Chittoor: Young Man Suicide Girlfriend Did Not Lift The Phone Viral - Sakshi
Sakshi News home page

ప్రేయసి ఫోన్‌ లిఫ్ట్‌ చేయలేదని.. ఎంత పనిచేశావ్‌ తరుణ్‌..

Published Tue, Jan 11 2022 2:38 PM | Last Updated on Tue, Jan 11 2022 3:18 PM

Young Man Suicide Girlfriend Did Not Lift Phone In Chittoor District - Sakshi

మదనపల్లె టౌన్‌(చిత్తూరు జిల్లా): ప్రేయసి ఫోన్‌ లిఫ్ట్‌ చేయలేదని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన పట్టణంలో సోమవారం జరిగింది. సదుం మండలం, చెరుకువారిపల్లెకు చెందిన క్రిష్ణయ్య అనారోగ్యంతో మృతి చెందడంతో అతని భార్య సుజాత, కుమారుడు తరుణ్‌ రెండేళ్ల క్రితం మదనపల్లె ఈస్ట్‌పేటలో ఉంటున్నారు.

చదవండి: గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం.. ముగ్గురు అరెస్టు

తరుణ్‌ పట్టణంలో ఫుడ్‌ సరఫరా చేసే సంస్థలో పనిచేస్తున్నాడు. ఇతను ఏడాదిగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఆమె 2 నెలలుగా ఫోన్‌కు స్పందించకపోవడంతో మనస్తాపానికి గురై యువకుడు ఇంట్లోనే ఉరివేసుకుని మృతి చెందాడు. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో సుజాత తల్లడిల్లిపోయింది. టూటౌన్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement