హైదరాబాద్‌ అమ్మాయితో ప్రేమ.. కొద్ది రోజులుగా ఆమె మాట్లాడటం లేదని.. | Young Man Attempted Suicide Girlfriend Not Talking In Kamareddy | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ అమ్మాయితో ప్రేమ.. కొద్ది రోజులుగా ఆమె మాట్లాడటం లేదని..

Published Fri, Dec 3 2021 9:47 AM | Last Updated on Fri, Dec 3 2021 11:28 AM

Young Man Attempted Suicide Girlfriend Not Talking In Kamareddy - Sakshi

సాక్షి, కామారెడ్డి: ప్రేమించిన అమ్మాయి మాట్లాడటం లేదని ఓ యువకుడు గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. గొంతు కోసుకున్న వ్యక్తి నరేష్‌గా గుర్తించారు.

చదవండి: Mating Season: ఆడతోడు కోసం ఎందాకైనా..!

స్థానికుల కథనం ప్రకారం.. దళితవాడకు చెందిన నడిపి నరేష్ కొంత కాలంగా హైదరాబాద్‌కి చెందిన ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు కొద్దిరోజులుగా ఆ అమ్మాయి  నరేష్‌తో మాట్లాడటం లేదని తెలిసింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువకుడు ఇంటి వద్ద బ్లేడ్‌తో గొంతు కోసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే నరేష్‌ని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగానే ఉందని స్థానికులు తెలిపారు. ఈ మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement