సెల్‌ఫోన్ కొనివ్వలేదని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
వైరా (ఖమ్మం) : సెల్‌ఫోన్ కొనివ్వలేదని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా వైరా మండలంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని గొల్లనపాడు గ్రామానికి చెందిన కన్నెగంటి హరికృష్ణ డిగ్రీ మొదటి ఏడాది చదువుతున్నాడు.
అయితే సెల్‌ఫోన్ కొనివ్వమని ఇంట్లో అడిగాడు. అందుకు తల్లిదండ్రులు నిరాకరించడంతో మనస్తాపం చెందిన హరికృష్ణ పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు.