
కర్నూలు: ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్యకు యత్నించిన ఘటన పట్టణంలోని సద్దాం కాలనీలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ వెంకటరెడ్డి తెలిపిన వివరాల మేరకు.. వైఎస్సార్ జిల్లా పెద్ద ముడియం మండలం సుద్దపల్లె గ్రామానికి చెందిన దస్తగిరమ్మకు డోన్‌కు చెందిన అల్లీపీరాతో 13 ఏళ్ల క్రితం వివాహమైంది. కొంతకాలంగా ఆళ్లగడ్డలోని సద్దాం కాలనీలో ఇల్లు బాడుగకు తీసుకుని నివాసం ఉంటున్నారు.
వీరికి ఇద్దరు కుమారులు రియాజ్, హర్షద్‌లు ఉన్నారు. కాగా భర్త అల్లీపీరా మద్యానికి బానిస అయ్యాడు. ఎంత చెప్పినా మారకపోవడంతో జీవితంపై విరక్తి చెందిన దస్తగిరమ్మ మంగళవారం రాత్రి విషపు గులికలు మింగింది. కొంత సేపటికి తాను చనిపోతే పిల్లలు అనాథలవుతారని భావించి విషపు గుళికలను నీళ్లలో కలిపి తాగించింది.
బుధవారం ఉదయం ఎంతకూ ఇంట్లో నుంచి బయటకు రాకపోవడంతో అనమానం వచ్చిన దస్తగిరమ్మ సోదరి లోపలకు వెళ్లి చూడగా అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. వెంటనే ఇరుగు పొరుగు సాయంతో 108లో స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం నంద్యాల జిల్లా ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment