సాధించగలిగామని తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ మార్గదర్శకాలను అనుగుణంగా శానిటైజేషన్‌లో చేసిన మార్పులే ఈ అవార్డు రావడానికి కారణమయ్యాయని చెప్పారు. కరోనా ఉన్నప్పటికీ తమ సిబ్బంది ప్రాణాలకు తెగించి పని చేస్తున్నారని పేర్కొన్నారు. విజయవాడ నగరాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా మార్చామన్నారు. ప్లాస్టిక్ బ్యాన్ చేయడానికి చేపట్టిన పద్దతులు కూడా సత్ఫలితాలు ఇస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వ సహకారంతో నగరంలో అందమైన పార్కులు తయారు చేయబోతున్నామని తెలిపారు. అలాగే విజయవాడను చెత్త రహిత నగరంగా తీర్చిదిద్దామన్నారు. అన్ని బహిరంగ ప్రదేశాల్లో చెత్తబుట్టలు ఏర్పాటు చేశామని చెప్పారు. వచ్చే ఏడాది ర్యాంకుల్లో విజయవాడ నగరాన్ని మొదటి స్థానంలో నిలిచేలా కృషి చేస్తామని ప్రసన్నవెంకటేష్ పేర్కొన్నారు. (చదవండి : స్వచ్ఛ సర్వేక్షణ్: నాలుగో స్థానంలో విజయవాడ) కాగా, స్వచ్ఛ సర్వేక్షణ్-2020 జాబితాను కేంద్రం గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన ఈ జాబితాలో మరోసారి మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ ప్రథమ స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో సూరత్, మూడో స్థానంలో ముంబై నిలిచాయి. మొదటి పది స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాలు కూడా చోటు దక్కించుకున్నాయి. -
దేశంలోనే తొలి స్థానంలో ఇండోర్
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ‘స్వచ్ఛ్ సర్వేక్షణ్-2020’ అవార్డులు ప్రకటించింది. దేశంలోనే అత్యంత స్వచ్ఛమైన నగరంగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ ప్రథమ స్థానంలో నిలిచింది. ఇలా వరుసగా నాలుగో సారి ఇండోర్ తొలి స్థానాన్నే కైవసం చేసుకోవడం విశేషం. రెండో స్థానంలో సూరత్(గుజరాత్), మూడో స్థానంలో ముంబై(మహారాష్ట్ర) నిలిచాయి. మొదటి పది స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాలు కూడా చోటు దక్కించుకున్నాయి. గురువారం 'స్వచ్ఛ మహోత్సవ్' కార్యక్రమంలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ ఈ అవార్డులను ప్రకటించారు. ఈ సందర్భంగా జలందర్ కాంత్ దేశంలోనే అత్యంత పరిశుభ్రత కల కంటోన్మెంట్‌గా ప్రకటించారు. పరిశుభ్రత గల పట్టణంగా వారణాసి చోటు దక్కించుకుంది. 4,242 నగరాలు, 62 కంటోన్మెంట్ బోర్డు, 92 గంగా సమీపంలోని పట్టణాల నుంచి మొత్తం 1.87 కోట్ల మంది ఇందుకు సంబంధించిన సర్వేలో పాల్గొన్నారు. ఈ సర్వే 28 రోజుల పాటు చేపట్టగా అనంతరం ర్యాంకులు ప్రకటించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి.. ఇండోర్ మళ్లీ తన ఆధిక్యతను ప్రదర్శించడంపై ఆ ప్రాంత ఎంపీ శివరాజ్ చౌహాన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అక్కడి ప్రజలు తమ నగర శుభ్రత పట్ల చూపిన అంకిత భావాన్ని కొనియాడారు. (రూల్స్ బ్రేక్: నడిరోడ్డుపై పెళ్లికొడుక్కి...) ఆంధ్రప్రదేశ్‌కు స్వచ్ఛ సర్వేక్షణ ర్యాంకులు దేశంలో పరిశుభ్ర రాష్ట్రాల్లో జార్ఖండ్ ప్రథమ స్థానంలో నిలిచింది. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ ఆరో స్థానాన్ని దక్కించుకోగా తెలంగాణ కూడా టాప్ 10లో చోటు సంపాదించుకుంది. దేశంలోనే పరిశుభ్రత గల నగరంగా విజయవాడ నాలుగో స్థానం దక్కించుకుంది. తిరుపతి ఆరో ర్యాంకు, విశాఖపట్నం తొమ్మిదో ర్యాంకు సాధించింది. బెస్ట్ మెగా సిటీ కేటగిరీలో రాజమండ్రి చోటు సంపాదించుకుంది. దీనితో పాటు ఒంగోలు, కాకినాడ, కడప, తెనాలి, చిత్తూరు, హిందూపురం, తాడిపత్రి కూడా స్థానం దక్కించుకున్నాయి -
అత్యంత స్వచ్ఛ నగరంగా ఇండోర్
