సెల్‌ఫోన్‌ కొనివ్వలేదని .. విద్యార్థిని ఆత్మహత్య | Student commits suicide for cell phone in Panaji | Sakshi
Sakshi News home page

సెల్‌ఫోన్‌ కొనివ్వలేదని .. విద్యార్థిని ఆత్మహత్య

Published Thu, Oct 12 2017 2:17 PM | Last Updated on Tue, Nov 6 2018 8:08 PM

Student commits suicide  for cell phone in Panaji - Sakshi

సాక్షి, పనాజి : నేడు సెల్‌ఫోన్‌ల వినియోగం పెరిగిపోయింది. ప్రస్తుతం మొబైల్‌ కూడా నిత్యవసర జాబితాలోకి చేరిపోయిందని చెప్పవచ్చు. కానీ మొబైల్‌ తన కూతురి ప్రాణం తీస్తుందని ఊహించలేదు ఆ తల్లిదండ్రులు. ఎన్నిసార్లు అడిగినా తండ్రి సెల్‌ కొనివ్వకపోవడంతో మనస్తాపానికి గురైన ఓ విద్యార్థిని వంటికి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది.

ఈ సంఘటన పనాజికి 45 కిలోమీటర్ల దూరంలోని సంఖలిమ్‌ గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. ఈ విద్యార్థిని గత కొంతకాలంగా సెల్‌ కావాలని తల్లిదం‍డ్రులను అడుగుతోంది. ఎన్నిసార్లు అడిగినా వారు ఫోన్‌ కొనించలేదు.  దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ బాలిక బుధవారం(11వ తేదీన) సాయంత్రం ఇంట్లో ఎవరు లేని సమయంలో వంటికి నిప్పంటించుకుంది. ఆ మంటలో శరీరం దాదాపుగా కాలిపోయింది. తీవ్రంగా గాయపడిన ఆ విద్యార్థిని ఆస్పత్రికి తరలించారు. మార్గ మధ్యలోనే మృతిచెందిందని వైద్యులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement