panaji
-
సొంత పార్టీ నేతలకు నితిన్ గడ్కరీ హెచ్చరిక
పనాజీ: బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ శ్రేణులనే సున్నితంగా హెచ్చరించారు. గోవా బీజేపీ రాష్ట్ర కమిటీ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన పలు అంశాలపై ప్రసంగించారు. ‘కాంగ్రెస్ చేసిన తప్పులనే మనం మళ్లీ చేస్తే వారికి మనకు తేడా ఏం ఉండదు. బీజేపీ అంటేనే ఒక ప్రత్యేకత కలిగిన పార్టీ. అందుకే మనల్ని ప్రజలు పదే పదే నమ్మి అధికారం కట్టబెడుతున్నారు. రాజకీయాలు సామాజిక, ఆర్థిక సంస్కరణలు తీసుకురావడానికేనని బీజేపీ క్యాడర్ తెలుసుకోవాలి. అవినీతి రహిత భారత్ కోసం కృషి చేయాలి. ఇందుకోసం మన దగ్గర ఒక ప్రణాళిక ఉండాలి. కుల రాజకీయాలు చేయకూడదు. కుల రాజకీయాలు చేస్తే ప్రతిచర్య కూడా గట్టిగా ఉంటుంది’అని 40 నిమిషాల పాటు గడ్కరీ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ సొంతగా మెజారిటీ దక్కించుకోలేకపోయిన నేపథ్యంలో గడ్కరీ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. -
టూరిస్టులతో గుంజీలు తీయించిన రైల్వే పోలీసులు
పనాజీ: కర్ణాటక గోవా సరిహద్దులో పర్యాటక ప్రాంతమైన దూధ్ సాగర్ జలపాతాలను దగ్గరగా చూసేందుకు నిబంధనలకు విరుద్ధంగా రైల్వే పట్టాలపై నడుచుకుంటూ వెళుతున్న పర్యాటకులను రైల్వే పోలీసులు అడ్డుకుని వారితో గుంజీలు తీయించారు. రైలులో గోవా వెళ్తుండగా మార్గమధ్యలో కిటికీల్లోంచి కనిపించే అందమైన పర్యటక దృశ్యం దూద్ సాగర్ జలపాతాలు. దూరం నుంచి చూస్తేనే అంత ఆహ్లాదంగా ఉండే ఈ జలపాతాలను దగ్గరగా చూడాలని కొందరు ఔత్సాహికులైన పర్యాటకులు ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. గతంలో అడవి గుండా జలపాతాలను చేరేందుకు మార్గం ఉండేది. కానీ ఇటీవల ఇక్కడికి సమీపంలోని మైనాపీ జలపాతాల వద్ద ఇద్దరు వ్యక్తులు నీటి ప్రవాహంలో కొట్టుకుపోవడంతో ఈ దోవను మూసివేశారు. దీంతో పర్యాటకులు దూధ్ సాగర్ చేరుకోవడానికి రైలు పట్టాల మీద నడుచుకుంటూ వెళ్లడం ప్రారంభించారు. అది ఇంకా ప్రమాదమని రైల్వే పోలీసులు అనేకమార్లు పర్యాటకులను హెచ్చరిస్తున్నా వారు దీన్ని పట్టించుకోవడం లేదు. ఆదివారం అయితే వందల కొద్దీ పర్యాటకులు ఈ మార్గం గుండా వెళ్తూ రైల్వే పోలీసుల కంటపడ్డారు.దీంతో చిర్రెత్తుకొచ్చిన రైల్వే పోలీసులు నిబంధనలను అతిక్రమించిన వందల టూరిస్టులతో గుంజీలు తీయించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతోంది. A huge crowd who set out to watch Dudhsagar Waterfalls in Goa were seen on the railway tracks after authorities denied them entry As per social media accounts, some of them were also asked to perform squats by Railway Police personnel as punishment#Dudhsagarwaterfall pic.twitter.com/jh7uzHcJiR — ET NOW (@ETNOWlive) July 16, 2023 దక్షిణ పశ్చిమ రైల్వే వారు ట్విట్టర్ వేదికగా దయచేసి దూధ్ సాగర్ జలపాతాలను రైలులో నుండే చూసి ఆస్వాదించండి. రైలు పట్టాలెక్కి కాదు. అలా చేస్తే ఇకపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. We urge you to savour the beauty of Dudhsagar Falls from WITHIN your coach. Walking on/along tracks not only endangers your own safety but is also an offence under Section 147, 159 of Railway Act. It can also endanger safety of trains. (1/2) pic.twitter.com/Puj7hKh5JF — South Western Railway (@SWRRLY) July 16, 2023 ఇది కూడా చదవండి: విహారం మిగిల్చిన విషాదం.. కళ్ళముందే ఘోరం.. -
తెలుగు చిత్రానికి మరో అరుదైన గౌరవం.. ఆ విభాగంలో ఎంపిక
శంకరాభరణం చిత్రానికి మరో అరుదైన గౌరవం లభించింది. గోవాలో జరుగుతున్న అంతర్జాతీయ చలన చిత్రోత్సవ వేడుకల్లో రీస్టోర్డ్ ఇండియన్ క్లాసిక్ విభాగంలో ఈ చిత్రం ఎంపికైంది. నేషనల్ ఫిల్మ్ అర్చివ్స్ ఆఫ్ ఇండియా వారు మనదేశంలోని గొప్ప చిత్రాలను డిజిటలైజ్ చేసి ప్రదర్శించనున్నారు. ఈ కేటగిరీలో శంకరాభరణం సినిమాకు చోటు దక్కింది. (చదవండి: Sarath Kumar: కళా తపస్వి జీవన చిత్ర ప్రస్థానం పుస్తకాన్ని ఆవిష్కరించిన నటుడు) తెలుగు సినిమా ఆత్మగౌరవాన్ని జాతీయస్థాయిలో రెపరెపలాడించిన దర్శక దిగ్గజం కళాతపస్వి కె.విశ్వనాథ్ చిత్రం శంకరాభరణం చిత్రాన్ని పనాజీలో జరుగుతున్న ఇఫి-2022 వేడుకల్లో ప్రదర్శించనున్నారు. పూర్ణోదయా ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై ఏడిద నాగేశ్వరావు ఈ సినిమాను నిర్మించారు. డిజిటలైజ్ చేసి ప్రదర్శించే భారతీయ సినిమాల్లో తెలుగు చిత్రం శంకరాభరణం చిత్రం చోటు దక్కించుకుంది. ఈ చిత్ర ప్రదర్శనకు నిర్మాత ఏడిద నాగేశ్వరావు కుమారుడు ఏడిద రాజా ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరు కానున్నారు. -
గెలిచినా సంతోషం లేదంటున్న బీజేపీ అభ్యర్థి
పణజి: గెలిచినా సంతోషం లేదంటున్నారు బీజేపీ అభ్యర్థి అటానాసియో మోన్సెరెట్టే. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిష్టాత్మకంగా భావించిన పణజి నియోజవర్గం నుంచి 716 స్వల్ప ఆధిక్యతతో ఆయన గెలిచారు. ఇక్కడి నుంచి స్వతంత్ అభ్యర్థిగా పోటీ చేసిన ఉత్పల్ పారికర్.. అటానాసియోకు గట్టిపోటీ ఇచ్చారు. ‘బాబూష్’గా పాపులర్ అయిన అటానాసియోకు 6787 ఓట్లు, ఉత్పల్‌కు 6071 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి ఎల్విస్ గోమ్స్ కు 3175 ఓట్లు దక్కాయి. అతి తక్కువ ఆధిక్యంతో గెలవడం పట్ల అటానాసియో అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఈ ఫలితం నాకు చాలా అసంతృప్తి కలిగించింది. చాలా మంది హార్డ్‌కోర్ బీజేపీ ఓటర్లు ఉత్పల్‌కు ఓటు వేశారు. అందుకే ఆయనకు అన్ని ఓట్లు వచ్చాయి. స్థానిక బీజేపీ నాయకుల్లో కొందరు నాకు సహకరించలేదు. ఈ విషయాన్ని బీజేపీ నేతలకు చెప్పాను. రాష్ట్ర బీజేపీ విభాగం కార్యకర్తలకు సరైన సందేశం ఇవ్వలేదు. దీంతో నాకు నష్టం జరిగింది. నిజం చెప్పాలంటే నేను బీజేపీ, కాంగ్రెస్‌తో పోరాడాను. నన్ను అభిమానించే కొంతమంది మద్దతుదారుల సహాయంతోనే మేము సీటును నిలబెట్టుకోగలిగామ’ని ఆయన వాపోయారు. గోవాలో కచ్చితంగా తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అటానాసియో దీమా వ్యక్తం చేశారు. ప్రమోద్ సావంత్ తమ ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. కాగా, అటానాసియో సతీమణి జెన్నిఫర్ కూడా ఈ ఎన్నికల్లో విజయం సాధించడం విశేషం. (క్లిక్: గోవాలో ఆమ్ ఆద్మీ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయంటే?) -
ఫుట్‌బాల్ స్టార్ రొనాల్డోకు భారత్‌లో అరుదైన గౌరవం
పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకు విశ్వవ్యాప్తంగా అభిమానులున్న సంగతి తెలిసిందే. అతని ఆటకు, క్రేజ్‌కు సెపరేట్ ఫ్యాన్‌బేస్ ఉంటుంది. వయసులో చిన్నవాడైనప్పటికి ఫుట్‌బాల్‌లో మాత్రం చాలా ఎదిగిపోయాడు. మైదానంలో పాదరసంలా కదిలే రొనాల్డో గోల్ కొడుతుంటే మనకు ఏదో జరుగుతున్న ఫీలింగ్ వస్తుంది. అంతలా ఇన్స్పైర్ చేస్తాడే కాబట్టే అతనికి కోట్లలో అభిమానులు ఉన్నారు. ఇక అతన్ని ఆదర్శంగా తీసుకొని నేటి యువత ఫుట్‌బాల్‌వైపు అడుగులు వేస్తున్నారు. అలాంటి రొనాల్డోకు మన ఇండియాలోనూ బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలోనే గోవాలోని పనాజీలో 410 కేజీల బరువు ఉన్న రొనాల్డో కాంస్య విగ్రహాన్ని గోవా మంత్రి మైకెల్ లోబో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పనాజీలో రొనాల్డో విగ్రహం ఏర్పాటు వెనుక ఒక కారణం ఉందన్నారు.'' ఇండియాలో రొనాల్డో విగ్రహం ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. ఇక్కడి యువత రొనాల్డోను ఆదర్శంగా తీసుకొని ఫుట్‌బాల్‌లో మరింత ముందుకు పోవాలనేది తమ కోరిక. రోజు ప్రాక్టీస్‌కు వచ్చే యువత ఈ విగ్రహాంతో సెల్ఫీలు మాత్రమే దిగకుండా.. అతన్ని చూసి ఇన్స్పైర్ పొంది.. దేశానికి ప్రాతినిధ్యం వహించడం కలగా పెట్టుకోవాలి. ఫుట్‌బాల్‌ను ప్రోత్సహించడానికి మా ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుంది. ఫుట్‌బాల్ మైదానాల్లో ప్రాక్టీస్‌కు వచ్చే యువతకు అన్ని సౌకర్యాలు కల్పించే బాధ్యత మాది'' అని చెప్పుకొచ్చారు. ఇక రొనాల్డో ప్రస్తుతం పోర్చుగల్ జట్టుతో పాటు మాంచెస్టర్ యునైటెడ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. -
Arvind Kejriwal: అధికారంలోకి వస్తే 300 యూనిట్ల ఉచిత విద్యుత్
పణజి: గోవాలో ఆప్ అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ ప్రకటించారు. రెండో రోజుల పర్యటనలో భాగంగా ఆయన గోవా చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన నాలుగు హామీలను ప్రజలకు ఇచ్చారు. తాము అధికారంలోకి రాగానే పాత విద్యుత్ బిల్లులన్నీ రద్దు చేస్తామని ప్రకటించారు. రాష్ట్రాన్ని పరిశుభ్రంగా మారుస్తామని చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని 87 శాతం మంది ప్రజలు ఉచిత విద్యుత్ పొందుతారని స్పష్టం చేశారు. ఢిల్లీలోని ప్రజలు ప్రస్తుతం ఉచిత విద్యుత్ పొందుతున్నారని గుర్తు చేశారు. ఢిల్లీ ప్రజలు ఉచిత విద్యుత్ పొందితే గోవా ప్రజలు ఎందుకు పొందలేరని ప్రశ్నించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన పలువురు ముఖ్యనేతలను కలిశారు. స్వచ్ఛమైన రాజకీయాలు చేసేవారికోసం తమ పార్టీ వెదుకుతోందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన ఎమ్మెల్యేలను ఆయన టార్గెట్ చేశారు. ఎన్నికల ఫలితాల్లో 17 సీట్లను కాంగ్రెస్ గెలుచుకోగా, 13 సీట్లను బీజేపీ గెలుచుకుందని గుర్తు చేశారు. అయితే తర్వాత జరిగిన పరిణామాల్లో కాంగ్రెస్ తరఫున 5 మంది మిగలగా, మిగిలిన వారు వెళ్లి బీజేపీలో చేరారు. తాము ఓటేసిన నేతలు ఇతర పార్టీలకు మారపోవడంపై ప్రజలు మోసానికి గురైనట్లు భావిస్తున్నారని అన్నారు. వారంతా డబ్బుల కోసమే పార్టీ మారినట్లు ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు. -
నాలుగంటే నాలుగే రోజుల లాక్డౌన్: ఎక్కడంటే..
పనాజీ: మహమ్మారి కరోనా వైరస్ విజృంభణతో చాలా చోట్ల కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. కరోనా కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే రాత్రికర్ఫ్యూ అన్ని చోట్ల అమల్లో ఉండగా కరోనా కట్టడి కావడం లేదు. దీంతో విధిలేక సంపూర్ణ లాక్డౌన్ విధిస్తున్నారు. మహారాష్ట్ర, ఢిల్లీ, కర్నాటకలో సంపూర్ణ లాక్డౌన్ అమల్లో ఉండగా తాజాగా గోవాలో లాక్డౌన్ విధించింది. అయితే ఈ లాక్డౌన్ కేవలం నాలుగంటే నాలుగే రోజులు లాక్డౌన్ విధించడం గమనార్హం. నాలుగు రోజుల పాటు సంపూర్ణ లాక్డౌన్ విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రకటించారు. రేపు రాత్రి (ఏప్రిల్ 29వ తేదీ) 7 గంటల నుంచి మే 3 వరకు గోవాలో లాక్డౌన్ విధిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజా రవాణా, హోటళ్లు, పబ్‌లు, మద్యం దుకాణాల మూసివేత కొనసాగుతుందని వివరించారు. అత్యవసర సేవలు, పరిశ్రమలకు లాక్డౌన్ నుంచి మినహాయింపు ఉంటుందని గుర్తుచేశారు. ప్రస్తుతం గోవాలో రోజుకు 2 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. వాటిని నియంత్రించేందుకు లాక్డౌన్ ప్రకటించారు. చదవండి: ఏపీలో కరోనా కట్టడికి అన్ని చర్యలు విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ -
ప్రమోద్ జీ.. సీఎంగా మీకు బాధ్యత లేదా
పనాజీ : గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సెప్టెంబర్ 2న(బుధవారం) కరోనా బారీన పడ్డ సంగతి తెలిసిందే. అయితే ఆయనకు ఎలాంటి లక్షణాలు లేకపోవడంతో ప్రస్తుతం హోంఐసోలేషన్లో ఉంటూ ముఖ్యమంత్రిగా తన విధులు నిర్వర్తిస్తున్నారు. తనకు కరోనా సోకిందని.. అయినా రాష్ట్రానికి సీఎంగా సేవలు అందించాల్సిన బాధ్యత తన మీద ఉందని స్వయంగా చెప్పుకొచ్చారు. ఈ మేరకు ప్రమోద్ సావంత్ తన విధులకు సంబంధించి కొన్ని ఫోటోలను శుక్రవారం విడుదల చేశారు. ఆ ఫోటోలో రాష్ట్రానికి సంబంధించిన కొన్నొ ముఖ్యమైన ఫైళ్లపై సంతకాలు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ప్రమోద్ సావంత్ తీరును ప్రతిపక్షం కాంగ్రెస్ తప్పుబట్టింది. ముఖ్యమంత్రి తన చేతులకు గ్లౌజ్ వేసుకోకుండానే ఫైళ్లపై సంతకాలు ఎలా చేస్తారని విమర్శించింది. (చదవండి : దేశాభివృద్ధికి చిన్నారుల సంక్షేమమే పునాది) ఇదే విషయమై గోవా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గిరీష్ చోదంకర్ ట్విటర్లో స్పందిస్తూ..' కరోనా సోకినా ప్రమోద్ సావంత్ విధులు నిర్వర్తించడం బాగానే ఉంది.. కానీ చేతికి కనీసం గ్లౌజ్ వేసుకొని సంతకాలు చేస్తే బాగుండేది.. ఆయన సంతకం చేసిన ఫైళ్లను అధికారులు, ఇతర సిబ్బంది ముట్టుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వారికి కరోనా సోకదని గ్యారంటీ ఏంటి.. ప్రమోద్ సావంత్ ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది 'అంటూ చురకలంటించారు. -
ఆ వేడుకలకు గోవా రానున్న ఐర్లాండ్ ప్రధాని
పనాజీ: భారత దేశానికి పలు దేశాల అధ్యక్షులు, ప్రధానులు పర్యటిస్తుంటారు. కాని తాజాగా భారతదేశాన్ని పర్యటించనున్న ఐర్లాండ్ ప్రధాని లియో వరద్కర్కి ఓ ప్రత్యేకత ఉంది. ఆయన భారతమూలాలు ఉన్న ఐర్లాండ్ ప్రధాని. గోవా సముద్రతీర ప్రాంతంలో నిర్వహించే 2020 నూతన సంవత్సర వేడుకల్లో తన కుటుంబ సభ్యులతో పాల్గొనడానికి భరత్ వస్తున్నట్లు సోమవారం గోవా రాష్ట్ర అధికారులు తెలిపారు. అయితే ప్రధాని లియో వరద్కర్ భారత పర్యటన వ్యక్తిగతమైందని.. ఈ పర్యటనలో భాగంగా లియో ఎటువంటి అధికారిక కార్యక్రమాలకు హాజరుకారని ఆ రాష్ట్ర సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు. జనవరి 1 వరకు ప్రధాని లియో వరద్కర్ తన కుంటుంబ సభ్యులతో గోవాలో గడుపుతారని ఆయన పేర్కొన్నారు. జనవరి 1 మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో తిరిగి ఐర్లాండ్ వెళతారని ఆ పోలీసు అధికారి తెలిపారు. వరద్కర్ తన కుటుంబ సభ్యులతో కలిసి మహారాష్ట్రలోని తీరప్రాంత సింధుదుర్గ్ జిల్లాలో ఉన్న తన పూర్వీకుల గ్రామమైన వరద్ను ఆదివారం సందర్శించనున్నారు. ‘2017 లో నేను ఐర్లాండ్ ప్రధానిగా ఎన్నుకోబడ్డాడు. నా తండ్రి ఒక వైద్యుడు. ఆయన 1960లో ఇంగ్లాండ్ వెళ్లారు. నా పూర్వికుల గ్రామమైన వరద్ను సందర్శించటం ఇదే మొదటిసారి. ఇప్పుడు వరద్ గ్రామంలో మూడు తరాలకు చెందిన నా కుటుంబ సభ్యులను కలుసుకోవడం చాలా ప్రత్యేకం’ అని లియో వరద్కర్ తెలిపారు. ప్రధాని వరద్కర్ వరద్గ్రామ పర్యటనలో భాగంగా గ్రామ దేవతను దర్శించుకోనున్నారు. అదేవిధంగా వరద్ గ్రామ ప్రజలు ప్రధాని వరద్కర్‌ను సత్కరించన్నుట్లు తెలుస్తోంది. -
సీఎం ఔదార్యానికి ఫిదా..
పనాజీ: గోవా సీఎం ప్రమోద్ సావత్ తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ముంబై విమానాశ్రయంలో గురువారం రాత్రి 9.30 గంటలకు గోవాకు బయలుదేరాల్పిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ తీసుకునేందుకు తీవ్ర జాప్యమైంది. ఆ విమానం తెల్లవారుజామున 3. 30 గంటలకు గమ్యస్ధానం చేరుకుంది. విమానం గోవాకు చేరుకోవడంలో తీవ్ర జాప్యం నెలకొనడంతో ప్రయాణికులు ఇబ్బందులకు లోనయ్యారు. ఈ విమానంలో గోవా ఫార్వర్డు పార్టీ నాయకుడు కేతన్ భాటికర్ కూడా ప్రయాణిస్తున్నారు. ఢిల్లీలో ఉన్న గోవా ముఖ్యమంత్రికి కేతన్ భాటికర్ విమాన అలస్యం విషయం గురించి రాత్రి 1.13 గంటలకు ఫోన్లో వివరించారు. సీఎం ప్రమోద్ వెంటనే స్పందించి ప్రయాణీకులకు భోజనాలు సమకూర్చారు. తర్వాత రాత్రి 1.27 గంటలకు సీఎం స్వయంగా ఫోన్ చేసి మరో 30 నిమిషాల్లో విమానం బయలుదేరుతుందని సమాచారం అందించారని భాటికర్ తెలిపారు. గోవా సీఎం స్పందించిన తీరు పట్ల విమాన ప్రయాణీకులు హర్షం వ్యక్తం చేశారు. -
మళ్లీ ఇండియాకు రానివ్వండి ప్లీజ్..
పణజీ: గోవాలో తాను చదివిన పాఠశాలకు, అక్కడి గోవులకు దూరమై తీవ్ర విచారంతో ఉన్నాననీ, మళ్లీ భారత్‌లోకి వచ్చేందుకు తమను అనుమతించాలని ప్రధాని మోదీని వేడుకుంటూ పోలండ్ బాలిక(11) లేఖ రాసింది. తాము భారతీయులం కాకున్నా తమ ఇల్లు భారతేనని అనుకుంటామనీ, ఇండియా అంటేనే ఎక్కువ ఇష్టమని ఆ చిన్నారి పేర్కొంది. అలిస్జా వనాట్కో అనే ఈ పాప గోవాలో చదువుకుంటూ ఉండేది. ఆమె తల్లి మార్టా కొట్లరాక్స బీ–2 బిజినెస్ వీసా మీద భారత్‌కు వచ్చింది. పలుసార్లు ఇండియాకు వచ్చి వెళ్లే వెసులుబాటు ఈ వీసాకు ఉంది. అయితే ఈ ఏడాది మార్చి 24న ఆమె శ్రీలంక నుంచి బెంగళూరు విమానాశ్రయానికి వచ్చింది. అనుమతించిన దాని కన్నా ఎక్కువకాలం ఇండియాలో ఉన్న కారణంగా మార్టాను, అలిస్జాను ఉత్తరాఖండ్‌లోని ఫారినర్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ బ్లాక్ లిస్ట్‌లో పెట్టిందనీ, కాబట్టి భారత్‌లోకి రావడం కుదరదని బెంగళూరు అధికారులు ఆమెకు తెలిపారు. పొరపాటున తనను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టారనీ, తాను ఎక్కువ కాలం భారత్‌లో లేనని చెప్పినా వినలేదు. గోవాలో అలిస్జా చదువుకుంటూ ఉండగా, ఆ పాపను అప్పగించే వరకు మార్టా థాయ్‌లాండ్‌లో ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత భారత్‌కు వచ్చి అలిస్జాను తీసుకెళ్లి ప్రస్తుతం కాంబోడియాలో ఉంటోంది. ఈ మేరకు అలిస్జా ప్రధానికి లేఖ రాసింది. ఆ లేఖను మోదీ, విదేశాంగ మంత్రి జై శంకర్లకు ట్వీట్ చేసింది. -
ముగిసిన పరీకర్ అంత్యక్రియలు
-
బురఖాతో లేడీస్ టాయ్లెట్లోకి...అరెస్ట్
పనాజీ : బురఖా ధరించి మహిళల టాయ్లెట్లోకి వెళ్లిన ఓ వ్యక్తి అడ్డంగా బుక్ అయ్యాడు. ఈ సంఘటన పనాజీ సెంట్రల్ బస్టాండ్‌లో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం... విర్గిల్ ఫెర్నాండేజ్ (35) ముస్లిం మహిళలు ధరించే బురఖాతో లేడీస్ టాయ్లెట్లోకి వెళ్లాడు. అయితే ఈ విషయాన్ని గమనించిన చుట్టుపక్కలవారు పోలీసులకు సమాచారం అందించడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగి అయిన అతగాడిపై సెక్షన్ 419 కింద కేసు నమోదు చేశారు. అయితే నిందితుడు ఈ చర్యకు ఎందుకు పాల్పడాడనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
ఉద్రిక్తంగా మారిన బీజేపీ, కాంగ్రెస్ ర్యాలీలు
పనాజీ: గోవాలో బీజేపీ నిర్వహించిన ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. రాఫెల్‌పై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గుర్తుచేస్తూ.. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పనాజీలో బీజేపీ కార్యకర్తలు భారీ ర్యాలీని నిర్వహించారు. రాఫెల్ కుంభకోణంపై కాంగ్రెస్ కూడా బీజేపీకి వ్యతిరేకంగా అదే సమయంలో ర్యాలీని చేపట్టింది. ఇరువర్గాలు ఎదురుపడటంతో ఇరుపార్టీల నేతలు బాహాబాహీకి దిగారు. ఒకరికి వ్యతిరేకంగా మరొకరు నినాదాలు చేసుకోవడంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. #WATCH Goa: Clash between Congress and BJP workers in Panaji during BJP protest against Congress over Rafale verdict by Supreme Court (21.12.18) pic.twitter.com/E59qbYmQFH — ANI (@ANI) 22 December 2018 -
ఆయన కోలుకుంటున్నారు: కేంద్రమంత్రి ట్వీట్