న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత స్వచ్ఛ నగరంగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నిలిచింది. వరుసగా మూడో ఏడాది ఇండోర్ ఈ అవార్డును సొంతం చేసుకుంది. 2019 సంవత్సరానికి గాను స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులను బుధవారం ఇక్కడ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రదానం చేశారు. ఈ అవార్డుల జాబితాలో వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్, కర్ణాటకలోని మైసూర్ స్థానం సంపాదించాయి. ఈ సందర్భంగా స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఉత్తమ ర్యాంకులు పొందిన రాష్ట్రాలకు మహాత్మా గాంధీ మెమొంటోను ప్రదానం చేశారు. ‘పరిశుభ్రతను ఉద్యమంగా వ్యాప్తి చేయడంలో మహాత్మా గాంధీ క్రియాశీలకంగా వ్యవహించారు. ఇటీవల ముగిసిన కుంభమేళాలో నిర్వహించిన పారిశుద్ధ్య కార్యక్రమాల నుంచి ప్రజలు పరిశుభ్రత పట్ల ప్రేరణ పొందుతారని ఆశిస్తున్నా’అని కోవింద్ పేర్కొన్నారు. దీనిపై అవగాహన పెంపొందించడానికి పాఠశాలల్లో, ఉన్నత విద్యా సంస్థల్లో పరిశుభ్రతను పాఠ్యాంశంగా చేర్చాలని సూచించారు. అవార్డుల వివరాలు ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ ఏరియాకు ‘స్వచ్ఛమైన చిన్న నగరం’అవార్డు ‘ఉత్తమ గంగా పట్టణం’గా ఉత్తరాఖండ్‌లోని గౌచర్ అహ్మదాబాద్‌కు ‘స్వచ్ఛమైన పెద్ద నగరం’అవార్డు వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద నగరంగా రాయ్‌పూర్ (ఛత్తీస్‌గఢ్) ‘మధ్య స్థాయి స్వచ్ఛమైన నగరం’గా మధుర (ఉత్తర ప్రదేశ్) వేగంగా అభివృద్ధి చెందుతున్న మధ్యస్థాయి నగరంగా బృందవాన్ (యూపీ) -
అత్యంత పరిశుభ్రమైన నగరాలు మూడే
న్యూఢిల్లీ: దేశంలో మూడే మూడు పరిశుభ్రమైన నగరాలుగా నిలిచాయి. అత్యంత పరిశుభ్రమైన నగరాల జాబితాను సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సెంటర్ (సీఎస్ఈ) సోమవారం విడుదల చేసింది. సీఎస్ఈ తాజా రేటింగ్స్ ప్రకారం వీటిలో కేరళలోని అలెప్పు, గోవా రాజధాని పనాజి, కర్ణాటకలోని మైసూరు అతి పరిశుభ్రమైన నగరాలుగా పేరు దక్కించుకున్నాయి. దేశంలో సాలిడ్ వేస్టే మేనేజ్ మెంట్ పద్ధతిపై 'నాట్ ఇన్ మై బ్యాక్ యార్డ్' పేరుతో ఈ నివేదికను విడుదల చేసింది. ఘన వ్యర్థాల నిర్వహణలో ఢిల్లీ లాంటి మెట్రో నగరాల్లో పరిస్థితులు అంత మెరుగ్గా లేవని సీఎస్సీ వ్యాఖ్యానించింది . దేశవ్యాప్తంగా పట్టణాల్లో ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ పద్ధతులు ఆధారంగా ఒక సర్వే నిర్వహించింది. మున్సిపల్ వ్యర్థ పదార్థాల నిర్వహణ వ్యవస్థల భారతదేశం లో పరిశుభ్రమైన నగరాల్లో ఈ మూడు నగరాలు ఉన్నాయని సర్వే తేల్చింది. ఈ విషయంలో దేశరాజధాని నగరం ఢిల్లీ అట్టడుగు స్థాయిలో ఉండగా, మైసూర్ తన స్థానాన్ని నిలబెట్టుకోవడం విశేషం. గ్రౌండ్ లెవల్ సమాచారం పూర్తిగా లభ్యంకానప్పటికీ, 2009 ఘన వ్యర్థాల నిర్వహణ ఆర్థిక వ్యవహారాల శాఖ స్థాయీ పత్రాన్ని ప్రస్తావిస్తూ, భారతదేశ అర్బన్ ఏరియాల్లో ఇప్పటికే ఒక రోజు వ్యర్థాలు సుమారు 80,000 మెట్రిక్ టన్నులకు చేరిందన్నారు . 2047 నాటికి ఇది 260 మిలియన్ టన్నులకు చేరుతుందని అంచనా వేశారు. దీనికోసం 1,400 చదరపు కిలోమీటర్ల అవసరమవుతుందనీ, ఇది హైదరాబాద్, ముంబై , చెన్నై నగరాలకు కలిపితే వచ్చే ప్రదేశానికి సమానమవుతుందని సునీత హెచ్చరించారు. భారతదేశం అత్యంత పరిశుభ్రమైన నగరాన్ని కొనుక్కొనే క్రమంలో ఈ సర్వేనిర్వహించామని సీఎస్ సీ డైరెక్టర్ జనరల్ సునీతా నారాయణ్ తెలిపారు. వ్యర్థాల నియంత్రణలోపాలపై ఆమె అసంతృప్తి వ్యక్తంచేశారు. ఈ పరిస్థితుల్లో కేరళలో మున్సిపాలిటీ కంటే ప్రజలు అనుసరిస్తున్న పద్ధతులే ఉత్తమమైనవి అని ఆమె తెలిపారు. ప్రజలే కంపోస్ట్ , ఇతర వ్యర్థాలను వేరుచేసి రీసైక్లింగ్ చేసి సేకరించి అమ్ముతున్నారన్నారు. ఫ్యూచర్ వేస్ట్ మేనేజ్ మెంట్ లో ఇదే అద్భుతమైన మోడల్ అనీ, వ్యర్థాలను నిరోధించకపోతే దేశంలోని ఇతర నగరాలకు భారీ గుణపాఠం తప్పదని నారాయణ్ చెప్పారు.