న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత స్వచ్ఛమైన నగరంగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ మరోసారి ప్రథమ స్థానంలో నిలిచింది. ఇలా ఇండోర్ తొలి స్థానాన్ని కైవసం చేసుకోవడం ఇది అయిదోసారి విశేషం. రెండో స్థానంలో సూరత్(గుజరాత్), ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. దేశంలో పరిశుభ్ర రాష్ట్రంగా జార్ఖండ్ ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ‘స్వచ్ఛ్ సర్వేక్షణ్-2021’ అవార్డులను శనివారం ప్రకటించింది. విజేతలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అవార్డులను ప్రదానం చేశారు.
చదవండి: మాజీ మిస్ కేరళ, రన్నరప్ మృతి: ఆడి కారులో వెంటాడి మరీ
కాగా ఇండోర్ సాధించిన విజయానికి నగర ప్రజలకు కలెక్టర్ అభినందనలు తెలిపారు. ‘ఇండోర్ నగరాన్ని దేశంలోని అత్యంత పరిశుభ్రమైన నగరంగా వరుసగా ఐదవసారి నిలిపినందుకు ఇండోర్ వాసులకు అభినందనలు. పౌరులకు పరిశుభ్రతపై అవగాహన కల్పించడం వల్లే ఇది సాధ్యమైంది’ అని కలెక్టర్ మనీష్ సింగ్ ట్వీట్ చేశారు. అంతేగాక ఇంతకుముందు దేశంలోనే తొలి వాటర్ ప్లస్ నగరంగా ఇండోర్ నిలిచింది. ఇదిలా ఉండగా స్వచ్ఛ్ సర్వేక్షణ్ అనేది ‘స్వచ్ఛ భారత్ మిషన్’లో భాగంగా దేశంలోని నగరాలు, పట్టణాలలో పరిశుభ్రత, పారిశుద్ధ్యానికి సంబంధించిన వార్షిక సర్వే.
చదవండి: యువత ఆలోచనల్లో మార్పు తెస్తున్న ‘జై భీమ్’..
लगातार पाँचवी बार देश का सबसे स्वच्छ शहर घोषित होने पर इंदौर के नागरिकों को बधाई। कलेक्टर श्री मनीष सिंह ने कहा है कि नागरिकों की स्वच्छता जागरूकता के कारण यह संभव हो सका है।@CMMadhyaPradesh @PMOIndia pic.twitter.com/GVaxap54oS
— Collector Indore (@IndoreCollector) November 20, 2021
Comments
Please login to add a commentAdd a comment