పనాజి : తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న గోవా ముఖ్యమంత్రి మనోహార్ పారికర్ ప్రస్తుతం కోలుకుంటున్నారని కేంద్రమంత్రి సురేష్ ప్రభు ట్విట్ చేశారు. ప్యాంక్రియాటిక్ సమస్యతో గతకొంత కాలంగా ఇబ్బంది పడుతున్న పారికర్ అమెరికాలో వైద్యం తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ మేరకు పారికర్ ఆరోగ్యంపై వాకాబు చేసిన సురేష్ ప్రభు.. ‘ప్రస్తుతం పారికర్ వైద్యానికి స్పందిస్తున్నారు, వేగంగా కోలుకుని, త్వరలోనే రాష్ట్రానికి తిరిగి రావాలని కోరుకుంటున్నాను’ అని తన ట్వీటర్లో పేర్కొన్నారు. ప్యాంక్రియాటిక్ సమస్యతో పారికర్ ఫిబ్రవరి 14న ముంబాయిలోని లీలావతి హాస్పిటల్లో చేరిన విషయం తెలిసిందే. అయితే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన రోజునే ఆయన రాష్ట్ర బడ్జెట్ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశాలు ముగిసిన అనంతరం సమస్య తీవ్రం కావడంతో పారికర్ పనాజీలోని గోవా మెడికల్ కాలేజ్ హాస్పిటల్ చేరారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం మార్చి మొదటి వారంలో ఆయనను అమెరికా తీసుకెళ్లారు. కాగా సీఎం రాష్ట్రంలో లేని కారణంగా ముగ్గురు మంత్రుల బృందం రాష్ట్ర పరిపాలన వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. -
‘అలాంటి అమ్మాయిలను చూస్తే భయమేస్తోంది’
సాక్షి, పనాజీ : భారత్‌లో మద్యం సేవించే యువతుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోందని సర్వేలో స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో గోవా ముఖ్యమంత్రి మనోహర్‌పారికర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమ్మాయిలు కూడా బీర్లు తాగటం మొదలుపెట్టేశారని.. వారిని చూస్తుంటే తనకి భయమేస్తోందని ఆయన అంటున్నారు. ‘‘అమ్మాయిల్లో ఆల్కహాల్ సేవించే అలవాటు పెరిగిపోయింది. అది పరిమితి ఎప్పుడో దాటి పోయింది. బీర్లు ఎగబడి తాగేస్తున్నారు. ఇది నాకు ఎంతో భయాన్ని కలగజేస్తోంది’ అని పారికర్ పేర్కొన్నారు. గోవాలో జరిగిన స్టేట్ యూత్ పార్లమెంట్ కు హాజరైన యువతను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఈ మాట అమ్మాయిలందరినీ ఉద్దేశించి నేను అనటం లేదు. ఇక్కడున్న వాళ్లలో ఆ అలవాటు లేకపోలేదు. కానీ, గోవాలో గత రెండేళ్లలో మద్యం సేవిస్తున్న అమ్మాయిల సంఖ్య మాత్రం విపరీతంగా పెరిగిపోయింది. దీనికి అడ్డుకట్ట పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది’ అని పారికర్ అభిప్రాయపడ్డారు. ఇక గోవాలో మాదకద్రవ్యాల వ్యాపారంపై ఆయన మాట్లాడుతూ.. డ్రగ్ నెట్ వర్క్ ను అంతమొందించే ఆపరేషన్ కొనసాగుతోందని చెప్పారు. కాలేజీలో డ్రగ్స్ సంస్కృతి ఎక్కువగా ఉందని తాను భావించడం లేదని.. కానీ, మొత్తానికి లేదన్న వాదనతో మాత్రం తాను ఏకీభవించబోవని చెప్పారు. ఇప్పటి వరకు 170 మంది డ్రగ్ పెడ్లర్లను అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. చట్టంలోని లోపాలతో నిందితులు త్వరగతిన బయటపడుతున్నారని.. అందుకే శిక్షాస్మృతిని సవరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇక నిరోద్యోగ సమస్యపై స్పందిస్తూ... గోవా యువత కష్టపడి పని చేయడానికి ఇష్టపడటం లేదని... సింపుల్ వర్క్ వైపే మొగ్గుచూపుతున్నారని చెప్పారు. గవర్నమెంట్ జాబ్ అంటే పని ఉండదనే భావంతో ఉన్నారని పారికర్ అసహనం వ్యక్తం చేశారు. -
సెల్‌ఫోన్ కొనివ్వలేదని .. విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి, పనాజి : నేడు సెల్ఫోన్ల వినియోగం పెరిగిపోయింది. ప్రస్తుతం మొబైల్ కూడా నిత్యవసర జాబితాలోకి చేరిపోయిందని చెప్పవచ్చు. కానీ మొబైల్ తన కూతురి ప్రాణం తీస్తుందని ఊహించలేదు ఆ తల్లిదండ్రులు. ఎన్నిసార్లు అడిగినా తండ్రి సెల్ కొనివ్వకపోవడంతో మనస్తాపానికి గురైన ఓ విద్యార్థిని వంటికి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన పనాజికి 45 కిలోమీటర్ల దూరంలోని సంఖలిమ్ గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. ఈ విద్యార్థిని గత కొంతకాలంగా సెల్ కావాలని తల్లిదండ్రులను అడుగుతోంది. ఎన్నిసార్లు అడిగినా వారు ఫోన్ కొనించలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ బాలిక బుధవారం(11వ తేదీన) సాయంత్రం ఇంట్లో ఎవరు లేని సమయంలో వంటికి నిప్పంటించుకుంది. ఆ మంటలో శరీరం దాదాపుగా కాలిపోయింది. తీవ్రంగా గాయపడిన ఆ విద్యార్థిని ఆస్పత్రికి తరలించారు. మార్గ మధ్యలోనే మృతిచెందిందని వైద్యులు తెలిపారు. -
రాజీనామా చేసి, ఇంట్లో కూర్చుంటా: సీఎం
సాక్షి, పనాజీ : ‘నాది రాజకీయ నేపథ్య కుటుంబం కాదు. ఇంకా చెప్పాలంటే రాజకీయాల్లోకి వస్తానని కలలో కూడా అనుకోలేదు. కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కేవలం 10 ఏళ్ల కాలానికే రాజకీయాలకు గుడ్ బై చెబుతానని భావించాను. ఒకవేళ నేను రాజకీయాలకు తగిన వాడిని కాదని ఆలోచన వస్తే మాత్రం క్షణం కూడా ఆలోచించకుండా నా పదవికి రాజీనామా చేసి ఇంట్లో కూర్చునేవాడినని’ కేంద్ర మాజీ మంత్రి, గోవా సీఎం మనోహర్ పారికర్ అన్నారు. ఐఐటీ బాంబే గ్రాడ్యుయేట్ అయిన తాను తనకు ఇష్టం లేకున్నా రాజకీయ జీవితం ప్రారంభించాల్సి వచ్చిందని ఇటీవల ఓ కార్యక్రమంలో వెల్లడించారు. ’గతంలో కేంద్రం సూచన మేరకు సీఎం పదవికి రాజీనామా చేసి అక్కడ మంత్రి పదవి చేపట్టాను. అయితే గోవా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మళ్లీ మీ కోసం తిరిగొచ్చేశాను. ఈసారి ఏం జరిగినా సరే.. ఎలాంటి ఆపద వచ్చినా తట్టుకుని నిలబడతాను. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యలో విడిచి వెళ్లిపోను. సీఎంగా పూర్తికాలం పదవిలో కొనసాగుతాను. మా ప్రభుత్వానికి ఎలాంటి ఢోకాలేదు. నాది రాజకీయ నేపథ్య కుటుంబం కాదు. ఒకవేళ పొలిటికల్ ఫ్యామిలీలో పుట్టినవాడినైతే ఢిల్లీ రాజకీయాలకు అనుగుణంగా మారేవాడినని’ ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల గోవాలోని పనాజీ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో పోటీచేసిన సీఎం పారికర్ ఘన విజయం సాధించారు. -
ప్రాణం తీసిన సెల్ఫీ..
పనాజి: సెల్ఫీ మోజు ఓ యువకుడి ప్రాణం తీసింది. వేగంగా వస్తున్న రైలు ముందు నిల్చోని సెల్ఫీ దిగుతుండగా రైలు ఢీ కొట్టడంతో ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఆదివారం పనాజిలోని కర్మాలీ రైల్వే స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సచిన్ కుందేకర్ (25), అతని మిత్రుడితో దోజి గ్రామంలోని రైల్వే ట్రాక్‌పై నిల్చోని సరదాగా సెల్ఫీ దిగుతుండగా వేగంగా వస్తున్న రైలు ఢీకొట్టింది. అతని మిత్రుడు సమాచారంతో వెంటనే ఆసుపత్రికి తరలించామని, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారని కొంకణ్ రైల్వే ఇన్స్పెక్టర్ సోమవారం మీడియాకు తెలిపారు. -
ఆప్ దగ్గర డబ్బులేదు: కేజ్రీవాల్
పనాజీ: ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆమ్ఆద్మీ పార్టీ దగ్గర డబ్బు లేదని ఆ పార్టీ జాతీయ కన్వినర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఆదివారం సాయంత్రం దక్షిణ గోవాలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల నేతలతో సమావేశమైన కేజ్రీవాల్ ఈ మేరకు వెల్లడించారు. ఒకటిన్నర సంవత్సరాలుగా ఢిల్లీలో ప్రభుత్వాన్ని నడుపుతున్న ఆప్ దగ్గర డబ్బులేదంటే నమ్మడానికి కొంత కష్టంగా ఉంటుందని, కావాలంటే తన బ్యాంకు ఎకౌంట్లు చూపిస్తానన్నారు. పంజాబ్, గోవాలో త్వరలో జరగనున్న ఎన్నికల కోసం ఆమ్ఆద్మీ పార్టీ ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించింది. ఢిల్లీ ఎన్నికల్లో.. ప్రజలు తమ భవిష్యత్తును నిర్మించుకునేందుకు తమ పార్టీ ఒక వేదికలా పనిచేసిందని, ప్రస్తుతం ఇదే పరిస్థితి గోవాలో ఉందని ఆయన అన్నారు. గోవా ప్రజలే గోవా ప్రభుత్వాన్ని నడుపుతారని, తమ పార్టీలో హైకమాండ్ కల్చర్ లేదని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. గోవా ఎన్నికల మేనిఫెస్టోను సైతం గోవా ప్రజలే నిర్ణయించుకుంటారని అన్నారు. ప్రభుత్వం తలచుకుంటే ఒక గంటలో గోవాలో డ్రగ్స్ లేకుండా చేయొచ్చని, అయితే పోలీసులు, రాజకీయ నాయకులు డ్రగ్స్ ముఠాలకు సహకరిస్తూ అక్రమ రవాణాను ప్రోత్సహిస్తున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. -
అత్యంత పరిశుభ్రమైన నగరాలు మూడే
న్యూఢిల్లీ: దేశంలో మూడే మూడు పరిశుభ్రమైన నగరాలుగా నిలిచాయి. అత్యంత పరిశుభ్రమైన నగరాల జాబితాను సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సెంటర్ (సీఎస్ఈ) సోమవారం విడుదల చేసింది. సీఎస్ఈ తాజా రేటింగ్స్ ప్రకారం వీటిలో కేరళలోని అలెప్పు, గోవా రాజధాని పనాజి, కర్ణాటకలోని మైసూరు అతి పరిశుభ్రమైన నగరాలుగా పేరు దక్కించుకున్నాయి. దేశంలో సాలిడ్ వేస్టే మేనేజ్ మెంట్ పద్ధతిపై 'నాట్ ఇన్ మై బ్యాక్ యార్డ్' పేరుతో ఈ నివేదికను విడుదల చేసింది. ఘన వ్యర్థాల నిర్వహణలో ఢిల్లీ లాంటి మెట్రో నగరాల్లో పరిస్థితులు అంత మెరుగ్గా లేవని సీఎస్సీ వ్యాఖ్యానించింది . దేశవ్యాప్తంగా పట్టణాల్లో ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ పద్ధతులు ఆధారంగా ఒక సర్వే నిర్వహించింది. మున్సిపల్ వ్యర్థ పదార్థాల నిర్వహణ వ్యవస్థల భారతదేశం లో పరిశుభ్రమైన నగరాల్లో ఈ మూడు నగరాలు ఉన్నాయని సర్వే తేల్చింది. ఈ విషయంలో దేశరాజధాని నగరం ఢిల్లీ అట్టడుగు స్థాయిలో ఉండగా, మైసూర్ తన స్థానాన్ని నిలబెట్టుకోవడం విశేషం. గ్రౌండ్ లెవల్ సమాచారం పూర్తిగా లభ్యంకానప్పటికీ, 2009 ఘన వ్యర్థాల నిర్వహణ ఆర్థిక వ్యవహారాల శాఖ స్థాయీ పత్రాన్ని ప్రస్తావిస్తూ, భారతదేశ అర్బన్ ఏరియాల్లో ఇప్పటికే ఒక రోజు వ్యర్థాలు సుమారు 80,000 మెట్రిక్ టన్నులకు చేరిందన్నారు . 2047 నాటికి ఇది 260 మిలియన్ టన్నులకు చేరుతుందని అంచనా వేశారు. దీనికోసం 1,400 చదరపు కిలోమీటర్ల అవసరమవుతుందనీ, ఇది హైదరాబాద్, ముంబై , చెన్నై నగరాలకు కలిపితే వచ్చే ప్రదేశానికి సమానమవుతుందని సునీత హెచ్చరించారు. భారతదేశం అత్యంత పరిశుభ్రమైన నగరాన్ని కొనుక్కొనే క్రమంలో ఈ సర్వేనిర్వహించామని సీఎస్ సీ డైరెక్టర్ జనరల్ సునీతా నారాయణ్ తెలిపారు. వ్యర్థాల నియంత్రణలోపాలపై ఆమె అసంతృప్తి వ్యక్తంచేశారు. ఈ పరిస్థితుల్లో కేరళలో మున్సిపాలిటీ కంటే ప్రజలు అనుసరిస్తున్న పద్ధతులే ఉత్తమమైనవి అని ఆమె తెలిపారు. ప్రజలే కంపోస్ట్ , ఇతర వ్యర్థాలను వేరుచేసి రీసైక్లింగ్ చేసి సేకరించి అమ్ముతున్నారన్నారు. ఫ్యూచర్ వేస్ట్ మేనేజ్ మెంట్ లో ఇదే అద్భుతమైన మోడల్ అనీ, వ్యర్థాలను నిరోధించకపోతే దేశంలోని ఇతర నగరాలకు భారీ గుణపాఠం తప్పదని నారాయణ్ చెప్పారు. -
సెక్స్ రాకెట్ లో సినిమా తారలు!
పణజి: హైటెక్ వ్యభిచార ముఠా గుట్టును గోవా పోలీసులు రట్టు చేశారు. మోడల్స్, సినిమా తారలతో మహారాష్ట్ర, గోవాలో వ్యభిచారం చేయిస్తున్న ముఠాలోని కీలక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పణజి శివారులోని టోనీ హౌసింగ్ కాలనీలో నివసిస్తున్న ఆనంద్ కుమార్ అలియాస్ ఆండీని అరెస్ట్ చేసినట్టు ఎస్పీ(క్రైమ్ బ్రాంచ్) కార్తీక్ కశ్యప్ తెలిపారు. అతడి నుంచి కీలక ఆధారాలు సేకరించినట్టు వెల్లడించారు. 'ఆనంద్ కుమార్ ఇంట్లో కీలక ఆధారాలు లభించాయి. ఉన్నత స్థాయి వ్యక్తులు, సినిమా తారలు, మోడల్స్ ఫోన్ నెంబర్లు దొరికాయ'ని ఎస్పీ కశ్యప్ చెప్పారు. క్లైయింట్ల లిస్టులో సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల ఫోన్ నంబర్లు కూడా ఉన్నాయని పోలీసు వర్గాలు వెల్లడించాయి. అయితే మిగతా వివరాలు చెప్పేందుకు ఎస్పీ నిరాకరించారు. పోలీసులు కస్టమర్ల నటించి ఆనంద్ కుమార్ కింద పనిచేస్తున్న నలుగురిని అరెస్ట్ చేశారు. ముగ్గురు మహిళలను కాపాడారు. -
కన్నకొడుకైనా ఉపేక్షించను: కేజ్రీవాల్
పనాజి: అవినీతికి తన కొడుకు పాల్పడ్డా ఉపేక్షించేదిలేదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. పనాజిలోని పబ్లిక్ మీటింగ్ లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఢిల్లీ ఫుడ్ మినిష్టర్ లంచం ఇవ్వమని డిమాండ్ చేశారనే ఆరోపణలపై ఆయనను పదవినుంచి తొలగించిన విషయం తెలిసిందే. గోవాలో జరగనున్న 2017 అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారాన్ని కేజ్రీవాల్ గోవాలో ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్టాడుతూ.. మద్యం వ్యాపారి విజయ్ మాల్యాకు రుణంగా రూ.9 వేల కోట్లను కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని, తమ ప్రభుత్వం 36 లక్షల పేద కుటుంబాలకు విద్యుత్ సబ్సిడీ కింద రూ. 400 కోట్లు మాఫీ చేస్తే దానిని కాంగ్రెస్ విమర్శిస్తుందని ఆయన పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాల్యా విదేశాలకు పారిపోవడానికి సహకరించిందని ఆయన ఆరోపించారు. గతంలో ఢిల్లీకి విద్యుత్తును అందించిన ప్రైవేటు వ్యక్తులకు చెందిన విద్యుత్ కంపెనీలలో జరిగిన అక్రమాలపై విచారణ జరుపగా రూ.8 వేల కోట్లు అవినీతి జరిగిందని కాగ్ తేల్చిందని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఈ డబ్బును తమ ప్రభుత్వం వెనకకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తోందని, ప్రస్తుతం ఈకేసు సుప్రీ కోర్టులో ఉందని తెలిపారు. ఈ కేసులో తాము విజయం సాధిస్తే ఢిల్లీలో మరింత విద్యుత్ టారిఫ్ ను తగ్గిస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. -
వంట పాత్రల కోసం వెళితే వాంఛ తీర్చమన్నాడు!
పనాజీ: అన్నం పెట్టిన విశ్వాసం కూడా లేకుండా ఆ ఇంటి చిన్నారిపైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడో ప్రబుద్ధుడు. 13 ఏళ్ల చిన్నారిని లైంగికంగా వేధించినందుకు జైలు ఊచలు లెక్కపెడుతున్నాడు. వివరాల్లోకి వెళితే పనాజీలోని మసీదులో గుమాస్తాగా పనిచేస్తున్న సఫ్రాజ్ అహ్మద్ (32)కు ఈ నెల 15న పక్కింట్లోని వాళ్లు వంటపాత్రల్లో భోజనం పెట్టి ఇచ్చారు. మరుసటిరోజు ఆ పాత్రలను తీసుకురావడానికి వెళ్లిన పక్కింటి చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. మొదట విషయాన్ని ఇంట్లో చెప్పడానికి భయపడిన బాలిక తర్వాత ఆమె తల్లికి చెప్పింది. ఆమె స్థానిక స్వచ్ఛంద సేవా సంస్థ సహాయంతో పోలీసులకు ఈ ఘటనపై ఫిర్యాదు చేసింది. అహ్మద్‌పై ఐపీసీ సెక్షన్ 354, 354-ఏ, గోవా బాలల చట్టం 8 కింద కేసు నమోదుచేసిన పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. -
మేకప్ పై పెరుగుతున్న వ్యామోహం..!
భారత్ లో సంప్రదాయ వివాహాల్లో ఇటీవల మేకప్ పై తీవ్ర వ్యామోహం పెరుగుతున్నట్లు మేకప్ పరిశ్రమ నిపుణులు పనాజీ వెల్లడించారు. దేశంలో మేకప్ ఇండస్ట్రీరీ ప్రతి సంవత్సరం ఇరవై శాతం చొప్పున అభివృద్ధి చెందేందుకు ఈ వివాహాలు దోహదం చేస్తున్నాయని ఆయన అన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత ప్రజలు సౌందర్యానికి అత్యధికంగా ఖర్చు చేస్తున్నారని ఆయన చెప్తున్నారు. ముఖ్యంగా భారత వివాహాలు పరిశ్రమకు మంచి అభివృద్ధి సాధకాలుగా మారుతున్నాయని, ముంబైలోని బాలీవుడ్, హాలీవుడ్ ఇంటర్నేషనల్(BHI), మేకప్ అండ్ హెయిర్ స్టయిలింగ్ అకాడమీ నిపుణుడు వివేక్ భారతీ వివరించారు. ముంబైలో ప్రారంభమైన ఓ అంతర్జాతీయ వర్క్ షాప్ సందర్భంగా మాట్లాడిన ఆయన... ఈ విషయాన్ని వెల్లడించారు. హాలీవుడ్ ప్రముఖ మేకప్ కళాకారుడు డోనాల్డ్ సిమ్ రాక్ ఈ వర్క్ షాప్ కు ముఖ్య అతిథిగా హజరయ్యారు. అభివృద్ధి చెందిన, అత్యంత సంపన్నదేశమైన అమెరికా చుట్టుపక్కల ప్రాంతాల్లో వివాహ సందర్భాల్లో మేకప్ కు సుమారు 150 నుంచి 200 డాలర్లను ఖర్చు పెడుతుంటే... ఇండియాలో మాత్రం బ్రైడల్ మేకప్ కు సుమారు 14 నుంచి 15 వేల రూపాయలు దాకా ఖర్చు చేయడం పెద్ద విషయంగా భావించడం లేదని నిపుణులు అంటున్నారు. కొన్ని ప్రత్యేక వివాహ వేడుకల్లో లక్షలకొద్దీ మేకప్ కోసం ఖర్చుచేసిన దాఖలాలు ఉన్నాయంటున్నారు. వివాహాన్ని ఓ చిరస్మరణీయ వేడుకగా జరుపుకునేందుకు భారతీయులు ఎంతో ఖర్చు పెడతారని ఈ సందర్భంగా భారతీ వివరించారు. వివాహం అనేది భారత కుటుంబాల్లో ఓ ప్రత్యేక కార్యక్రమం అని, ఇందులో వధువు దుస్తులతోపాటు, అలంకరణ, మేకప్ ఆకర్షణీయంగా ఉండేందుకు ఎంతో ప్రాముఖ్యతనిస్తారని భారతీ అన్నారు. పెళ్ళి సందర్భంలో వధువు అత్యంత ఆకర్షణీయంగా కనిపించడం వారి ఐశ్వర్యాన్ని సూచిస్తుందని, ఆ సన్నివేశంలోని చిత్రాలను తరతరాలపాటు భద్రపరచుకొంటారని సూచించారు. బ్యూటీ ఇండ్రస్ట్రీ సంవత్సరానికి ఇరవై శాతం అభివృద్ధి చెందుతుండగా మేకప్ పై జనంలో ఏభైశాతం అవగాహన కూడ పెరుగిందని అయన తెలిపారు. ముఖ్యంగా పరిశ్రమ అభివృద్ధి భారతీయ సెలూన్లలో చూస్తే తెలుస్తుందని, గతంలో బ్యూటీ ఇండస్ల్రీపై అవగాహన అంతగా ఉండేది కాదని, నిరక్షరాస్యులే ఇందులో పనిచేసేందుకు ముందుకొచ్చేవారని అన్నారు. ఇప్పుడు ఉన్నత కుటుంబాల్లోని పిల్లలు బ్యూటీ పరిశ్రమలో అడుగిడి, దాన్ని ఉద్యోగంగా మార్చుకుంటున్నారన్నారు. అంతేకాక ఎక్కువ మొత్తంలో చెల్లింపులు పొందే ఉద్యోగంగా మేకప్ ఉద్యోగం మారుతోందని, మంచి మేకప్ ఆర్టిస్ట్ ఇప్పుడు కార్పొరేట్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ స్థాయిలో సంపాదిస్తున్నాడని ఆయన వివరించారు.