బ్యాంకులో వ్యాపారి ఆత్మహత్యాయత్నం
గిద్దలూరు: బ్యాంకు అధికారు లు నిబంధనల పేరు చెప్పి తన ఖాతాలో ఉన్న నగదును ఇవ్వ కుండా తిప్పుకుంటున్నారని మనస్తాపం చెందిన ఓ వ్యాపారి అరగుండుతో బ్యాంకు వద్ద నిరసన వ్యక్తం చేశాడు. అనంతరం ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశా డు. గిద్దలూరు గణేష్‌నగర్ నివాసి అహ్మద్ బాషా పండ్ల వ్యాపారి. నగదు కొరతతో వ్యాపారం మానేశాడు. దీంతో కుటుంబం గడవడం కష్టమైంది. మళ్లీ వ్యాపారం ప్రారం భిద్దామనుకున్న అహ్మద్ కొద్దిరోజులుగా పలుమార్లు స్థానిక ఎస్‌బీఐ చుట్టూ తిరిగాడు.
తన ఖాతాలోని నగదు ఇవ్వమని అడగ్గా బ్యాంకర్లు కుదరద న్నారు. దీంతో నిరాశ పడ్డ అహ్మద్ శుక్రవారం అరగుండు, అరమీసం గీయించుకుని, నల్లచొక్కా ధరించి కిరోసిన్ డబ్బాతో బ్యాంకుకు వెళ్లాడు. బ్యాంకు అధికారులతో గొడవకు దిగాడు. బ్యాంకు తలుపులు వేసి, ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో పోలీసులు అహ్మద్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. సీఐ శ్రీరాం బాషాకు రూ.24వేలు అప్పుగా ఇప్పించారు.