attempted suicide
-
అప్పుల బాధతో కుటుంబం ఆత్మహత్యాయత్నం
విశాఖపట్నం: అప్పులు తీర్చలేక ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన విశాఖ జిల్లా పెందుర్తి మండలం గొరపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తల్లిదండ్రులు మృతి చెందగా, కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది. గ్రామస్తుల కథనం ప్రకారం...గొరపల్లిలో కల్లూరు సత్యనారాయణ (57) కిరణా దుకాణం నడుపుతున్నాడు. అతనికి భార్య సూర్యకుమారి (48), కుమారుడు సంతోష్ (26), కుమార్తె నీలిమ (24) ఉన్నారు. కుమారుడు సంతోష్ ఓ ప్రైవేటు బ్యాంకులో పనిచేస్తున్నాడు. కుమార్తె నీలిమ డిగ్రీ చదివి ఇంట్లోనే ఉంటోంది. సత్యనారాయణ, సంతోష్ ఇటీవల అప్పులు చేశారు. అప్పలు తీర్చమని ఫైనాన్స్ వాళ్లు సత్యనారాయణ ఇంటికి వచ్చి డిమాండ్ చేస్తున్నారు. దీంతో మనస్థాపానికి గురైన సత్యనారాయణ, సూర్యకుమారి, నీలిమ గురువారం అర్ధరాత్రి దాటాకా పురుగు మందు తాగారు. ఈ విషయాన్ని సూర్యకుమారి అదే గ్రామంలో ఉంటున్న బంధువుకి ఫోన్‌చేసి చెప్పింది. దాంతో సూర్యకుమారి బంధువు, గ్రామస్తులు సత్యనారాయణ ఇంటికి చేరుకున్నారు. ఆ సమయంలో సంతోష్ ఇంట్లో లేకపోవంతో అతనికి సమాచారం ఇచ్చారు. ఇంటికి చేరుకున్న సంతోష్, బంధువులు, స్థానికులు కలిసి వారిని కేజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం సత్యనారాయణ, మధ్యాహ్నం సూర్యకుమారి మృతి చెందారు. నీలిమ పరిస్థితి విషమంగా ఉన్నట్టు గ్రామస్తులు తెలిపారు. పెందుర్తి సీఐ ఎం. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సుమారు రూ.25 లక్షల వరకు అప్పులున్నట్టు తెలిసింది. -
మొదటి భార్యకు తెలియకుండా రెండో పెళ్లి.. మనస్తాపంతో నిద్రమాత్రలు మింగి
అన్నమయ్య :భర్త తనను ఇంటి నుంచి గెంటివేసి, రెండోపెళ్లి చేసుకున్నాడని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా న్యాయం జరగకపోవడంతో ఓ వివాహిత ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన సోమవారం మదనపల్లెలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కురవంకకు చెందిన డేరంగుల రమేష్, బాబూకాలనీకి చెందిన శివజ్యోతికి 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. పిల్లలు లేరు. దీంతో శివజ్యోతిపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ రమేష్ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేశాడు. శివజ్యోతి తండ్రితో కలిసి బాబూకాలనీలో నివాసం ఉంటోంది. ఈ క్రమంలో మొదటిభార్యకు తెలియకుండా చరితను రెండో వివాహం చేసుకుని ఒక బిడ్డకు తండ్రి అయ్యాడు. విషయం తెలుసుకున్న శివజ్యోతి శనివారం భర్త ఇంటి ముందు తనకు న్యాయం చేయాలంటూ నిరసన వ్యక్తం చేసింది. భర్తపై తాలూకా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. రెండు రోజులుగా పోలీసులు ఫిర్యాదుపై స్పందించకపోవడం, భర్తపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో శివజ్యోతి మనస్తాపం చెంది ఆదివారం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్సల అనంతరం ఆమె తేరుకోకపోవడంతో మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. -
కస్తూర్బాలో ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం
శాయం పేట: సెల్‌ఫోన్ దొంగతనం చేశారని తోటి విద్యార్థినులు అవమానించారని మనస్తాపం చెందిన ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటన హనుమకొండ జిల్లా శాయంపేట మండలం గోవిందాపూర్ శివారులోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో బుధవారం సాయంత్రం జరిగింది. టీచర్లు వారిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. గోవిందాపూర్ కేజీబీవీలో కల్పన, పూర్ణ పదో తరగతి చదువుతున్నారు. ఇందులో హనుమకొండకు చెందిన కల్పన, పూర్ణతో కలిసి మంగళవారం రాత్రి అటెండర్ సెల్ ఫోన్ తీసుకొని తల్లికి ఫోన్ చేసింది. తనకు ఆరోగ్యం బాగా లేదని, ఇంటికి తీసుకెళ్లాలని కోరింది. అదే సందర్భంగా తోటి విద్యార్థినులు గమనించి ‘దొంగ’‘దొంగ’.. అంటూ అవహేళన చేశారు. దీంతో మనస్తాపం చెందిన ఆ ఇద్దరు విద్యార్థినులు బుధవారం సాయంత్రం తమ వద్ద ఉన్న నెయిల్ పాలిష్‌ను తాగారు. గమనించిన టీచర్స్ వారిని వెంటనే పరకాలలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఆస్పత్రిలో వైద్యసిబ్బంది అందుబాటులో లేకపోవడంతో వారి ని వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వారి ఆరోగ్యం మెరుగు పడటంతో గురువారం తల్లిదండ్రులు వారిని ఇళ్లకు తీసుకెళ్లారు. ఈ విషయమై కేజీబీవీ స్పెషలాఫీసర్ మాధవిని వివరణ కోరగా కల్పన, పూర్ణ తమ ఇళ్లకు వెళ్తామని అడిగితే పర్మిషన్ ఇవ్వలేదని, ఆ బాధతోనే ఆత్మహత్యకు యత్నించారని పేర్కొన్నారు. -
మహిళలు టికెట్లు కొనరు..కండక్టర్లకు చిక్కులు
రాయచూరు రూరల్: కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఐదు గ్యారంటీ కార్డు పథకాల్లో భాగంగా కేఎస్ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అనే వాగ్దానం కండక్టర్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. మహిళలు టికెట్ తీసుకోకుండా కండక్టర్లతో గొడవలు పడుతున్న ఘటనలు రోజూ జరుగుతున్నాయి. కాగా చెకింగ్ సిబ్బంది కండక్టర్లనే బాధ్యులను చేస్తున్నారు. వివరాలు.. శుక్రవారం భాల్కి నుంచి బీదర్ మీదుగా హైదరాబాద్ వెళుతున్న బస్సును ఖానాపూర్ వద్ద అధికారులు తనిఖీ చేశారు. ఆ సమయంలో టికెట్ తనిఖీ అధికారులు ఓ మహిళ వద్ద టికెట్ లేకపోవడంపై కండక్టర్‌పై మండిపడ్డారు. ఆమెకు టికెట్ ఎందుకివ్వలేదని నిలదీశారు. ఉచిత రవాణా సదుపాయం అంటూ ప్రకటించిన నేపథ్యంలో తాను టికెట్ తీసుకోలేదని ప్రయాణికురాలు చెప్పినా అధికారులు కండక్టర్‌ను మందలించి క్రమశిక్షణ చర్యలకు పూనుకున్నారు. దీంతో మనస్తాపానికి గురైన కండక్టర్ రామకృష్ణ డ్యూటీ ముగిసిన అనంతరం బీదర్ డిపో ముందు తాడుతో ఉరి వేసుకునేందుకు యత్నించాడు. తోటి సిబ్బంది, ఉద్యోగులు గమనించి కండక్టర్‌ను రక్షించారు. -
రూ.50 లక్షల కట్నం, బైక్ ముందే కావాలి.. ఇస్తేగాని పెళ్లి చేసుకోను
పటాన్చెరు టౌన్: కట్నం, బైక్ ముందే కావాలని, ఇస్తేగాని పెళ్లి చేసుకునేది లేదని ఓ యువకుడు ఫోన్లో యువతిని తిడుతూ అడగటంతో మనస్తాపం చెందిన యువతి రెండో అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్యయు యత్నించింది. ఈ సంఘటన పటాన్చెరు పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. యువతి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పటాన్చెరు పట్టణంలోని నాయికోటి బస్తీకి చెందిన జంగయ్య కూతురు యామినికి పటాన్చెరు మండలం భానూర్ కంచర్లగూడెంకు చెందిన జంగయ్య అక్క లక్ష్మి కుమారుడు చిన్నోల శంకర్‌తో మార్చి 26వ తేదీన నిశ్చితార్థం జరిగింది. ఆ సమయంలో రూ.50 లక్షలు కట్నం భూమి అమ్మిన తర్వాత ఇస్తామని చెప్పడంతో శంకర్ కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. నిశ్చితార్థం జరిగిన మార్నాడే కట్నంతో పాటు బైక్ ముందే కావాలని యువతికి ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడి అడిగాడు. దీంతో యువతి కుటుంబ సభ్యులు శుక్రవారం యువకుడి ఇంటికి వెళ్లి మాట్లాడేందుకు వెళ్లడంతో తనకు పెళ్లి అవసరం లేదంటూనిశ్చితార్థం సమయంలో పెట్టిన రింగ్ తీసి పడేశాడు. దీంతో యువతి కుటుంబ సభ్యులు మళ్లీ మాట్లాడుదామని చెప్పి ఇంటికి వచ్చారు. దీంతో మనస్తాపం చెందిన యువతి భవనం రెండో అంతస్తు పైనుంచి దూకడంతో తీవ్రంగా గాయపడింది. కుటుంబ సభ్యులు వెంటనే యామినిని చికిత్స కోసం పట్టణంలో ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె పరిస్థితి మిషయంగా ఉందని వైద్యులు తెలిపారు. కట్నకానుకల విషయంలో శంకర్, అతడి కుటుంబ సభ్యులు వేధించడంవల్లే తమ కూతురు ఆత్మహత్యకు యత్నించిందని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
సర్పంచ్ దంపతుల ఆత్మహత్యాయత్నం
సుభాష్‌నగర్ (నిజామాబాద్ అర్బన్): నిజామాబాద్ జిల్లా నందిపేట్ సర్పంచ్ సాంబారు వాణి, ఆమె భర్త తిరుపతి సోమవారం కలెక్టరేట్లో ఆత్మహత్యకు యత్నించారు. బిల్లుల(ఎంబీల)పై ఉప సర్పంచ్ సంతకాలు పెట్టడంలేదని, దీనితో రూ.2 కోట్ల కుపైగా ఆగిపోయాయంటూ ఒంటిపై పెట్రోల్ పోసుకున్నారు. సమీపంలో ఉన్నవారు వెంటనే దంపతుల నుంచి అగ్గిపెట్టెను లాక్కొని విసిరేశారు. బీజేపీ మద్దతుతో వాణి సర్పంచ్‌గా గెలుపొందడంతో సాకులు చూపి వేధింపులకు గురి చేస్తున్నారని, పంచాయతీ నిధులు మింగేశామని ఆరోపిస్తూ సస్పెండ్ చేశారని తిరుపతి కన్నీళ్లు పెట్టుకున్నారు. పార్టీ మారినా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి బిల్లులు, చెక్ పవర్ ఇప్పించ లేకపోయారని పేర్కొన్నారు. బిల్లులు రాక గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టలేక ప్రజలకు ముఖం చాటేయాల్సి వస్తోందన్నారు. వడ్డీ సహా మొత్తం రూ.4 కోట్ల వరకు అప్పులు అయ్యాయని.. ఈ దిగులుతో తన భార్య, సర్పంచ్ వాణి ఆస్పత్రి పాలైందన్నారు. అయితే కలెక్టర్ వచ్చే వరకూ కలెక్టరేట్ నుంచి కదిలేది లేదంటూ వాణి, తిరుపతి అక్కడే బైఠాయించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డీపీవో జయసుధ అక్కడికి చేరుకుని వారితో మాట్లాడారు. ఉప సర్పంచ్ సంతకాలు పెట్టకపోవడంపై విచారణ చేపడతామని, న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. -
మరో రైతు ఆత్మహత్యాయత్నం
సాక్షి, కామారెడ్డి: తన భూమిని రిక్రియేషన్ జోన్లో కలిపారన్న ఆవేదనతో మంగళవారం ఓ రైతు గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కామారెడ్డి కొత్త మాస్టర్‌ప్లాన్‌లో పంట భూములను ఇండస్ట్రియల్, గ్రీన్, రిక్రియేషన్ జోన్ల కింద పేర్కొనడంపై రైతాంగం నెలన్నర రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారం రామేశ్వర్పల్లికి చెందిన రైతు మర్రిపల్లి బాలక్రిష్ణ గడ్డిమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అతన్ని వెంటనే జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించగా, ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నాడు. తనకున్న ఎకరం భూమి రిక్రియేషన్ జోన్‌లోపోతే పిల్లలను ఎలా పెంచాలి, పెళ్లిళ్లు ఎలా చేయాలని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. మరోవైపు, మాస్టర్‌ప్లాన్‌ను రద్దు చేయాలంటూ రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో 8గ్రామాలకు చెందిన రైతులు కలెక్టరేట్ ముట్టడి, కుటుంబ సభ్యులతో ర్యాలీ వంటి నిరసన వంటి కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఆయా గ్రామాలకు చెందిన 9 మంది కౌన్సిలర్లు ఈనెల 19లోపు రాజీనామా చేయాలని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ డెడ్‌లైన్ విధించింది. దీంతో బీజేపీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు రాజీనామా లేఖలను రైతు జేఏసీకి అందించారు. -
ఎంత చెప్పినా మారకపోవడంతో...
కర్నూలు: ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్యకు యత్నించిన ఘటన పట్టణంలోని సద్దాం కాలనీలో చోటు చేసుకుంది. ఎస్ఐ వెంకటరెడ్డి తెలిపిన వివరాల మేరకు.. వైఎస్సార్ జిల్లా పెద్ద ముడియం మండలం సుద్దపల్లె గ్రామానికి చెందిన దస్తగిరమ్మకు డోన్‌కు చెందిన అల్లీపీరాతో 13 ఏళ్ల క్రితం వివాహమైంది. కొంతకాలంగా ఆళ్లగడ్డలోని సద్దాం కాలనీలో ఇల్లు బాడుగకు తీసుకుని నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు రియాజ్, హర్షద్లు ఉన్నారు. కాగా భర్త అల్లీపీరా మద్యానికి బానిస అయ్యాడు. ఎంత చెప్పినా మారకపోవడంతో జీవితంపై విరక్తి చెందిన దస్తగిరమ్మ మంగళవారం రాత్రి విషపు గులికలు మింగింది. కొంత సేపటికి తాను చనిపోతే పిల్లలు అనాథలవుతారని భావించి విషపు గుళికలను నీళ్లలో కలిపి తాగించింది. బుధవారం ఉదయం ఎంతకూ ఇంట్లో నుంచి బయటకు రాకపోవడంతో అనమానం వచ్చిన దస్తగిరమ్మ సోదరి లోపలకు వెళ్లి చూడగా అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. వెంటనే ఇరుగు పొరుగు సాయంతో 108లో స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం నంద్యాల జిల్లా ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
‘నా పరిస్థితి ఎవరికీ రావొద్దు’.. యువతి సెల్ఫీ వీడియో కలకలం
గీసుకొండ(వరంగల్ జిల్లా): ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ యువతి భర్తతోపాటు అతడి బంధువుల వేధింపులు తాళలేక క్రిమిసంహారక మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన గీసుకొండ మండలం కోటగండి వద్ద మంగళవారం చోటుచేసుకుంది. స్థాని కుల కథనం ప్రకారం.. ఖానాపురం మండల కేంద్రానికి చెందిన ఇబ్రహీం, నసీమా దంపతుల కూతురు నూర్జహాన్ అదే గ్రామానికి చెందిన రవి, అరుణ దంపతుల కుమారుడు శరత్ ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకుని హైదరాబాద్‌లో ఉంటున్నారు. చదవండి: డీజే ప్రవీణ్‌తో సుజాత వివాహేతర సంబంధం.. భర్తను కడతేర్చిన భార్య ఆ తర్వాత కొన్ని రోజులకు భర్త శరత్‌తోపాటు అత్తమామలు, ఆడబిడ్డ, ఆమె భర్త నూర్జహాన్ను కట్నం కోసం వేధిస్తూ చిత్రహింసలకు గురి చేశారు. దీనిపై పలుమార్లు గ్రామంలో పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించినా.. వారి తీరు మారలేదు. వారి వేధింపులు భరించలేక నూర్జహాన్ మంగళవారం సాయంత్రం గీసుకొండ మండలం కోటగండి వద్దకు వచ్చి క్రిమిసంహారక మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను స్థానికులు చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా.. క్రిమిసంహారక మందు తాగే ముందు నూర్జహాన్ సెల్ఫోన్లో తన బాధను వీడియో తీసి తెలిసిన వారికి వాట్సాప్‌లో పెట్టింది. ఎక్కడికెళ్లినా న్యాయం జరగలేదు.. ‘నా చావుకు కారణం మాత్రం నా హజ్బెండ్, మా ఆడబిడ్డ, మా బావ, మా అత్తమామలు.. నేను లవ్ మ్యరేజ్ చేసుకున్నా.. క్యాస్టు తక్కువని, కట్నం కోసం కొట్టడంతోపాటు చంపేస్తామని వారు బెదిరిస్తున్నారు. చాలా పీఎస్‌లకు తిరిగాను. నాకు ఎక్కడా న్యాయం లేదు. ఉమెన్ పీఎస్‌కు వెళ్లినా అక్కడ సీఐ సారు వాళ్లవద్ద మనీ తీసుకుని నాకు న్యాయం చేయలేదు. ఎక్కడికి వెళ్లినా న్యాయం జరగడం లేదు. అందుకే చనిపోతున్నా.. నాలాంటి సిచ్యువేషన్ ఇంకో అమ్మాయికి రాకుండా చూడండి.. ప్లీజ్..’ అని ఒక వీడియోలో .. మరో వీడియోలో ‘అన్నా వినయ్‌రెడ్డి అన్నా థాంక్యూ వెరీమచ్ అన్నా. ఒక చెల్లిగా నాకు సహాయం చేసినందుకు థాంక్యూ అన్నా’ అంటూ మరో వీడియోను నూర్జహాన్ పోస్టు చేసింది. -
పెట్రోలు పోసుకుని వివాహిత ఆత్మహత్యాయత్నం
(కోనసీమ) రాజోలు: ఒంటిపై పెట్రోలు పోసుకుని ఓ వివాహిత రాజోలు సర్కిల్ పోలీసు కార్యాలయం వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. స్థానికులు, బంధువుల కథనం ప్రకారం.. సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలేనికి చెందిన యర్రంశెట్టి విజయలక్ష్మి ఈ ఘాతుకానికి ఒడిగట్టింది. ఆమె విజయలక్ష్మి ఏ1 టీవీ తెలుగు న్యూస్ ఛానల్ రిపోర్టర్‌గా, ఆమె భర్త రమేష్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ పని చేసుకుంటూ సుమారు రూ.80 లక్షల అప్పులు చేశారు. కొన్ని బకాయిల నిమిత్తం విజయలక్ష్మి పుట్టిల్లు ఇరుసుమండలో ఉన్న స్థలాన్ని, కేశవదాసుపాలెంలోని డాబా ఇంటిని అమ్మేందుకు.. అప్పులు ఇచ్చిన వ్యక్తులతో పెద్దల సమక్షంలో చర్చలు జరుపుతున్నారు. ఇదిలా ఉండగా అప్పు ఇచ్చిన కొందరు బకాయి కింద ఇరుసుమండలోని భూమిని స్వాధీనం చేసుకున్నారు. దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్, భూసర్వే పనుల్లో వివాదం తలెత్తింది. దీనిపై ఫిర్యాదు చేసేందుకు విజయలక్ష్మి తన స్కూటర్‌పై రాజోలు సర్కిల్ పోలీసు కార్యాలయానికి వచ్చింది. వెంట లీటరు బాటిల్లో పెట్రోలు పోయించి తెచ్చుకుంది. సర్కిల్ కార్యాలయం ఎదుట సిమెంట్ బల్లపై కూర్చుని సీఐ ఎప్పుడు వస్తారని అక్కడున్న సెంట్రీ కానిస్టేబుల్‌ను అడిగింది. సీఐ శిక్షణలో ఉన్నారని, సోమవారం వస్తారని కానిస్టేబుల్ చెప్పాడు. వెంటనే ఆమె కూడా తెచ్చుకున్న పెట్రోలును ఒంటిపై పోసుకుని నిప్పు పెట్టుకుంది. మంటలు పూర్తిగా వ్యాపించడంతో హాహాకారాలతో పరుగులు తీస్తూ పక్కనే ఉన్న ట్రెజరీ, రెవెన్యూ కార్యాలయాల సమీపానికి వచ్చింది. అక్కడ ఉన్న పలువురు ఆమెను రక్షించేందుకు తడి గోనె సంచులు, ఇసుక వేసి, మంటలను ఆదుపు చేశారు. హుటాహుటిన రాజోలు ప్రభుత్వాసుపత్రికి తీసుకు వెళ్లారు. డాక్టర్ రాంజీ ఆధ్వర్యంలో ప్రథమ చికిత్స చేశారు. విజయలక్ష్మి శరీరం సుమారు 80 శాతం కాలిపోవడంతో మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆమె వాంగ్మూలాన్ని రాజోలు మెజి్రస్టేట్ జి.సురేష్‌బాబు నమోదు చేశారు. దీనిపై కేసు నమోదు చేస్తామని ఎస్సై కృష్ణమాచారి తెలిపారు. -
పెళ్లి రోజున కొత్త చీర కొనలేదని.. కోపంతో భార్య ఏం చేసిందంటే?
పిఠాపురం(కాకినాడ జిల్లా): పెళ్లి రోజున కొత్త చీర కొనలేదనే మనస్తాపంతో ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది. గొల్లప్రోలు పోలీసుల కథనం ప్రకారం.. చేబ్రోలుకు చెందిన మల్లిపూడి శ్రీనివాసరావుకు శంఖవరం మండలం నెల్లిపూడికి చెందిన పద్మినితో 2017లో వివాహమైంది. ఈ నెల 11న చేలో పని పూర్తి చేసుకుని ఇంటికి వచ్చిన భర్తను పెళ్లి రోజు, వరలక్ష్మీ వ్రతం సందర్భంగా చీర కొనాలని పద్మిని అడిగింది. చదవండి: ఇంటి యజమానితో భార్య వివాహేతర బంధం.. ప్రస్తుతం కొంత ఇబ్బందిగా ఉందని, తాను ఇప్పుడు కొనలేనని అతడు సమాధానం చెప్పాడు. తోటి వారందరూ వరలక్ష్మీ వ్రతానికి కొత్త చీరలు కొనుక్కుంటున్నారని.. ఆ రోజు పెళ్లి రోజు కూడా అయినందున తనకు చీర కొనాలని కోరింది. ఈ నేపథ్యంలో దంపతులిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్న పద్మిని చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. విషయం గమనించిన భర్త కేకలు వేయగా.. బంధువులు, స్థానికులు పరుగున వచ్చి ఆమెను కిందకు దింపారు. పిఠాపురం ప్రభుత్వాసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం కాకినాడలో ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి తల్లి రమణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
సాయిగణేష్‌తో నిశ్చితార్థమైన యువతి ఆత్మహత్యాయత్నం
సాక్షి, ఖమ్మం జిల్లా: ఆత్మహత్య చేసుకున్న బీజేపీ కార్యకర్త సాయి గణేష్‌తో నిశ్చితార్థం జరిగిన యువతి నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది.. సాయి గణేష్ ఆత్మహత్య చేసుకున్నప్పటి నుంచి మనస్థాపంతో ఉన్న యువతి విజయ ఇవాళ మధ్యాహ్నం ఖమ్మంలో సాయి గణేష్ నిర్మించాలనుకున్న బీజేపీ పార్టీకి సంబంధించిన దిమ్మె స్థలంలో అపస్మారక స్థితిలో పడిపోవడంతో స్థానికులు వెంటనే గమనించి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. చదవండి: తెలంగాణ సీఎస్‌పై సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఆగ్రహం వచ్చే నెల 4వ తేదీ సాయి గణేష్, విజయ వివాహం జరగాల్సి ఉంది. ఈ నెల 14వ తేదీ ఖమ్మం త్రీటౌన్ పోలీస్‌స్టేషన్ ముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సాయి గణేష్.. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించగా అక్కడ ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సాయి గణేష్ మృతి చెందాడు. ఆ తర్వాత సాయి గణేష్ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది.. సాయి గణేష్ మృతికి కారణమైన మంత్రి అజయ్ కుమార్‌పై కేసు నమోదు చేయాలని బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తూ వచ్చారు. ప్రస్తుతం ఈ కేసు హైకోర్టులో కూడా నడుస్తోంది. -
నచ్చని పెళ్లి చేస్తున్నారని.. ఆ యువతి ఎంతకు తెగించిందంటే?
కాకినాడ క్రైం: నచ్చని పెళ్లి చేస్తున్నారని ఆవేదనకు గురైన ఓ యువతి ఆత్మహత్యకు యత్నించింది. ఆదివారం సాయంత్రం కాకినాడ ఆర్అండ్బీ సూపరింటెండెంట్ కార్యాలయం పైకి ఎక్కి కిందికి దూకేందుకు ప్రయత్నిస్తుస్తుండగా చూసిన వారు గమనించి ఆమెను రక్షించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు, కాకినాడ సర్పవరం ఐడియల్ కళాశాల సమీపంలో నివాసం ఉంటున్న 21 ఏళ్ల దోబా దుర్గాదేవికి ఇంట్లో వారు నచ్చని పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యారు. ఇదే విషయంపై కొద్ది రోజులుగా ఆమెకు కుటుంబ సభ్యుల మధ్య వాదనలు జరుగుతున్నాయి. చదవండి: పరువు హత్య కలకలం.. తాళ్లతో కట్టేసి.. తలపై మేకులు కొట్టి.. ఈ నేపథ్యంలో బాబాయి ఆమెపై చేయి చేసుకున్నాడు. ఆదివారం జరిగి ఈ ఘటనతో మనస్థాపం చెందిన యువతి ఇంటి నుంచి బయటికి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది. కాకినాడ కలెక్టర్ కార్యాలయానికి చేరుకుంది. అక్కడే ఉన్న ఆర్అండ్బీ సూపరింటెండెంట్ కార్యాలయంపైకి ఎక్కి కిందికి దూకే ప్రయత్నం చేస్తుండగా అక్కడి వారు గమనించి నిలువరించారు. అవుట్‌పోస్టు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఆమెను రక్షించి కిందికి దించారు. అక్కడికి చేరుకున్న త్రీ టౌన్ సీఐ కృష్ణ యువతితో మాట్లాడి కౌన్సెలింగ్ కోసం జీజీహెచ్‌లోని దిశ వన్‌స్టాప్ కేంద్రానికి తరలించారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
హైదరాబాద్ అమ్మాయితో ప్రేమ.. కొద్ది రోజులుగా ఆమె మాట్లాడటం లేదని..
సాక్షి, కామారెడ్డి: ప్రేమించిన అమ్మాయి మాట్లాడటం లేదని ఓ యువకుడు గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. గొంతు కోసుకున్న వ్యక్తి నరేష్‌గా గుర్తించారు. చదవండి: Mating Season: ఆడతోడు కోసం ఎందాకైనా..! స్థానికుల కథనం ప్రకారం.. దళితవాడకు చెందిన నడిపి నరేష్ కొంత కాలంగా హైదరాబాద్‌కి చెందిన ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు కొద్దిరోజులుగా ఆ అమ్మాయి నరేష్‌తో మాట్లాడటం లేదని తెలిసింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువకుడు ఇంటి వద్ద బ్లేడ్‌తో గొంతు కోసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే నరేష్‌ని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగానే ఉందని స్థానికులు తెలిపారు. ఈ మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రియుడు మోసగించాడు..మరో యువకుడు రక్షించాడు!
సాక్షి, భైంసాటౌన్: ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడని ఓ బాలిక (17) ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన భైంసాలో జరిగింది. పట్టణ సీఐ శ్రీనివాస్ కథనం ప్రకారం భైంసా మండలం మహాగాం గ్రా మానికి చెందిన ఓ బాలిక శుక్రవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో గడ్డెన్నవాగు ప్రాజెక్టు చేరుకుని నీళ్లలో దూకి ఆత్మహత్యాయత్నాకి పాల్పడిం ది. అప్పుడే అక్కడ ఈత కొడుతున్న పట్టణానికి చెందిన షేక్ నవీద్ అనే యువకుడు బాలిక నీటిలో దూకడం గమనించి వెంటనే ఆమెను రక్షించి ఒడ్డుకు చేర్చాడు. తర్వాత పోలీసులకు సమాచారమివ్వగా, ఘటనాస్థలికి చేరుకున్న సీఐ శ్రీనివాస్ ఆమెను పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బా లిక నీటిలో దూకే ముందు తన చావుకు శ్రీకాంత్ అనే వ్యక్తి కారణమంటూ రాసిన లెటర్ లభించింది. ఆ లెటర్లో తనది మహాగాం గ్రామమని, అదే గ్రామానికి చెందిన శ్రీకాంత్ తనను ప్రేమించానంటూ మోసం చేశాడని రాసి ఉంది. బాలికను ప్రాణాలకు తెగించి రక్షించిన నవీద్‌ను పట్టణ సీఐ శ్రీనివాస్ అభినందించారు. బాలికను తల్లిదండ్రులకు అప్పగించినట్లు సీఐ తెలిపారు. -
కోర్టు సముదాయాల ముందు మహిళ ఆత్మహత్యాయత్నం
తిరుపతి క్రైం /తిరుపతి లీగల్: తిరుపతి కోర్టు సముదాయాల ఎదుట శనివారం ఒక మహిళ ఆత్మహత్యకు యత్నించింది. ఈస్ట్ పోలీసుల కథనం మేరకు.. అరుణ అనే మహిళ నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. అదే ఆస్పత్రిలో డాక్టర్‌గా పనిచేస్తున్న తిరుపతి ఖాదీకాలనీకి చెందిన ఆదర్స్‌రెడ్డితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఇద్దరికీ గతంలోనే వివాహమైంది. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. వారి మధ్య విభేదాలు రావడంతో తనను పెళ్లి చేసుకుంటానని మోసగించాడని డాక్టర్‌పై ఆమె మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు ఇద్దరికి కౌన్సెలింగ్ ఇచ్చారు. తిరిగి ఆమె తన ఫిర్యాదుపై కేసు నమోదు చేయలేదంటూ కోర్టు ఎదుట పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించింది. సమీపంలోని పోలీసులు గుర్తించి ఆమెను వెస్ట్ పోలీస్ స్టేషన్‌కు అక్కడి నుంచి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. శనివారం కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తుండడంతో ఎక్కువ సంఖ్యలో ప్రజలు కోర్టు సముదాయాల వద్ద ఉన్నారు. మహిళ కోర్టు ఎదుట హల్చల్ చేయడంతో ప్రజలు గుమికూడారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీరించడానికి ఇబ్బంది పడ్డారు. కోర్టు ఆవరణం వెస్టు స్టేషన్ పరిధిలోకి రావడంతో వెస్టు స్టేషన్ ఎస్ఐ, సిబ్బంది వాహనంలో వచ్చి ఆమెను స్టేషన్‌కు తరలించారు. -
ఆత్మహత్యకు యత్నించిన విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగులు
స్టేషన్‌ఘన్‌పూర్ వరంగల్ : తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ స్టేషన్‌ఘన్‌పూర్‌లోని సబ్‌స్టేషన్ వద్ద చేపట్టిన సమ్మె శిబిరంలో విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగులు మామిండ్ల శ్రీను, నామోజు అశోక్ పురుగుల మందు డబ్బాలతో ఆత్మహత్మకు యత్నించిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నా యి. ఫత్తేపూర్ సబ్‌స్టేషన్‌లో ఆపరేటర్‌గా పనిచేస్తున్న మామిండ్ల శ్రీను, ఘన్పూర్ టౌన్లో అన్మ్యాన్డ్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న నామోజు అశోక్‌పై ట్రాన్స్‌కో డీఈ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. విషయం తెలుసుకున్న వారు సమ్మె శిబిరం వద్ద పురుగుల మందు డబ్బాతు తెచ్చుకుని ఆత్మహత్యకు యత్నించారు. అయితే ముందే విషయం తెలుసుకున్న విజిలెన్స్ అధికారులు కిరణ్, పాషా వారి వద్ద నుంచి పురుగుల మందు డబ్బాను లాక్కున్నారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు రాజు, కార్యదర్శి రాము మాట్లాడారు. సమ్మె చేస్తున్న కార్మికులపై విద్యుత్‌శాఖ అధికారులు కేసులు పెడుతూ బెదిరింపులకు పాల్పడుతుండడం తగదన్నారు. మాపై అక్రమంగా కేసులు పెట్టారు.. సమ్మెకు ఉద్యోగులను బలవంతంగా సబ్‌స్టేషన్ ఆపరేటర్లను తీసుకొస్తున్నామని ఆరోపిస్తూ తమపై అక్రమంగా పోలీస్‌స్టేషన్‌లో డీఈ కేసులు పెట్టారని శ్రీను, అశోక్ వాపోయారు. సం ఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు మూర్తి, ఎన్.రాజేంద్రప్రసాద్, సీహెచ్.రామ్‌రెడ్డి, కె.రాము, ఎం.శ్రీహరి, సుధాకర్, రాజేందర్, రాజు, అశోక్, కిషన్, శ్రీనివాస్, సురేష్ పాల్గొన్నారు. -
ఏఎన్ఎం ఆత్మహత్యాయత్నం
కాశీబుగ్గ: శిక్షణకు వచ్చిన ఓ ఏఎన్ఎం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. హార్పిక్, ఫినాయిల్ తాగి కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న యువతిని చూసి స్థానికులు పోలీసుల సహాయంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. స్థానిక పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలావున్నాయి. సోంపేట గ్రామానికి చెందిన లావేటి మోహినమ్మ పలాసలో ఓ వసతిగృహంలో ఏఎన్ఎంలకు జరిగిన ట్యాబ్‌లపై శిక్షణ కార్యక్రమానికి వచ్చినట్టు భావిస్తున్నారు. అయితే పలాస తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఖాళీస్థలంలో మోహినమ్మ కిందపడి కాళ్లు చేతులు కొట్టుకుని విలవిలలాడుతుంటే కొంతమంది స్థానికులు గమనించారు. విషయం కాశీబుగ్గ పోలీసులకు ఫోన్లో తెలియజేశారు. కానిస్టేబుల్ కోటేశ్వరరావుతో పాటు సిబ్బంది వచ్చి ఆమెను పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె నురగలు కక్కుతుంది. దీంతో ఈమె పక్కన ఉన్న బ్యాగును పోలీసులు పరిశీలించగా అందులో దుస్తులు, హార్పిక్, ఫినాయిల్ బాటిల్ దొరికాయి. బ్యాగులో ఉన్న ఆధారాల బట్టి చూస్తే లావేటి మోహినమ్మగా పోలీసులు గుర్తించారు. అయితే ఈమె ఒంటరిగా హార్పిక్ తాగిందా, లేదా ఎవరైనా తాగించారా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుండగా కొన్నిగంటలు గడిస్తే తప్ప పరిస్థితి చెప్పలేమని వైద్యులు హేమసుందర్ తెలిపారు. అమ్మాయితో ఉన్న బ్యాగ్, బట్టలను కాశీబుగ్గ పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. దీనిపై కేసు నమోదు చేశారు. -
మోసం...
గరుగుబిల్లి (కురుపాం): మండలంలోని దళాయివలసకు చెందిన ఇప్పాకుల ఉమాకార్తీక అదే గ్రామానికి చెందిన బలగ శంకరరావు ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కొద్ది నెలల కిందట వీరి మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి. దీంతో శంకరరావు పెళ్లి చేసుకోనని కార్తీకకు తేల్చి చెప్పాడు. దీంతో ఈ ఏడాది సెప్టెంబరు 1న గరుగుబిల్లి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. స్టేషన్లో అధికారులు, పెద్దల సమక్షంలో ఆరు నెలల్లోగా కార్తీకను పెళ్లి చేసుకుంటానని శంకరరావు ఒప్పుకున్నాడు. తరువాత ఇంటికొచ్చి పెళ్లి చేసుకోనని చస్తే...చావని శంకరరావు కార్తీకను నిందిస్తూ మాట్లాడాడు. దీంతో కార్తీక సెప్టెంబరు 11న చీమల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. గుర్తించిన తల్లిదండ్రులు ఆమెను ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చి వైద్యం అందించారు. దీంతో ప్రాణాలతో బయటపడింది. అనంతరం పార్వతీపురం సీఐ ఎదుట మరోసారి దీనికి సంబంధించి పంచాయతీ జరిగింది. ఈ సమయంలో పోలీసుస్టేషన్లో కాకుండా పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంటానని శంకరరావు మళ్లీ అంగీకరించాడు. ఈ మేరకు రావుపల్లిలో ముహుర్తాలు కూడా తీసుకొని వధువు ఇంట్లో అక్టోబరు 5న పెళ్లి చేసుకునేందుకు అంగీకరించారు. దీంతో వధువు ఇంట్లో పచ్చని పందిరి వేసి ఇంటిని అలంకరించి వివాహ భోజనాలు కూడా గురువారం నిర్వహించారు. అంతా అయిన తరువాత వరుడు కనిపించకుండా పోవడంతో వివాహం నిలిచిపోయింది. దీంతో గొల్లుమన్న కార్తీక తనకు శంకరరావుతో వివాహం జరిపించాలని కోరుతుంది. ఇదిలా ఉండగా వారం రోజులుగా వరుడు శంకరరావు గ్రామంలో లేని విషయం వెలుగులోకి వచ్చింది. ఎక్కడ ఉన్నాడో కూడా తెలియలేదు. ఇదే విషయమై వరుడు తల్లిదండ్రులు నిశ్చితార్ధానికి ముహుర్తం తీసుకున్నామే తప్ప వివాహానికి కాదని చెబుతున్నారని కార్తీక బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రేమించాడు...పెళ్లి చేసుకుంటానని పోలీసుల సమక్షంలోనే అంగీకరించాడు. దీంతో వధువు తల్లిదండ్రులు నమ్మి వివాహ పత్రికలు వేయించారు. బంధువులు, స్నేహితులకు భోజనాలు కూడా పెట్టేశారు. తీరా వివాహం జరిగే వేళకు వరుడు కనిపించకుండా పోయాడు. దీంతో పచ్చని పందిట్లో పెళ్లి వేడుక జరగాల్సిన ఆ ఇంట్లో విషాదం నెలకొంది. వధువు తెలిపిన వివరాల్లోకి వెళ్తే... వరుడు వస్తే పెళ్లి చేస్తాం... పెళ్లి విషయమై ఎస్ఐ హరిబాబునాయుడు వద్ద సాక్షి ప్రస్తావించగా పోలీసు ఉన్నతాధికారులు సమక్షంలో శంకరరావు పెళ్లికి కొంత సమయం కావాలని కోరాడని తెలిపారు. సంక్రాంతి తరువాత పెళ్లి చేసుకొంటానని అంగీకరించినట్టు చెప్పారు. ఇరు పక్షాల వారు కూడా దీన్ని అంగీకరించినట్టు తెలిపారు. ప్రస్తుతం వరుడు శంకరరావు పరారీలో ఉన్నాడని, ఆరా తీస్తున్నామని, వధువుకు న్యాయం చేస్తామని చెప్పారు. -
బ్యాంకులో వ్యాపారి ఆత్మహత్యాయత్నం
గిద్దలూరు: బ్యాంకు అధికారు లు నిబంధనల పేరు చెప్పి తన ఖాతాలో ఉన్న నగదును ఇవ్వ కుండా తిప్పుకుంటున్నారని మనస్తాపం చెందిన ఓ వ్యాపారి అరగుండుతో బ్యాంకు వద్ద నిరసన వ్యక్తం చేశాడు. అనంతరం ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశా డు. గిద్దలూరు గణేష్‌నగర్ నివాసి అహ్మద్ బాషా పండ్ల వ్యాపారి. నగదు కొరతతో వ్యాపారం మానేశాడు. దీంతో కుటుంబం గడవడం కష్టమైంది. మళ్లీ వ్యాపారం ప్రారం భిద్దామనుకున్న అహ్మద్ కొద్దిరోజులుగా పలుమార్లు స్థానిక ఎస్బీఐ చుట్టూ తిరిగాడు. తన ఖాతాలోని నగదు ఇవ్వమని అడగ్గా బ్యాంకర్లు కుదరద న్నారు. దీంతో నిరాశ పడ్డ అహ్మద్ శుక్రవారం అరగుండు, అరమీసం గీయించుకుని, నల్లచొక్కా ధరించి కిరోసిన్ డబ్బాతో బ్యాంకుకు వెళ్లాడు. బ్యాంకు అధికారులతో గొడవకు దిగాడు. బ్యాంకు తలుపులు వేసి, ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో పోలీసులు అహ్మద్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. సీఐ శ్రీరాం బాషాకు రూ.24వేలు అప్పుగా ఇప్పించారు. -
ప్రొఫెసర్ వేధింపులు.. కుటుంబం చిన్నాభిన్నం
-
చోరీ కేసు నిందితుడి ఆత్మహత్యాయత్నం
సీరోలు(కురవి) : దొంగతనం కేసులో పోలీసులు కొడతారనే భయంతో ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన సంఘటన మండలంలోని సీరోలు గ్రామంలో శుక్రవారం జరి గింది. పోలీసులు, నిందితుడి భార్య మల్లమ్మ, కుమారుడు ఉపేందర్ కథనం ప్రకారం.. సీరోలు గ్రామానికి చెందిన బోనాల రాంమూర్తి 24వ తేదీన కోళ్లు దొంగిలించాడంటూ అదే గ్రామానికి చెందిన ఈర్ల మైసయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో గురువారం రాంమూర్తిని సీరోలు పోలీసులు స్టేషన్‌కు పిలిపించి దుస్తులు విప్పి కూర్చోబెట్టారు. దీంతో తనను పోలీసులు కొడతారనే భయంతో వణికిపోయాడు. పుష్కరాల విధులకు వెళ్లి స్టేషన్‌కు చేరుకున్న ఎస్సై ప్రవీణ్‌కుమార్ అతడిని దొంగతనం చేశావా? అని విచారించగా తాను చేయలేదని సమాధానమిచ్చాడు. దీంతో అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి జమానత్ ఇవ్వడంతో రాంమూర్తిని ఇంటికి పంపించారు. శుక్రవారం మళ్లీ ఎలాగైనా పోలీసులు స్టేషన్‌కు పిలిపిస్తారని, కొడతారనే భయంతో మనోవేదనకు గురైన రాంమూర్తి చేను వద్ద పురుగుల మందు తాగాడు. దీంతో అపస్మారకస్థితికి చేరుకునేలోపు చేను వద్దే ఉన్న కుటుంబ సభ్యులు హుటాహుటీన మానుకోట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై సీరోలు ఎస్సై ప్రవీణ్‌కుమార్‌ను వివరణ కోరగా ఐదు కోళ్లు పోయాయని మైసయ్య అనే వ్యక్తి రాంమూర్తిపై ఫిర్యాదు చేశాడని తెలిపారు. తాను ఆ సమయంలో పుష్కరాల విధుల్లో ఉన్నానని, స్టేషన్‌కు వచ్చాక విషయం తెలుసుకొని జమానత్పై రాంమూర్తిని ఇంటికి పంపించినట్లు తెలిపారు. అతడిని ఎవరూ కొట్టలేదని, కొట్టే ఆలోచన కూడా లేదన్నారు. కుటుంబ కలహాలతో పురుగుల మందు తాగి ఉంటాడని తెలిపారు. -
ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం
తమ పెళ్లి విషయం ఇంట్లో తెలుస్తుందన్న భయంతో ఓ యువ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం పిల్లల చెరువు గ్రామంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన శ్రీను, అనిత పెద్దలకు చెప్పకుండా ఇటీవల ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ విషయం ఇంట్లో తెలిస్తే ఏమంటారోనన్న భయంతో ఆదివారం వారు ఇద్దరూ పురుగుల ముందు తాగారు. స్థానికులు గమనించి వారిని నర్సారావుపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. -
కాంట్రాక్ట్ కార్మికుడి ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్: రెండు నెలల క్రితం విధుల నుం చి తొలగించడంతో మున్సిపల్ కాంట్రాక్టు కార్మికుడు ఒకరు మనస్తాపానికిలోనై ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. ఉప్పల్ మున్సిపల్ సర్కిల్ కార్యాలయం ఎదుట గురువారం ఈ సంఘటన జరిగింది. వరంగల్ జిల్లా కొత్తపల్లికి చెందిన గ్యార ఉప్పలయ్య 20 ఏళ్ల క్రితం నగరానికి వచ్చి ఉప్పల్‌లోని చిలుకానగర్‌లో అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. ఉప్పలయ్యకు భార్య లక్ష్మి, ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. అతను 15 ఏళ్లుగా ఉప్పల్ మున్సిపల్ కార్యాలయంలో కాంట్రాక్ట్ కార్మికునిగా పనిచేస్తున్నాడు. జీహెచ్ఎంసీ ఉప్పల్ సర్కిల్ పరిధిలోని సెవెన్‌హిల్స్ సొసైటీలో విధు లు నిర్వహిస్తున్నాడు. 2 నెలల క్రితం 30 మంది కాంట్రాక్టు కార్మికులను విధుల నుంచి తొలగిం చారు. ఇలా తొలగించిన కార్మికులంతా గురువారం ఉప్పల్ సర్కిల్ ఇన్చార్జి డీసీ విజయకృష్ణతో మాట్లాడటానికి వచ్చారు. తన చేతుల్లో ఏమీ లేదని ఈ సందర్భంగా డీసీ వారికి చెప్పారు. దీంతో మనస్తాపానికి గురైన ఉప్పలయ్య సర్కిల్ కార్యాలయ ఆవరణలోనే వెంట తెచ్చుకున్న కిరోసిన్‌ను ఒంటిపై పోసుకున్నాడు. దీనిని గమనించిన తోటి కార్మికులు అరవడంతో ఉప్పల్ పోలీసులు అతడిని అడ్డుకున్నారు. అగ్గిపుల్లను అంటించుకునే లోపే ఉప్పలయ్య ఒంటిపై నీరుపోసి అదుపులోకి తీసుకున్నారు. పిల్లలను స్కూల్ నుంచి గె ంటేస్తున్నారు ‘‘రెండు నెలల నుంచి ఇంటి అద్దెకట్టడం లేదు. పిల్లల స్కూల్ ఫీజులు కూడా చెల్లించలేదు. పిల్లలను స్కూల్ నుంచి గెంటేస్తున్నారు.. ఇంటి యజమాని గిన్నెలు బయటవే స్తానంటున్నాడు.. ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్నాం. 4 రోజులుగా పస్తులుంటున్నాం. ఈ బాధలు తట్టుకోలేక బతకడంకన్నా చావే నయం అనుకున్నా’’ - ఉప్పలయ్య -
రైతు కుటుంబం ఆత్మహత్యాయత్నం
మాక్లూర్, న్యూస్‌లైన్: మాక్లూర్ మండలం మెట్పల్లి గ్రామానికి చెందిన గుండారం పోశెట్టి అనే రైతు కుటుంబం బుధవారం తహశీల్దార్ కార్యాలయంలో పురుగుల మందు తాగేందుకు యత్నించింది. బాధితు ల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గుండారం పోశెట్టి, గుండా రం పోసాని, గుండారం రాజుబాయిల కు ప్రభుత్వం 50 ఏళ్ల క్రితం గ్రామ శివారులోని సర్వే నంబర్ 70, 70/1, 70/2లో రెండున్నర ఎకరాల భూమిని కేటాయించింది. అప్పటి నుంచి వారు ఆ భూమిని సాగు చేసుకుంటున్నారు. ఆరేళ్ల క్రితం పక్కవారితో వివాదం రావడంతో పోశెట్టి వీఆర్ఓ భోజారావును ఆశ్రయించాడు. ఆయన హద్దులు చూపిస్తానని చెప్పి పోశెట్టి నుంచి రూ. 10 వేలు తీసుకున్నారు. రూ. 700 చలా నా కట్టించి తాత్కాలిక పహాణీ జారీ చేయించారు. అనంతరం వీఆర్ఓ ఎవ్వరికీ తెలియకుండా అదే భూమిలో 1.04 ఎకరాల భూమిని వల్లభాపూర్ గ్రామానికి చెందిన గొల్ల అబ్బులుకు అక్రమం గా పట్టా చేసి ఇచ్చారు. అప్పటి నుంచి పోశెట్టి భూమిని సాగు చేయకుండా అబ్బులు అడ్డుకుంటున్నాడు. తిరిగి సర్వే హద్దులు చూపించాలని ఆరేళ్ల నుంచి ఫిర్యాదులు చేస్తున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. రెండు నెలల నుంచి కొందరు రెవెన్యూ సిబ్బంది డబ్బుల కోసం వేధిస్తున్నా రు. దీంతో ఆవేదన చెందిన పోశెట్టి ఆయన భార్య రజని, పిల్లలు పవన్, జ్యోతి, బంధువులు బుధవారం పురుగుల మందు డబ్బా తీసుకుని తహశీల్ కార్యాలయానికి వచ్చారు. తహశీల్దార్ నారాయణ చాంబర్లోకి వెళ్లి తమ భూమి తమకు ఇవ్వాలని వేడుకున్నారు. లేకపోతే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని పేర్కొన్నారు. ఆయన అందించిన సమాచారం తో ఎస్ఐ సంతోష్‌కుమార్ వెంటనే అక్కడికి చేరుకుని పోశెట్టిని వారించి పురుగుల మందు డబ్బాను లాక్కున్నా రు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు హైడ్రామా కొనసాగిం ది. న్యాయం చేస్తామని ఎస్ఐ, తహశీల్దార్ హామీ ఇవ్వడంతో రైతు కుటుం బం శాంతించింది.