Two Female Students Attempted Suicide In Kasturba After Being Insulted By Their Friends - Sakshi
Sakshi News home page

కస్తూర్బాలో ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం

Published Fri, Jul 28 2023 1:51 AM | Last Updated on Fri, Jul 28 2023 11:24 AM

Two female students attempted suicide in Kasturba - Sakshi

శాయం పేట: సెల్‌ఫోన్‌ దొంగతనం చేశారని తోటి విద్యార్థినులు అవమానించారని మనస్తాపం చెందిన ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటన హనుమకొండ జిల్లా శాయంపేట మండలం గోవిందాపూర్‌ శివారులోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో బుధవారం సాయంత్రం జరిగింది. టీచర్లు వారిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. గోవిందాపూర్‌ కేజీబీవీలో కల్పన, పూర్ణ పదో తరగతి చదువుతున్నారు. ఇందులో హనుమకొండకు చెందిన కల్పన, పూర్ణతో కలిసి మంగళవారం రాత్రి అటెండర్‌ సెల్‌ ఫోన్‌ తీసుకొని తల్లికి ఫోన్‌ చేసింది.

తనకు ఆరోగ్యం బాగా లేదని, ఇంటికి తీసుకెళ్లాలని కోరింది. అదే సందర్భంగా తోటి విద్యార్థినులు గమనించి ‘దొంగ’‘దొంగ’.. అంటూ అవహేళన చేశారు. దీంతో మనస్తాపం చెందిన ఆ ఇద్దరు విద్యార్థినులు బుధవారం సాయంత్రం తమ వద్ద ఉన్న నెయిల్‌ పాలిష్‌ను తాగారు. గమనించిన టీచర్స్‌ వారిని వెంటనే పరకాలలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఆస్పత్రిలో వైద్యసిబ్బంది అందుబాటులో లేకపోవడంతో వారి ని వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వారి ఆరోగ్యం మెరుగు పడటంతో గురువారం తల్లిదండ్రులు వారిని ఇళ్లకు తీసుకెళ్లారు. ఈ విషయమై కేజీబీవీ స్పెషలాఫీసర్‌ మాధవిని వివరణ కోరగా కల్పన, పూర్ణ తమ ఇళ్లకు వెళ్తామని అడిగితే పర్మిషన్‌ ఇవ్వలేదని, ఆ బాధతోనే ఆత్మహత్యకు యత్నించారని పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement